రైలు పట్టాలపై బంగారు ఏనుగుElephant on Railway Track | Fairy Tales |Best animal Stories Telugu

ఒక అడవిలో బంగారు ఏనుగు, నల్ల ఏనుగు భార్య భర్తలు, కుందేలు, పులి, పాండా, పండి, కోతి వాటి వాటి పిల్లలతో నివసిస్తూ ఉండేవి. జంతువులన్నీ అడవిలో కలిసి మెలసి జీవించేవి, కానీ నల్ల ఏనుగు జంట మాత్రం ఎప్పుడు ఎదో ఓక్ జంతువు తో గొడవ పెట్టుకుంటూనే ఉండేవి, అలా ఉండగా ఒకరోజు కుందేలు పండి దగ్గరికి వచ్చి ఇలా అంటుంది.

కుందేలు : బురద పంది మన జంతువులన్నీ ఒకరితో ఒకరు ఎంతో స్నేహంగా ఉంటాయి కదా, కానీ నల్ల ఏనుగులు ఏంటి ఎప్పుడు ఎదో పోగొట్టుకున్నట్టు ఎవరో వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నట్టు అల్లా జంతువులతో చిరాకుగా మాట్లాడుతుంటాయి.

పంది : నాకేం తెలుసు, వాళ్ళేమన్నా నాకు చుట్ట్టాలా అదిగో మన అడవిలో గాలి కూడా తిరగని ప్రదేశాలకి వెళ్లే కోతి వస్తుంది గా తహని అడుగు తనకేమన్న తెలుసేమో చెప్తుంది అని అంటుంది

కోతి : ఏంటి నా గురించి ఎదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారు.

కుందేలు : నీ గురించి తప్పుగా కాదు మామ నువ్వు అడవంతా ఏ పని పాత లేకుండా తిరుగుతావని, నీకు ఒక్క దగ్గర కాలు నిలవదని, అడవిలో ఎక్కడ ఏమి జరిగినా నువ్వే కారణం అని పంది అంటుంది.

కోతి : ఏంటే పంది, ఈ మధ్య నీకు నోరు ఎక్కువ అయ్యింది లే, ఒక్క సరి దెబ్బల పూజ జరిగితే తప్ప నువ్వు దారికి రావు అని అంటుంది కోతి కోపంగా

పంది : అయ్యో కోతి బావ నేను నిన్ను అలా అంటానా? ఈ అల్లరి కుందేలు కావాలని నా మీద అలా చెబుతుంది, ఇందాక నల్ల ఏనుగుల జంట గురించి మాట్లాడుతుంటే నీకేమన్నా తెలుసేమో అని అడుగుమన్న అంతే అని పంది అంటుంది.

కోతి : వామ్మో నల్ల ఏనుగు గురించా అది తెలుసు కోవడం కంటే ఇంటికి పోయి పడుకున్నది మేలు అని అంటుంది కోతి

అలా కొన్ని రోజులు గడిచిపోతాయి, బంగారు ఏనుగు ఒకరోజు జంతువులన్నింటిని ఒక చోట సమావేశ పరిచి

బంగారు ఏనుగు : చూడండి జంతువులారా, మన అడవి పక్క నున్నచీ ఒక రైలు మార్గం పడుతుంది, ఇక నున్నచీ మనం అటు ఇటు ఇంతకు ముందులా తిరగడానికి లేదు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు రైలు ఎలా వస్తుందో తెలియదు, మనం అప్రమత్తంగా లేకుంటే మన ప్రాణాలు కూడా పోవచ్చు మీ పిల్ల విషమ లో మరి జాగ్రత్తగా ఉండడి అని చెప్తుంది మిమిగతా జంతువులకు. జంతువులన్నీ కూడా బంగారు ఏనుగు చెప్పిన దానికి సరే అని తల ఊపి వెళ్లిపోతాయి.

ఒకరోజు పాండా ఆహారం కోసం అడవిలో తిరుగుతుండగా పాండా పిల్ల అటు ఇటు తిరుగుతూ రైలు పట్టాల వైపుకు వెళ్తుంది. ఒక్కసారి రైలు వస్తున్న శబ్దం పాండా చెవిన పడుతుంది. పాండా తన పిల్ల కోసం అటు ఇటూ చూడగా పాండా బిడ్డ రైలు పట్టాలపై కనిపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన బంగారు ఏనుగు తన ప్రాణాలకి తెగించి పాండా బిడ్డని కాపాడుతుంది.

బంగారు ఏనుగు : పాండా నీకు ఇంతకు ముందే చెప్పాను, రైలు పట్టాలు ఉన్నాయి అందరు జాగ్రత్తగా ఉండండి అని, నువ్వు ఎదో పనిలో పది పిల్లని ఇలా వదిలెయ్యడం సరైన పద్ధతి కాదు, సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఎంత గోరం జరిగి ఉండేది చెప్పు అని పాండా ని మందలించి వెళ్ళిపోతుంది. పాండా అడవికి వెళ్ళిన తరువాత రైలు పట్టాల దగ్గర జరిగిన విషయం విగతా జంతువులకి చెబుతుంది. బంగారు ఏనుగు తెగింపుకు అడవి జంతువులన్నీ ఎంతో సంతోషిస్తాయి, వెంటనే వెళ్లి బంగారు ఏనుగుకి ఒక పూల దండ వేసి బంగారు ఏనుగు చేసిన మంచి పనికి ఎంతో మెచ్చుకుంటాయి, ఇదంతా పక్కనే ఉండి గమనిస్తున్న నల్ల ఏనుగు జంటకి మాత్రం జంతువులన్నీ అలా బంగారు ఏనుగుని మెచ్చుకోవడం అస్సలు నచ్చలేదు.

మగ నల్ల ఏనుగు : ఒసేయ్ ఇది చూసావా అడవిలో అన్ని జంతువులు బంగారు ఏనుగు చేసిన ఇంత చిన్న పనికి ఎంత హడావిడి చేస్తున్నాయో, బంగారు ఏనుగు అంటే జంతువులకి రోజు రోజుకు మర్యాద ఎక్కువైపోతోంది, ఎలా గైనా చేసి దానిని జంతువులు దూరం చేసేలా చెయ్యాలి, అలా కుదరని పక్షం లో దాన్నే లేకుండా చేయాలి అని అంటుంది.

ఆడ బంగారు ఏనుగు : ఏ పని చేసినందుకు అయితే జంతువులన్నీ దాన్ని మెచ్చుకుంటున్నాయో అక్కడే దాన్ని చంపేద్దాం అని అంటుంది.

మగ నల్ల ఏనుగు : అర్ధం కాలేదు

ఆడ బంగారు ఏనుగు : రైలు పట్టాలపైనా దాన్ని కట్టి పడేద్దాం  అప్పడు దాని పీడా విరగడ అయిపోతుంది. అని అంటుంది.

అనుకున్నట్టు గానే జంతువులు లేకుండా బంగారు ఏనుగు వంటరిగా ఉన్న సమయం కోసం ఎదురు చూస్తుంటాయి నల్ల ఏనుగులు.

ఒకేరోజు బంగారు ఏనుగు ఒక్కతే అహ్హరం కోసం రైలు పట్టాల వైపుకు వెళ్తుంది.

మగ నల్ల ఏనుగు : అబ్బా ఒంటరిగా చిక్కింది పదా మన పని అమలు చేద్దాం అని అంటుంది.

నల్ల ఏనుగులు రెండు కలిసి బంగారు ఏనుగుని రైలు పట్టాలపై పడుకోబెట్టి తాళ్లతో కట్టేస్తాయి.

బంగారు ఏనుగు : ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, నేను మీకు ఏమి హాని చేసాను, ఎందుకిలా చేస్తున్నారు మీకు ఏమి కావాలో చెప్పండి అని అంటుంది.

ఆడ నల్ల ఏనుగు : మాకు నీ చావే కావలి, అందుకే ఇలా చేసాము, అడవిలో అన్ని జంతువులు మమ్మల్నేమొ చూస్తేనే చీదరించుకొని వెళ్లిపోతున్నాయి, నీకేమో పూవుల దండాలు వేసి మరి సత్కరిస్తున్నాయి, అందుకే ఇల్లా అని అంటుంది.

బంగారు ఏనుగు : నా ప్రాణాలు కావాలని అడిగితే ఇచ్చే దానినే కదా దానికి ఇంత చేయాలా, మీరు నా తల్లి దండ్రుల లాంటి వాళ్ళు మీ కోసం నా ప్రాణాలు వదలడానికి కూడా నేను వెనుకాడను, అని అంటుంది బంగారు ఏనుగు

బంగారు ఏనుగు మాటలకి మెగా నల్ల ఏనుగు మనస్సు కరిగి పోతుంది,

మెగా నల్ల ఏనుగు : ఇన్ని రోజులు మనం ఇలా క్రూరంగా ఆలోచించబట్టే అందరు మనకి భయపడ్డారు, కానీ బంగారు ఏనుగు మాత్రం మనల్ని తల్లి దండ్రులుగా భావించింది, మన బిడ్డని మన చేతులతో చంపుకుంటామా పద వెళ్లి కట్లు విప్పి మన బిడ్డని మనం కాపాడుకుందాం అని రెండు ఏనుగులు వెళ్లి బంగారు ఏనుగుని విడిపిస్తాయి.

ఆరోజునుంచి నల్ల ఏనుగులు కూడా జంతువ్వులతో ఎంతో స్నేహంగా ఉంటాయి. ఇక అడవంతా ఆనందంగా ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *