యూట్యూబ్ పిచ్చి అక్క పాపం తమ్ముడు Episode 159 |Telugu Stories | Telugu Kathalu | Banana Dreams TV

కీర్తి బాలు అనే ఇద్దరు అనాధ పిల్లలు తమకి వచ్చిన పని చేసుకుంటూ వచ్చిన డబ్బులతో పూట ఎల్లదీసుకునేవారు, అలా ఉండగా ఓక్ రోజు కీర్తి వాళ్ళ ఊరిలో పెద్దమనిషి అయిన రవీందర్ వాళ్ళ ఇంటికి పనికి వెళ్తుంది, కీర్తి పని చేస్తూ ఉండగా రవీందర్ వాళ్ళ అబ్బాయి ప్రకాష్  తన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ఏవేవో వీడియోలు చూస్తూ నవ్వుతూ ఉంటాడు, కీర్తి ఇంటికి వచ్చినప్పటి నుంచి ప్రకాష్ ని గమనిస్తూనే ఉంటుంది.

కీర్తి : ఈ అబ్బాయి ఏంటి ఫోన్ లో చూస్తూ తెగ నవ్వుతున్నాడు, అంతలా నవ్వడానికి అందులో ఏముంటుందబ్బా అని అనుకుంటుంది. కీర్తి ఎంతగా ప్రయత్నించినా ప్రకాష్ ఏమి చూస్తున్నాడో మాత్రం తనకి అర్ధం కావడం లేదు,

కీర్తి తన పని అంతా పూర్తి చేసుకొని ఇలా అనుకుంటుంది.

కీర్తి : రవీందర్ గారి ఇంట్లో వాళ్ళు చెప్పిన పని అంత నేను పూర్తి స్చేసాను ఇక నేను వెళ్లే సమయం అయ్యింది, ప్రకాశం మాత్రం పొద్దున్న నుంచి ఫోన్ చూస్తూ నవ్వుతున్నాడు, ఆశ్చ్చర్యం పోతున్న్నాడు, ఏడుస్తున్నాడు రకరకాలుగా ప్రవర్తిస్తున్నాడు. అందులో అంతలా ఏముందబ్బా నాకు కూడా తీలుసుకోవాలని ఉంది, నేను ఇప్పుడే వెళ్లి ప్రకాష్ ని అడిగి తెలుసుకుంటాను అని అనుకుంటుంది వెంటనే ప్రకాష్ దగ్గరికి వెళ్తుంది.

కీర్తి : ప్రకాష్ బాబు నేను నిన్ను పొద్దున్న నుంచి గమనఇస్తున్నాను నువ్వు ఫోన్ నుంచి మొఖం బయటకు తీయకుండా నవ్వుతున్నావు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు అంతలా దీంట్లో ఏముంది అని అడుగుతున్నది కీర్తి ఎంతో అమాయకంగా

ప్రకాష్ : ఏంటి కీర్తి నీకు ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ గురించి తెలియదా? ఇందులో ప్రపంచమే ఉంటుంది కావాలంటే చూడు అని తన ప్రకాష్ కీర్త్తికి కొంత సేపు తన ఫోన్ లో యూట్యూబ్ వీడియోస్ చూపిస్తాడు, స్మార్ట్ ఫోన్ యూట్యూబ్ చూడడం కీర్తికి ఎంతగానో నచుతుంది.

అలా సెల్ల్ ఫోన్ పిచ్చిలో పడిపోయిన కీర్త్తి మిగహతా విషయాలు పట్టించుకోవడమే మానేసింది. అలా రోజులు గడుస్తుండగా ఒక్కరోజు బాలు కీర్తి దగ్గరకు వచ్చి

బాలు : అక్క ఇదెంతక్క నువ్వు ఈ మధ్య ఇలా మారిపోయావు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు, ఇంతకు ముందు నాతో ఎంత ప్రేమగా ఉండేదానివి అక్క నువ్వు కానీ ఇప్పుడు నేను ఇంట్లో ఉన్ననా తిన్నానా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు, అస్సలు నువ్వు నాతో సరిగా మాట్లాడి ఎన్ని రోజులు అవుతుందక్కఅని బాలు తన బాధనంతా కీర్తి తో చెప్పుకుంటాడు

కానీ కీర్తి మాత్రం అప్పుడే ఎక్కడవు ఎవరి దగ్గరో తెచ్చిన ఒక ఫోన్ లో యూట్యూబ్ చూస్తూ కనీసం బాలు చెపిప్ప్ విషయాలని కూడా పట్టించుకోలేదు.

ఒకరోజు కీర్తి తనలో తాను ఇలా అనుకుంటుంది.

కీర్తి : అయ్యో ఈ రోజు యూట్యూబ్ వీడియోస్ చూడడాన్నికి సరిగ్గా సమయానికి నా దగ్గర ఫోన్ లేదే, ఎవ్వరు కనిపించేద్దాం లేదు ఫోన్ అడుగుదాం అంటే అయ్యో ఇంత సేపు యూట్యూబ్ చూడదకుండా ఉండడం అంటే నా వల కావడం లేదే, ఎలా ఎలా ఏమి చెయ్యాలి ఏమి చెయ్యాలి అని కీర్తి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కీర్తికి ఒక్క ఆలోచన వస్తుంది.

కీర్తి : నేను రోజు అక్కడో ఇక్కడో పని చేసి ఎన్నో కొన్ని డబ్బులు అయితే సంపాదిస్తున్నాను కదా వాటిని అన్నింటింది దాచుకుంటే కొన్ని రోజుల తరువాత స్మార్ట్ ఫోన్ కొనుక్కునే అన్ని డబ్బులు వస్తాయి కదా, ఈరోజు నుంచే డబ్బులు దాచిపెట్టడం స్టార్ట్ చేస్తా అని అనుకుంటుంది.

కీర్తి అనుకున్నట్టు గానే తాను పని చెయ్యగా వచ్చిన డబ్బులని ఒక్క రూపాయి కూడా ఇంట్లో ఇవ్వకుండా తాను కొనాలనుకున్న ఫోన్ కోసం దాచ్చిపెట్టుకునేది, కీర్తి ఎప్పుడు ఫోన్ వస్తుందన్న ఊహల్లోనే తేలి పోతు ఉండేది, కనీసం ఇంటి పని వంట పని కూడా చేసేడోయ్ కాదు. అలా కొన్ని అర్జులు గడుస్తూ ఉంటాయి కీర్తి చేసే పనులకు విసిగి పోయిన బాలు కీర్తి దగ్గరకు వచ్చి

బాలు : అక్క నువ్వసలు ఏమి చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో నీకైనా తెలుస్తుందా? ఎంతసేపు ఫోన్ పిచ్చిలో పది కింద మీద కానకుండా తయారయ్యావు ఎందుకు? ఫోన్ అనేది మన అవసరం తీర్చే ఒక వస్తువు మాత్రమే కానీ నువ్వు దానికి బానిసవి అయిపోయావు, ఇన్ని రోజులు నాతో చుట్టూ పక్కన వాళ్ళతో ఎంత ప్రేమగా మాట్లాడే దానివి, ఇప్పుడు ఎవరు ఫోన్ ఇస్తారా ఎప్పుడు యూతు  బె చూస్తూ కూర్చుందామా, ఎవరు టీవీ లో యూట్యూబ్ పెడాతారా చూస్తూ కూర్చుందామా అని తయారయ్యావు, నీ ఒక్క దానికి కాదు నేను చెప్పడం అందరి గురించి చెబుతున్నాను, ఏదైనా మితంగా ఉంటేనే మంచిది ఇంటికి ఒంటికి కూడా అతిగా చేస్తే ఏదైనా ప్రమాదమే, ఎక్కువగా తింటే స్వీట్స్ కూడా విసుగొచ్చేస్తాయి, ఇంత చెప్పిన తరువాత కూడా నువ్వు ఇంకా యూట్యూబ్ పిచ్చి అదులుకోను ఇంటిని పట్టించుకోను అని అనుకుంటే ఇక ఈ తమ్ముడిని మరెచ్చిపో ఛేచ్చిపోయాడు అనుకో అని అంటాడు బాలు బాధతో కూడిన ప్రేమతో.

బాలు మాటలకి కీర్తికి తాను చేస్తున్న తప్పు అర్ధం అవుతుంది. 

కీర్తి : తమ్ముడు నన్ను కష్మించు రా ఎదో యూట్యూబ్ మోజులో పది నిన్ను కూడా పాట్టించుకోవడం మానేసాను, అస్సలు ఇన్నిరోజులు నా చుట్టూ ఏమి జరిగిందో కూడా నాకు సరిగా గుర్హులేదు, ఫోన్లకు సోషల్ మీడియా కి అతిగా అలవాటు అయ్యి తరువాత బానిసలుగా మారే కొంతమంది ప్రజలకు ఉదాహరణే నేను, కానీ ఇప్పటినుంచి నేను అలా ఉండను ఇంతకు ముందు లాగా నీతో సంతషంగా ఉంటాను అని కీర్తి బాలు కి మాట ఇస్తుంది.

ఆ రోజు నుంచి యూట్యూబ్ పిచ్చి వదిలించుకొని కీర్తి బాలు తో మునుపటిలా ఎంతో సంతోషంగా ఉంటుంది, అక్క మారిపోవడం చూసి బాలు కూడా ఎంతో ఆనంద పడతాడు.

కీర్తి తాను ప్రొఫానే కోసం దాచుకున్న డబ్బులు అన్ని బాలు కి చూపిస్తూ

కీర్త్తి : తమ్ముడు ఇవ్వి నేను ఫోన్ కొనడం కోసం దాచుకునేం డబ్బులు, ఇప్పుడు ఎలాగూ ఫోన్ కొనేది లేదు కాబట్టి మనము ఈ డబ్బులతో కొన్ని అర్జులు ఎక్కడికైనా హాయిగా వేలి తిరిగి వద్దాం అని అంటుంది. కీర్తి చెప్పినాన్ దానికి బాలు కూడా సరే అంటాడు, ఇద్దరు విహార యాత్రకు వేళ్ళాడడానికి సిద్ధం అవుతారు. అలా వాళ్ళు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉంటూ జీవిస్తారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *