వడపావ్ అమ్మే దెయ్యం | Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories | Horror Stories

అది భూగర్భ పురమని ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో విష్ణు అనే ఒక వ్యక్తి ఉండేవాడు . అతను రైల్వే స్టేషన్ లో రొట్టెలు సమోసాలు అమ్మ తో తన భార్య శాంతి కూతురు శోభని బాగా చూసుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి అనుకోకుండా ఒక రోజు రైల్వే దిగేటప్పుడు ప్రమాదం జరిగింది . రైలు కిందపడి అతను చనిపోతాడు. భార్య శాంతి బిడ్డ శోభ ఇద్దరు కూడా . ఎంతో ఏడుస్తూ ఉంటారు. ఇక తరువాత జరగవలసిన కార్యక్రమం పూర్తయిపోతుంది. ఇక ఇల్లు గడవడం కోసం రొట్టెలు సమోసాలో ఆ బిడ్డను ఎత్తుకుని
రైల్వే స్టేషన్ లో శాంతి అమ్ముకుంటూ ఉంటుంది.
అలా రోజులు గడిచాయి . తన వ్యాపారం బాగానే సాగుతూ ఉంటుంది. ఒక రోజు ఆమె వ్యాపారం చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుని ఉంటుంది. ఉన్నట్టుండి పాపకి జ్వరం తగిలినట్టుగా అనిపిస్తుంది. తల్లి కంగారు పడిపోతూ….. అయ్యో
జ్వరం తగ్గిందా అమ్మ. బిల్లు వేసుకో అని చెప్పి ఆమె కు మందులు వేసి చాలా సేపు అక్కడే ఉంటుంది.
కొంత సమయం తర్వాత….. పాపా నేను కాసేపట్లో వీటిని. అమ్ముకొని తిరిగి వచ్చేస్తాను . జాగ్రత్తగా ఉండు అమ్మ ఈరోజు డబ్బులు వస్తాయి కదా నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను. నిన్నే ఇంటిలోకి సరుకులు తెచ్చాము కదా. నిన్నే ఇంటి అద్దె కూడా ఇచ్చేశాము అందుకే చేతిలో డబ్బులు లేవు. ఇప్పుడు వ్యాపారం చేస్తే కానీ డబ్బులు చేతిలో ఉండవు. నువ్వు జాగ్రత్త నేను ఇప్పుడే వచ్చేస్తాను. అని చెప్పి తన వ్యాపారానికి వెళ్ళిపోతుంది . చాలా సమయం వరకు ఆ తల్లి రైల్వే స్టేషన్లో తన వ్యాపారం చేస్తూనే ఉంటుంది ఆ రోజు వ్యాపారం చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువ సమయము ఉండాల్సి వస్తుంది. ఇక సాయంత్రం సమయం కావడంతో ఆమె వచ్చిందానితో . సంతోష పడుతూ ఇంటికి చేరుకుంటుంది. ఇంటి దగ్గర పాప నిద్ర పోతూ ఉంటుంది. ఆమె ….. పాపా నేను చేశాను అమ్మా నిద్ర లే పాప నేను వచ్చేసాను అమ్మ నిద్ర లే. అంటూ పాప నిద్ర వస్తుంది పాప నిద్ర నుంచి లేచి ఆమె వైపు చూసి …… అమో దెయ్యం నన్ను ఏమీ చెయ్యొద్దు అమ్మో దెయ్యం నన్నేం చెయ్యొద్దు. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది తల్లి….. ఏమైంది పాపా ఏమైంది . నేను అమ్మ మీ అమ్మని నా వైపు చూడు
అంటూ మాట్లాడుతూ ఉంటుంది పాప చాలా భయపడుతూ….. నువ్వు మా అమ్మ వి కాదు . నువ్వు ఒక దెయ్యానివి. దయచేసి నన్ను ఏం చేయలేదు వెళ్ళిపోయి ఇక్కడినుంచి. అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. తల్లి పదే పదే చెప్పినా కూడా పాప అలాగే మాట్లాడుతూ ఉంటుంది తల్లికి ఏమయింది అనేది ఏమీ అర్థం కాదు తల్లి ఒకసారి తన రూపాన్ని అద్దంలో చూసుకుంటుంది.
ఆమె నిజంగానే దెయ్యం. ఆమె తన రూపాన్ని చూసి తానే భయపడుతూ….. ఓరి భగవంతుడా ఇదేం కర్మ. ఏం జరిగింది నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఓరి భగవంతుడా అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది.
ఆమె ఒక్క నిమిషం నిలబడి అసలు ఏం జరిగిందో
ఆలోచిస్తూ పరుగులు తీస్తూ రైల్వే స్టేషన్ కి వెళుతుంది. రైల్వే స్టేషన్ ట్రాక్ మీద ఆమె శవం పడి ఉంటుంది. అందరూ కూడా చుట్టుముడతారు.
ఆమె ఏడుస్తూ….. నేను చనిపోయాను ఏం జరిగింది మీరు నా కూతురు గురించి ఆలోచనలో ఉన్నాను దిగేటప్పుడు ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ. కొద్ది గంటలు కాలం వెనక్కి వెళ్తుంది.
ఆమె సరిగ్గా తన కూతురు గురించి ఆలోచిస్తూ తన మనసులో…… డబ్బులు వస్తే నా కూతురని హాస్పిటల్ తీసుకెళ్ళులనుకున్నాను. కానీ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. నా కూతురు ఇంటి దగ్గర ఎలా ఉందో ఏమో నాకు భయమేస్తుంది అంటూ. ఆలోచనలోనే ఉండి పోయి రైలు ఆగింది అని అనుకొని కూతురి మీద ఉన్న ధ్యాస తో అలాగే రైలు నుంచి దూకేస్తుంది. ఆమె అతడు కూడా రైలు దిగింది అనుకుంటుంది అప్పటికే మరణించి
దెయ్యం గా మారి తన కూతురు దగ్గరికి వెళ్ళింది. ఇదంతా కళ్లకు కట్టినట్టు ఆమె కి కనిపించడంతో.
ఆమె పెద్దగా ఏడుస్తూ….. నేను ఇప్పుడు ఏం చేయాలి. భగవంతుడు నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ ఏడుస్తూ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుంది.
ఇంటి దగ్గర తన కూతురు మళ్లీ దెయ్యాన్ని చూసి…. మళ్లీ ఎందుకు వచ్చావ. మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ ఏడుస్తుంది దెయ్యం తల్లి… నేను నిజంగా మీ అమ్మని . నా మాట నమ్ము అంటూ ఏడుస్తూ పాపను బ్రతిమిలాడు తుంది .ఇక పాప పదేపదే భయపడటంతో దెయ్యం తల్లి…. సరే పాపా నేను చెప్పింది నిజమా అబద్దమా నీకే తెలుస్తుంది రైల్వే స్టేషన్ కి వెళ్ళు అక్కడ నా సేవము ఉంటుంది ఆ తర్వాత చెప్పు నేను మీ అమ్మనో కాదో. అంటూ ఏడుస్తూ చెబుతుంది పాప ఏడుస్తూ చాలా భయపడుతూ…. ఆ దెయ్యం చెప్పిన మాటలు నిజం కాకూడదు మా అమ్మ బ్రతికే ఉండాలి.
భగవంతుడా మా అమ్మ ఏం కాకూడదు .
అంటూ ఏడుస్తూ రైల్వే స్టేషన్ కి బయల్దేరుతుంది దెయ్యం తల్లి కూడా ఆమెకు తెలియకుండా ఆమె వెనకాలే వస్తుంది.
రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ నిజంగానే ఆమె తల్లి శవం అక్కడ ఉంటుంది దాన్ని చూసి ఏడుస్తూ….. అమ్మ నాకు భయంగా ఉంది లేమ్మా. అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు దయ్యం తల్లి అక్కడికి వచ్చి….. అమ్మా శోభా నేను ఇక్కడే ఉన్నాను. నిజంగా నేను మీ అమ్మను నీ కోసమే వచ్చాను. నీ తల్లిని నేను అంటే ఏడుస్తూ ఉంటుంది.
పాపను పట్టుకుని ఏడుస్తూ….. అమ్మ నన్ను క్షమించు అమ్మ నువ్వు నా కోసం వచ్చావు కదా.
నాకు చాలా బాధగా ఉంది అమ్మ. భగవంతుడా
అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది తల్లి ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకు వెళుతుంది.
ఆ తల్లి పాపని చూసుకుంటూ అక్కడే ఉంటుంది .
ఇక తన పాపని బ్రతికించడం కోసం తను మళ్లీ వ్యాపారం చేయాలని అనుకుంటోంది.
ఏ రూపంలో ఉండే అయినా సరే తన వ్యాపారం కొనసాగించాలని అనుకుంటుంది.
ఇక ఆమె పాపను తీసుకుని ఒక మూసుకుని వేసుకుని. రైల్వే స్టేషన్లో తన ముఖం ఎవరికీ కనపడకుండా. ఆమె ఒక దెయ్యం అని ఎవరికీ తెలియకుండా…… వేడివేడి సమోసా బాబు వేడివేడి రొట్టెలు. వేడివేడి సమోసా బాబు వేడివేడి రొట్టెలు బాబు అని అని అమ్ముకుంటూ. ఆ డబ్బుతో తన
పాప అవసరాలు తీరుస్తూ ఉంటుంది.
కానీ తన తల్లి మనసులో….. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పుడైతే నేను బాగానే ఒకరకంగా ఎవరికీ కనపడకుండా వ్యాపారం చేస్తున్నాను కానీ ఏదో ఒక రోజు నేను దయ్యాన్ని అని తెలిస్తే.
ఏమవుతుందో అని భయ పడుతూ ఉంటుంది రోజులు గడిచాయి. ఆమె అనుకున్నట్టుగానే ఒకరోజు గాలికి తన పైట చెంగు పక్కకు వెళ్ళిపోతుంది.
ఒక వ్యక్తి ఆమెను చూస్తాడు. దెయ్యం దెయ్యం అంటూ అరుస్తూ ఉంటాడు.
కానీ రైల్వే అనౌన్స్మెంట్ శబ్దం వల్ల అది ఎవరికి వినపడదు కానీ ఆదాయం తల్లికి అర్థం అవుతుంది ఆమె వెంటనే అక్కడికి వెళ్లి…. దయచేసి అరవకండి నేను ఎవరికీ హాని చేయడం లేదు. నా కూతుర్ని పెంచుకోవడం కోసం నేను ఇలా చేస్తున్నాను నేను.
చనిపోయాను అంటూ జరిగిన విషయం అంతా చెప్పి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది.
ఆ మాటలు విన్న అతను కూడా చాలా బాధపడుతూ…. ఒక తల్లి ప్రేమ ఎలాంటిదో మీరు నిరూపించారు. నేను ఇక్కడ స్టేషన్ మాస్టర్ని
మీరు ఎలాంటి భయం లేకుండా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని అంటారు ఆ మాటలకు అమీ చాలా చాలా సంతోషపడుతుంది.
ఆ మరుసటి రోజు అందరికీ ఒక ఎనౌన్స్మెంట్ జరుగుతుంది. విచిత్ర దెయ్యం వేషంలో ఒక ఆమె
వ్యాపారం చేస్తూ ఉంటుంది అని. ఆమెకు మీరు సహాయం చేయండి ఆమె దగ్గర వాటిని తీసుకొని డబ్బులు ఇవ్వండి . ఆమె చాలా పేద కుటుంబం నుంచి ఈ వ్యాపారం చేసుకుంటూ ఉంది.
అని చెప్పడంతో ఆమె మనసు చాలా ఊరట కలుగుతుంది. అందరూ ఆమె నిజమైన దయ్యం అనుకోకుండా వేషం వేసుకున్నది అనుకొని
ఆమె దగ్గర కొనుగోలు చేస్తూ ఉంటారు. ఆమెకూడా అలాగే ప్రవర్తిస్తూ సంతోషంగా తన కూతుర్ని చూసుకుంటూ సంతోషంగా జీవిస్తుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *