మాయ గౌను Magical Gown Telugu New Magical Story | Telugu Kathalu | Stories In Telugu | Moral Stories

శోభ తన సవతి తల్లి శారద కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఎందుకంటే సవతి తల్లి శోభనీ సరిగా చూసుకునేది కాదు. శోభ తండ్రి శంకర్ పట్టణంలో ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాడు. అప్పుడు శారద చాలా నటిస్తూ శోభన్ ఎంతో బాగా చూసుకున్నట్టు గా చేస్తూ ఉంటుంది దాన్ని చూసి శంకర్ తనను ఎంతగానో సంతోషపడుతూ…… అబ్బా నా భార్య తన కన్న బిడ్డ కాకపోయినా శోభ ని ఎంతో బాగా చూసుకుంటుంది. నాకిది చాలు అంటూ సంబర పడిపోయేవాడు.
కానీ శోభ తన మనసులో మాత్రం ఎంతో బాధపడుతూ…. మా నాన్న వచ్చినప్పుడు మా పిన్ని బాగా చూసుకుంటుంది తర్వాత మళ్లీ నన్ను కొడుతూ ఇంటి పని మొత్తం చేయిస్తూ బడికి కూడా పంపించదు.
మా నాన్న ఇక్కడే ఉండి పోతే బాగుండు. ఎలా అయినా మా నాన్న మీ ఊరికి వెళ్లకుండా చేయాలి అని అనుకుంటుంది.
ఇక రెండు రోజులు గడిచాయి.
శంకర్…. శారదా ఇక నేను బయలుదేరుతాను . శోభ నీ బాగా చూసుకో.
అంటూ శోభ వైపు చూసి…… శోభ నేను వెళ్లి వస్తాను జాగ్రత్తగా ఉండు బాగా చదువుకో.
శోభ…. నాన్న ఇక్కడే ఉండి పో నాన్న వెళ్ళద్దు . అని అంటూ ఏడుస్తుంది.
వెళ్లాలి అమ్మ అని చెప్పి అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు. వెళ్లిపోతున్న సమయంలో కూడా ఆమె తన తండ్రిని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది కానీ అతను వెళ్ళి పోతాడు.
తండ్రి వెళ్ళిపోయిన వెంటనే సవతి తల్లి… ఒసేయ్ ఏంటి మీ నాన్న ఇక్కడే ఉంచాలని చూస్తున్నావు. నిన్ను ఇలా కాదు అంటూ ఇష్టం వచ్చినట్టుగా పాపను కొడుతుంది.
పాప ఏడుస్తూ ….. పిన్ని నన్ను ఇలా నువ్వు కొడుతున్నావు బడికి పంపించలేదని కచ్చితంగా నాన్నకు ఫోన్ చేసి చెబుతాను.
ఇన్ని రోజులు నేను చెప్పక పోవడానికి కారణం మీ ఇద్దరి మధ్య గొడవలు అవుతాయని నేనింక భరించలేను. నిజం చెబుతాను నువ్వు నన్ను సరిగా చూసుకోవడం లేదు అని.
ఆ మాటలు వినగానే సవతి తల్లి మరింత కోపంతో ఊగిపోతూ….. ఎంత ధైర్యం వచ్చింది రెండు రోజులు మీ నాన్న ఎక్కడ ఉంటే టప్పటికి నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తే కదా అంటూ ఒక ఆమెను ఒక గదిలోకి తీసుకెళ్లి తాళం వేస్తుంది.
అది ఒక స్టోర్ రూమ్ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ పనికిరాని వస్తువులు ఉంటాయి.
దమ్ము లో పాప దగ్గుతూ ఉంటుంది పైగా చీకటి ఆ చీకటికి పాప చాలా బాధ పడుతూ ఉంటుంది.
తలుపు కొడుతూ …… పిన్ని తలుపు తీయి ఇక్కడ నాకు భయంగా ఉంది.
అంటూ ఏడుస్తూ ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేక పాప చాలా బాధ పడుతూ ఉంటుంది.
ఇక రాత్రి అయిపోతుంది సవతి తల్లి శుభ్రంగా తిని ప్రశాంతంగా పడుకుంటుంది.
ఇక రాత్రి సమయం పాప ఏడుస్తూ ఆ గదిలోనే ఉండిపోతుంది ఇంతలో ఒక్కసారిగా గది మొత్తం వెలుగుతో నిండి పోతుంది . పాపకి అసలు ఏం జరుగుతుంది అసలు అర్థం కాదు.
….. ఉన్నట్టుండి గదిలోకి ఇంటి వెలుగు ఎందుకు వచ్చింది. ఓరి దేవుడా ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వెలుగు వస్తుంది.
అని వెలుగు వస్తున్నా వైపుగా నడుస్తుంది.
ఆ వెలుగు ఒక పెట్టి నుంచి వస్తుంది పాపా ఆ పెట్టి నీ తెరిచి చూస్తుంది అందులో తళ తళ మెరిసి పోతూ ఒక గౌను. మరి చెప్పులు కనబడతాయి వాటిని చూసి పాప చాలా ఆశ్చర్యపోతుంది వాడిని తీసుకుంటుంది.
పాప…. ఏంటిది చాలా అందంగా ఉన్నాయి.
అని మాట్లాడుతూ ఉండగానే అవి కూడా మాట్లాడడం మొదలు పెడతాయి…. పాప నువ్వు చాలా బాగున్నావు . మమ్మల్ని బయటకు తీసి నందుకు చాలా సంతోషం.
మేము మాయ గౌను మాయ చెప్పలేము నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తాను.
పాప…. అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మిమ్మల్ని ఎవరు ఇక్కడ ఉంచారు.
అప్పుడు మాయ చెప్పులు గౌను…… ఒక స్వామీజీ శాంతి అనే ఆమెకు మమ్మల్ని బహుమతిగా ఇచ్చాడు . మమ్మల్ని జాగ్రత్తగా పెట్టెలో దాచి పెట్టింది . బహుశా తను అప్పుడు పిల్లలు లేరు . తన పిల్లలు పుట్టిన తర్వాత కనుక ఉపయోగించి అనుకుందేమో . తర్వాత ఏం జరిగిందో తెలీదు.
అప్పుడు పాప ఏడుస్తూ….. మా అమ్మ పేరు శాంతి మా అమ్మ ఇక్కడ ఉంచినట్టు ఉంది.
అప్పుడు నేను చిన్న పిల్లని కాబట్టే ఇలా చేసింది కానీ మా అమ్మ ఇప్పుడు లేదు.
అంటూ ఏడుస్తూ ఉంటుంది.
ఆమెను ఓదారుస్తారు ఆ మాయా గౌను చెప్పులు..
తర్వాత నువ్వు అసలు ఈక్కడ ఎందుకు ఉన్నావు నీకేం కావాలో చెప్పు.
అని అడుగుతారు.
పాప ఏడుస్తూ. …… నా సవతి తల్లి నన్ను సరిగా చూసుకోవడం లేదు అని జరిగిన విషయం అంతా చెబుతూ వస్తుంది.
అందుకు మాయ చెప్పులు గౌను ….. నువ్వు మమ్మల్ని ధరించు నువ్వు ఇక్కడ నుంచి బయటికి ఎక్కడ కావాలన్నా వెళ్లొచ్చు.
అందుకు పాప నేను మన దగ్గరికి వెళ్తాను ఇక్కడ జరుగుతున్న విషయం చెబుతాను.
అని అంటుంది పాప మాయా గౌను మాయ చెప్పులు ధరించి అక్కడినుంచి మాయమైపోతుంది . ఆమె గాల్లో తేలుతూ తన తండ్రి దగ్గర ప్రత్యక్షమవుతుంది.
తండ్రి ఆమెను చూసి చాలా ఆశ్చర్యపోతాడు.
ఏంటమ్మా ఇదంతా అని అడుగుతాడు అప్పుడు పాప జరిగిన విషయమంతా చెప్పి ఏడుస్తుంది.
ఆ మాటలు విన్న అతను చాలా బాధ పడుతూ….. అయ్యో శారద ఇలాంటి అని అస్సలు అనుకోలేదు . సరే అమ్మ ఆమె కూతురు నేనే బయట పెడతాను నువ్వు వెళ్ళిపో ఇప్పుడే బయలుదేరి ఇంటికి వస్తున్నాను.
అని అంటాడు అందుకు పాపా సరే అంటుంది . మళ్లీ అక్కడి నుంచి మాయమైపోయి గాల్లో తేలుతూ ఆ చీకటి గదిలో కి వెళుతుంది.
ఓ గంట సమయం తర్వాత తండ్రి ఇంటికి వస్తాడు అతను ఏమీ తెలియనట్టు గా.
ఉంటాడు భార్య అతన్ని చూసి….. ఏంటండీ ఇంత త్వరగా అనుకోకుండా వచ్చారు ఒక మాట కూడా చెప్పలేదు ఏంటి.
అతను …. ఏం లేదు ఎందుకో నాకు పాపం చూడాలనిపించింది అందుకే వచ్చాను .
అంటూ శోభ ఎక్కడున్నావు అన్న శోభ అని పిలుస్తూ ఉంటాడు.
శారద చాలా కంగారు పడుతూ…. శోభ లేదండి. ఇందాక నేను బడి దగ్గర వదిలిపెట్టి వచ్చాను. సాయంత్రం వస్తుంది.
అని అంటుంది తన మనస్సులో చాలా భయపడ్తు…. ఇదేంటి ఈయన ఇప్పుడు వచ్చాడు . నేను ఇప్పుడే దాన్ని బయటికి తీసుకు వద్దాం అనుకున్నాను ఒక్క రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా బాగుండేది.
అని అనుకుంటూ ఉండగా అతను సరాసరి ఆ స్టోర్ రూం గది వైపు నడుచుకుంటూ వెళ్తాడు ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది.
ఇంతలో తండ్రి అమ్మ శోభ అని పిలుస్తాడు.. లోపల ఉన్న శోభ…. నాన్న తలుపుతీయి నాన్న అని అంటుంది.
ఆ మాట వినగానే శారద గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పాప బయటకు వస్తుంది ఆమె బట్టలు చెప్పులు చూసి చాలా ఆశ్చర్యపోతుంది సవతి తల్లి.
అప్పుడు శంకర్ శారద వైపు చూసి కోపంగా…. ఇన్ని రోజులు నువ్వు ప్రేమగా చూసుకుంటే మంచిదినివి అని అనుకున్నాను కానీ నా బిడ్డ ఇలా వేధించుకు తింటావు అని అస్సలు అనుకోలేదు. ఆమె ఏడుస్తూ… ఏవండి నన్ను క్షమించండి . అంటూ ఏడుస్తూ ఉంటుంది అతని ఏం మాట్లాడకుండా పాపనీ తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఆమె చాలా బ్రతిమిలాడి ఉంది కానీ అతను
వినకుండా వెళ్తూ…. నువ్వు ఎప్పుడైతే పూర్తిగా మారిపోయారు అని నేను భావిస్తాను అప్పుడు మళ్ళీ తిరిగి వస్తాము అని చెప్పి వెళ్ళిపోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *