లక్ష్మీదేవి వరం -దీపావళి పండుగ_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో మన్మధ రావు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి డబ్బు ఉందని పొగరు ప్రతి ఒక్కరితో పెడ గా మాట్లాడుతూ ఉంటాడు. అతని దగ్గర ఒక పేదవాడు అయినా సోమయ్య పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు సోమయ్య పనిచేస్తూ ఉండగా మన్మధరావు అతన్ని పిలిచి…. ఏరా సోమయ్య ఈమధ్య నీకు బాగా కొవ్వు ఎక్కింది. పిలిచిన వెంటనే రావడం మానేసావు.

సోమయ్య…. అలాంటిది ఏమీ లేదు బాబు మీరు పిలిచిన వెంటనే నేను పరుగుపరుగున వస్తున్నాను. అందుకు అందుకు అతను… సరే సరే అయితే అయితే పర్వాలేదు ఒళ్ళు కొవ్వెక్కి తే కొరడా దెబ్బలు తప్పవు జాగ్రత్త. పో వెధవ. అని ఏ కారణం లేకుండానే తిరుగుతూ ఉంటాడు. పాపం సోమయ్య ఏం మాట్లాడకుండా. అతను అనే మాటలు భరిస్తూ ఉంటాడో ఎందుకంటే అతనిది చాలా పేద కుటుంబం. పొరపాటున ఒక మాట జారితే. ఆ కోపిష్టి తనని వెళ్లిపోమంట డని భయం. అందుకే అక్కడ అలా రోజులు గడిచాయి. ఒకరోజు సోమయ్య తన ఇంటి దగ్గర అతని భార్య తో…. ప్రమీల నేను పనికి వెళ్తున్నాను. ఈరోజు సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు తినేసి పడుకో నా కోసం ఎదురు చూడకు అని అంటాడు. ఆమె… సరే అండి అని అంటుంది ఇంతలో తన కూతురు దేవి…. నాన్న ఏం తిని పడుకో అంటారు చెప్పండి బియ్యం అయిపోయి రెండు రోజులు అవుతుంది. మీకంటే అక్కడ భోజనం పెడతారు కానీ ఇక్కడ మాకు ఎవరు పెడతారు. నాన్న అమ్మకి చెప్పాలంటే భయంగా ఉంది. అందుకే నేను చెప్తున్నాను తిండి తిని రెండు రోజులవుతుంది నాన్న చాలా ఆకలిగా ఉంది.
అందుకు అతను….. అమ్మ జీతం రావాలంటే ఇంకొక వారం రోజులు పడుతుంది. ముందుగా నేను జమిందార్ అని అడిగితే ఆయన నన్ను తిడతాడు అందుకే నేను అలా చేయను. అందుకో ఆమె….. అయితే నేను ఈ వారం రోజులు పస్తులు పడిపోవాల్సిందే నాన్న. ఇంతలో తన తల్లి బయటికి వచ్చి…..
మాటలు ఎక్కువగా వస్తున్నాయి ఆపుతావా ఇంకా. ఏమండీ ఇంకా మీరు వెళ్ళండి నేను దీనికి ఏదో ఒకటి చెప్తాను.
అందుకు అతను ఏడుస్తూ…. నువ్వే ఎటు నన్ను అనలేక పోతున్నావు. నా కూతురు చాలా ధైర్యవంతురాలు ఉన్న నిజాన్ని.
చెప్పింది నేను ఎలా అయినా డబ్బు ఏర్పాటు చేసి. కావాల్సినవన్నీ తీసుకొని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్తూ ఉండగా అతనికి మార్గమధ్యలో
ఒక సంచి కనబడుతుంది. అతను ఆ సంచిని చూసి…. ఏంటిది అని ఆ సంచిని తెరిచి చూస్తాడు అందులో చాలా డబ్బు ఉంటుంది.
అందుకని అతను దాన్ని మొదటి గా చూసినప్పుడు… ఇంత డబ్బుని నేను ఎప్పుడూ చూడలేదు. ఈ డబ్బుతో నా జీవితం అంతా మారిపోతుంది. నా కుటుంబం హాయిగా జీవిస్తుంది వాళ్లకి తిండి పెట్టే అవకాశం ఆ భగవంతుడే నాకు ఇచ్చినట్టు ఉంటాడు. అని అనుకొని దానిని తీసుకుని వెళుతూ ఉండగా ఒక ఆమె చాలా కంగారుగా ఆమెకు ఎదురొచ్చిన వాళ్ళతో…. బాబు ఇక్కడ ఏదన్నా సంచి కనబడిందా మీకు అందులో నా డబ్బులు ఉన్నాయి. దయచేసి ఎవరికైనా దొరికితే నాకు ఇవ్వండి.అంటూ ప్రాధేయ పడుతూ అడుగుతూ ఉంటుంది ఆమెను చూసిన సోమయ్య….. అయ్యో పాపం ఆ డబ్బు ఆమెది అనుకుంటా. మనకెందుకులే ఈ డబ్బు ఆమె డబ్బు ఆమె తిరిగి చేద్దాం అని అనుకోని ఆ డబ్బుని తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో… అమ్మ ఈ డబ్బు మీదే తీసుకోండి నాకు దారిలో కనపడింది అంటూ ఆమెకు ఇస్తాడు ఆమె చాలా సంతోష పడుతూ…. చాలా సంతోషం అండి. ఎంతో కష్టపడి ఈ డబ్బు సంపాదించాను. పోయినందుకు ఎంతో బాధ పడుతున్నాను కానీ మీరు చాలా నిజాయితీగా నా డబ్బు నాకు తిరిగి ఇచ్చారు. చాలా కృతజ్ఞతలు అని కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. అతను సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అతను సరాసరి ఆ ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ పనులన్నీ ముగించుకొని ఆ జమీందారు తో …. బాబు గారు ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి
ఇంట్లో బియ్యం అయిపోయాయి. కొంచెం సహాయం చేయండి బాబు గారు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి.
అందుకు అతను చాలా కోపంగా….. ఎంత ధైర్యం ఉంటే నన్నే జీతం ఇవ్వమని అడుగుతావా. ఏ ఒక్కపూట అన్నం లేకపోతే చచ్చిపోతారా. నేను డబ్బు ఇచ్చినప్పుడే నువ్వు తీసుకోవాలి. అంతే కానీ నోరు తెరిచి నన్ను అడగకూడదు వెళ్ళు ఇక్కడి నుంచి అంటాడు అందుకు సోమయ్య చాలా బాధ పడుతూ …. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి. నేను ఎవరినన్న అప్పు అడగాలి అన్న నాకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే నా పేదరికాన్ని చూసి ఎవరు అప్పు ఇవ్వరు. అంటూ బాధపడుతూ వెళుతూ ఉంటాడో ఇంతలో అతనికి ఒక బంగారు ఉంగరం కనబడుతుంది. దానిని చూసి అతను ….. అయ్యో పాపం ఎవరో బంగారు ఉంగరం పోగొట్టుకున్నారు. అది ఎవరిదో అని అనుకుంటూ అటూ ఇటూ చూస్తాడు అక్కడ ఎవరూ కనపడరు ఇంతలో అక్కడికి ఒక ఆమె వచ్చి …. బాబు ఆ బంగారు ఉంగరం నాదే పొరపాటున ఎలాగో జారి కింద పడిపోయింది. అప్పుడు అతను సరే అని చెప్పి ఆమెకు ఇచ్చి అక్కడనుంచి వెళ్ళి పోతాడు అతను చాలా దిగులుగా ఇంటికి వెళ్లగా. అక్కడ ఇంట్లో రకరకాల పండ్లు బియ్యం చాలా సామాన్లు కనబడతాయి.
దాన్ని చూసిన అతను ఆశ్చర్యపోయి తన భార్యతో… ఈ సామాన్లన్నీ ఎక్కడివి ఎవరిచ్చారు ఇవన్నీ.
అందుకు ఆమె…. ఏమండీ ఎవరో మీ స్నేహితురాలoట మిమ్మల్ని చూడాలని వచ్చింది ఆమె ఇవన్నీ తీసుకు వచ్చింది. పాపం చాలా సమయం వరకు ఎదురు చూసింది కానీ మీరు రాకపోవడంతో ఆమె ఇప్పుడే వెళ్లి పోయింది.
అందుకు సోమయ్య…. నాకు తెలియకుండా నాకు స్నేహితురాలు ఎవరున్నారు.
అని అనుకుంటూ ఆమె పేరు ఏం చెప్పింది.
ఇంతలో కూతురు అక్కడికి వచ్చి…..ఆమె పేరు ఏదో చెప్పింది నాన్న కానీ నాకు గుర్తులేదు. కానీ ఆమె చాలా మంచిది నాన్న చాలా సేపు కబుర్లు చెప్పింది.అని అంటుంది అందుకే అతను చాలా ఆశ్చర్య పోతూ ఉంటాడు అలా రోజులు గడిచాయి. ఇంట్లో ఉన్న సామాను వాడుతున్నప్పటికీ అవి మాత్రం ఆ రోజు తరిగిపోయినా ఆ మరుసటి రోజు మళ్లీ తిరిగి ఎలా స్థానానికి వస్తాయి.దాన్ని చూసిన వాళ్లు కూడా చాలా ఆశ్చర్యపోతారు వచ్చిన ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. అలా ఉండగా దీపావళి పండుగ వచ్చింది. సోమయ్య ఎప్పటిలాగే తన కొలువుకి వెళ్ళాడు. ఆరోజు జమిందారు అతనితో….ఏరా దీపావళి పండుగ వచ్చింది గా మరి ఇంటిముందు టపాసులు పేలుస్తవ.
అందుకు అతను…. మాలాంటి వాళ్ళకి పండగ ఎందుకు సామి. ఒక దీపం వెలిగించి కుంనామ్మ ఆ లక్ష్మీదేవి పూజ చేసుకున్నామ అంతే అదే పండగ.
అందుకు అతను…బాగా చెప్పావు నీ లాంటి వాళ్లకు పండగ ఎందుకు రా మాలాంటి డబ్బున్న వాళ్ళకు పండగ అంటే ఒక పూట అన్నం గతి ఉండదు కానీ టపాసులు తెచ్చి ఎలా పేలుస్తారు. అంతేలే. సర్లే పో పో అని అంటాడు సాయంత్రం కావడంతో అతను అక్కడ పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తాడు.అప్పుడు చాలా మంది బయట రోడ్లమీద టపాసులు పేలుస్తూ చాలా ఆనందంగా కనపడుతూ ఉంటారు అతను దాన్ని చూసి చాలా బాధపడుతూ తన ఇంటికి వెళ్లి బాధపడుతూ….. చి చి ఈ పేదరికంలో బ్రతకడం కంటే చావడం నయం.అసలు నా కుటుంబానికి నేనంటే ఏమీ చేయలేదు కనీసం అందరు బయట దీపావళి రోజున టపాసులు
పేలుస్తున్నారు కానీ మన జీవితంలో అలాంటివి ఏమీ లేవు. అంటూ ఉండగా అతని భార్య కూతురు ఇద్దరు వచ్చి…. నాన్న ఈ పట్టుబట్టలు ఎలా ఉన్నాయి.
ఇదిగో చూడు నాన్నా ఎన్ని టపాసులు ఉన్నాయో.
అందుకే అతను వాళ్ళ వైపు చూస్తూ….. అసలు ఇవన్నీ మీకు ఎవరు ఇస్తున్నారు మళ్లీ ఆమె వచ్చిందా అసలు ఆమె ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది. ముందు వాటిని బయటపడేయండి అంటూ వాటిని బయటకు విసురుతాడు. అప్పుడే అక్కడ ఉన్న దీపం లో నుంచి లక్ష్మీ దేవి ప్రత్యక్షమయ్యి…..సోమయ్య ఎందుకని అలా ఉన్నావు నేనే మీ అమ్మని లక్ష్మీదేవి అమ్మని. నువ్వు అమ్మ అని నన్ను పిలిచి ఉంటావు కదా నేనే కదా మరి ఇవన్నీ ఇచ్చింది.
అని అంటుంది లక్ష్మీదేవిని చూసిన వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతూ ఆమెకు నమస్కరిస్తూ…. అమ్మ ఇదంతా నీ వల్లే జరిగింది అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి.
లక్ష్మీదేవి… చూడు సోమయ్య నీ మనసు చాలా మంచిది ఆ రోజు డబ్బు పోయిందని ఒక ఆమె నీ దగ్గరికి వచ్చింది కదా అది ఎవరో కాదు నేనే నేను పరీక్షించడం కోసం అలా చేశాను. ఆరోజు నువ్వు నేను పెట్టిన పరీక్షలో నైగావు. ఆ తరువాత ఉంగరం పేరుతో మళ్లీ నీ దగ్గరికి వచ్చాను దాన్లో కూడా నీ దే పై చేయి అందుకే నీ మంచితనానికి మెచ్చి ఇదంతా చేస్తున్నాను. అని అంటుంది. ఇంతలో ఆమె అక్కడి నుంచి మాయమైపోయి ఆ జమీందారీ ఇంట్లో ప్రత్యక్షమవుతుంది. జమీందారు లక్ష్మీ దేవిని చూసి చాలా సంతోషపడుతూ ఆమెకి నమస్కరిస్తాడు ఆమె… నీ లాంటి కఠిన హృదయం కల వాళ్లకి ఇంత డబ్బు అవసరం లేదు. నువ్వు కటిక పేదరికం లో బ్రతికి డబ్బు విలువ తెలుసుకోవాలి ఆకలి విలువ తెలుసుకోవాలి నేను నిన్ను శపిస్తున్నాను.
అని అంటుంది ఆ మాటలు విన్న అతను చాలా కంగారు పడుతూ…. అమ్మ తల్లి నన్ను క్షమించు నా వల్ల ఎన్నో పొరపాట్లు జరిగాయి అది నాకు కూడా తెలుసు కానీ ఇకమీదట ఎప్పుడూ అలా చేయను. అని అంటాడు కానీ లక్ష్మీదేవి….నీకు ఒకసారి బుద్ధి రావాల్సిందే నువ్వు కూడా పేదరికం అనుభవించు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వెంటనే అతను ఇల్లు చిన్న పూరి గుడిసె లాగా మారిపోతుంది.
సోమయ్య ఇల్లు పెద్దగా ధనవంతులు కుటుంబం లాగా మారిపోతుంది. దాన్ని చూసి వాళ్లు చాలా సంతోష పడుతూ లక్ష్మీదేవికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
ఆ జమీందారు చాలా బాధపడుతూ ఉంటాడు అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు అతను ఆకలితో అల్లాడి పోతు.
సోమయ్య ఇంటికి వెళ్తాడు. అతను చాలా ఆకలితో సోమయ్య దగ్గరకు వెళ్లి…. సోమయ్య నన్ను క్షమించు లక్ష్మీదేవి నా కళ్లు తెరిపించింది పేదరికంలోకి నన్ను నెట్టివేసింది.
నాకు నిన్నటి నుంచి తిండి లేదు. దయచేసి కొంచెం అన్నం ఉంటే పెట్టవా అని జాలిగా అడుగుతాడు.
ఆ మాటలు విన్న సోమయ్య…. అయ్యా జమిందార్ గారు మీరు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు.మీరు ఒక మాట సెలవిస్తే అన్ని ముందుకు వచ్చేస్తాయి అంటూ భోజనం తీసుకువచ్చి అతనికి ఇస్తాడు అతను ఆవురావురు మంటూ తింటూ తనలో ….. ఒకప్పుడు నేను సోమయ్య ని ఒక్కపూట అన్నం లేకపోతే చచ్చి పోతారా అని తిట్టాను కానీ అది ఎంత తప్పు నాకు ఇప్పుడు అర్థం అయింది అంటూ భోరున ఏడుస్తూ. అతనికి క్షమాపణ కోరుకున్నాడు.
అప్పుడే లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి….. చూసావా ఒక్క రోజు అన్నం లేకపోతే నువ్వు ఎలాగ అల్లాడిపోతున్నారు అలాంటి పేద బ్రతుకులు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకి సోమయ్య. అలాంటి వాళ్లకు సహాయం చేయాల్సింది పోయి ఎన్నో మాటలు అవమానంతో వాళ్ల మనసుని గాయపరచావు ఇప్పుడు కైనా బుద్ధి తెచ్చుకో.
అందుకు జమీందారు… ఒక్కరోజులోనే బుద్ధి వచ్చిందమ్మా. ఇకమీదట నావల్ల ఎవరికీ అపాయం ఉండదు తప్పు జరగదు. దయచేసి నన్ను క్షమించు అమ్మ. అని అంటుంది అందుకు లక్ష్మీదేవి అతనిని క్షమించి అతన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొస్తుంది.
దాన్ని చూసి అతను చాలా సంతోష పడతాడు.
లక్ష్మీదేవి…. చూడండి మీరు ఉన్నదానితో తృప్తి పడుతూ లేని వాళ్ళకి సహాయం చేస్తూ సంతోషంగా బతకండి అప్పుడే మీకు మీ కుటుంబాలకు మంచి జరుగుతుంది.
అని వారిని దీవించి అక్కడినుంచి మాయమైపోతుంది.
ఆ రోజు నుంచీ జమీందారు మరియు సోమయ్య ఇద్దరు పేద వాళ్లకి వాళ్లకి తోచిన సహాయం చేస్తూ ఉంటాడు జమీందారు పూర్తిగా తన బుద్ధిని మార్చుకొని .అడిగిన వాళ్ళకి లేదు కాదు అనుకుంటా సహాయం చేస్తూ జీవితాన్ని గడుపుతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *