మాయా రోకలి | Telugu kathalu | Telugu Stories | Bedtime Dreams Telugu | Kattapa kathalu

సిరిసిల్ల అనే గ్రామంలో కృష్ణమ్మ అనే పచ్చళ్ళ వ్యాపారి ఉండేది.ఆమె రోటి ద్వారా రుచికరమైన పచ్చళ్లు తయారు చేసి వాటిని అమ్ముతూ ఉండేది. ఆ పచ్చళ్ళు చాలా రుచి గా ఉండటంతో చాలా మంది తీసుకెళ్తూ ఉండేవాళ్ళు . అలా కొన్ని రోజులకి ఆమెకు మంచి పేరు రావడం చాలా మంది ఇంటికి వచ్చి మరీ వాటిని తీసుకెళ్లడం జరుగుతూ ఉండేది. దాన్ని చూసి తన శత్రువైన రాదమ్మా కుళ్ళు కుంటూ ఉండేది. దాన్ని చూసి ఆమె కూడా పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టాలని .
ఆమె కూడా పచ్చళ్లు తయారు చేసి వాటిని అమ్ముతూ ఉంటుంది. కానీ ఆమె చేసే పచ్చళ్ళు అస్సలు బాగోదు ఎవరు కూడా తీసుకు వెళ్ళే వాళ్ళు కాదు ఒకవేళ తీసుకెళ్లినా . ఈ పచ్చడి ఏంటి ఇలా ఉంది అని ఆమెను తిట్టేవాళ్ళు.
దాన్ని చూసి ఆమె చాలా బాధ పడుతూ తన మనసులో…. ఎలా అయినా దీని వ్యాపారంలో నష్టం తీసుకురావాలి నా కళ్ళ ముందే నా శత్రువు ఎదగడం నాకు అస్సలు ఇష్టం లేదు. అని అనుకుంటుంది .
ఆమెని ఎలా అయినాసరే దెబ్బతీయాలనీ ప్రయత్నిస్తూ ఉంటుంది .
కానీ అది ఆమె వల్ల కాదు. అలా రోజులు గడిచాయి ఒకరోజు కృష్ణమ్మ కు పెద్ద ఆర్డర్ వచ్చి దాన్ని తీసుకుని వెళుతూ ఉండగా
మార్గ మధ్యలో ఒక పాప ఏడుస్తూ కనిపిస్తుంది పాపనీ చూసిన కృష్ణమ్మ.ఆ పాప దగ్గరికి వెళ్లి ….. పాప ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావు. అని అడుగుతుంది అందుకు పాప ఏడుస్తూ….. మా అమ్మ నన్ను ఇక్కడ వదిలి పెట్టి వెళ్ళింది .
ఇంత వరకు తిరిగి రాలేదు.
కృష్ణమ్మ…. అవునా మీ అమ్మ పేరు ఏం పేరు మీది ఏ ఊరు .
పాపా ఏం చెప్పకుండా ….. ఏంటమ్మా ఏం చెప్పట్లేదు. ఎందుకు ఏం చెప్పకుండా అమ్మ పేరు అమ్మ అని ఊరు పేరు ఊరు పేరు అని చెప్తుంది. కృష్ణమ్మ…. ఏంటమ్మా అలా చెప్తున్నావు నీకు ఏమీ తెలియదా . అయ్యో అని పాప పైన జా లిపడి ఆమెనీ తనతో పాటు ఇంటికి తీసుకువెళుతుంది.
పాప గురించి చాలామందికి తెలియడం కోసం పేపర్ పత్రికలో ఆమె గురించి ప్రచారం చేస్తుంది అయినప్పటికీ ఎవరూ కూడా పాప కోసం రారు.
కృష్ణమ్మా సరే అని చెప్పి పాపను తన కన్న కూతురు లాగా చూసుకుంటూ ఉంటుంది.
అలాగే రోజులు గడుస్తున్నాయి పాప ఒక రోజు…. కృష్ణమ్మ ఎప్పుడు నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటావు . మా అమ్మ లాగా నిన్ను కూడా మీ అమ్మ వదిలి పెట్టిందా.
అందుకు కృష్ణమా నవ్వుతూ…. కాదమ్మా మా అమ్మ నాన్న చనిపోయారు. నేను అదిగో ఆ ఫోటోలో కనబడుతున్న ఆడే ఆయన్ని పెళ్లి చేసుకున్నాను. ఆయన కూడా నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. అంటూ చాలా బాధపడుతూ చెబుతుంది.
ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు.
అతను ఆమెతో….. ఏమమ్మా కృష్ణమ్మ నువ్వు ఇలాంటి దానివి అని అస్సలు అనుకోలేదు.
కృష్ణమ్మ…. ఏమైందండీ ఎందుకు అలా అంటున్నారు ఏం జరిగిందో చెప్పండి .
అతను….బూజు పట్టిన ముక్కిపోయిన వాసన వస్తున్నా పచ్చళ్లను మాకు పంపిస్తారా కస్టమర్ లో అందరూ నన్ను ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు ఇక నుంచి ఈ పచ్చళ్ళు వద్దు ఏమి వద్దు. అని అంటాడు ఆమె ఎంత చెప్పినా కూడా అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు.
కృష్ణమ్మ చాలా బాధపడుతూ….. ఇదేంటి ఎప్పుడూ లేనిది ఇలా జరిగింది.
నేను అలా ఎప్పుడు చేయను కదా.
అని చాలా బాధపడుతుంది ఇంకా కొంత సమయం తర్వాత మరో ఆమె అక్కడకు వచ్చి…. కృష్ణమ్మ ఏంటి నువ్వు పచ్చళ్ళు ఇలా చేస్తున్నావా . ముక్కిపోయిన కంపు కొడుతుంది. ఇకనుంచి మా షాప్ కి ఇవి అవసరం లేదు. మంచి పేరు వచ్చిన తర్వాత నువ్వు కూడా అందరి లాగే తయారయ్యావు అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి పోతుంది .
అలా రోజులు గడుస్తున్నాయి చాలామంది ఆమె ఒక్క పచ్చళ్ళు బాగోలేదు అని చెప్పి మొఖం మీద వద్దు అని అక్కడి నుంచి వెళ్లి పోయేవాళ్ళు ఆమె బిజినెస్ పూర్తిగా లాస్ అవుతుంది.
అలా ఎందుకు జరుగుతుందో ఆమెకు అస్సలు అర్థం కాదు. కృష్ణమ్మ తన మనసులో…. ఈ పాప ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా జరిగింది . ఈమె జాతకం మంచిది కాదు అనుకుంటా అందుకే తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. ఈ పాప దరిద్రం నాకు అంటుకుంది అందుకే నా వ్యాపారం పూర్తిగా నష్టపోయాను దీన్ని ఎలా అయినా వదిలించుకోవాలి. అని అనుకుంటూ ఉంది ఆ రోజు రాత్రి సమయం పాప నిద్ర పోతూ ఉండగా. ఆమెను ఒక గోతం లో కట్టివేసి దూరంగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టేసి వచ్చేస్తుంది.
ఆ మరుసటి ఈ రోజు ఉదయం ఒక స్వామీజీ అటుగా వెళుతూ ఆ గోతం కదులుతూ ఉండడంతో దాన్ని తెరిచి చూస్తాడు అందులో పాప ఉంటుంది పాప పెద్దగా ఏడుస్తూ…. కృష్ణమ్మ ఎక్కడ . మా కృష్ణమ్మ ఎక్కడ స్వామి
నన్ను మా కృష్ణమ్మ దగ్గరకు తీసుకు వెళ్ళు.
అంటూ ఏడుస్తుంది స్వామీజీ…. పాప ఏడవకు ముందు అసలు నువ్వు ఎవరో చెప్పు.
పాప…. స్వామి నన్ను మా అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది తర్వాత పచ్చళ్ళు అమ్మే కృష్ణమ్మ నన్ను పెంచు కుంటూ ఉంది.
నేను ఆమె దగ్గరే ఉన్నాను ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు.
అంటూ ఏడుస్తుంది స్వామీజీకి కృష్ణమ్మ ఎవరో తెలుసు కానీ కృష్ణమ్మ ఎందుకు ఇలా చేసిందో తానే స్వయంగా తెలుసుకోవాలి అని పాపను తీసుకుని ఆమె ఇంటికి వెళ్తుండగా కృష్ణమ్మ వాళ్ళకే ఎదురవుతుంది.
కృష్ణమ్మ పాప ని చూసి….. అమ్మ గౌరీ నీకేం కాలేదుగా పాపిష్టి దాన్ని నేను ఏదో ఊహించుకొని అభంశుభం తెలియని నేను ఇలా వదిలేశాను అంటూ ఏడుస్తూ…. స్వామి మీరు చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే పాపకి ఏం జరిగిందో ఏమో అంటూ ఏడుస్తుంది.
స్వామీజీ….. అసలు ఈ పాప ని ఎందుకు వదిలి పెట్టావ్ అమ్మ.
అందుకు కృష్ణమ్మా జరిగిన విషయమంతా చెప్పి బాధ పడుతుంది.
స్వామీజీ నవ్వుతూ….హా హా హా అసలు నిజం ఏంటో మీకు తెలియదు కదా అలాంటప్పుడు ఎదుటి వాళ్ల ద్వారా మనకే నష్టం వచ్చిందని ఎలా అనుకుంటాము.
ఈ పాప ఎవరో నీకు తెలుసా ఈ పాప పేరు గౌరీ తల్లి పేరు రాధ. ఆమె తండ్రి చనిపోవడంతో రాదా ఈమెను చూసుకుంటూ ఉంది. రాధా ఆరోగ్యం బాగోక ఒక ప్రభుత్వ హాస్పిటల్లో చేరడం కోసం పాపను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అనాధ ఆశ్రమంలో చేర్పించండి ప్రయత్నం చేసింది కానీ ఎవరు కూడా ఆమెను చేర్చుకోమని చెప్తారు ఎందుకంటే తల్లి బతికి ఉండగా అదంతా అసాధ్యం అని. అందుకే ఆమె చనిపోయి తన బిడ్డకి నీడని ఇవ్వాలని అనుకొని ఆమెను ఆశ్రమం ముందు వదిలిపెట్టి .
తాను చనిపోయింది.
ఆమె ఒక జబ్బు చేసిన వ్యక్తి కాబట్టి తన ప్రాణాలు పోయినా పర్వాలేదు నా బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఆశించి అలా చేసింది. ఇదివరకే పాప ని చూసిన ఆశ్రమం వ్యక్తులు ఎవరూ పట్టించుకోలేదు అప్పుడే నువ్వు కనిపించావు . ఆమెను దగ్గరికి తీసావు ఇది ఈ పాప కథ . అంటూ కళ్ళకి కట్టినట్టుగా తన అరచేతిలో జరిగిన విషయమంతా చూపిస్తాడు.
దాన్ని చూసి కృష్ణమ్మ చాలా బాధ పడుతూ….
అయ్యో స్వామి నేను చాలా అర్థం చేసుకున్నాను కానీ ఈ నష్టానికి కారణం ఏంటి.
అప్పుడు స్వామి తన అరచేతిలో …. ఏం జరిగిందో నువ్వే చూడు. అని అంటాడు ఆమె సరే అని చూస్తుంది . ఆమెకు ఈ విధంగా కనబడుతుంది. రాధమ్మ కృష్ణమ్మ వ్యాపారం చెడగొట్టడం కోసం ఆమె స్వయంగా తయారుచేసే వాటన్నిటిని వేరే వాళ్ల చేత కొనుగోలు చేయించి వాటిని తీసుకువచ్చి .
పచ్చళ్లలో నీళ్ళను పోసి బిగించింది.
అలాగే మరికొన్ని వాటిలో ముక్కిపోయిన నూనెను పోసి మూత బిగించింది తర్వాత… ఆహా నేను అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోయింది ఇప్పుడు ఏమీ తెలియనట్టుగా వీటన్నిటికీ కృష్ణమ్మ ఇంటికి చేర్చాలి. అని రాత్రి సమయం కృష్ణమ్మ నిద్ర పోతూ ఉండగా . గోడనీ దూకి మరి ఇంట్లో ప్రవేశించి . ఆమె కొత్తగా తయారు చేసిన పచ్చడి బాటిల్ కి బదులు ఆమె కల్తీ చేసిన పచ్చడి బాటిల్ లో పెట్టింది అక్కడ నుంచి
ఏం తెలియనట్టు గా వెళ్ళిపోతుంది.
అదంతా చూసినా కృష్ణమ్మా… వామ్మో ఇది ఇలాంటిదా నేను అస్సలు అనుకోలేదు స్వామి
అంటూ చాలా బాధపడుతుంది స్వామీజీ… బాధపడకు క్రిష్ణమ్మ. దెబ్బకు దెబ్బ నువ్వు తీయాలి అంటూ ఒక మాయ రోలు మరియు రోకలి ప్రత్యక్షం చేసి…. దీనిని తీసుకువెళ్ళు ఈ రోటినీ ఈ రోకలిబండతో దంచాఉ అంటే తన మాయాశక్తి తో రకరకాల పచ్చళ్లును దీని ద్వారా అందిస్తుంది. నువ్వు దాని కోసం ప్రత్యేకంగా శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇది బంగారం కూడా ఇస్తుంది.
ఈ మాయని ఎవరికి తెలియసిన అవసరం లేదు కానీ రాధమ్మ కు మాత్రం తెలిసే లాగా చేయి .
ఆ తరువాత ఏం జరుగుతుందో చూడు అని అంటాడు . అందుకు ఆమె సరే అని చెప్పి స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పుకొని దానిని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఆ మరుసటి రోజు
కృష్ణమ్మ రాధమ్మ కు వినపడేలా గా పాపతో
… గౌరీ ఇదిగో చూడమ్మా . ఇన్ని రోజులు నేను తయారుచేసిన పచ్చళ్లు రుచిగా ఉండడానికి కారణం ఈ మాయ రోలు. ఈ ఖాళీ రోలుని
రోకలి బండతో దంచావు అంటే రుచికరమైన పచ్చళ్ళు ప్రత్యక్షం చేస్తుంది. అంతే కాదు ఇది బంగారాన్ని కూడా ఇస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే అది ప్రత్యక్షం చేస్తుంది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే . ఈరోజు నుంచి ఈ పని నువ్వు చూసుకో వాలి కాబట్టి. దీన్ని దంచుతూ ఉండు తల్లి .
అని లోపలికి వెళ్తుంది అదంతా రాధమ్మ చూసి…. ఇదంతా నిజమా నా కల అని అలాగే చూస్తూ ఉంటుంది. పాప రోటి ని దంచడం మొదలు పెట్టగానే అందులో నుంచి పచ్చళ్ళు బంగారం వస్తూ ఉంటుంది. దాన్నంతా చూసిన రాదమ్మా…. ఓహో ఇప్పుడు నాకు అర్థమైంది దీని రహస్యం ఏంటో అని. ఇంత మంచి అవకాశం నేను వదులుకోను ఈరోజు రాత్రి ఆ మాయా రోల్ ని నా సొంతం చేసుకుంటాను.
అని అనుకొని ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరు నిద్రపోతుండగా దానిని దొంగతనంగా తన ఇంటికి తెచ్చుకుంటుంది. రాధమ్మ ఎంతో ఆతృతగా రోటిలో రోకలితో దంచుతూ….. నాకు బంగారు నగలు. బంగారం కావాలి త్వరగా ఇవ్వు అంటూ దంచుతోంది అలా దాల్చిన వెంటనే ఆ రోకలి గాల్లోకి లేచి
ఆమె వెంట పడుతుంది.
ఆ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ కాపాడమని అరుస్తోంది దాన్ని అంతా చూస్తున్నా . పాపా కృష్ణమ్మా నవ్వుకుంటారు. రాధమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లి…. నన్ను క్షమించండి ఆ రోకలి బండ నన్ను చంపేసే లాగా ఉంది అంటూ క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక ఆమె తప్పు తెలుసుకున్న వెంటనే రోకలి అక్కడే ఆగిపోతుంది. ఆ రోజులు అక్కడ మాయమైపోయి తిరిగి కృష్ణమ్మ ఇంటికి చేరుకుంటుంది. రాధమ్మ దాన్ని చూసి ఊపిరి పీల్చుకొని….. నన్ను క్షమించు ప్రశ్న అమ్మ నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది ఇంకెప్పుడూ నేను నీ వ్యాపారానికి అడ్డు రాను. అని క్షమాపణ కోరుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక ఆరోజు నుంచి ఆ మాయా రోకలి సహాయంతో వాళ్లకు కావాల్సింది కోరుకుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *