మాయ చేపల కూర 2 Telugu Magical Story | Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories

శోభ తన తల్లి చనిపోయిందని శవం ముందు కూర్చుని ఏడుస్తూ ….. అమ్మ లేమ్మా. నువ్వు లేకపోతే నేను నాన్న సరిగ్గా చూసుకోడు అమ్మ. నేను కూడా మీతో పాటు వస్తా నమ్మ. ఒకసారి లేచి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్లండమ్మ. అంటూ పెద్ద పెద్ద ఏడుస్తూ ఉంటుంది. పాపం పాప ని చూసి చాలామంది బాధపడుతూ ఉంటారు. తాగుబోతు అయినా తండ్రి శంకర్ అక్కడికి వచ్చి….. ఊరికే చచ్చిన శవాన్ని ఎంతసేపని అలా ముందు కూర్చుని ఏడుస్తారు. తీసుకెళ్లి అవతల పడేయండి.
అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు….. చి వీడు మారడు వీడి జీవితంలో మారడు అంటూ తిట్టుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అంతా పూర్తయిపోతుంది. రెండు రోజుల తర్వాత తన తండ్రి ఇంటికి తాగి వచ్చి….. ఒసేయ్ బుడ్డ దాన పిల్ల పిశాచి. ఎక్కడున్నావే అంటూ కేకలు వేస్తాడు పాప శోభ….. ఏమైంది నాన్న.
తండ్రి….. గాడిదగుడ్డు అయింది. భాగా మేక్కి మూడుపూట్ల తింటున్నావు. ఇక్కడ ఒకడు ఉన్నాడు వాడికి ఏమైనా పెట్టాలి అని తెలియదా.
అందుకు పాప ….. నాన్న నేను అసలు రెండు రోజుల నుంచి ఏమీ తినలేదు. ఆకలవుతుంది నువ్వు ఏమైనా తీసుకొస్తావా ని చూస్తే నువ్వు ఏమి తీసుకు రావటం లేదు.
అతను….. అబ్బా నేను తీసుకురావాలా. వంట చేయడం నేర్చుకో వే అంటూ పాపని తిట్టి కొడతాడు పాప ఏడుస్తూ … నాన్న కొడుకు నేను వంట చేస్తాను అని ఏడుస్తుంది. పాపం ఆ చిన్ని చిన్ని చేతులతో తాను వంట తయారు చేసి అతనికి అందిస్తుంది.
అతను….. ఏంటి ఇది గడ్డి లాగా ఉంది నువ్వు తినవే అంటూ దాన్ని విసిరికొడతాడు.
పాపా మొఖం పై ఆ భోజనం విసిరి కొట్టడంతో. కంట్లో పడి …. వంట వంట అంటూ అరుస్తూ వెళ్లి ముఖం కడుక్కుని అలా తండ్రి వైపు బాధగా చూస్తూ ఉంటుంది.
అతను మాత్రం పట్టీపట్టనట్లు గా….. అక్కడి నుంచి బయటికి వెళ్ళి పోతాడు. పాప ఏడుస్తూ ఇంట్లో పడుకుంటుంది. తండ్రి బయటకు వెళ్లి తన మనసులో…… ఈ పిల్ల దాంతో నాకెందుకు ఎక్కడ ఉంటే దీన్ని సాగడం నావల్ల కాదు. నేను దూరంగా వెళ్ళి నా బతుకు నేను బతుకుతా. అని అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రెండు రోజులు గడిచాయి. పాపా తండ్రి కోసం ఎదురుచూస్తూ బాధపడుతు….. ఎక్కడికి వెళ్లి పోయాడు మా నాన్న . నువ్వు ఎక్కడ ఉన్నా తిరిగి రా నాన . అంటూ ఏడుస్తూ బాధపడుతు…… అమ్మ నువ్వు గుర్తుకొచ్చిన ప్రతిసారి నిన్ను చూడడానికి కనీసం నీ ఫోటో ఒకటి కూడా లేదు. నాన్న నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు అమ్మ. నేను ఒంటరి దానమ్మ…. పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. రోజులు గడిచాయి తన తండ్రి కోసం పాప ఎదురు చూస్తూ ఉంటుంది తినీ తినక ఎన్నో ఇబ్బందులు పడుతోంది.
తల్లిని గుర్తుచేసుకుంటూ పదేపదే ఏడుస్తూ తన తల్లి ఫోటో ఒకటి ఉన్నా బాగుండు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఇంతలో ఒక స్వామీజీ అటుగా వెళుతూ ఉంటాడు.
పాప యొక్క బాధ చూసి….. పాప ఎందుకు ఏడుస్తున్నావ్. ఎందుకు పాప……. మా అమ్మ చనిపోయింది మా నాన్న నన్ను వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. మా అమ్మని చూడడానికి ఒక్క ఫోటో కూడా లేదు. అమ్మ నాకు పదే పదే గుర్తుకు వస్తుంది స్వామి. అంటూ తన గోడును వినిపించుకోవడం ది పాప.
స్వామీజీ తన మాయతో తన తల్లి యొక్క చిత్రపటాన్ని ప్రత్యక్షం చేస్తాడు.
దాన్ని చూసి పాప ఎంతగానో సంతోషపడుతూ…… అమ్మ అమ్మ అంటూ ఫోటో ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. స్వామీజీ నీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
పాపా చాల సంతోషపడుతూ తన తల్లి ఫోటో ని తీసుకొని ఇంట్లో ఉంచి. తన బాధ పడుతూ తల్లికి అని చెప్పుకుంటూ ఉంటుంది.
రోజులు గడుస్తున్నాయి పాపే స్వయంగా భోజనం తయారు చేసుకుంటూ తాను వచ్చినట్లు దాన్ని తయారు చేసుకుంటుంది.
అది అంత రుచిగా ఉండదు అయినా కూడా పాప అలాగే తిందాం లే అనుకొని మరో పని చేసుకుంటూ ఉంటుంది . ఇంట్లో తల్లి చిత్రపటం నుంచి ఆమె దాన్ని చూసి….. అయ్యో నా బంగారు తల్లి ఎంత కష్టపడుతుంది. అంటూ తాను తయారు చేసిన వంటని తల్లి యొక్క శక్తితో చేపల కూర గా మారుస్తుంది.
కొంత సమయం తర్వాత పాప అక్కడికి వచ్చి భోజనం చేస్తుండగా…. ఆశ్చర్యంగా ఉంది. నేను కూరగాయలతో కూర వండితే చాపల కూర ఎలా వచ్చింది. అని ఆశ్చర్యంగా దాన్ని తింటుంది.
అబ్బా ఇది ఎంత రుచిగా ఉంది అని అనుకుంటుంది పాప.
రోజులు గడుస్తున్న వి. రోజు పాప నిద్ర లేవకముందే అక్కడ భోజనం తయారు అయి ఉంటుంది.
అందమంతా చూసి చాలా ఆశ్చర్యపోతుంది పాప.
పాప ఏడుస్తూ…… అమ్మా నాకు అర్థమైంది. నువ్వే ఈ ఫోటో నుంచి అన్నీ చేస్తున్నారు. కానీ అమ్మ నువ్వు ఎన్ని చేసినా నేను ఒంటరిదానిని ఒక్కసారి నాకు కనిపించఅమ్మ. నేను ఒంటరి తనాన్ని భరించలేక పోతున్నాను. నేను స్నేహితులతో ఆడుకోవాల్సిన వయసులో . ఇంటి పని చేసుకొని బయట దొరికిన పని చేసుకుంటూ బతుకమ్మ. అమ్మ ఒక్కసారి రా అమ్మ. అంటూ పదే పదే తల్లిని పిలుస్తూ బాధపడుతుంది.
అలా పాప ఏడుస్తూనే నిద్రలోకి జారి పోతుంది.
తల్లి ఆ చిత్రపటం నుంచి బయటకు వచ్చి….. అయ్యో భగవంతుడా. నేనేం చేయాలి నేను పాపకి కనిపించకూడదు. స్వామీజీ చిన్న వరంతో నేను జాగ్రత్త పడాలి ఆమెకు సహాయం చేయడం కోసమే నేను వచ్చాను కానీ కలిసి జీవించడానికి కాదు.
ఆ విషయం చెప్పలేను. ఆమెకు నేను కనిపించలేను.
అంటూ చాలా బాధపడుతుంది.
రోజులు గడుస్తున్నాయి పాప ఒంటరితనాన్ని ఎలాగైనా సరే తన తల్లి తొలగించాలని అనుకుంటూ ఉంటుంది. ఒక చక్కని ఆలోచన వస్తుంది .
అప్పుడే పాప ఎవరు చేపలు అయితే దాంతో వంట తయారు చేయడానికి సిద్ధమవుతోంది. ఇంతలో తల్లి పాప కి కనిపించకుండా ఆ చిత్ర పటం నుండి బయటకు వచ్చి…… అక్కడున్న చేపల్ని మరో విధంగా మార్చేస్తుంది. పాప ఆ చేపల్ని చూసి….. అయ్యో ఉన్నట్టుండి ఈ చేపలు ఎక్కడినుంచి వచ్చాయి. ఆశ్చర్యంగా ఉంది ఇంత పెద్ద చేపలు నేను తీసుకు వచ్చింది ఏంటి. ఇక నేను చూస్తున్న ఏంటి
అని ఆశ్చర్యంగా వాటిని వస్తుంది ఇంతలో చేపల నుంచి ఇద్దరూ పిల్లలు బయటకు వస్తారు.
పాప వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యపోతుంది పిల్లలిద్దరూ…. శోభను కంగారుపడుతూ నీ ఒంటరితనాన్ని పోగొట్టడం కోసమే మేము వచ్చాము నీతో ఆడతాము నీతో కలిసి తింటాము. నీతో కలిసి ఇక్కడే జీవిస్తాము. అని అంటరు ఆ మాటలకి పాప ఎంతగానో సంతోష పడుతూ ….. మా అమ్మే ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడకు పంపించింది అని తలలు అనుకొని వాళ్లతో ఆడుకుంటుంది. అందరూ కలిసి పనులు చేసుకుంటారు. కలిసి భోజనం చేశారు. సంతోషంగా అక్కడే ఆడుకుంటారు.
ఇక పాప ఒంఅన్న అన్న మాటే లేకుండా పోతుంది తను సంతోషంగా వాళ్లతో ఉంటుంది.
దానంత చూసిన తల్లి ఎంతగానో సంతోషపడుతుంది.
పాపా తన మనసులో…. అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. నీ ప్రేమను నువ్వు నామీద మళ్ళీ ఇలా చూపించినందుకు. ఓకే జన్మంటూ ఉంటే మనం ఇద్దరం మళ్ళి తల్లి కూతురూలుగా పుట్టి దీర్ఘాయుష్షుతో బతకాలని కోరుకుంటున్నాను.
అని భగవంతుని తలుస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *