మాయ చేపలు Magical Fish Telugu Magical Story | Telugu Stories | Telugu Moral Stories | Telugu Kathalu

శోభ   తన స్నేహితులతో ఆడుకుంటూ ఉంటుంది. ఇందులో వాళ్ల స్నేహితులకి దూరంగా ఒక స్వామీజీ కనబడతాడు. వాళ్లు….. అదిగో అక్కడ చూడండి ఎవరో వింత గా ఉన్నాడు పదండి వెళదాం కాసేపు అతన్ని ఆట పట్టిద్దము. శోభ…. వద్దు వద్దు మనం అలా చేయకూడదు . ఆయనని చూస్తుంటే ఏదో స్వామీజీ లాగా ఉన్నాడు. మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. అని అంటుంది అందుకు వాళ్లు…. శోభన వెళ్ళిపో అన్నిటికి ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. అని ఆమెను పక్కకు నెట్టారు. పాపా పక్కకు పడి చేతికి చిన్న గాయమవడంతో ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ పిల్లలు పరిగెత్తుకుంటూ అక్కడకు వెళుతూ ఉండగా వాళ్లకి ఎదురుగా ఎండు చేపలు అమ్మే ఆమె….. ఏడు చేపలు, తోక చేపలు, ఉప్పు చేపలమ్మ రావాలి బాబు రావాలి అమ్మ అంటూ అమ్ముకుంటూ ఉంటుంది.

ఆ పిల్లలు కావాలని పక్కకు నెడతారు ఆమె బుట్ట కింద పడిపోతుంది. పిల్లలు ఆ చేపల్ని తీసుకొని అక్కడి నుంచి పరిగెడతారు. ఆమె…. ఐయ్ పిల్లలు

ఏం చేస్తున్నారు వాటిని ఏం చేసుకుంటావు రా అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది. ఆమె చిరాగ్గా భావాలను తిట్టుకుంటూ అక్కడినుంచి వెళ్తూ…… ఏం పిల్లలో ఏమో కొంచెం కూడా బుద్ధి లేదు. చి చి

అని వాళ్ళ ని తిట్టుకుంటూ వెళ్తుంది ఆ పిల్లలు స్వామి జి దగ్గరకు వెళ్లి ఆ ఎండు చేపలను ఆయన మీద విసిరేస్తూ ఉంటారు. స్వామీజీ ఆ వాసనకి ఒక్క సారిగా కోపం గా పైకి లేచి….. నా తపస్సుకు భంగం కలిగించడమే కాకుండా ఇలా నీసు పదార్థం నా పైన విసురుతారు మిమ్మల్ని ఈ నీసులోకి పంపిస్తాను అంటూ వాళ్లని శపిస్తాడు. ఆ పిల్లలు అందరు కూడా మాయమైపోతారు. స్వామీజీ మళ్ళీ తపస్సు చేసుకుంటూ ఉంటాడు.

సాయంత్రం సమయం అవుతుంది. పిల్లలు ఇంటికి రాకపోవడంతో వాళ్ల తల్లులు శోభ ఇంటికి వస్తారు.

శోభతో….. అమ్మ నువ్వు నీ స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్లలేదా.

శోభ….. వెళ్లాను ఆంటీ వాళ్ళ నాతోని ఆడు కొన్నారు. నేను కొంచెం సేపు ఉన్న తర్వాత వచ్చేసాను. అని అంటుంది వాళ్ళు….. వాళ్లు ఎవరు కూడా ఇంత వరకు ఇంటికి రాలేదు అమ్మ భయంగా ఉంది. అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతారు శోభ తన మనసులో…. పొద్దున ఎప్పుడో ఆడుకోడానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి. ఏం జరిగి ఉంటుంది నాకెందుకో చాలా అనుమానంగా ఉంది ఆ స్వామీజీ ఏమన్నా విల్లని తీసుకుని వెళ్లి పోయాడా.

అతను పిచ్చోడు ఏమో లేకపోతే పిల్లల్ని పట్టుకెళ్ళి వాడేమో. అంటూ తనలో తానే అన్నీ సందేహాలను ఒక దాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది.

ఇక రాత్రి సమయం అవుతుంది. తల్లులు పిల్లల కోసం ఎదురు చూస్తూనే బాధపడుతూ ఉంటారు. శోభ

కూడా ఆలోచిస్తూనే పడుకుంటుంది.

ఆ మరుసటి రోజు ఉదయం కూడా పిల్లలు రాకపోవడంతో చాలా కంగారు పడుతూ వుంటారు తల్లిదండ్రులు కూడా కంగారు పడుతూ ఆ స్వామీజీ దగ్గరకు వెళ్తుంది. స్వామీజీ జపం చేస్తూ ఉంటాడు శోభా చిన్నగా…. స్వామి స్వామి అని పిలుస్తుంది.

స్వామీజీ….. ఎవరు అంటూ చిన్నగా కళ్ళు తెరుస్తాడు. శోభ…. స్వామి నేనే మిమ్మల్ని పిలిచాను. స్వామీజీ ఏం కావాలమ్మా నీకు అడుగుతాడు.

శోభ….. స్వామి నిన్ను నా స్నేహితులు కొందరు మీ దగ్గరకు వచ్చారు. వాళ్లు నిన్నటి నుంచి కనిపించడం లేదు వాళ్ళ జాడ కావాలి. వాళ్ల కోసం వాళ్ల తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు.

స్వామీజీ…

ఆ పొగరుబోతు లు మీ స్నేహితుల వాళ్లకు తగిన శాస్తి జరిగింది. వాళ్లు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నారు. ఆ మాట వినగానే శోభా కంగారుపడుతూ….. ఏం చేశారు స్వామి . అసలేం జరిగిందో చెప్పండి. అందుకు స్వామి జరిగిన విషయమంతా చెప్పాడు.

వాళ్ళకి శిక్ష విధించాను అని . వాళ్ళు ఇప్పుడు ఒక నదిలో ఉన్న ఒక చెట్టు కోమ్మ నా  వేలాడుతున్న చేపల కడుపులో ఉన్నారు అని స్వామిజి చెప్తాడు దానికి శోభ చాలా బాధపడుతూ….. స్వామి వాళ్లు చేసిన దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దయచేసి వాళ్లను శాపం నుంచి విముక్తి పొందే లాగా చేయండి. మీకు పుణ్యం ఉంటుంది స్వామి. దయచేసి జా లి చూపించండి అంటూ ఏడుస్తూ బాధపడుతుంది.

స్వామీజీ పాప యొక్క ప్రవర్తన నచ్చి….. చిన్నపిల్లపై నా యొక్క సభ్యులకు మెచ్చి వాళ్ళని విడిపించేందుకు అవకాశం కల్పిస్తున్నాను. ఊరి చివర ఉన్న నదిలో పడవలో ప్రయాణం అయితే. వాళ్ళు నీకు కనబడతారు. ఇదిగో ఈ ఉంగరాన్ని ఆ చెట్టు వైపు చూపిస్తే చెట్టుపై చేపల శరీరంలో దాగి ఉన్న నీ స్నేహితులు శాప విముక్తి పొంది నీ దగ్గరకి చేరుకుంటారు. అని చెప్పడంతో ఆమె సంతోషపడుతుంది. ఇక స్వామీజీకి కృతజ్ఞతలు చెప్పి ఉంగరం తీసుకొని. నది దగ్గరకు వెళ్తుంది అక్కడ ఆమెకు ఒక పడవ కనపడ్డం తో. అందులో ఎక్కి కూర్చొని తన ప్రయాణం సాగిస్తోంది చాలా చాలా దూరం వెళ్లిన తర్వాత. ఆమెకు ఒక చెట్టు కనబడుతుంది ఆ చెట్టు మీద చేపలు. చేపలలో కడుపులో ఉన్న పిల్లలు పెద్ద పెద్ద గా ఏడుపులు వినబడుతూ ఉంటాయి…… అమ్మ నాన్న ఎక్కడున్నారు మీరు బొమ్మల కాపాడండి ఇక్కడ భయంకరమైన దుర్వాసన. మమ్మల్ని కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటారు.

కీర్తి వాళ్ళ మాటలు విని…… అయ్యో నా స్నేహితులు ఎంత బాధ పడుతున్నారో. భగవంతుడా అంటూ తన చేతిలో ఉన్న ఉంగరాన్ని ఆ చెట్టు వైపు చూపిస్తుంది. వెంటనే చెట్టుకి ఉన్న చేపలన్ని ఆ పడవ లో పడతాయి. ఆ పడవలోని చేపను కోయగా పిల్లలుడు బయటకు వస్తారు.

వాళ్ల ఎదురుగా ఉన్న శోభన చూసి గట్టిగా హత్తుకొని….. మిత్రమా నిన్ను దూరం చేసిన మమ్మల్ని దూరం చేసుకోకుండా ఇక్కడికి వచ్చావు.

నువ్వు నిజమైన స్నేహితురలివి. నీ మాట ఆరోజు ఉన్నందుకు మేము చాలా నరకం చూసాం. అంటూ ఏడుస్తూ బాధపడతారు.

శోభ….. మరేం పర్వాలేదు ఇప్పటికైనా అర్థమైందా. మనం పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మనం ఎవరినీ బాధించ ఉంచకూడదు. అలా బాధ పెడితే తర్వాత మనం కూడా బాధ పడతాము. అంటూ అందుకు వాళ్లు అవును అని సమాధానం చెపుతారు ఇక అందరూ తిరిగి పడవలు వస్తారు.

ఇంకా ఒడ్డుకు చేరుకున్న వెంటనే స్వామీజీ అక్కడే ఉంటాడు. స్వామీజీని చూసి వాళ్ళు…… స్వామీజీ నీకు చాలా కృతజ్ఞతలు అలాగే క్షమాపణ కోరుకుంటున్నాము. అని ఆ పిల్లలు అందరు స్వామీజీకి క్షమాపణ కొరుతారు.

స్వామీజీ….. చూడండి పిల్లలు మీకు ఇలాంటి స్నేహితురాలు దొరికినందుకు చాలా గర్వ పడాలి. ఇలాంటి

స్నేహాన్ని మీరు ఎప్పుడు వదులుకోకండి. జీవితంలో మన కోసం నిలబడే ఒక స్నేహితుడు కావాలి. మి కోసం నిలబడే నిజమైన స్నేహితుడు ఈమె. స్నేహంలో చిన్నచిన్న గొడవలకు విడిపోయే వాళ్ళు ఉంటారు. కానీ మీరు గాయపరిచిన కూడా ఆమె ఇంట్లో ఏం చెప్పకుండా. మీరు చేసిన తప్పుని మీ పెద్దవాళ్లకి చెప్పకుండా తనంతట తానుగా వచ్చి

నా స్నేహితులని కాపాడండి అని ప్రాధేయపడింది.

అలాంటి స్నేహాన్ని మీరు ఎప్పుడు వదులుకోకండి ఎప్పుడు మీరు స్నేహితులుగానే ఉండాలి అని చెబుతాడు అందుకు వాళ్లు తప్పకుండా అంటూ ఒకరినొకరు పట్టుకొని బాధపడతారు.

ఇక అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ల తల్లిదండ్రులు వారిని చూసి ఎంతగానో సంతోష పడతారు. బాలు జరిగిన విషయమంతా చెబుతారు.

వాళ్ళ తల్లులూ దానిని విని శోభ యొక్క ధైర్యాని గొప్ప మనసు ని చాల మెచ్చుకుంటారు. వాళ్లు జరిగిందంతా మర్చిపోయి ఎప్పటిలాగే స్నేహంగా సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *