మూగజీవాల ఆవేదన_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

మాతృవేదన.కరుణ లేని మనుషులు

అది ఒక అందమైన అడవి అక్కడ ఒక ఏనుగు దాని ఈ యొక్క బిడ్డ నివసిస్తున్నారు అది వేసవి కాలం కావడంతో ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తల్లి తో….. అమ్మ ఇక్కడ తినడానికి ఏమీ లేదు. నాకేమో బాగా ఆకలిగా ఉంది అమ్మ. మనం ఎక్కడికైనా వెళ్లి ఆహారం వెతుకుదాం పదమ్మ ఈ అడవిలోనే ఉంటే ఏమీ దొరకదు. అలా గ్రామం వైపు వెళ్దాం మనుషులు పనికి ఏదైనా తినడానికి పెడ్తారేమో.
ఆ మాటలు విన్న తల్లి….. వద్దమ్మా మనుషులు మంచి వాళ్ళు కాదు. వాళ్ల స్వభావం ఇప్పుడు ఎలాగా మారుతుందో తెలియదు. వాళ్లు అవసరం ఉంటే మరిన్ని చేరవేస్తారు. లేకపోతే మన ప్రాణాలే తీస్తారు.
వాళ్లతో చాలా ప్రమాదం. అని మనుషుల గురించి చెప్తూ ఉంటుంది. అయినప్పటికీ ఆ ఏనుగు పిల్ల మాత్రం ఆహారం కోసం గొడవ బాగా చేస్తుంది. ఇంకా ఆ తల్లి చేసేది ఏమి లేక ఆ బిడ్డ తో…. సరే అమ్మ నేను గ్రామం లోకి వెళ్లి తినడానికి నీకోసం ఏమన్న తీసుకొస్తాను. నువ్వు చిన్న పిల్లవి నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు. నేను వెంటనే తిరిగి వస్తాను అని చెప్పి ఆ తల్లి ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ ఉండగా పాపం అనుకోకుండా ఒక ఊరిలో పడిపో డీ ఇరుక్కుపోయి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఇద్దరు మనుషులు ఆ అడవిలోకి తేనె పట్టు కోసం వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ఊబిలో పడిపోయిన ఏనుగును చూసి ఒకరితో ఒకరు….. రాయ్ అటు చూడు ఎంత పెద్ద ఏనుగు. అది ఊబి లో ఇరుక్కుపోయి కేకలు వేస్తోంది. దాని అరుపులు భలే విచిత్రంగా ఉన్నాయి కదా.
అది అనుకోని దాని దగ్గరికి వెళ్తారు అందులో ఒకడు…. అరేయ్. మనకు ఎందుకు వచ్చిన గొడవ మనం వెళ్దాం పద.
మరొకడు…… ఎక్కడికి వెళ్ళేది నీకేం తెలియదు ఉండు. దీన్ని ఇంకొక లాగా అర్పిస్తాను చూడు. అని ఒక పెద్ద కర్ర తీసుకొని దానిని కొడుతూ ఉంటాడు.
ఆ దెబ్బలకి ఆ ఏనుగు మరింత బిగ్గరగా కేకలు వేస్తూ తన మనసులో….. భగవంతుడా నేను ఈ మనిషలకు ఏమి అన్యాయం చేశాను. ఇలా నన్ను చిత్రహింసలు భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలి నా బిడ్డ ఆకలితో అల్లాడి పోతుంది. నేను ఇక్కడ ఊబిలో పడి మరణిస్తాడు బ్రతుకుతారో తెలీదు దానికితోడు ఈ మనుషుల చిత్రహింసలు ఏంటి దేవా అంటూ భగవంతుని ప్రార్ధిస్తూ కన్నీరు కారుస్తూ ఉంటుంది.అలా చాలా సేపటి వరకు వాళ్ల ఆనందం కోసం ఆ ఏనుగుని చిత్రహింసలు పెడుతూనే ఉంటారు. ఆ అరుపులు మరింత బిగ్గరగా కావడంతో దాని బిడ్డ….. అమ్మ ఎందుకో కేకలు వేస్తోంది. అని అనుకొని పరుగు పరుగున అక్కడినుంచి తన తల్లిని వెతుక్కుంటూ వస్తుంది.
అప్పుడు ఆ మనుషులు తన తల్లి కొట్టడం చూసి…… అయ్యో అమ్మ చెప్పింది నిజం. మనుషులు చెడ్డవాళ్లు అన్నది . మా అమ్మని బాగా కొడుతున్నారు నేనేం చేయాలి. వాళ్లు ముందుకు వెళ్లాలంటే నాకు చాలా భయంగా ఉంది. అమ్మ అమ్మ…. అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అక్కడ ఆ మనుషులు ఆ తల్లి ఏనుగు కన్నీరు చూసి కూడా కొంచెం కూడా జాలి పడకుండా దాన్ని హింసిస్తూ పెద్ద పెద్దగా….హా..హా…హా… ఇది ఇలా అరుస్తూ ఉంటే భలే సరదాగా ఉంది రా. నాక్కూడా అలాగే ఉంది రా ఇంకా కొట్టు నేను కూడా మరో కర్ర తీసుకొని వస్తాను ఆగు. అని చెప్పి మరొకడు ఇంకొక కర్ర తీసుకొని దాన్ని కొడుతూ ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ ఏనుగు పిల్ల……మా అమ్మని ఆ రాక్షసులు లాంటి మనుషుల నుంచి కాపాడుకోవాలి నాకు ఏమైనా పర్వాలేదు. అని ధైర్యం చేసి వాళ్ల మీద కి వెళ్తుంది. ఆ పిల్ల ఏనుగు చూసిన వాళ్ళిద్దరూ కర్రలను అక్కడ పడేసి….
అరే పరిగెత్త రా బాబు ఇది మనల్ని చంపేసేలా ఉంది. అంటూ కేకలు వేస్తూ భయంతో అక్కడినుంచి పరుగులు తీస్తారు. వాళ్లు అలాగా పరుగులు తీస్తూ ఉండగా వాళ్లకి ఎదురుగా అటవీశాఖ అధికారి కనిపిస్తాడు.
అతను వాళ్లతో…. ఏమైంది ఏమైంది మీరు అంతగా భయపడుతూ పరిగెడుతున్నారు.
అందుకు వాళ్లు…. సార్ అక్కడ ఒక ఏనుగు ఊబిలో పడిపోయింది. దాన్ని కాపాడుతున్న గా దాని పిల్ల అనుకుంటా అది మా మీద దాడి చేస్తుంది. మేము భయం తో ఇలా పరిగెత్తుకుంటూ వచ్చాము. అని చెప్తారు ఎందుకు ఆయన…. సరే పదండి నేను కూడా వస్తాను మన ముగ్గురం కలిసి దాన్ని కాపాడుదాం. అని అంటాడు అతను అంత గట్టిగా అనడంతో వాళ్ళిద్దరూ కూడా సరే అని అతనితోపాటు. తిరిగి అక్కడికి వెళుతూ ఉంటారు.
వాళ్లు తిరిగి రావడం చూసిన ఏనుగు పిల్ల పరుగుపరుగున తన తల్లి దగ్గరికి వెళ్లి….అమ్మ వాళ్లు మళ్లీ వస్తున్నారు అమ్మ నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు నిన్ను మళ్ళీ కొడతారా అమ్మ. అంటూ కన్నీరు కారుస్తోంది.
అందుకు ఆ తల్లి….. అమ్మ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీ ప్రాణాల్ని కాపాడుకో. ఇంక నేను నీకు ఉండను జాగ్రత్తగా ఉండు. అందరితో కలిసి మెలిసి ఉండు. మనుషులు జోలికి వెళ్లకు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఆ మాటలు విన్న ఆ బిడ్డ ఏడుస్తూ వెళ్లి ఒక చెట్టు దగ్గర నిలబడుతుంది.
ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడికి వస్తారు . వాళ్ల దగ్గర ఉన్న తాళ్ళతో ముగ్గురు కలిసి ఆ ఏనుగుని చాలా కష్టపడి దాని రెండుకాళ్లను బయటికి తీస్తారు .తన రెండు కాళ్ళు బయటకు రావడంతో ఆ ఏనుగు దాన్ని అది తమాయించుకుని. పూర్తిగా బయటకు వచ్చేస్తోంది. అది అక్కడి నుంచి పరుగు పరుగున తన బిడ్డ దగ్గరికి వెళ్లి పోతుంది.
అప్పుడు అటవీశాఖాధికారి వాళ్ళతో…. అది సరే కానీ మీరు నిజంగా ఆ ఏనుగుకి సాయం చేయడం కోసమే వచ్చారా.
అందుకు వాళ్ళలో ఒకడు….. అవును సార్ నేను నిజంగానే దానికి సాయం చేయడానికి ఆగాను మేము తేన పట్టు కోసం వెళ్తుండగా ఈ దృశ్యాన్ని చూసాము. మీ ఇద్దరూ ఎంతో ప్రయత్నించాను కానీ మా వల్ల కాలేదు.
అందుకు అటవీశాఖ అధికారి…. అవునా మరి ఆ ఏనుగు శరీరం పైన కర్రతో కొట్టినట్టు గాయాలున్నాయి . అసలు ఏం జరిగిందో నిజం చెప్పకపోతే మీ ఇద్దరినీ జైల్లో జైలుకు పంపిస్తాను జాగ్రత్త నిజం చెప్పండి.
అని గట్టిగా అరవడంతో ఆ మాటలకు వాళ్ళిద్దరు భయపడి జరిగిన విషయం అంతా చెబుతారు.
అప్పుడు ఆ అటవీశాఖ అధికారి….. చి మీరసలు మనుషులేనా రా. మీ ఆనందం కోసం ఒక మూగ జీవిని చిత్రహింసలు పెడతారా. దానివల్ల మీకు వచ్చిన ఆనందం ఏంటి మీ బిడ్డలను కూడా ఒక చెట్టుకు కట్టేసి కర్రతో కొడుతూ ఉంటే ఆ బాధ నీకు ఎలా అనిపిస్తుంది. పోను పోను మనుషులను అన్న సంగతి మర్చిపోతున్నాం. మీరు వీలైతే దానికి సహాయం చేసి ఉంటే అది ఎంతో ఆనంద పడేది. సహాయం చేయడం మానేసి చిత్రహింసలు పెడతారా. ఈ దృశ్యం చూస్తుంటే నాకు కేరళలో జరిగిన ఆ ఏనుగు దృశ్యాన్ని చూసినట్టు ఉంది. ఆహారం కోసం వచ్చిన గర్భవతైన ఏనుగుని ఆహారంలో బాంబులు పెట్టి దాని ప్రాణం తీశారు. అలా నమ్మించి మోసం చేయడంలో ఏముంది. అది అలా చేసినప్పటికీ ఒక్కరికి కూడా హాని కలిగించకుండా తనకు తానుగా వెళ్లి చెరువులో మరణించింది. మీ లాంటి వాళ్లని ఏం చేయాలి రా. పదండి స్టేషన్ కి ఇద్దరికీ థర్డ్ డిగ్రీ చూపిస్తాను.
అందుకు వాళ్లు భయపడి…. సార్ మీకు పుణ్యం ఉంటుంది భార్య బిడ్డలు గల వాళ్ళం క్షమించి వదిలేయండి.
అధికారి….. మిమ్మల్ని వదిలేస్తే ఎలాగా మిమ్మల్ని పదిమందిలో పెట్టి టీవీలో వార్తల్లో మీరు చేసిన పాప o గురించి చెప్పి మీకు వేసిన శిక్ష ను అందరికీ చూపిస్తే రెండోసారి ఎవ్వరూ ఇలాంటి పని చేయకుండా ఉంటారు.
అప్పుడైనా మనుషులు మనుషుల ఆలోచిస్తారు. మీకంటే పశువులు చాలా నయం. ఆ మాటలకు వాళ్లు కాళ్లావేళ్లా పడడంతో ఆ పోలీస్ అధికారి వాళ్లపై దయతలిచి వదిలేస్తాడు.
వాళ్లు ….సార్ ఇలాంటి పొరపాటు మా జన్మ లో ఎప్పుడు చెయ్యను నాకు బుద్ధొచ్చింది అంటూ అక్కడి నుంచి పరుగున వెళ్ళి పోతారు.
పాపం ఆ ఏనుగు ఎంతో బాధతో తన బిడ్డ దగ్గర అ నిలబడి ఉంటుంది. అటవీశాఖ అధికారి నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు కొంచెం భయపడుతుంది. అప్పుడు అతను…. దాని తలపై నిమురుతూ దాన్ని మచ్చిక చేసుకుంటాడు. అతని ప్రేమను చూసిన ఆ ఏనుగు తన బాధని మర్చిపోతుంది. ఆ తరువాత ఆ అధికారి ఆ ఏనుగు కు దాని పిల్లలకు కొన్ని అరటిపండును తీసుకొచ్చి తినిపిస్తాడు. ఇక ఆరోజు నుంచి ఆ ఏనుగు అటవీశాఖ అధికారి మంచి స్నేహితులుగా మారిపోతారు. ఈ కథలోని నీతి ఏమిటంటే మనం వాళ్ళ పట్ల దయ చూపించాలి. మనకి ఆకలైతే అమ్మ ఆకలి అని అడగ లాం కానీ అవి నోరు తెరిచి అడగలేవు. వాటి మూగా సైకలను మనం అర్థం చేసుకొని మనకి తగినంతగా వాటికి సహాయం చేయాలి. అంతే కానీ వాటిని హింసించ కూడదు. ఆహారం పేరుతో నమ్మించి వాటి ప్రాణాలు తీయకూడదు.కొంచెం ప్రేమ చూపిస్తే మనుషుల కంటే జంతువులు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. దయచేసి మూగజీవుల పట్ల కరుణ దయ చూపించండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *