మాయ బంగారు జుట్టు 2 Latest Story | Telugu Stories | Stories In Telugu | Telugu Fairy Tales

రామాపురం గ్రామంలో ఒక దెయ్యం ఉండేది, ఆ దెయ్యానికి బంగారు జుట్టు ఉండేది, ఊరిలో ప్రజలందరూ దెయ్యాన్ని చూసి భయపడేవారు కానీ దెయ్యం ఎవ్వరిని ఏమి అనేది కాదు, అదే ఊరిలో శోభా అనే అమ్మాయి ఆమె తల్లి జయమ్మ తో ఉండేది. జియ్యమ్మ వాళ్ళు చాలా పేదవాళ్ళు అవ్వడం వల్ల ఊరిలో ఎవ్వరు వీళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు, జయమ్మ అడవిలో దొరికిన కట్టెలు దుంపలు తీసుకొచ్చి ఊరిలో అమ్ముతూ బ్రతుకుతుంది, అలా వచ్చిన డబ్బులు వాళ్ళ జీవనానికి సరిపోయేవి కావు, డబ్బులు ఉన్న రోజు తిని లేని రోజు శోభా కి పెట్టిసి హాజయమ్మ పస్తులు పడుకునేది,

రోజు లాగే ఒకరోజు అడవికి వెళ్తున్న జయమ్మ శోభతో ఇలా అంటుంది

జయమ్మ : శోభ నేను అడవికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనుంచి ఎక్కడికి వేళ్ళకు ఎవరితో మాట్లాడకు ఎవరితో మాట్లాడిన వాళ్ల్లు మనం ల్పెదవాలం అని మనల్ని చులకన చేస్తారు, వాళుళ్ అన్న మాటలకు నుయివ్వు మల్లి బాధపడడం నాకు నచ్చదు అని అంటుంది

శోభ : సరే అమ్మ ఎక్కడికి వెళ్ళాను నువ్వు వచ్చేవరకు ఇంట్లోనే ఉంటాను, అని అంటుంది

జయమ్మ : అసలే వరిలో బంగారు జుట్టు దెయ్యం తిరుగుతుందని ఊరంతా అనుకుంటున్నారు, నాకంటూ ఉన్నది నువ్వు ఒక్క దానివే ఆ దెయ్యం నిన్నేమన్నా చేస్తే మల్లి తెట్టుకొని బ్రతకడం నా వల్ల కాదు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండు, అలాగే కొంచం అన్నం ఉంది కారం వేసుకొని తిను అని అంటుంది

శోభ : అమ్మ రోజు కారం ఏ నా? వేరే ఏమి లేదా అమ్మ నాకు ఈ కార్మ తో తిని తిని  విసుగొస్తుంది అమ్మ అని అంటుంది

జయమ్మ : మనకి ఆ మాత్రం దొరకడమే ఎక్కువ తల్లి అది ఇది అని వంకలు పెట్టకుండా ఉన్నదేదో తినే అని  చెప్పి జయమ్మ వెళ్ళిపోతుంది

జయమ్మ అడవికి వెళ్లిన కొంత సేపటికి శోభా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, ఇంటి ముందు ఉన్న అరుగు మీద శోభా కూర్చొని ఉంటుంది.

అప్పుడే అక్కడికి బంగారు జుట్టు దెయ్యం వస్తుంది. వచ్చి శోభ దగ్గరికి వచ్చి శోభని పిలుస్తో ఉంటుంది

శోభ : దెయ్యం దెయ్యం బంగారు జుట్టు దెయ్యం అని అరుస్తూ భయపడుతూ ఉంటుంది

దెయ్యం : అమ్మ శోభ నేను నిన్ను ఏమి చేయను, నిన్ననే కాదు నేను ఎవ్వరిని ఏమి చేయను నువ్వు అంతలా భయపడవలసిన అవసరం లేదు, అందరు నన్ను చొసి ఎందుకు భయపడుతున్నారా నాకు ఆరడం కావడం లేదు, అందరు నేనంటే భయపడి అన్ని ఇళ్ల తలుపులు మూసుకొని ఉంటున్నారు, ఎక్కడైనా ఏమైనా తిందాం అంటే నాకు ఏమి దొరకడం లేదు, మీ ఇల్లు మాత్రం ఇలా తలుపులు తీసి ఉన్నాయి అందుకే ఇక్కడకి వచ్చాను అని అంటుంది

శోభ : అంటే నువ్వు అందరు చెప్పే లాంటి భయంకరమైన దేయ్యనివి కాదా? నువ్వు నన్ను ఏమి చెయ్యవు కదా అని మల్లి అడుగుతుంది

దెయ్యం : అదే కదా చెబుతున్నాను నేను ఎవ్వరికి ఏ హాని తలపెట్టను అని, నేను సరిగా అహ్హరం తిని వారం రోజులు అవుతుంది తినడానికి ఏమైనా ఉంటె పెడతావా అని అడుగుతుంది

శోభ : తినడానికా తినడానికి అంటే మా అమ్మ నేను తినడం కోసం కొంచం అన్నం ఉంచింది కానీ కారం పొడితో తినాలి నువ్వు తినగలవా అని అడుగుతుంది

దెయ్యం : ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అన్నం అయితే చాలు అందులోకి ఏమి ఉన్న తింటాను అని లోపలి వెళ్ళిపోతుంది

శోభా కూడా దెయ్యం వెంటే వెళ్లి దెయ్యానికి అన్నం పెడుతుంది

దెయ్యం తింటూ ఉండగా శోభా ఇలా అంటుంది

శోభ : నీ జుట్టు ఎందుకు అలా బంగారు వరణం లో మెరుస్తూ ఉంది, అందరిలా నల్లగా ఎందుకు లేదు అని అడుగుతుంది

దెయ్యం : నా జుట్టు అందరి లాంటి జుట్టు కాదు, నా జుట్టుకు కొన్ని రకాల శక్తులు ఉన్నాయి, ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోతే నేను పడుకున్నప్పుడు నాకు తెలియకుండా నాజుట్టు లో కొన్ని వెంట్రుకలని కత్తిరించుకొని తెచ్చుకొని వాళ్ళ పక్కలో పెట్టుకొని పడుకుంటే ఉదయం లేచే వరకు వాళ్ళ ఆరోగ్త్యం కుదుట పడుతుంది అని చెప్పి తినడం పూర్తి చేస్తుంది

దెయ్యం  :ఆహా ఇలా భోజనం చేసి ఎన్ని రోజులు అవుతుందో, నా కడుపు నింపినందుకు నీకు చాలా ధన్యవాదాలు నీకొక ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న బంగారు జుట్టు దెయ్యం స్నేహితురాలు ఉంది అన్న విషయూయం మర్చిపోకు అని చెప్పి వెళ్ళిపోతుంది

తన దగ్గర ఉన్న అన్నామా అంతా దెయ్యానికి పెట్టి శోభ కాళీ కడుపుతో ఉండిపోతుంది

సాయంత్రానికి జయమ్మ ఎంతో అలసిపోయి ఇంటికి వస్తుంది, జయమ్మ లా ఉండడం చూసి శోభా చాలా కంగారు పడుతుంది

శోబహ్ : అమ్మ ఏమయ్యింది ఇలా ఉన్నావు, అని అడుగుతుంది

జయమ్మ : ఈరోజు చాలా అలసిపోయేలా తిరిగానమ్మా కానీ అడవి మొత్తం గాలించినా ఏమి దొరకలేదు, నేను ఆహారం తినక చాలా రోజులు అవబుతుంది కదా అందుకే కళ్ళు తిరుగుతున్నాయి కొంత సేపు పడుకుంటాను అని వెళ్లి పడుకుంటుంది

శోభ : అయ్యో అమ్మ పొద్దున్న ఉంచిన అన్నం దెయ్యం కి పెట్టక పోయి ఉంటె ఇప్పుడుఇ అమ్మకి పెట్టగలిగే దాన్ని కానీ ఆ దెయ్యం కూడా దాదాపు అమ్మ లాంటి పరిస్థితుల్లోనే ఉంది, దెయ్యం ఏ సహాయం కావాలన్న అడుగుమన్నది ఇప్పడు వెళ్లి అడుగుదాము అంటే దెయ్యానికే తిండి లేక మా ఇంటికి వచ్చింది ఇంకా ఏమి అడగాలి అని అనుకోని తల్లిని చూస్తూ బాధాపడుతూ ఉంటుంది.

కొంత సేపటి తరువాత జయమ్మ దగ్గరికి వెళ్లి చూసిన శోభ షాక్ అవుతుంది

శోభ : అమ్మ అమ్మ నీ ఒళ్ళు ఆగిరవ్వలా కాలిపోతుంది, నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది అమ్మ అని అంటుంది

జయమ్మ : నాకు ఏమి అవ్వడులే తల్లి నువ్వేం భయపడకు అని అంటుంది

శోభ : ఇంత కాలిపోతుంటే అమీ అవ్వదేంటమ్మా నేను ఎదో ఒకటి చేస్తాలే అని అంటుంది

జయమ్మకి మాట్లాడే ఓపిక కూడా లేకపోవడం వల్ల అలాగే ఉండిపోతుంది

శోభ ఏమి చెయ్యాలో అర్ధం కాక కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతూ పరుయిష్కారం ఆలోచిస్తూ ఉంటుంది

సడెన్గా దెయ్యం చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి

శోభ : ఉదయం బంగారుజుట్టు దెయ్యం చెప్పింది కదా తాను పడుకున్నప్పుడు కొన్ని బంగారు వెంట్రుకలు తెచ్చి అనారోగ్యం గా ఉన్నవారి పక్కలో పెడితే తెల్లారే వరకు వాళ్ళ ఆరోగ్యం కుదుట పడుతుందని ఎలాగైనా సరే నేను వెళ్లి బంగారు వెంట్రుకలని తీసుకొస్తాయని అని ఇంట్లో నుంచి ఒక కత్తెర తీస్కోని భయలుదేవుతుంది బంగారు జుట్టు దెయ్యం ఇంటికి

కొత్త జుట్టు కత్తిరించుకు వస్తుంది.  వస్తుండగా ఆమెకు కొన్ని విగ్రహాలుగా ఉన్న మనుషులు కనిపిస్తారు వాళ్ళు ఎవరో తెలియక పరిగెత్తుకుంటూ వచ్చి బంగారు వెట్రుకలు వాళ్ళ అమ్మ పక్కలో పెడుతుంది తెల్లారే వరకు జయమ్మ ఆరోగ్యం కుదుట పడుతుంది.

తెల్లారి దెయ్యం ఇంటికి వెళ్లి ధన్యవాదాలు చెబుతుండగా శోభ మనుషుల లాంటి విగ్రహాల గురించి అడుగుతుంది

దెయ్యం : అవ్వ వాళ్ళు అందరు మనుషులే కానీ వాళ్ళు నీలా జుట్టు కత్తిరించుకొని వెళ్లే సమయం లో నాకు మెలుకువ వచ్చి వాళ్ళని చూడడం వల్ల వాళ్ళు అలా అయిపోయారు. నిజంగా నిన్న రాత్రి నీ అదృష్టం నాకు మెలుకువ రాలేదు అని అంటుంది

ఆరోజు నుంచి దెయ్యం శోభతో స్నేహం చేస్తూ ఉంటుంది.

1 మినిట్ స్టోరీ

ఒక ఊరిలో బంగారు జుట్టు దెయ్యం ఉండేది, దెయ్యం పడుకున్నప్పుడు ఎవరైనా జుట్టు కొంత కత్తిరించుకొని వెళ్లి అనారోగ్యాంగా ఉన్న వారి పక్కలో పెడితే తెల్లారే వరకు వారి ఆరోగ్యం కుదుట పడుతుంది, కానీ జుట్టు కత్తిరించే సమయం లో మెలుకువ వస్తే మాత్రం వాళ్ళు శిలగా మారిపోతారు, ఆ విషం తెలియని శోభా అనే అమ్మాయి వాళ్ళ అమ్మ ఆరోగ్యం కోసం దెయ్యం దగ్గర కొంత జుట్టు కత్తిరించుకొని వస్తుంది, వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగా అవ్వగానే దెయ్యానికి ధన్యవాదాలు తెలుపుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *