ముంజు కాయలు దెయ్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది వేసవి కాలం ఎండలు బాగా మండిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆ సమయంలో లో ఇద్దరు స్నేహితులైన నరేష్ సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఈ విధంగా మాట్లాడు కుంటారు.

నరేష్….. రేయ్ సురేష్ ఎండలు బాగా ఉన్నాయి ఈ ఎండలకి చల్లచల్లగా ఏమన్నా తింటే ఆరోగ్యానికి చాలా బాగుంటుంది.
సురేష్….. నిజమే మిత్రమా లేత ముంజులు కనక ఒంటికి పడ్డాయంటే ఆహా ఎంత ఎండైనా కూడా బాడీ మొత్తం చల్లగా ఉంటుంది.
నరేష్…. మరి ఇంకెందుకు ఆలస్యం ఒక కొడవలి తీసుకో నీ రా సుబ్బయ్య తోటలోకి వెళ్దాం. అని అనుకొని ఇద్దరూ తాటిచెట్లు ఉండే ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ నరేష్….. అబ్బా ఎన్ని కాయలు ఉన్నాయి రా . తో ఒకసారి దుమ్ము దులిపే సరి. అని కొన్ని కాయలున్న గళాల్ని నరికి.
వాళ్ల దగ్గరే ఉంచుకుంటారు.
వాటిని చూసిన సురేష్….. శ్రీ నరేష్ ఇవి ముదిరిపోయిన కాయలు రా ఇవి తినడానికి గట్టిగా చండాలంగా ఉంటాయి. లేత ముంజులు తింటేనే చాలా రుచిగా ఉంటాయి అలాగే శరీరంలో ఉన్న వేడి తగ్గుతుంది.
అని చెప్తాడు తరువాత నరేష్ మరికొంచెం ముందుకు వెళ్లి మరో చెట్టు నుంచి కొన్ని కాయల్ని పెంచుతాడు.
అప్పుడు నరేష్….. రేయ్ ఇది చాలా బాగున్నాయి కానీ ఎవరన్నా రాకముందే ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం.
అని అనుకొని కాయలు తీసుకొని హడావిడిగా పరిగెడతారు.
ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర లో ఇద్దరు కూర్చొని. ఆ కాయలు తింటూ ఉండగా. వాళ్ల స్నేహితుడైన రవి ఎక్కడికి వచ్చి….రేయ్ మీరిద్దరే తింటున్నారు ఏంట్రా నన్ను. అయినా మీరు ఇద్దరూ ముంజూ తోటలోకి వెళుతున్న సంగతి నాకు చెప్పలేదు.
అప్పుడు సురేష్….. నీకు చెప్పినా నువ్వు రావు కదరా మీ ఇంట్లో వాళ్లు తిడతారు అని చెప్పి. మేము నిన్ను పిలవలేదు సరే ఇదిగో ఈ గల తీసుకొని వెళ్ళు. అని చెప్పి అతనికి ఒక గల కాయల్ని ఇచ్చి అక్కడి నుంచి అతను పంపించేస్తారు..
ఇక సురేష్ నరేష్ ఇద్దరూ కలిసి ఆ కాయలని తిని….. హరే రేపు కూడా వెళ్దాం రా .
తప్పకుండా వెళ్దాం రా. అని ఇద్దరు అనుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు ఆ మరుసటి రోజు.
ఇద్దరూ కలిసి మళ్లీ తోట కి వెళ్తారు. వాళ్లు కాయల్ని కోసుకొని వెళ్తూ ఉండగా.
నరేష్… రేయ్ సురేష్ మనం మరి ఇంటికి ఎందుకు వెళ్లడం ఇక్కడికి ఎవరూ రావడం లేదు కదా. మనం ఎక్కడ కూర్చొని తినేసి వెళ్ళిపోదాం రా. పైగా మనం ఇంటికి వెళ్ళిన దగ్గర్నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి కాయలు అడుగుతూనే ఉంటారు.అనవసరంగా వాళ్లకి ఇవ్వాల్సి వస్తుంది అవసరం అంటావా అక్కడిదాకా వెళ్లడం.
నువ్వు అన్నది కూడా నిజమే లేరా మనం ఎక్కడ కూర్చొనినువ్వు అన్నది కూడా నిజమే లే రా మనం ఎక్కడ ఉండి వీటిని తిందాం అని చెప్పి ఇద్దరు అక్కడే వాటిని తింటూ ఉండగా ఆ తోట యజమాని అయిన సుబ్బయ్య వాళ్లను చూసి….. రేయ్ ఎవర్రా అది ఎవర్రా అది అంటూ కేకలు వేస్తూ వచ్చాడు.
ఆ కేకలు విన్న వాళ్ళిద్దరూ అరే సుబ్బయ్య వచ్చాడు. పరిగెత్తు పరిగెత్తు అంటూ పరిగెడుతున్న గా సుబ్బయ్య కూడా వాళ్ళ వెంబ డీ పరిగెత్తుకెళ్లి వాళ్ళని పట్టు కొన్ని… ఏరా నా తోటలో రావడానికి మీకు ఎంత ధైర్యం అందరూ ఏ మిరప తోట లో ఏ మామిడి తోట వేస్తే. నేను మాత్రం ప్రత్యేకంగా తాటి చెట్లు నాటాను . అలాంటి ఇ విభిన్నమైన నాలాంటి వాడు దగ్గరికి దొంగతనం చేయాలని వస్తారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడు అంటూ వాళ్ళిద్దరినీ కొడతాడు.
వాళ్లు అబ్బా అమ్మ అయ్యో ఇంకెప్పుడు రాము ఇంకెప్పుడు రాము…. అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోతారు.
ఇక వాళ్ళిద్దరూ సుబ్బయ్య చేతిలో దెబ్బలు తిన్న తర్వాత…. రేయ్ సురేష్ ఆ సుబ్బయ్య మనల్ని ఇలా కొడతాడని అనుకోలేదు. మను కొట్టినందుకు వాడి తోటి మొత్తంలో ఉన్న కాయల్ని నరికి పడేస్తాం చూడు. వాడు పగలే కదా కాపలా ఉండేది. ఈరోజు రాత్రి వాటి పని చూద్దాం.
సురేష్…. వాడు ఎప్పుడు రానివాడు బలే వచ్చాడు వాడి మీద కచ్చితంగా పగా తీసుకోవాల్సిందే. అని అనుకుంటారు రాత్రి సమయం అవుతుంది ఇద్దరు ఒక దీపం తీసుకొని తోట లోకి వెళ్తారు అక్కడ ఉన్న కాయలు అన్నిటిని నరికి వాటిని ఒక చోట ఉంచుతారు. ఇంతలో ఒక పెద్ద శబ్దం తో హా…హా..హా… అని నవ్వుకుంటూ ఒక దయ్యం వస్తుంది.
దానిని చూసిన వాళ్ళు హడలెత్తి కంగారు పడిపోతారు.
ఆ దెయ్యం వాళ్ళ దగ్గరకు వచ్చి….. నాకు ఈ కాయలు అన్నీ కావాలి. వాటిని ఎప్పటినుంచో తిందాం అనుకుంటున్నా. కానీ నాకు చెట్టు ఎక్కడం రాదు. నా మాయ శక్తులతో నేను వాటి రుచి చూడొచ్చు కానీ మనుషులు ఎలాగైతే తింటారో అలాగే సహజంగా తింటే అద్భుతంగా ఉంటాయి. దాని మాటలకి వాళ్ళు చాలా భయపడుతూ….. సరే ఈ కాయల్ని నువ్వే తీసుకో మమ్మల్ని మాత్రం ఏం చేయొద్దు మమ్మల్ని వదిలేయ్. అని అక్కడి నుంచి పరుగులు తీస్తారు.
ఆ తరువాత దెయ్యం….హా..హా..హా.. పాపం పిరికి వాళ్ళ లాగా ఉన్నారు. మరి అనుకొని ఆ కాయల్ని మాయం చేసి తరువాత ఆ దెయ్యం కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది.అలా వాళ్ళిద్దరూ అక్కడినుంచి పరుగు పరుగున ఇంటికి వెళ్లిపోతారు.
అలా ఇంటికి వెళ్లిన నరేష్ నీ వాళ్ళ తండ్రి… ఏరా రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు.
నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది.
అంటూ ఉండగా రంగా కి వాళ్ళ తండ్రి దెయ్యంలా కనిపిస్తాడు.
దాన్ని చూసి నరేష్….. అమ్మో దెయ్యం నువ్వు ఇక్కడి కి కూడా వచ్చేసావా.
అమ్మ బాబోయ్. అంటూ పరుగులు తీస్తాడు . అక్కడ సురేష్ ఇంటిదగ్గర వాళ్ళ అమ్మ అతనితో…. సురేష్ రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయావు. మీ నాన్న రా న్నివ్వు నీ పని చెప్తాను. అని తిడుతూ ఉంటుంది అప్పుడు సురేష్ కి కూడా వాళ్ళ అమ్మ దెయ్యం లాగా కనిపిస్తుంది.
దాన్ని చూసిన సురేష్ కూడా…. అమ్మో దయ్యం నువ్వు ఎక్కడ ఎందుకు వచ్చావు తల్లి నన్ను వదిలేయ్. అంటూ బయటకు పరుగులు తీస్తాడు.
అలా నరేష్ సురేష్ ఇద్దరూ పరుగెత్తుకుంటూ ఒకరికి దగ్గరికి మరొకరు చేరుకుంటారు.
అప్పుడు వాళ్ళిద్దరూ…. అరె మామ మా ఇంట్లో వాళ్ళందరూ దెయ్యాల కనిపిస్తున్నారు రా బాబు.ఆ దెయ్యంనీ ఎప్పుడైతే చూసామూ అప్పుడు నుంచి నా కాళ్లు చేతులు పనిచేయటం లేదు. ఎవరిని చూసినా దెయ్యాల లాగే ఉంటున్నరు.
అని అనుకుంటుండగా దెయ్యం మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి…..హా..హా..హా.. మిత్రులారా నేను మళ్ళీ వచ్చేసాను.
ఆ దెయ్యాన్ని చూసి వాళ్ళిద్దరు…. నువ్వెందుకు మా వెంట పడుతున్నాను నీకు కావలసిన కాయలు అన్నీ ఇచ్చాం కదా.
అప్పుడు ఆ దెయ్యం….. కాయలు అయితే ఇచ్చారు మరి వాటిని తినడం ఎలాగా.
సురేష్…. మీకు ఎన్నో మాయలు వచ్చుగా అ మాయలతో వాటిని తినొచ్చు గా. ఇలా మా ప్రాణాలు తీయడం ఎందుకు.
అందుకు ఆ దెయ్యం….. మీకు నేను ఇదివరకే చెప్పాను. నా మాయలతో కాదు మనుషుల్లాగా సొంతగా తినాలి అని. వాటిని కొట్టి ఇవ్వండి తింటాను.అని అంటుంది అందుకు వాళ్ళు ఆ కాయను కొట్టి ఇచ్చి తినమని చెబుతారు….. వాటిని ఆవురావురు మంటూ తింటూ మీరు కూడా తినండి. అని చెప్తుంది అలా వాళ్ళు ముగ్గురు మాటలు చెప్పుకుంటూ. తింటూ ఉంటారు ఆ మాటల్లో మాటల్లో దెయ్యం తో వాళ్లకి మంచి స్నేహం కుదురుతుంది. అది ఒక దెయ్యం ఆన్న సంగతి మర్చిపోయి. స్నేహంగా మాట్లాడుతూ ఉండగా ఆ దెయ్యం…. చూడండి మిత్రులారా మీరు చేసింది చాలా పెద్ద తప్పు. ఇలా దొంగలించి ఎక్కడా తినకూడదు. అది క్షమించరాని నేరం. ఆ మాటలకి వాళ్ళిద్దరు తలదించుకుంటారు.
సురేష్….. కానీ మిత్రమా ఇప్పుడు మేం ఏం చేయగలం. ఆ చెట్లకు ఉన్న కాయలను నరికే శ్యాము. దానివల్ల అతనికి ఎంత నష్టమో మాకు అర్థం అవుతుంది. కానీ అతను మమ్మల్ని కొట్టడ నే కోపంతో మేమిద్దరం అలా చేశాను. కానీ ఇప్పుడు బాధపడుతున్నాము.
అప్పుడు ఆ దెయ్యం…. మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు నా మాయలతో ఆ చెట్టు కాయలు అన్నిటిని మళ్ళీ యధా స్థానానికి తీసుకు వెళ్ళాను. ఇప్పుడు చెట్లు నిండా కాయలు ఉన్నాయి. ఎందుకంటే ఒక రైతుని మనం మోసం చేయకూడదు . ఆ వ్యక్తి అందరి కంటే విభిన్నంగా ఆలోచించి ఆ తాటి చెట్లు పెంచుతున్నాడు. అతనికి వాటి మీదే జీవనాధారం. అందుకే నేను అలా చేశాను.
ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ…. నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా ఇంక ఎప్పుడూ ఇలాంటి దొంగతనం చేయుము.
అని అంటారు అప్పుడు నరేష్…. కానీ దెయ్యం మిత్రమా నువ్వు మరి దొంగిలించిన కాయల్ని తీసుకెళ్లారు కదా అప్పుడు నువ్వు కూడా దొంగతనం చేశావు కదా .
అప్పుడు దెయ్యం….హా..హా..హా.. నిజమే మిత్రమా కానీ నేను ఆ తోట యజమాని ఎప్పటినుంచో అడుగుదామని అనుకుంటున్నాను. ఈ దెయ్యం రూపం చూస్తే అతను భయపడతాడు అనుకొని ఉరుకుందు పోయాను. అనుకోకుండా మీరిద్దరూ అక్కడికి వచ్చారు . అప్పుడు నేను ఏమో అనుకున్నానో తెలుసా ఈరోజు నా పంట పండింది లే అనుకున్నాను. మీ దయతో ఆ కాయలను చూసే భాగ్యం దొరికింది నేను కూడా ఒక అందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎలాగైతే ఏం మన ముగ్గురం తప్పు చేసాము దాన్ని నేను సరి చేశాను ఇంకా హాయిగా ఉండొచ్చు. అని ముగ్గురు పెద్ద గా నవ్వుకుంటారు… ఆ రోజు నుంచి వాళ్ళు ముగ్గురు రాత్రి సమయంలో ఒకే చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ. మంచి స్నేహితులుగా మారిపోయి ఆనందంగా జీవిస్తారు. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం దొంగతనం చేయకూడదు ఎవరినీ మోసం చేయకూడదు. దాని వల్ల ఎంతోమంది నష్టపోతారో తెలుసుకున్నాం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *