రైతు కోడలు vs సాఫ్ట్వేర్ కోడలు Episode 2 | Telugu Kathalu | Telugu Stories | Panchatantra kathalu

అది ఒక అందమైన పల్లెటూరు. ఆ పల్లెటూర్లో ఒక ధనవంతుల కుటుంబం ఉంది . ఆ కుటుంబంలో తల్లి వెంకమ్మ. కూతురు saroja నివసిస్తూ ఉంటారు వాళ్లది చాలా ధనవంతులు కుటుంబం కావడంతో సరోజా బాగా చదువుకొని మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. అదే ఊరిలో సరోజ స్నేహితురాలు విమల ఉంటుంది విమల ఇంటర్మీడియట్ వరకు తనతో పాటు కలిసి చదువుకున్నది ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదివించే స్తోమత లేక విమలకు చదువు ఆపేస్తారు.
ఆమె తల్లిదండ్రులతో పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి ఒకసారి సరోజా పట్నం నుంచి తిరిగి వస్తుంది.
ఆమె రావడం రావడమే తన స్నేహితురాలైన విమల దగ్గరకు వెళ్తుంది.
విమల అప్పుడే పొలం నుంచి రావడంతో ఆమె బట్టలు మట్టి మట్టి గా ఉంటాయి.
ఆమె విమల ను చూసి తన మనసులో….. ఇదేంటి ఇంత దరిద్రంగా ఉంది. చదువుకునే సమయంలోనే ఒక రకంగా చూడ బుద్ధి అయ్యేది మరి ఇప్పుడు ఏంటో ఎలా ఉంది. నేను అనవసరంగా వచ్చానా అని అనుకుంటుంది.
విమల saroja చూసి ఎంతో సంతోష పడుతూ….. saroja saroja నేను ఇప్పుడే పొలం నుంచి వచ్చాను . ఒక్క ఐదు నిమిషాలు అలా కూర్చొ నేను స్నానం చేసి వస్తాను. ఎంచక్కా మనం కబుర్లు చెప్పుకుందాం చాలా సంవత్సరాలు అయిపోయింది మనం కలిసి.
అందుకు సరోజా సరే అని చెప్పి అక్కడ కూర్చుంటుంది . ఆమెకు అక్కడ కూర్చోవడం కూడా ఏ మాత్రం ఇష్టం లేదు ఇబ్బంది పడుతూనే ఉంటుంది.
కొంచెం సమయం తర్వాత విమల శుభ్రంగా స్నానం చేసి ఆమె దగ్గరకు వస్తుంది.
ఇక తల్లిదండ్రులతో…. నాన్న అలా వెళ్లి వస్తాము అని చెప్పి బయటకు వెళ్తారు ఆ ఇద్దరూ కలిసి ఇంటి బయటకు వస్తారు.
ఇద్దరూ కలిసి కారులో ఊరి చివర ఉన్న గుడి దగ్గరికి వెళ్తారు.
అక్కడ సరోజ….. ఏంటి విమల ఇదంతా నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు. ఇంటర్మీడియట్ చదువుకున్నావు . ఓపెన్ గా డిగ్రీ రాస్తున్నవని కూడా తెలిసింది ఆ డిగ్రీ ఏదో పూర్తి చేసుకున్నావు అంటే నేను ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను సాఫ్ట్వేర్ కంపెనీలో.
అందుకు ఆమె….. సరోజ నిజానికి నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ ఇప్పుడు మా కుటుంబ పరిస్థితి అస్సలు బాగోలేదు. అమ్మ నాన్న ఇద్దరు ఆరోగ్యం సరిగా లేదు నేనే వాళ్లతో పాటు కలిసి పొలానికి వెళ్లి కష్టపడుతున్నాను. వచ్చిన డబ్బులతో ఇల్లు అలా గడుస్తుంది.
ఈ జన్మకి ఇంతే. అది సరే గానీ నీ సంగతి ఏంటి మీ అమ్మగారు మొన్న కనిపించారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అంట కదా.
ఆమె….. అవును చూస్తున్నారు అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్. నెలకి లక్ష రూపాయల జీతం నాకంటే 20000 ఎక్కువే.
అబ్బాయి కూడా చాలా బాగున్నాడు.
అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను.
బహుశా అంతా ఓకే అనుకుంటే వచ్చే నెలలో పెళ్లి ఉండొచ్చు.
అందుకు విమల చాలా సంతోషపడుతూ
చాలా మంచి శుభవార్త చెప్పావు నాకు కూడా.
ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
అబ్బాయి ఎవరో కాదు మనతోపాటు చదువుకున్నా డే గణేష్ అతను.
ఆ పేరు వినగానే సరోజ….. ఏంటే పోయి పోయి వాని చేసుకుంటున్నావా వాడికి చదువు రాగా ఎనిమిదో తరగతి తోనే ఆపేశాడు. పైగా వాడి పెళ్లి చేసుకుంటే పెళ్లి తర్వాత కూడా నువ్వు ఇక్కడే మట్టి పిసుక్కుంటూ ఉండాల్సి వస్తుంది.
నా మాట విను అతన్ని పెళ్లి చేసుకోకు . మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగి సంబంధం నేను తీసుకు వస్తాను.
ఆ మాటలు విన్న ఆమె…. చూడు saroja గణేష్ చదువు అబ్బక ఎనిమిదో తరగతితో ఆపలేదు . వాళ్ళ నాన్న చనిపోవడంతో . కుటుంబ బాధ్యతలు అతని మీద పడ్డాయి.
అందుకోసమే చదువు ఆపేశాడు. వాడిని చేసుకుంటే మట్టి పిసుకోవాలి అని అంటున్నావు కదా . ఆ మట్టి లేకపోతే మనకు ఆహారం ఎలా వస్తుంది చెప్పు.
అయినా సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్యని అని నువ్వు ఎంత గొప్ప గా చెప్పుకుంటున్నావో నేను కూడా ఒక రైతు భార్యని అని నేను కూడా గర్వంగా చెప్పుకుంటాను.
రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా అలాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి అంటే వద్దు అంటావేంటి అని అంటుంది ఆ మాటలకి సరోజ…. సరే ఇంకేంటి విశేషాలు.
అని అంటుంది అందుకు ఆమె తన కష్టసుఖాల గురించి చెప్తుంది ఇంక వాళ్ళిద్దరూ చాలా సమయం మాట్లాడుకున్న తర్వాత
తర్వాత కారులో ఆమెను విడిచి పెడుతుంది సరోజ. విమల ఆమెకు వీడ్కోలు చెప్పి ఇంటికి వెళ్తుంది.
కొన్ని రోజులు గడిచాయి సరోజకి సాఫ్ట్వేర్ ఉద్యోగి రవి తో పెళ్లి జరుగుతుంది.
విమలకు రైతు గణేష్ తో పెళ్లి జరుగుతుంది.
విమల గణేష్ లో అక్కడే కాపురం ఉంటారు.
గణేష్ తల్లి ఆమె నీ ఎంతో ప్రేమతో చూసుకుంటూ ఉంటుంది ఆమె అక్కడ కూడా ఏమాత్రం సేద తీరకుండ కష్టపడుతూనే వాళ్లతో పాటు పొలానికి వెళ్తుంది. అక్కడ అత్త భర్తతో కలిసి పొలం పనులు చేసుకుంటూ. సంతోషంగా ఉంటుంది మధ్యాహ్న సమయంలో వాళ్ల కోసం ఇంటికి వెళ్లి భోజనం తీసుకొని మళ్లీ తిరిగి పొలానికి వస్తుంది. అలా వాళ్ళ జీవితం సాగిపోతుంది.
ఇది ఇలా ఉండగా పట్టణంలో ఉన్న రవి saroja చాలా సంతోషంగా ఉంటారు రవి తల్లి…. అమ్మ saroja నాకు కొంచెం నడుము నొప్పిగా ఉంది. కొంచెం ఇంటిపని చేయి తల్లి.
సరోజ…. ఏంటి అత్తయ్య నేనొక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. అలాంటి నన్ను పట్టుకొని. అది చెయ్యి ఇది చెయ్యి అని అంటున్నారు.
ఆయన ఈరోజు మేమిద్దరం బయటికి వెళ్తున్నాము బీచ్లో అలా సరదాగా గడపడం కోసం. ఏమనుకోకండి అత్తయ్య మేము ఏదైనా హోటల్లో. భోజనం చేస్తాము మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోండి.
లేదంటే నాకు కాల్ చేసిన నేను ఆర్డర్ పెట్టేస్తాను సరేనా.
అని అంటుంది అందుకు అత్తగారు ఏం మాట్లాడకుండా ఉంటుంది.
కొంత సమయం తర్వాత మా భార్య భర్తలిద్దరూ బీచ్ కి వెళ్తారు . అక్కడ ఆమె ఎంతో సరదాగా బీచ్లో కూర్చుని ఫోటోలు దిగుతూ. చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
పాపం అత్త గారు తన నడుము నొప్పి తోనే ఇంటి పని చేసుకుంటూ….. భగవంతుడా డబ్బున్న , ఉద్యోగం ఉన్న కోడల్ని చేసుకోకూడదు అని ఎంతో మంది చెప్పారు . కానీ నేను వినలేదు అయినా ఉద్యోగం చేసే కోడళ్ళు పని చేయరా ఏంటి. అలా అనుకుంటే మా వదిన కోడలు ఈమె కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాం ది కానీ పొద్దున్నే లేచి ఇల్లు చక్కబెట్టుకునే భర్తతోపాటు ఆఫీస్ కి వెళ్తుంది.
అందరూ ఈమెలా గా పొగరుగా ఉండట్లేదు.
ఏదైనా నా మనిషిని బట్టి ఉంటుందిలే అని ఎంతో బాధపడుతూ పని చేసుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా పల్లెటూర్లో ఉన్న విమల వాళ్ళ అత్తగారికి సేవలు చేసుకుంటూ. మరియు భర్తకి సేవలు చేసుకుంటూ. ఉంటుంది.
కోడలు అంత కష్టపడ్డాను చూసిన తర్వాత తన మనసులో…. నా కోడలు బంగారం ఉదయాన్నే లేచి ఇంటి పని చూసుకుంటుంది. అలాగే మాతో పాటు కలిసి పొలంలో ఎండలో కష్టపడుతుంది. ఇలాంటి బంగారం లాంటి కోడలిని ఇచ్చినందుకు భగవంతుని కి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.
అంటూ ఎంతగానో సంతోషపడుతుంది.
అలా రోజులు గడిచాయి. సాఫ్ట్వేర్ రాయ్స్ట్రేషన్ రావడంతో చాలామంది ఉద్యోగాలు పోతాయి. అందులో ఆ భార్య భర్తలు ఉద్యోగాలు కూడా పోతాయి.
వాళ్ళిద్దరూ మరో వాటికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ. వాళ్ళకి ఎక్కడా కూడా ఉన్న పరిస్థితిలో ఉద్యోగం దొరకదు.
అందుకు తల్లి వాళ్ళతో…. ఒరేయ్ జరిగిందేదో జరిగిపోయింది మన ఊరు వెళ్దాం రా అక్కడ పొలం సాగు చేసుకుందాం దానికి మించిన ఉత్తమమైన పని మరొకటి లేదు.
సొంత ఊరిలో ఉండొచ్చు. చల్లని వాతావరణం అయిన వాళ్ళతో పలకరింపులు చాలా బాగుంటుంది.
అని చెబుతుంది ఆ మాటలు విన్న కోడలు….. ఏంటి మీరు మాట్లాడుతుంది ఇంత చదువు చదువు కొని పొలనీకి వెళ్ళను అంటున్నారా ఇది అస్సలు సరైంది కాదు. నేను చచ్చినా రాను.
అందుకు భర్త…. ఎందుకు రావు పొలం పని చేసుకోవడం లో నీకు ఎందుకు అంత నామోషి. అసలు రైతు అనేవాడు లేకపోతే మనం నాలుగు మెతుకులు కూడా తినేవాళ్ళం కాదు. ఇలా ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఒకరి కింద ఆధారపడటం కంటే . సొంత ఊరిలో ఉంటూ సొంతం గా పని చేసుకుంటే మనల్లి అనే వాళ్ళు ఉండరు.
నాకున్న జ్ఞానం తో నేను కొత్త రకాల జాతుల్ని ఉత్పత్తి చేసి వ్యవసాయంలో మంచి రాబడిని పొందుతాను.
అని అంటాడు అతని మాటలకి ఆమెకు చాలా కోపం వస్తుంది కానీ ఏం చేయలేదు కొన్ని రోజులకి వాళ్ళ ముగ్గురు సొంత ఊరికి తిరిగి వచ్చేస్తారు అక్కడ భర్త పండ్ల తోటలు వేసి తనకున్న జ్ఞానంతో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఎన్నో లాభాలు పొందుతాడు ఇక ఆమె కూడా చేసేది ఏమీ లేక పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి ఒక రోజు ఆమె తన స్నేహితురాలైన విమల దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది.
ఆమె అనుకున్న విధంగానే అక్కడికి వెళుతుంది. విమల సరోజ ని చూసి….. సరోజ పెళ్లి తర్వాత చాలా రోజులు ఇక్కడ వచ్చావే ఎలా ఉన్నావు ఏంటి ఇంత నల్లబడి పోయావు.
సరోజ…. నన్ను క్షమించు విమల నేనెప్పుడు నీతో చాలా తప్పుగా గర్వంగా మాట్లాడాను కదా. నాకు తప్పు తెలిసి వచ్చింది. నాకు నా భర్త కి ఉద్యోగం పోయింది. ఆ తర్వాత నా భర్త సొంత ఊరైన కృష్ణాపురం కి వచ్చాను. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను . ఇలాంటి పెన్షన్లు లేవు . అంతా ప్రకృతి మీద ఆధారపడి ఉన్నాము. సంతోషంగా అందరం కలిసి పొలంలో పని చేసుకుంటే చాలా బాగుంది. పైగా మాకు ఉన్న జ్ఞానం తో మంచి ఆదాయం పొందుతున్నాము. అని బాధగా క్షమాపణ కోరుకుంటూ జరిగిన విషయం చెబుతుంది ఆ మాటలు వింటున్న విమల…. అయ్యో నువ్వు నా స్నేహితురాలి వే నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి. అదంతా వదిలేయ్ . నిజానికి మన సొంత పొలంలో పని చేసుకునే భాగ్యం ఎంత మందికి ఉంటుంది మనం ఒక ఇద్దరికీ కాదు దేశం మొత్తానికి అన్నం పెడుతున్న రైతులము.
కాబట్టి మనం రైతులము అని గర్వంగా చెప్పుకోవాలి.
అని ఆమెకు ధైర్యం చెబుతుంది.
నా మాటలు విన్న సరోజ….. చాలా అదృష్టవంతురాలివి . నువ్వు ఎందుకంటే నా కంటే ముందు నుంచి వ్యవసాయం చేస్తూ.
ఎంతోమంది ఆకలి తీర్చినందుకు.
అందుకు ఆమె నవ్వుకుంటుంది అలా ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాటలు చెప్పుకుంటారు. కొంత సమయం తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఇక ఎవరు పొలంలో వాళ్ళు కష్టపడుతూ. దేశానికి ఆహారాన్ని అందిస్తూ. సంతోషంగా జీవిస్తారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *