మాయ చేపల కూర Telugu New Magical Story | Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories

అది ఒక చిన్న చెరువు. చిన్న చెరువు పక్కన చిన్న గుడిసె ను ఏర్పాటు చేసుకుని ఒక పేద భార్య భర్తలు నివసిస్తున్నారు. భర్త శంకర్ భార్య శారద వాళ్ళిద్దరూ కూడా ఆ చెరువులో మరియు పక్కన దగ్గరలో ఉన్న నదిలో చేపలు పట్టుకొని వాటిని అమ్మి వాళ్ళ జీవితాన్ని సాగించేవారు.
తన రోజులు గడుస్తుండగా ఒకరోజు భర్త….. శారదా ఎప్పుడు పని పని పని తోనే మన జీవితం అంతా సరిపోతుంది. ఒక్కరోజు కూడా ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేసింది లేదు ప్రశాంతంగా మాట్లాడుకున్నది కూడా లేదు. ఈరోజు మనం సరదాగా కూర్చొని మాట్లాడుతున్నాదము. శారదా…. సరే అండి తప్పకుండా మీరు అయితే చేపలు తీసుకురండి నీకు ఇష్టమైన చేపల కూర వండి పెడతా. అని ఆమె అన్నం కట్టెల పొయ్యి మీద సిద్ధం చేస్తూ ఉంటుంది.
చేపల ఎదురుగా ఉన్న చెరువులో చేపలు పడుతూ ఉంటాడు. చాలా సమయం తర్వాత ఒక పెద్ద చేప అతనికి దొరుకుతుంది.
ఆ చేప చాలా వేగంగా ఉంటుంది అది భార్యాభర్తలిద్దరూ కూడా చూసి ఏంటిది.
చాలా పెద్దగా ఉంది.
అని అనుకుంటారు.
భార్య…. ఏవండీ ఇదేదో అలాగే ఉంది. దీనిని కోసి చూడండి. మనకు ఏమన్నా బంగారం దొరుకుతుందేమో. అందుకు అతను సరే అని చెప్పి దానిని కోయ్యిలనుకుంటాడు కానీ అది వెంటనే గాలిలోకి ఎగురుతుంది.
చేప గాల్లోకి ఎగరడం ఏంటని భార్యాభర్తలిద్దరూ చాలా కంగారు పడిపోతారు. అది గాలిలోకి ఎగురుతుంది కానీ అక్కడ అక్కడే తీరుగుతూ ఉంటుంది.
అతను వెంటనే …. ఇదేదో మాయ చేప లాగే ఉంది దీని పని చెప్పాలి అంటూ తన చేతిలో ఉన్న కర్ర ను గట్టిగా విసిరికొడతాడు.
అది ఎగురుతున్న చేప కు తగిలి చేప మాయమైపోయి ఒక పాప బయటకు వస్తుంది. పాప ని చూసి వాళ్ళిద్దరు….. ఎవరు నువ్వు . ఆ చేప కడుపులో కి ఎలా వెళ్లావు .ఆ చేప ఏంటి మాయిమైపోయింది నాకు ఏమీ అర్థం కావట్లేదు. కొంపదీసి నేను దయ్యాన్వా.
అందుకు పాప…. లేదు లేదు నేను ఒక మాయా పాపని ఒక స్వామిజి శాపం వల్ల నేను కొన్ని నెలలు చేప కడుపులో మరికొన్ని నెలలు ఆవు కడుపులో మరికొన్ని నెలల్లో మరో జంతువు కడుపులో పెరగాల్సి ఉంటుంది. ఎవరైనా ఐనా ఆ జంతువునీ లేదా ఆ పక్షిని గాయపరిస్తే కానీ నా శాపం తొలగిపోదు. ఇంతవరకు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. మీ అందుకే నేను వింతగా చేయాలని చేపకు రెక్కలు తీసుకొచ్చాను. నేను అనుకున్నది సక్రమంగా జరిగింది నన్ను శ్ పం నుంచి మీరు విముక్తి
కలిగించారు.
అని అంటుంది అందుకు వాళ్లు కూడా సంతోష పడతారు. వాళ్లు ….. నీకు చాలా మాయలు ఉన్నాయి అని అంటున్నావు కదా . కుటుంబ పరిస్థితులు అసలు బాగోలేదు నువ్వు దయ చూపించి మాకు ఏమన్నా సహాయం చేయి నీ మేలు మర్చిపోలేను.
అందుకో పాప…. తప్పకుండా నాకు సహాయం చేసిన మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను. అని అంటుంది అందుకు శారద…..
మేము దానికోసం ఎదురు చూస్తున్నాము. అని అంటుంది ఇంతలో పాప పెద్ద పెద్ద చేపలు ప్రత్యక్షం చేస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాటిని చూస్తారు అవి బంగారు వర్ణంలో ఉంటాయి. పాప….. చూడండి మీరు ఈ చేపల్ని ముక్కలుగా నరికి నప్పుడు అవి బంగారాన్ని ఇస్తాయి. ఈ చేపలు బంగారు చేపలు వాడికి తిండి అవసరం లేదు నీటిలో ఉండాల్సిన అవసరం లేదు. మరణం లేదు మీరు వాటిని నరికిన ప్రతిసారి బంగారం వస్తుంది వాటి గాయం మాయమైపోతుంది . .
అందుకు వాళ్లు చాలా సంతోషపడ్డారు ఆమె అక్కడి నుంచి మాయమైపోతుంది.
ఇక వాళ్ళు ఆ చేపల ద్వారా చాలా బంగారాన్ని సంపాదిస్తారు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా బంగారం మొత్తం ఒక మూటలో కట్టుకుంటారు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాటిని అమ్మి డబ్బు సంపాదించి ధనవంతుడు అవుతాడు అని అనుకుంటారు . అనుకున్న కాని వాళ్ళు కట్టిన మాటలన్నీ తీసుకొని పట్నం వెళ్తారు అక్కడ ఒక బంగారం పని చేసే వ్యక్తి దగ్గరికి వెళ్లి…… బాబు మా దగ్గర చాలా బంగారు నాణాలు ఉన్నాయి. మీరు వాటికి తగిన ధర ఇవ్వగలరా. అందుకు అతను వాళ్లను పైనుంచి కిందదాకా చూసి….. వీళ్ళ మొహాలు చూస్తుంటే దొంగ మొఖాలు లాగా వున్నాయి వెళ్లి బట్టలు కూడా చినిగిపోయిన టు గా ఉన్నాయి వీళ్లు బంగారం ఎలా తీసుకొస్తారు. బంగారం ఎలా వస్తుంది ఖచ్చితంగా వీళ్ళు దొంగతనం చేశారు.
వీళ్ళ సంగతి చెప్పాలి అని అనుకొని వాళ్లతో….. తప్పకుండా మీ దగ్గర ఉన్న బంగారం చూపించండి దానికి తగ్గ డబ్బులు ఇస్తాను. అని అంటాడు అందుకు వాళ్లు చాలా సంతోష పడుతూ వాళ్ళ మాటలు విప్పి చూపిస్తారు.
అతను వాటిని చూసి కళ్లు చెదిరే పోతాడు నాణ్యమైన స్వచ్ఛమైన బంగారం అని తనలో అనుకొని వాటిని చూసి ….. ఇది అసలు బంగారమే కాదు మీకు ఎక్కడినుంచి వచ్చింది . ఎవరిచ్చారు మీకు అడుగుతాడు.
అందుకు వాళ్ళిద్దరూ కూడా ఒకరి మొఖం ఒకరు చూసుకొని…. బంగారం కాదా.!? బాబు ఒకసారి సరిగ్గా చూసి చెప్పు బంగారం ఎందుకు కాదు . మాకు ఒక మాయా పాప ఈ బంగారాన్ని ఇచ్చింది అని జరిగిన విషయమంతా చెబుతారు.
దాన్ని విన్న అతనికి మరింత ఆశ పెరిగిపోతుంది…… అయ్యో ఈ రోజుల్లో కూడా మాయలు మంత్రాలు ఉన్నాయా. ఒకవేళ మీరు చెప్పింది నిజమే అయితే
ఆ చేపలు బంగారం ఇవ్వట్లేదు అన్నది కచ్చితంగా నిజం. కావాలంటే మీరు ఈ బంగారం ఎక్కడ కన్నా తీసుకువెళ్ళండి వాళ్లు కూడా ఇదే చెబుతారు. కానీ ఒక్క మాట అందరూ నాలాగా మంచివాళ్ళు ఉండరు.
మీరు చెప్పింది నిజమే అయినా కూడా వాళ్ళు దానిని నమ్మకపోవచ్చు. పైగా నకిలీ బంగారం తీసుకువచ్చారు అని మిమ్మల్ని పోలీసులు తప్ప చెబుతారు జాగ్రత్త.
ఆ మాటలకి భార్యాభర్తలిద్దరూ కూడా ….. మనం ఎంతో ఆశ పడ్డాము. ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. అంటూ బాధపడతారు అతను….. అయ్యో మీరు అలా బాధ పడటం నాకు చాలా బాధగా ఉంది . ఇది బంగారం కాకపోయినా ఇది కూడా ఒక లోహ మే కదా నేను బయట ఎక్కడైనా ఆమ్ముతాను దానికి బదులుగా మీరు ఈ కొంచెం డబ్బులు తీసుకోండి అని వెయ్యి రూపాయల్ని చేతిలో పెడతాడు.
భార్య భర్తలు అదే చాలు అన్నట్లుగా భావించి అమాయకంగా అక్కడినుంచి వెళ్ళిపోతారు.
ఆ షాపు యజమాని చాలా సంతోష పడుతూ….. లక్షలు లక్షలు నేను నా సొంతం చేసుకొని 1000 రూపాయలు ఇచ్చాను పిచ్చివాళ్లు. నేను చెప్పిన మాటలు నమ్మేసారు. హా హా అని అనుకుంటాడు భార్య భర్తలు ఇంటికి వెళ్లి చాలా బాధగా మాట్లాడుతుంటారు . వాళ్లు….. ఇక ఈ చాపలు మనకెందుకు మనల్ని మాయ పాప కూడా మోసం చేసింది.
అంటూ బాధ పడుతూ ఆ చేపల్ని చెరువులో వేస్తారు. వెంటనే మళ్లీ పాప అక్కడ ప్రత్యక్షమవుతుంది. పాప…. ఏమైంది ఎందుకు మీరు ఇలా చేశారు.
ఆ భార్యాభర్తలు ఇద్దరూ….. ఆ విషయం నేను నిన్ను అడగాలి. మమ్మల్ని మోసం చేశావు. బంగారం అని చెప్పి పనికిరాని లోహాన్ని అందించావు.
అందుకు పాప…. మీరు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం కావట్లా. అసలేం జరిగింది అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయం చెబుతారు.
పాప…. మోసం చేసింది నేను కాదు. ఆ యజమాని. నిజమా అంటూ ఆశ్చర్యపోతారు.
పాపా….. మీరు మళ్ళీ బంగారు నగలు తీసుకుని అతని దగ్గరికి వెళ్ళండి . అతను మిమ్మల్ని మోసం చేసినందుకు తగిన శిక్ష పడుతుంది.
అందుకు వాళ్లు సరే అంటాడు కొన్ని రోజుల తర్వాత బంగారం తీసుకొని అక్కడికి వెళ్తారు.
మళ్లీ చాలా సంతోషపడ్డాడు .
ఇస్తారు. అతను మళ్లీ వాళ్ళకి ఏదో చెబుతూ వెయ్యి రూపాయలు ఇస్తాడు.
అలా మోసం చేసిన వెంటనే. అతను బిచ్చగాడిగా మారిపోతాడు .
ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ధనవంతులు గా మారిన షాపు యజమానుల మారిపోతారు.
అతను భిక్షాటన చేస్తూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. జరిగింది అంతా అతనికి ఉండదు.
ఆ భార్యభర్తలకు మాత్రం గుర్తుంది. వాళ్లు… ఒకరిని మోసం చేస్తే చివరికి వాళ్ళే మోసపోతారు అని బాధపడుతూ. వాళ్లు ఆ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *