రైతు కోడలు vs సాఫ్ట్వేర్ కోడలు | Telugu Kathalu | Telugu Stories | Panchatantra kathalu

శిరీష ఎప్పటిలాగే పొలం పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ మామయ్య అక్కడికి వచ్చి …. శిరీష మీ అక్క బావ వాళ్ళు వచ్చారు. ఇంటికి వెళ్దాం పద. శిరీష…. సరే మావయ్య అత్త పొలంలో చివరి చక్క వైపు వెళ్ళింది. అత్త నీ తీసుకొని వస్తాను మీరు వెళ్ళండి మావయ్య.
అందుకు అతను అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కొంత సమయం తర్వాత శిరీష అత్త అక్కడికి వస్తుంది. ఆమె…. అత్తయ్య మా అక్క, బావగారు వచ్చారంట ఇంటికి వెళ్దాం పద.
ఆ మాటలు విన్న అత్త…. నా పెద్ద కొడుకు వచ్చాడా నాకు చాలా సంతోషంగా ఉంది . నా పెద్ద కోడలు చూసి చాలా సంవత్సరాలు అయిపోతుంది తొందరగా వెళ్దాం పద శిరీష.
అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి ఆ ఇంటికి వెళ్తూ ఉంటారు.
అసలు ఎవరీ శిరీష. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అనేది కథలో తెలుసుకుందాం.
అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శంకర్రావు అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు , పెద్ద కూతురు జానకి , రెండో కూతురు శిరీష అతను అల్లారుముద్దుగా ఇద్దర్ని పెంచుకున్నాడు.
జానకి బాగా చదువుకొని పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంది అక్కడ ఆమెకు వినోద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వాళ్ళిద్దరు అక్కడ ప్రేమలో మునిగి పోయారు. ఇక శిరీష పెద్దగా చదువుకోలేదు . ఎందుకంటే తన తండ్రి పరిస్థితి అంతగా సరిగ్గా లేని కారణంగా ఆమె పదో తరగతి వరకు చదువుకొని పై చదువులు చదువుకోకుండా తన తండ్రికి పొలం పనులలో సహాయం చేస్తూ ఉండేది అలా ఉండగా ఒకరోజు జానకి వినోదు నీ తండ్రి దగ్గరకు తీసుకువచ్చి తన ప్రేమ విషయం చెప్తుంది. అందుకు అతను పెళ్లికి సరే అంటాడు. ఇక వినోద్ తల్లిదండ్రులతో మాట్లాడడానికి వెళ్తాడు.
అక్కడ వినోద్ తల్లి శారద , అతని తండ్రి గోవిందయ్యతో మాట్లాడుతాడు అతను కట్నకానుకలు పెద్దగా ఇచ్చుకోలేనని సమాధానం చెప్తాడు.
అందుకు వాళ్లు … కట్న కానుకలతో మాకు ఏం అవసరం లేదండి. మీ అమ్మాయి ఫొటో చూశాను చాలా బాగుంది. అన్నట్టు మా రెండో వాడి పేరు కిరణ్. మీ రెండో అమ్మాయిని వాడికిచ్చి చేస్తారా . వాడు పెద్దగా చదువుకోలేదు చదువు అబ్బలేదు. తండ్రితో పాటు పొలం సాగించు కుంటూ ఉన్నాడు .
మీకు ఇష్టమైతే నా ఇద్దరు పిల్లలకి మీ ఇద్దరు పిల్లల్ని ఇచ్చి పెళ్లి చేద్దాం.
అందుకు తను సరే అంటాడు. అతను అక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళ్లి . ఆ విషయం శిరీష తో మాట్లాడుతాడు.
అందుకు ఆమె సరే అంటుంది. కొన్ని రోజులు గడచాయి పెళ్లి పనులు జరుగుతూ ఉంటాయి . ఇంకా పెళ్లి సమయం రానే వచ్చింది. శిరీష కిరణ్ తో . జానకి వినోద్ పెళ్లి జరిగిపోతుంది.
పెళ్లి జరిగిన కొంచెం సమయం తర్వాత తండ్రి ఆనందం పట్టలేక ఎంతో సంతోష పడుతూ ఉంటాడు. ఇక అప్పగింతల సమయం ఎక్కువ తను ఏడుస్తూ…. పిల్లలిద్దర్నీ అత్త చేతిలో పెట్టి వాళ్లని చూసుకోమని చెప్తాడు .
అందుకు శారద…. తప్పకుండా అన్నయ్య నా కూతుల్లు లాగా చూసుకుంటాను. అని అంటుంది ఎందుకు అర్థం సంతోష పడుతూ ఉండగా ని ఒక్క సారిగా గుండె ఆగిపోయి కింద పడిపోతాడు.
జానకి శిరీష ….. నాన్న నాన్న అంటూ పిలుస్తూ ఉంటారు కానీ అప్పటికే తను మరణిస్తాడు.
పెళ్లి అయినా ఆనందం కంటే తండ్రి లేడు అన్న బాధ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది.
కొన్ని రోజులు గడిచాయి జరిగిందంతా మర్చిపోయి వాళ్ళు అక్కడ సంతోషంగా ఉంటారు కొన్ని రోజుల తర్వాత పెద్దకోడలు….. అత్తయ్య ఇంకా మేము పట్టణానికి వెళుతున్నాను మా ఉద్యోగాలు చేసుకోవాలి కదా . ఇప్పటికే మాకు చాలా రోజులు సెలవు ఇచ్చారు. ఇంకా సెలవు ఇవ్వడమైనది కుదరదు . మేము వెళ్లి వస్తాము. అని అంటుంది అందుకు ఆమె… సరే అమ్మ అంటుంది ఇంతలో వినోద్ వచ్చి….. అమ్మ నా బట్టలు మొత్తం సర్దుకున్నాను బస్ కి వేల అవుతుంది
మేము వెళ్ళిన తర్వాత మీకు రోజు ఫోన్ చేస్తూ ఉంటాను.
నువ్వు నాన్న జాగ్రత్త అని అంటాడు.
కిరణ్ తో…. ఒరేయ్ జాగ్రత్తగా ఉండండి . అమ్మ నాన్న నీ బాగా చూసుకో అని ఉంటాడు . అందుకు అతను సరే అంటాడు.
ఇక వాళ్ళిద్దరూ శిరీష కూడా జాగ్రత్తలు చెప్పి వాళ్ళిద్దరు అక్కడనుంచి వెళ్ళి పోతారు.
ఇక్కడ శిరీష భర్తతో కలిసి పొలానికి వెళ్తూ ఉంటుంది.
అలా సంతోషంగా వాళ్ళ కాపురం గడుస్తూ ఉంటుంది. వాళ్ల భార్యాభర్తలిద్దరూ ఎప్పట్లాగే పొలానికి వెళ్తారు. పొలం లో అతనికి పాము కాటు వేస్తుంది.
అతను ఏదో పురుగు అనుకుని దాన్ని పట్టించుకోడు. అలా పని చేస్తూ ఉంటాడు మెల్లగా అతని శరీరం అంతా వణుకు రావడం మొదలవుతుంది . అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. శిరీష చాలా భయపడుతూ… ఏమైందండీ ఏమైంది అంటూ హడావుడి పడుతూ . చుట్టుపక్కల సహాయం కోసం చూస్తుంది కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో తన భర్త నీ భుజాలమీద ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లంది. ఆస్పత్రిలో అతని వైద్యురాలు పరీక్షించి….. ఏదో పాము కాటు లాగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చారు . విషం నరాల్లో ఈముడుచుకుపోయింది .
అంటూ వైద్యం చేస్తుంది శిరీష చాలా బాధపడుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత . డాక్టర్ ఆమెతో…. ప్రాణనికి అయితే ఎలాంటి ప్రమాదం లేదు. కానీ ఆ పాము విషం వల్ల అతనికి నరాలు చచ్చి పడిపోయాయి.
నడవడం కొన్ని రోజులు కష్టం. అని అంటుంది శిరీష…. నా భర్త ప్రాణాలు తో ఉన్నాడు అది చాలు . ఏదో విధంగా తర్వాత నేను నా భర్తనే నడిపించుకుంటూ డాక్టర్ ఆనీ ఆమెకు చెప్పి అంబులెన్స్లో భర్తని ఇంటికి చేరుతుంది ఇక అక్కడ అత్త మామ తో జరిగిన విషయమంతా చెప్పంది .
వాళ్లు చాలా ఏడుస్తారు.
ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు అత్త పెద్ద కొడుకు వినోద్ కి . జరిగిన విషయం చెబుతుంది అతను…. సరే అమ్మ డబ్బులు పంపిస్తాను. మీరు జాగ్రత్త అని ఫోన్ కట్ చేస్తాడు. ఆ మాటలకి ఆమె… డబ్బుల కోసం చేశాడు అని అనుకుంటున్నాడా. అంటూ చాలా బాధపడుతుంది.
కొన్ని రోజులు గడిచాయి పెద్ద కొడుకు కోడలు ఇద్దరూ వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో చాలా బిజీ అయిపోతారు ఇక్కడ
ఈ ముసలి దంపతులకు అన్నిట్లో తోడుగా ఉన్న కొడుకు మంచాన పడ్డ చాలా బాధాకరంగా ఉంటుంది.
ఆ దంపతులు ఇద్దరూ ఒకరితో ఒకరు…. ఏమండీ ఇలా అవుతుందని అనుకోలేదు. శిరీష తన జీవితం సంతోషంగా ఉంటుంది అనుకున్నాను కానీ. ఇలా అవుతుంది అని కలలో కూడా ఊహించలేదు. అన్ని పనులలో సహాయం చేసే కొడుకు లేడు.
ఇక ఈ సారి పొలం కూడా పంపించకపోతే.
ఏం తిని బ్రతకాలి.
అతను … శారదా నువ్వేం కంగారు పడకు కవులకు ఇచ్చుకున్నదాము . అంత లాభం లేకపోయినా . మనం బ్రతకవచ్చు.
అని అంటాడు ఆ మాటలు వింటున్న కోడలు …. ఎందుకు మావయ్య నేను ఉన్న కదా నేను మీ కొడుకు లాగా మీకు సహాయం చేస్తాను. అని అంటుంది . వాళ్ళు వద్దు అన్న సరే ఆమె ఒప్పుకోదు వాళ్లకు సహాయం చేయాలని నిర్ణయించుకుని ఇక ఆ రోజు నుంచి. వాళ్లతో పాటు పొలం కి వెళ్తూ. అన్ని పనులు ఆమె చూసుకుంటూ ఉంటుంది.
అలా రోజులు ఆమె సాగుచేస్తూ లాభాలు తీసుకు వస్తూ ఉంటుంది. కొన్నేళ్ల తర్వాత ఎప్పటిలాగే పట్నం నుంచి పెద్ద కొడుకు కోడలు వచ్చారు అని సంబరముగా వాళ్లు ఇద్దరూ ఇంటికి వెళ్తారు.
పెద్దకోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో ఆమె
చాలా అందంగా. తయారై ఉంటుంది.
ఆమె తన చెల్లి ని చూసి … ఏంటి నీ అవతారం ఇలా ఉన్నావు మట్టి కంపు కొడుతుంది.
శిరీష…. పొలం పని చేసి వచ్చాను కదా అక్క అలాగే ఉంటుంది . నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది.
కొంత సమయం తర్వాత శిరీష అక్కడికి వస్తుంది.
శిరీష జానకి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్త…. అమ్మా జానకి నీకు ఇష్టం అని స్వీటు తెచ్చాను . తినమ్మా జానకి .. అత్తయ్య సీట్ల ఎలా పడితే అలా తినకూడదు నేను తినడం మానేశాను ఆయన మీరేంటి ఇలా ఉన్నారు. మేము వచ్చినప్పుడన్న కొంచెం మంచి బట్టలు వేసుకోండి.
డబ్బులు కావాలి అంటే అడగొచ్చు కదా ఇదిగో తీసుకోండి అంటూ డబ్బుని ఆమె ముందు విసిరి కొడుతుంది.
దాన్ని చూసి అత్త చాలా బాధపడుతు…. డబ్బు అవసరం లేదమ్మా . నా చిన్న కోడలు దయవల్ల నేను బాగానే ఉన్నాము. పొలం పని చేసేవాళ్ళం కదా. అందుకే ఇలా ఉన్నాను తప్పుగా అనుకోవద్దు లే. అని అంటుంది అందుకు ఆమె…. కానీ కాలంతో పాటు మనం కూడా మార్పు రావాలి. అని అంటుంది ఆ రోజు కలిసిపోతుంది ఆ మరుసటి రోజు అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటారు.
పెద్ద కోడలు గర్వంగా వాళ్ల దగ్గర ఉన్న వాటి గురించి చెప్తూ ఉంటుంది.
దాన్ని వాళ్ళు అందరూ వింటూనే ఉంటారు.
ఆమె మాటల్లో….. అసలు నాకు రాత్రి నిద్ర పట్టలేదు ఇక్కడ ఏసీ లేదు ఏమి లేదు దోమలు తెగ కొడుతున్నాయి.
దయతోడ ఎక్కడ చూసినా ఏదో మట్టి కంపు కొడుతూనే ఉంది ఏంటో శుభ్రం లేదు ఏం లేదు.
అయినా ఇక్కడ ఎందుకు మీరు ఉండడం . మాతోపాటు పట్నం రావచ్చు కదా ఈ పొలం పనులు ఇవన్నీ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు .
చి చి ఐ డోంట్ లైక్ దట్.
నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంది.
ఆ మాటలకి అత్త కి బాగా కోపం వచ్చింది…. నిన్నటి నుంచి చూస్తున్నాను మట్టి వాసన మట్టి వాసన అంటున్నావు. నువ్వు పుట్టి పెరిగింది ఎక్కడ అన్న సంగతి మర్చిపోయావా. వెనకటికి నీలాంటిదే చింతకాయల వైపు చూపించి వంకర టింకర గా ఉన్నవి అవి ఏంటి అన్నదట అప్పుడు యజమాని చెప్పుతో కొట్టినట్టుగా అంతకు ముందు నువ్వు ఆమె దానివే అవే అని అన్నాడంట అలా ఉంది.
మట్టి వాసన వస్తుందా మరి రోజు మూడు పుట్ల తింటున్నావు అది మట్టి నుంచి వచ్చింది
కాదా నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తే బంగారం డబ్బు ఏం తినటం లేదు అన్నంమే తింటున్నావ్వు. ఇందాక ఏమన్నావు గ్రామాన్ని వదిలేసి పట్టణానికి రావాలా అందరూ మీలాగా ఆలోచిస్తే రైతు అనేవాడే ఉండడు.
అప్పుడు అందరూ ఆకలితో రావాల్సి వస్తుంది.
అయినా కష్టం విలువ నీకేం తెలుసు. ఫ్యాన్ లో ఈ కిందా ఏసీల కింద కూర్చునే దానివి బాగా జల్సాలకు అలవాటు పడ్డావు.
కష్టమంటే నా రెండో కోడలు శిరీష ని చూసి నేర్చుకో . భర్త మంచం మీద ఉంటే . తన రెండు రెక్కలు మొక్కలు అయ్యేలాగా మాతోపాటు మగాడి లాగా గొడ్డు చాకిరీ చేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేయ లేవు ఏమి లేవు.
మమ్మల్ని పట్టించుకోవడం లేదు . మేము మూడు పూట్ల తింటున్నాను అంటే నా కోడలు శిరీష వాలన. ఆమె కష్టం మీదంతా అంటూ ఏడుస్తుంది.
శిరీష ఆమెను ఓదారుస్తుంది . మాటలకి సాఫ్ట్వేర్ కోడలికి తలకొట్టేసినట్టుగా అనిపిస్తుంది. ఆ భార్యభర్తలిద్దరు మారు మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోతారు.
మొదట వాళ్లు బాధపడినా. కష్టం విలువ తెలుసుకుని అవుతున్నందుకు సంతోష పడతారు తల్లిదండ్రులు. ఇక శిరీష ఎప్పటిలాగే కష్టపడుతూ వాళ్ళకి సహాయం గా ఉంటుంది. వాళ్లు ధైర్యం అంతా శిరీష ని. శిరీష భర్తను కోల్పోయి వాళ్ళ జీవితంలో మళ్లీ సంతోషం రావాలని మనం కూడా కోరుకుందాము.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *