మాయ చేపలు ఇచ్చే పిల్లలు Telugu New Magical Story | Telugu Kathalu | | Telugu Stories | Moral Stories

శంకరపల్లి అనే గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది,ఆ ఊరి ప్రజలందరూ ఆ చెరువు మీదే ఆధార పది బ్రతుకుతుండేవారు,

అదే ఊరిలో రంగ, మంగ అనే ఇద్దఱు దంపతులు ఉండేవారు, వాళ్లకి పెళ్లి అయ్యి ఏడు సంవత్సరాలు అయినా కూడా వాళ్లకు పిల్లలు లేరు, ఒకరోజు మంగ రంగ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది

మంగ : ఏమండి మనకి పెళ్లి అయ్యి ఈ సంవత్సరం తో ఏడు సంవత్సరాలు పూర్తి కావొస్తుంది, కానీ ఇప్పటికి మనకు పిల్లలు కావడం లేదు, ఒక పని చేయండి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అప్పుడు మీరైనా సంతోషంగా పిల్లల్తో ఉండొచ్చు, నేను మీకు పిల్లల్ని ఇవ్వలేక పోతున్నాను అన్న బాధ నన్ను రోజు రోజుకి దహించివేస్తుంది అని అంటాడు

రంగా : మంగా నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిల్లలు ఎప్పుడు పుట్టాలి అని మన చేతుల్లో ఉంటుందా? అదంతా దేవుడి నిరన్యం నువ్వు ఇలా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు, పిల్లలు అయినప్పుడే అవుతారు నువ్వేం ఆలోచించకు వెళ్లి విశ్రాంతి తీసుకుపో అని అంటాడు

ఎప్పటిలాగే రంగా చేపలు పట్టడానికి చెరువుకు వెళ్తాడు, అతనికి కొన్ని చేపలు పడతాయి వాటిని తీసుకెళ్లి ఊరూరురా తిరిగి అమ్ముతుంటాడు, అతనికి జీవనాధారం చేపలు పట్టడమే, అలా వచ్చిన డబ్బుని ఇంట్లో ఇస్తూ ఉంటాడు

అలా వాళ్ళ జీవితం గడిచిపోతుంది

ఒకరోజు ఊరి జమీందారు అతని భార్య లత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు, అప్పుడే వాళ్లకి వేరే పని మీద వెళ్లి వస్తున్న మంగ ఎదురు వస్తుంది. జమీందారు ని చూసిన మంగ పలకరింపుగా ఇలా అంటుంది

మంగ : జమీందారు గారు బాగున్నారా అని అడుగుతుంది

ఇంతలో లత కలుగజేసుకొని ఇలా అంటుంది

లత : ఈమె నీకు కొంచమైనా బుద్ధి ఉందా శుభమా అని నేను మా ఆయన శుభకార్యానికి వెళ్తుంటే బొడ్రాలివి అయిన నువ్వు ఎదురు రావడమే కాకుండా ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతావా? నీకు పిల్లలు పుట్టే రాత ఉందొ లేదో ఇలా అందరికి ఎదురు వచ్చి  వాళ్ళ పనులు జరగకుండా చేస్తావు ఎందుకు అని అంటుంది.

లత అన్న మాటలకు మంగ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్తుంది.

ఇంట్లో ఉన్న రంగ మంగ బాధపడుతూ ఉండడం చూసి ఇలా అంటాడు

రంగ : మంగ ఏమయ్యింది ఎందుకు బాధపడుతున్నావు అని అంటాడు

మంగ : ఇందాక నేను పని మీద బయటకు వెళ్ళాను, అక్కడ జమీందారు మరియు అతని భార్య లత ఎదురొచ్చారు, మాటవరుసగా బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాను, దానికి లత నేను పిల్లలు లేని దానినని ఎదురొస్తే అపశకునం అని అనరాని మాటలన్నీ అనింది, ఆ మాటలకు నాకు ఎంతో బాధనిపించింది అని చుతుంది భర్తకు

రంగ : అయ్యో మంగ దారిన పోతుంటే ఎంతో మంది ఎన్నో అంటారు అంన్నింటిని పట్టించుకుంటూ పోతే ఎలా? వాళ్లకు డబ్బులు ఉన్నాయి కానీ మనసు ఉండదు, ఎంత డబ్బులు ఉంటె మాత్త్రం ఏమి లాభం మాట్లాడే విధానమే తలియనప్పుడు నువ్వేం బాధపడకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి చేపలు పట్టడానికి చెరువుకి వెళ్తాడు

కానీ రంగ కి మంగ బాధపడడం అస్సలు నచ్చలేదు చెరువు దగ్గర కూర్చిని తనలో తాను ఇలా అనుకుంటాడు

రంగ : ఏంటో మాకు ఈ కర్మ, పిల్లలు లేరని మంగ ఆలోచిస్తూ రోజురోజుకు చాలా కృంగిపోతూ ఉంది, అదీ కాకుండా ఇలాంటి వాళ్ళు మాటలు అనడం మాకు అందరిలా పిల్లలు ఎప్పుడు పుడతారో మా కష్టాలు మంగ బాధ ఎప్పడు పోతుందో అని అనుకుంటూ వల వేస్తాడు,

అతని వాళ్లకి చిక్కిన ఒక చేప గాల్లోకి లేస్తుంది ఇలా అంటుంది

చేప : ఓ మానవా, ఇన్నరోజులు నేను ఈ చెరువులో ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు వల వేసి బయటకు లాగి నాకు కొత్త ప్రపంచాన్ని చూపించావు నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను పదా నా మాయాస్ హక్తులతో నీకు కావలసినవాణ్ణి ఇస్తాను అని అంటుంది

రంగ : ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు నిను చూస్తుంటే నాకు భయమేస్తుంది, అని అంటాడు

చేప : చెప్పను కదా నేను ఏమి చేయనని, నేను బయట ప్రపంచాన్ని చూడాలని ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాను, ఇప్పుడు నువ్వు నాకు విశ్రాంతిని కలిగించావు, నీ కోరికలన్నీ నేను తీర్చగలను నన్ను బయటకు తీసుకెళ్ళు అని అంటుంది.

రంగ : నాకు పెద్దగా కోరికలు ఏమి లేవు కానీ నువ్వు కొత్త ప్రపంచాన్ని చూడాలి అనుకుంటున్నావు కదా అందుకే బయటకు తీస్తున్నాను అని అంటుంది

మాయా చేపను ఒక నీటి తొట్టిలో పెట్టి ఇంటికి తీసుకెళ్తాడు, రంగా ఇంటికెళ్ళినప్పటికీ కూడా మంగ ఇంకా తనకు తిరిగిన అవమానాన్ని తలుచుకొని బాధపడుతూనే ఉంటుంది

రంగా : మంగా ఇంకా ఆ విషయాన్నే తలుచుకొని బాధ పడుతున్నావా? వదిలేయ్ మని చెప్పను కదా? చూడు చెరువులో చేపలు పడుతుంటే నాకు ఈ మాయ చేప దొరికింది, ఇది మాట్లాడగలడు కూడా ఎంచక్కా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అని అంటాడు

చేప : రంగ నువ్వు చెరువు గట్టున కూర్చొని బాధపడడం నేను విన్నాను, నాకు బయట తిరగాలని ఏ కోరికా లేదు, కేవలం నీ కోసమే నీ ఇంటికి వచ్చాను, చెప్పాను కదా నేను ఒక మాయా చేపను ఏమి కావాలన్న ఇవ్వగలనని అని చెప్పి మూడు చెప్పాలని ప్రత్యక్షం చేస్తుంది.

చేప : చూడండి ఇవ్వి నా శక్తితో ఇచ్చిన చేపలు, మీరిద్దరూ వీటిని పిల్లలు పుట్టాలని కోరికతో దండం పెట్టుకోండి అని చెబుతుంది, చేప చెప్పినట్టు గానే ఇద్దరు మూడు చేపల దగ్గరికి వెళ్లి దండం పెట్టుకుంటారు

అప్పుడు వెంటనే మూడు చేపల కడుపు నుండి ముగ్గురు చిన్న పిల్లలు బయటకు వస్తారు, అది చూసి మంగ ఎంతో సంతోషపడుతుంది

అప్పుడు మాయ చేప ఇలా అంటుంది

చేప : చూడండి ఇప్పటినుంచి ఆ ముగ్గురు పిల్లలు ఇక మీ పిల్లలే, మీరు పిల్లలు లేరని బాధపడవలసిన అవసరం లేదు అని అంటుంది

అప్పటినుంచి మంగ పిల్లలు లేరని బాధపడకుండా ముగ్గురు పిల్లలని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది, ముగ్గురు పిల్లల్తో పాటు మాయా చెప్పాను కూడా నాతో ప్రేమగా చూసుకుంటుంది. ఇక జీవితం లో రంగా కానీ మంగా కానీ పిల్ల్లలు లేరని ఎప్పుడు బాధపడరు. ఇంకా వాళ్ళ ఇల్ల్లు పిల్లల అల్లరితో ఎంతో సంతోషంగా మారిపోతుంది

1 మినిట్ స్టోరీ

రంగ మంగ అనే ఇద్దరు భార్య భర్తలు తమకు పిల్లలు లేరని చాలా బాధపడుతూ ఉంటారు, అలా ఉండగా ఒకరోజు లతా అనే ఒక మహిళ రోడ్డుపై వెళ్తుండగా మంగ ఎదురొచ్చింది మంగని ఎంతో అవమానిస్తుంది, పిల్లలు లేని కారణంగా లత తనని అన్ని మాటలు అన్నాడని మంగా ఎంతో బాధపడుతూ ఉంటుంది. రంగ ఎప్పటి లాగానే చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అతనికి ఒక మాయా చేప దొరుకుతుంది, ఆ మాయ చేప రంగ మంగళ బాధని అర్ధం చేసుకొని వాళ్లకి మూడు చెప్పాలని ఇస్తుంది, ఆ చేపల కడుపు నుచి మూగ్గురు పిల్లలు వస్తారు, అది చూసిన రంగా మంగా ఎంతో సంతోషపడతారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *