మాయ గౌనుల జలపాతం | Telugu Stories | Telugu Kathalu | Telugu Moral Stories | Telugu Fairy Tales

ఒక ఊరిలో శోభ అనే ఓక్ అమ్మాయి ఉండేది, ఆమెకి తల్లిదండ్రులు ఎవరు లేకపోవడం తో ఒంటరిగా ఉండేది. తనకంటూ ఉన్న ఒక ఇల్లు మాత్రమే ఉండేది. ఒకరోజు శోభ తనలో తాను మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటుంది,

శోభ : అయ్యో నా ఖర్మ ఎందుకిలా తయారయ్యిందో ఏమో, నేనేమన్నా తినడానికే బ్రతుకుతున్నానా లేక రోజు పంచ బక్ష పరమాన్నాలు అడుగుతున్ననా ఏదో బ్రతకాలంటే తినాలి కాబట్టి బ్రతకడం కోసం తినాలి కాబట్టి తింటున్నను, నేను తినే ఇంత అన్నం కూడా దొరకడం రోజు రోజుకి ఇంత కష్టాంగా మారిపోతుంటే ఎలా ఇలా అందరితో మాటలు పడుతూ బ్రతకడం కంటే చచ్చిపోవడం నయం అనిపిస్తుంది అన్న్ని శోభ రోజు బాధపడుతూనే ఉంటుంది.

అల్లా కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకేరోజు శోభ అడవికి వెళ్లి ఆహారం కోసం వెళ్తుకుతూ ఉంటూఉంది కానీ తనకు ఎక్కడ ఏమి కనిపించలేదు. అమ్మా ఆకలికి తట్టుకోలేక పోతున్నాను ఇంత పెద్ద అడవిలో నాకు తినడానికి ఏమి దొరకడం లేదు కనీసం ఊర్లో అయినా ఎవరైనా పుణ్యాత్ములు నా మీద జాలి తలుస్తారేమో చూస్తాను అని ఊరిలోకి వెళ్ళిపోతుంది.

శోభ : అమ్మ ఆకలిగా ఉంది తల్లి. ఈ ఆకలిని హరించడం నా వల్ల కావడం లేదు తల్లి కొంచం నా కడుపు నింపుకోవడానికి ఎదో ఒకటి ఇవ్వు అమ్మ, చచ్చి నీ కడుపునా పుడతాను తల్లి  అలా శోభ అరుస్తూ ఉండగా ఇంటి లోపలి నుంచి కుమారి కోపంగా బయటకు వస్తుంది.

కుమారి : ఇదేంటి అడుక్కోవడం లో కొత్త పద్దతా, పని చేతకాక అడుక్కోవడం మల్లి పుణ్యం మూట కట్టుకోండి పాపం వదిలెయ్యండి అని మాకేదో సేవ చేస్తున్న వాళ్ళలాగా మాట్లాడడం పో పో పుణ్యం లేదు పాపం లేదు పో ఇక్కడ నుంచి పొద్దున్నే ఇంటి ముందుకు వచ్చి కాళ్ళు చేతులు మంచిగానే ఇచ్చాడు కదా దేవుడు నీకు, ఇలా అడుక్కుతినే బదులు పోయి ఏదైనా పని చేసుకొని బ్రతుకు పో లేదంటే అక్కడైనా పది చావు అంతే గాని అలా అన్నం పెట్టు సహాయం చెయ్యి మమ్మల్ని చంపకు ఇంకొక సరి నా ఇంటి ముందు కనిపిస్తే చెప్తా నీ సంగతి అని శోభన తిట్టీస్తుంది.

శోభ : ఒక్క పూట అన్నామా దిగినందుకు నువ్వు ఇంత అవమానిస్తున్నావు కదా నన్ను అని అంటుంది.

కుమారి : అవమానమా సరే అవమానించానే అనుకో, అంతలా రోషం ఉన్నదానివి నా కంటే ఎక్కువ డబ్బు సంపాదించి చూపెట్టూ అయినా నీలా సిగ్గు లేకుండా అడుక్కుతినడానికి కూడా దిగజారే వాళ్ళతో మాట్లాడితే నా టైం వేస్ట్ కొందరికి అంటే తప్పదు వాళ్ళ పరిస్థితి అలాంటిది, నీ లాంటి పరిస్థితి నాకే వచ్చి అడుక్కోవలసి వస్తే చావనైనా చస్తాను కానీ నేను మాత్రం అడుక్కోను ఇలా కాయలు చేతులు అన్ని మంచిగా ఉంది కూడా అడుక్కుతినే వాళ్ళకి ఎంగిలి చేతిని కూడా దులపను, నేను చెప్పింది నీకు అర్ధం అయ్యింది అనుకుంటా ఇక దయ చేయడం మంచిది అని అంటుంది.

కుమారి మాటలకు ఘోర అవమానం తో ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది శోభ

శోభ : నా పరిస్థితి తనకు ఏమి తెలుసు అని అంతలా మాట్లాడుతుంది తాను ఒక్క పూట ఆకలి థీర్హుకోలేని నేనే బీటాతికితే ఎంత చస్తే ఎంత నేను బ్రతికి ఉండడం వల్ల ఏ ఒక్కరికి ఉప్పయోగం లేనప్పుడు నేను చచ్చిపోవడం మంచిది కదా అని చనిపోవాలని నిర్ణయించుకొని నది వైపు వెళ్తుంది.

అలా కొంత దూరం వెళ్లినా తరువాత తనకి ఒక నది కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళగానే కొంత దూరం లో తనకి ఒక అందమైన గౌను ఒకటి కనిపిస్తుంది.

శోభ : అబ్బా ఎంత బాగుంది ఆ గౌను అలాంటి గౌను నా జీవిత కాలం లో ఎప్పుడు చూడలేదు,  అని అనుకుంటుండగానే గౌను మాయం అయిపోతుంది.

శోభ : నేనేమన్నా భ్రమ పడ్డానా లేక నిజంగానే గౌను మాయం అయిపోయిందా? ఇంతకీ అది ఎక్కడ నుంచి వచ్చి ఉంటుంది. అని నీటి ప్రవాహం వస్తున్న వైపుగా వెల్తూ ఉంటుంది.

కొంత దూరం వెళ్లేసరికి చాలా అందమైన గౌనులు అన్ని నీటి ప్రవాహం లో కొట్టుకు వస్తూ ఉంటాయి అవి అన్ని కొంత దూరం రాగానే మాయం అయిపోతుంటాయి. అవన్నీ జలపాతం నుంచి వస్తూ ఉంటాయి వాటిని చూసి శోభ ఎంతో సంతోషపడుతుంది.

వాటిలో కొన్నిటిని తీసుకుంటుంది. వాటిని వురిలోకి తీసుకెళ్లి అమ్ముతూ ఉంటుంది.

అలా రోజు రావడం జలపాతం నుంచి కొట్టుకు వస్తున్న గౌనులని కొన్నింటిని తీసుకెళ్లడం వాటిని ఊరిలో అమ్మడం చేస్తూ ఉంటుంది. అలా శోభ కొన్ని రోజుల్లోనే చాలా డబ్బులు సంపాదించుకుంటుంది. అప్పుడు శోభ కుమారి దగ్గరికి వెళ్లి ఇలా చెబుతుంది.

శోభ : నువ్వు ఆ రోజు నన్ను అవమానించే సరికి నేను చచ్చిపోదాం అనుకున్నాను కానీ దాని తరువాతే నాకు తెలిసింది ఏంటంటే మనం కష్టపడి సంపాదిస్తే వచ్చే ఆ ఆనందం వేరు అని అంటుంది.

కుమారి : చనిపోవాలి అనుకున్నావా బుద్ధి ఉందా అసలు నీకు చనిపోవడం అంటే ఎంత పెద్ద తప్పో తెలుసా నీకు ఒక నిండు ప్రాణాన్ని బలి ఇవ్వాలి అనుకున్నావా ఛీ అలాంటి ఆలోచన రావడం కూడా తప్పే ఇకనైనా నువ్వు మారినందుకు సంతోషం నువ్వు గౌనులు అమ్మి బాగా డబ్బులు సంపాదిస్తున్నబువు అని విన్నాను అలాగే చాలా డబులు సంపాదిస్తూ ఆనందంగా ఉండు అని చెబుతుంది.

శోభ అంతలా ఎదగడం చూసిన వేరే అమ్మాయి కీర్తన ఇలా అనుకుంటుంది.

కీర్తన : అసలు ఇంత లా డబ్బు సంపాదించే అవకాశం శోభ కి ఎలా వచ్చిందబ్బా? అసలు ఈవిడ గౌనులు అన్ని ఎక్కడ నుచ్న్హి తెస్తుందో చూడాలి అని అనుకోని శోభ వెనకాలే వెళ్తుంది ఒక రోజు శోభ నది దగ్గరకు వెళ్ళగానే శోభ మీద ఈర్ష తో చంపేయాలి అని అనుకోని శోభని పొడవాలి అనుకోని పొడుస్తుండగా శోభ తప్పుకునే సరికి నదిలో పడిపోతుంది.

శోభ ప్రాణాలకు తెగించి కీర్తనని కాపాడుతుంది. శోభ మంచితనం చూసీ కీర్తన మారిపోతుంది. శోభ కి ఎలాంటి హాని తలపెట్టకుండా వెళ్ళిపోతుంది.

షార్ట్ స్టోరీ

శోభ అనే ఒక పేద అమ్మాయి ఒక అందమైన ఊరిలో ఉండేది, ఆమెకు నా అనే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు, ఒకరోజు ఎంతో ఆకలి వేసి అడవంతా తిరిగినా తినడానికి ఏమి దొరకలేదు, చేసేది లేక ఎవరినైనా అన్నామా అడుగుదాం అని అనుకోని వేళ్తే కుమారి అన్నామా పెట్టకపోగా అవమానిస్తుంది. దాంతో చనిపోవాలని వెళ్లిన శోభ కి గౌన్లు ఇచ్చే ఒక మాయ జలపాతం కనిపిస్తుంది. దాంట్లోనుంచి వచ్చిన గౌన్లని తీసుకెళ్లి ఊరిలో అమ్ముతూ బ్రతుకుతుంది శోభ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *