మిఠాయిలు తినే దెయ్యం | Telugu Kathalu | Moral Stories | Bedtime Stories | Panchatantra kathalu

మాధవపురం అనే గ్రామంలో సిరి అనే ఒక అమ్మాయి ఉండేది, సిరి ఒక అనాధ అదే ఊరిలో ఉండే సునీత అనే మహిళ ఇంట్లో పాచి పని చేస్తూ ఉండేది, సునీత సిరి ని ఎప్పుడు తిడుతూ కొడుతూనే ఉండేది, రోజంతా బ0డ చాకిరీ చేయించి నెల తిరిగే సరికి కొంత డబ్బులు చేతిలో పెట్టి పంపించేది, అలా ఉండగా ఒకరోజు సిరి సునీత తో

సిరి : అమ్మగారు మీరు నాకు నెల నెల ఇస్తానన్న డబ్బులకంటే ప్రతి నెల చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు, కనీసం సగం డబ్బులు కూడా ఇవ్వడం లేదు, ఈ సారైనా మొత్తం డబ్బులు ఇవ్వండమ్మా, మీరు ఇచ్చే డబ్బులతో ఇల్లు గడపడం చాలా కష్టాంగా ఉంది అని అంటుంది

సునీత : నువ్వు చేసే పనికి నేను ఆ మాత్రం డబ్బులు ఇవ్వడమే ఎక్కువ, అయినా రాత్రి అన్నం మిగిలినా, ఏదైనా పాడైపోయిన కూరలు ఉన్న అవ్వి నీకే కదా ఇస్తున్నాను, అవ్వి మాకు మాత్రం పుణ్యానికి వస్తాయా మేము వాటిని డబ్బులు పెట్టె కదా కొనాలి అని అంటుంది

సిరి : అమ్మగారు మీరు ఏ ఒక్కరోజు కూడా నాకు మంచిగా ఉన్న ఆహారం ఇవ్వలేదు, మీరిచ్చిన ఆహారం తింటే నేను ఆసుపత్రి బాట పట్టాల్సిందే, దాన్ని కూడా లెక్క పెడుతున్నారు మీరు, అయినా మిమ్మల్నెమన్న బిచ్చం అడుగుతున్నానా? నేను కష్టపడినా డబ్బులే కదా అడుగుతున్నాను దానికే మీరు నన్ను అన్నేసి మాటలు అంటున్నారు, మీరు ఇలా చేస్తున్నారని ఊరిలో తెలిస్తే మీ పరువు మీ కుటుంబం పరువే పోతుంది, నాకు రెండు రోజుల్లోగా రావలసిన డబ్బులు ఇస్తే మీకే మంచిది, నేను ఇలా అస్సలు మాట్లాడాలి అనుకోలేదు కానీ మీరు నాతో ప్రవర్తించిన తీరు వల్లనే ఇలా మాట్లాడాను ఇక మీ ఇష్టం అని అంటుంది,

ఇక సిరి పని పూర్తి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయినా తరువాత్త సునీత ఇలా నుకుంటుంది

సునీత : నా భర్త సిరి కి ఇవ్వమని ఇచ్చిన డబ్బులని నేను నా విలాసాలకు ఖర్చు పెట్టాను, సిరి ఇచ్చిన డబ్బులు తీసుకొని మారు మాట్లాడకుండా ఉంటుంది అనుకున్నాను కానీ ఇప్పిడి ఇలా తిరగబడిందేంటి? ఈ విషయం నా భర్తకి తెలిస్తే నన్ను చంపేస్తాడు, కాబట్టి ఎయిర్ ఎండు రోజుల్లో ఎలాగోలా సిరి పీడా వదిలించుకోవాలి అని అనుకుంటుంది

మర్నాడు ఉందయం ఎప్పటిలాగానే సిరి సునీత ఇంటికి పని చేయడానికి వస్తుంది, దారిలో మిఠాయిలు అమ్మే ఒక వ్యక్తి కనిపిస్తాడు సిరికి , వెంటనే సిరి అతని దగ్గరికి వెళ్లి

సిరి : తాత తాత నాకు మిఠాయిలు అంటే చాలా ఇష్టం నాకు కూడా కొన్ని మిఠాయిలు ఇస్తావా అని అడుగుతుంది,

మిఠాయిల వ్యక్తి : ఇవ్వడం ఏంటి నీ దగ్గర డబ్బులు ఉంటె కొనుక్కో అంటాడు

సిరి : నా దగ్గర ఒక్క రూపాయి ఉంది, ఒక్క రూపాయికి ఎన్ని మిఠాయిలు వస్తే అన్ని ఇవ్వవా అని అంటుంది

మిఠాయిలు వ్యక్తి : ఎప్పుడైనా మిఠాయిలు కొన్న మొహమేనా ఒక్క రూపాయికి మిఠాయిలు వస్తాయా? వెళ్ళమ్మా వెళ్ళు నీలాంటి వాళ్ళు వస్తే నా గిరాకీ నాశనం అవుతుంది, తక్షణం ఇక్కడ న్నుంచి వేళ్ళు అని చిరాగ్గా అరుస్తాడు.

మిఠాయి అమ్మే వాడు అన్న మాటలకు సిరి ఎంతో బాధ పడుతూ ఉంటుంది.

అలా బాధ పడుతూ సునీత దగ్గరికి పనికి వెళ్తుంది సిరి, అప్పుడే సరిగా ఇంటికి చుట్టాలు రాబోతున్నారని చాలా రకాల మిఠాయిలు చేయించి పెడుతుంది సునీత, అప్పుడే అక్కడికి వెళ్లిన సిరి తో

సునీత : సిరి ఏంటి అలా చూస్తున్నావు? అవన్నీ మిఠాయిలు వెళ్లి వాటన్నింటిని లోపల పెట్టు అని అంటుంది

ఆ మిఠాయిలన్నిటిని చూడగానే సిరికి నోరు ఊరుతుంది.

సిరి : అబ్బా ఎన్ని రకాల మిఠాయిలో చూస్తుంటేనే నోరు ఊరుతుంది, అమ్మగారిని అడిగి కొన్నింటిని తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో సునీత అక్కడికి వచ్చి

సునీత : ఏంటే వాటిని అలా చూస్తున్నావు, దిష్టి పెడతావా ఏంటి? పో పోయి లోపల పెట్టు అని అరుస్తుంది

సునీత చెప్పినట్టుగానే సిరి వాటి అన్నింటిని లోపల పెట్టి

సిరి : అమ్మగారు ఎలాగూ ఇక్కడ లేదు కదా? మిఠాయిలు చూస్తుంటే నేను ఆగలేక పోతున్నాను కొన్నింటిని ఎవరికీ కనపడకుండ దాచి పెట్టుకొని ఇంటికి తీసుకెళ్లి దాచి పెట్టుకొని తింటాను అని అనుకోని తన దుపట్టాలో కొన్ని మిఠాయిలు దాచి పెట్టుకొని బయటకు వెళ్తుంది. అదంతా దొంగచాటుగా సునీత గమనిస్తుంది

సునీత : అమ్మయ్య ఈ దెబ్బతో సిరి పీడా వదిలించుకోవచ్చు, అని అనుకోని సిరి బయటకు వెళ్ళగానే ఊరందఱిని అక్కడికి పిలుస్తుంది

సునీత : చూసారా చూసారా కన్నా కూతురులా ఈ పిల్లని చూసుకుంటే సిరి మాత్రం నా ఇంట్లోనే దొంగతనం చేసేసింది, అని సిరి దుపట్టని దులుపుతుంది సునీత వెంటనే దుపట్టా నుండి మిఠాయిలు రాలుతాయి అది చూసిన ఊరి జనం సిరిని థలా ఒక మాట అంటారు

అవమాన భారం తో సిరి ఇంటికి వెళ్తుంది,

సిరి : ఊరందరి ముందు సునీత నా పరువు తీసేసింది, ఇక రేపటి నుండి ఊరిలో నేను తలెత్తుకు తిరగలేను, నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు అని సిరి ఆత్మహత్య చేసుకుంటుంది,

ఆత్మ హాత్త్య చేసుకున్న సిరి దెయ్యంలా మారిపోతుంది. సిరి దెయ్యం లా మారిపోయినప్పటికీ కూడా తనకు మిఠాయిలంటే ఇష్టం మాత్రం తగ్గదు

కొంత దూరం నుండి దెయ్యం గా మారిన సిరికి మిఠాయిలు వాసన వస్తుంది.

సిరి దెయ్యం : అబ్బా మిఠాయిలు వాసం వస్తుంది, ఇక ఈరోజు ఎలాగైనా నేను మిఠాయిలు కడుపునిండా తింటాను అని వాసన వస్తున్న వైపు వెళ్ళిపోతుంది,

అలా అక్కడ ఉన్న మిఠాయిలని తినేస్తుంది సిరి

సిరి దెయ్యం : ఇప్పటికి అయితే కడుపునిండా మిఠాయిలు తిన్నాను కానీ నేను ఇలా దెయ్యం లా మారడానికి సునీత నే కారణం నాకు ఈ గతి పట్టించినందుకు సునీత దగ్గరికికి వెళ్లి తగిన గుణపాఠం చెప్పాలి అని అనుకుంటింది సిరి దెయ్యం, అనుకున్న వెంటనే సునీత దగ్గరికి వెళ్తుంది

దెయ్యం ని చూసిన సునీత

సునీత : దెయ్యం దెయ్యం నన్ను ఏమి చేయొద్దు చేయొద్దు అని భయపడుతూ ఉంటుంది

సిరి దెయ్యం : నీ వల్లనే నాకు ఈ గతి పట్టింది, కేవలం కొన్ని మిఠాయిలు కోసం నన్ను ఊరందరి ముందు అవమానించి నేను చచ్చిపోవడానికి కారణం అయ్యావు కాబట్టి నీకు శిక్ష తప్పదు,

నేను ఈరోజు నుంచి నీ దగ్గరే ఉంటాను, రోజు నాకు ఇష్టమైన మిఠాయిలు చేసి పెట్టాలి లేదంటే నీ బండారం బయట పెడతాను అని సునీతని బెదిరిస్తోంది దెయ్యం

సునీత తప్పక రోజు దెయ్యం కోరిన రకరకాల మిఠాయిలు చేసి పెడుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *