లాక్డౌన్ పేదల ఆక్సిజన్ కష్టాలు|Telugu Stories |Telugu Kathalu | Bedtime Stories|Panchatantra kathalu

దేవేంద్ర మన గ్రామంలో దేవయ్య శారద అనే దంపతులు ఉండేవాళ్ళు అతని కొడుకు పేరు శ్యామ్ వాళ్ళు ముగ్గురు పొలం పని చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉండేవాడు. అలా ఉండగా కొన్ని రోజులు అక్కడ ఏ పని త్వరగా వాళ్ళు . పట్టణానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ శారదకు ఊరిని విడిచి పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు . శారదా …. ఏవండీ ఇక్కడ అయిన వాళ్ళని బంధువుల ని వదిలిపెట్టి ఎలా వెళ్తాము. మన ఈ గడ్డమీద పుట్టాము ఈ గడ్డమీద మరణిస్తాము. కష్టమో నష్టమో ఇక్కడ ఇంకో పని ఏదన్న చేసుకొని ఉందా మండి అందుకు భర్త …. అబ్బా నీకు ఎన్ని సార్లు చెప్పాలి . ఇక్కడే ఉంటే మనం తిండికి అల్లాడే చచ్చిపోవాలనిపిస్తుంది . పట్నం వెళ్లి సంపాదించుకొని కావాలంటే మళ్ళీ తిరిగి అక్కడికే వద్దాం లే . అని అంటాడు అందుకు ఆమె ఏం మాట్లాడకుండా సరే అంటుంది కొన్ని రోజులు ఈ ముగ్గురు కలిసి పట్టణం వెళ్లిపోతారు. అక్కడ ముగ్గురు పని చేసుకుంటూ ఉంటారు. శ్యామ్ చిన్న పిల్లవాడు అయినా చాలా తెలివైన వాడు పని బాగా చేస్తాడు. అలా వాళ్ళు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని. అక్కడే ఉంటారు కానీ శారద మనసు మొత్తం ఊరు మీద ఉంటుంది ఆమె ఒక రోజు ఒంటరిగా కూర్చుని బాధపడుతుండగా భర్త … ఏమైంది శారదా దేని గురించి ఆలోచిస్తున్నావు.
ఆమె…. ఏం లేదండి ఊళ్ళో అయితే ఈ సమయానికి అందరూ ఒకచోట కూర్చొని కష్టసుఖాలు ఆ ముచట్లు ఈ ముచట్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది చాలా కష్టమైపోయింది. ఈ పట్టణం లో ఎవరికి వారే యమునా తీరే . మనిషికి మనిషికి పొంతనే ఉండదు ఇరుగుపొరుగు అన్నా ఇది కూడా లేదు ఎవరు ఎవరితో మాట్లాడరు ఎవరు ఎవర్ని పట్టించుకోరు.
అతను…. పట్నం అంటే అంతే ఉంటుంది మరి. అంటాడు కొన్ని రోజులు గడిచాయి .
కొత్త వ్యాధి కారణంగా అక్కడ లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండి పోతారు.
రోజులు గడిచాయి అనుకోకుండా భార్యకు వ్యాధి సోకి మంచాన పడుతుంది. భర్త…. ఏమైంది శారద అలా దగ్గు తున్నావు అని అడుగుతాడు అందుకు ఆమె…. రెండు రోజుల నుంచి జ్వరం తలనొప్పిగా ఉంది అండి హాస్పిటల్ కి వెళ్దాం పదండి నాకెందుకు ఇక్కడ వుక్క పోసుకున్నట్టు ఉంది గాలి ఆడటం లేదు. అంటూ శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతోంది.
అతను కొడుకుతో…. బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళకు ఇక్కడే ఉండు నేను అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తాను. అని ఆమెను హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు . హాస్పిటల్ ముందు చాలామంది ఉంటారు. మరణించిన వాళ్లు శవాలు కనబడతాయి. బంధువులు ఆ శవాల కి దూరంగా ఉండి ఏడుస్తూ ఉంటారు అతనికి అక్కడ ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు అతను హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి …. డాక్టర్ గారు నా భార్య ని ఒకసారి చూడండి . ఆమె దగ్గుతూ ఉంది ఊపిరి ఆడడం లేదు అంటుంది చూడండి.
డాక్టర్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను పరీక్షిస్తాడు … ఇది కొత్త వ్యాధి ఈ వ్యాధి వల్ల అందరూ చనిపోతున్నారు . హాస్పిటల్లో బెడ్ లేవో ఆక్సిజన్ చలి తక్కువగా ఉన్నాయి ఒకసారి చూడండి ఒక్క ఆక్సిజన్ నీ ఇద్దరికీ పెట్టాల్సి వస్తుంది ఇలా ఏ హాస్పిటల్ లో చూసి ఉండరు అని అంటాడు ఇంతలో ఆమె ఆయాసపడుతూ …. ఏమండీ నాకు అర్ధమైపోయింది నేను బ్రతకను . ఒకవేళ నేను చనిపోతే నన్ను ఊరికి తీసుకు వెళ్ళండి . నా చివరి కోరిక అదే నేను పుట్టిన మట్టిలోనే నన్ను కలిపేయండి . అంటూ ఎంతో బాధపడుతూ దగ్గుతూ కన్ను ముస్తుంది.
దాన్ని చూసి అతను భోరున ఏడుస్తూ ఉంటాడు. ఇక అతను ఆమె సెవెము నీ ఇంటికి తీసుకెళ్తాడు . బిడ్డ తల్లి మరణం చూసి పెద్దగా ఏడుస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్లంతా వాళ్ళ దగ్గరికి కూడా రాకుండా . దూరంగా నిలబడి చూస్తూ ఉంటారు.
ఇంతలో ఆ ఇంటి యజమాని దూరంగా నిలబడి…. ముందు ఆ శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అద్దె ఇళ్లలో శవాల్ని ఉంచకూడదు. పైగా వ్యాధి వచ్చి చనిపోయిన మనిషి . ఆ వ్యాధి నలుగురు కి అంటుతుంది అని అంటాడు అందుకు అతను ఏడుస్తూ…. బాబు అలా అనకండి ఈ సమయంలో నేను ఎక్కడికి వెళ్ళగలను చెప్పండి.
యజమాని… అదంతా నాకు తెలియదు ముందు వెళ్ళిపొండి .
అప్పుడు అతను అతని భార్య శవాన్ని చేతులతో పట్టుకొని తీసుకెళ్తాడు . అతను తన మనసులో చాలా బాధపడుతూ…. ఎలాంటి రోగాన్ని సృష్టించావు భగవంతుడా మనిషి చచ్చిపోతే . చివరి చూపు చూడడానికి ఎంతో మంది వచ్చే వాళ్ళు కానీ చివరి చూపు లేకుండా . చేశావు మనుషుల్లో మానవత్వం ఉన్నప్పటికీ . దాన్ని నువ్వు వ్యాధి పేరుతో చంపేసావు ఇది న్యాయమేనా అంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు. అతను కొంచెం దూరం వెళ్ళిన తరువాత అతనికి ఒక రోడ్డు మీద తోపుడు బండి కనపడుతుంది . అతను ఆమె శవాన్ని తోపుడు బండి పై పడుకోబెట్టి తాడుతో తీసుకెళ్తూ ఉంటాడు.
మార్గ మధ్యలో ఒక పోలీస్ అధికారి అతన్ని చూసి….. ఏంటి ఈ శవం ఎక్కడికి తీసుకెళ్తున్నారు.
అతను…. నా భార్య బాబు . అదే ఇంట్లో ఉంచకూడదు అన్నారు . పైగా నా భార్య చివరి కోరిక తన ఊర్లోనే ఆమెను దహనం చేయమని అందుకే అక్కడికి తీసుకెళ్తున్నాను అంటూ ఎంతో బాధగా చెప్తాడు.
పోలీస్ అధికారి చాలా బాధపడుతూ….. ఏ ఊరు మీది.
అతను…. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాన్ని విన్న పోలీసు అధికారి చాలా ఆశ్చర్యపోతూ….. అంత దూరం ఎలా తీసుకెళ్తావ్.
ఇక్కడే ఉండు నేను ఏదైనా బండి మాట్లాడతాను అని వేరే వాళ్ళకి కాల్ చేస్తారు ఇంతలో ఒక కారు వస్తుంది అతను ఆ కారులో కూర్చుంటాడు ఆ పోలీసు అధికారి కూడా ఆ కారులో కూర్చుంటాడు ఇక అందరూ కలిసి ఆ ఊరికి వెళ్తారు కొత్త వ్యాధి కారణంగా చుట్టుపక్కల వాళ్ళు ఆమె దగ్గరికి రావడానికి భయపడతారు దూరంగా ఉండి అందరూ చాలా బాధపడుతూ ఉంటారు.
ఆ తర్వాత ఆ పోలీస్ అధికారి తన కుమారుడు భర్త ముగ్గురు కలిసి ఆమెను దహనం చేస్తారు.
అతను చాలా బాధపడుతూ పోలీసు అధికారితో … బాబు నీ వల్ల నా భార్య చివరి కోరిక తీరింది. నీకు చాలా కృతజ్ఞతలు అంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు పోలీస్ అధికారి కంటతడి పెట్టుకుంటూ ….. ఏంటో ఈ బాధలు నా భార్య కూడా కొత్త వ్యాధి కారణంగానే చనిపోయింది చివరి చూపు కూడా చూసుకోలేక పోయాను . నాకు ఒక ఆడ బిడ్డ తల్లి ఉంటేగాని తినదు ఆమె జోల పాడి బుజ్జగించి మరీ తినిపించాలి . ఇప్పుడు నా మాటలు వినటం లేదు. అమ్మ కావాలి అమ్మ కావాలి అంటూ ఏడుస్తుంది . మీ అమ్మ చనిపోయింది నేను ఎలా చెప్పగలను. అంటూ ఎంతగానో బాధ పడతాడు.
అప్పుడు అతను పోలీసు అధికారికి …. బాబు గారు బాధపడకండి. మీరే ధైర్యంగా ఉండి ఆ పాపకు తల్లి తండ్రి లాగ మారి జాగ్రత్తగా చూసుకోండి .
అని అంటాడు. ఆ పోలీసు అధికారి చాలా బాధపడుతూ సరే అంటాడు .
ఇంతలో ఆ వ్యక్తి ఒక్కసారిగా కిందపడిపోయి. గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడో తను చూసిన పోలీస్ అధికారి కి ఏం జరిగిందో అర్థం కాదు అతన్ని లేపడానికి ప్రయత్నిస్తాడు.
వెంటనే హాస్పిటల్కు తీసుకు వెల్తాడు .
అక్కడ అతన్ని లోపలికి తీసుకు వెళ్తుంది డాక్టరమ్మ . కొంత సమయం తర్వాత ఆమె బయటకు వస్తుంది. పోలీస్ అధికారి ఆమెతో.. డాక్టర్ గారు అతనికి ఎలా ఉంది.
ఆమె … సార్ మమ్మల్ని క్షమించాలి అతను మార్గమధ్యంలోనే చనిపోయాడు.
గుండెపోటు కారణంగానే చనిపోయాడు.
ఇలాంటి కేసులు నేను చాలా తక్కువ చూశాను. వాళ్లు ఈ పోయింది కొన్ని గంటలనుంచి అనుభవిస్తూ ఉంటారు. కానీ పైకి మాత్రం అది కనపడదు. ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు అతను భరించలేని దృశ్యం తన కంట పడినప్పుడు ఇలాంటివి జరుగుతాయి . అని అంటుంది అందుకు అతను జరిగిన విషయం అంతా చెబుతాడు. అందుకు డాక్టర్ చాలా బాధపడుతూ మనం ఏమి చేయలేము అని చెప్పి …. శవాన్ని తీసుకు వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
ఇంతలో బాబు…. నాన్న మా నాన్న కి ఏమైంది. నాన్న ఒకసారి లేl నాన్న ఒక్కసారి లే నాన్న అటు పెద్దగా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఆ పోలీస్ అధికారి …. ఊరుకో బాబు ఇక నీకు నేనే తల్లి తండ్రి అని చెప్పి తర్వాత జరగాల్సిన కార్యక్రమం అంతా జరిపి చేస్తాడు ఆ తరువాత పోలీసు అధికారి ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళతాడు . అక్కడ ఒక చిన్న పాప ఉంటుంది. ఆమె ఆ పోలీసు అధికారి కూతురు.
పోలీస్ అధికారి ఆమెతో…. పాపా చూడు ఎవరొచ్చారో మీ అన్నయ్య. మీ అన్నయ్య ఎప్పుడు నీతోనే ఉంటాడు నీ తోనే ఆడుకుంటాడు . ఇప్పుడు నీకు ఎవరు తోడు లేరని బాధపడొద్దు . నేను చెప్పినట్టు వింటావు కదా . అందుకు ఆమె సరే అంటుంది వాళ్ళిద్దరు అక్కడ ఆడుకుంటూ సంతోషంగా ఉంటారు . అతను డ్యూటీ మీద వెళ్ళి ఇంటికి తిరిగి వస్తాడు ఒక రోజు అతను పెంపుడు కొడుకు తో… చూడు బాబు నువ్వు నాకు మాట ఇస్తావా.
అతను … ఏమిటి నాన్న చెప్పండి .
పోలీస్ అధికారి….. నేను ఉన్నా లేకపోయినా మీ చెల్లిని బాగా చూసుకుంటూ ఉండు. ఆమెకు ఎలాంటి బాధ కలగకుండా చూసుకుంటానని మాట ఇవ్వు .
అతను…. నాన్న ఏమైంది మీరు అలా మాట్లాడుతున్నారు నాకు చాలా భయంగా ఉంది.
అతను…. బయట పరిస్థితి బాగోలేదు బాబు ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కావడం లేదు . నేను ప్రతి సారి బయట తిరిగి ఇక్కడికి రావడం నాకు నచ్చలేదు. నా వల్ల ఆ వ్యాధి మీకు అంటుందేమో భయంగా ఉంది కొన్ని రోజులు నేను మీకు దూరంగా ఉంటాను అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను . ఈ ఫోను దగ్గర పెట్టుకో అని ఫోను ఇస్తాడు.
అందుకు అతను సరే అంటాడు రోజులు గడిచాయి పోలీసు అధికారి ఆరోగ్యం బాగోక హాస్పిటల్లో చేరుతాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి కొత్త వ్యాధి అని చెప్తుంది అతను చాలా భయపడతాడు తన మనసులో….. భగవంతుడా ఒకవేళ నేను మరణిస్తే నా బిడ్డలు ఇద్దర్నీ జాగ్రత్తగా చూసుకో. అని అని దేవుని ప్రార్థిస్తాడు డాక్టర్ ….. సార్ మీకు ఏమీ కాదు . ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెబుతుంది . కొన్ని రోజులు అతను అక్కడే ఉంటాడు . అతని ఆరోగ్యం కుదుటపడుతుంది అతను…. డాక్టర్ ఇప్పుడు నా ఆరోగ్యం బానే ఉంది ఇక నేను డ్యూటీ కి వెళ్తాను.
డాక్టర్…. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోండి అప్పుడే డ్యూటీ కి వెళ్ళవద్దు.
అతను…. నా విధులు నేను సక్రమంగా నిర్వర్తించాలి మేడం . ఇప్పుడు మీరు మీ కుటుంబాన్ని విడిచి పెట్టి ఎక్కడ రోగులకు ఎంత సేవ చేస్తున్నారో మేము కూడా అలాగే సేవ చేసి . కనపడని శత్రువుతో పోరాడాలి అని అంటాడు అందుకు ఆమె సరే అంటుంది. ఈ కథను తన డ్యూటీని చేసుకుంటూ. సాయంత్రం తన బిడ్డల కి ఫోన్ చేసి మాట్లాడుతూ తనలో తానే సంతోష పడుతూ ఉంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *