వడ పావ్ అమ్మే పేద పిల్లలు Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

ఒక ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మతో పాటు ఉండేవారు, బాలు కీర్తి వాళ్ళ అమ్మ పేరు సుగుణ, పేరుకి తగినట్టే చాలా గుణవతి కూడా, అందరితో మర్యాదగా మాట్లాడేది, ఎవ్వరిని ఒక్కరిని కూడా నొప్పించి మాట్లాడేది కాదు, సుగుణ ఊరిలో ఏ పని దొరికినా వెళ్లి చేసుకొని కొన్ని డబ్బులు సంపాదించి పిల్లల కడుపు నింపడానికి ప్రయత్నించేది, పిల్లలు ఏది కావాలన్న ఎంత కష్టమైనా సరే అది వ్వాళ్ళకి ఇస్తూనే ఉండేది,  గడుస్తుంటాయి ఒకేరోజు సుగుణ పనికి పోతున్నప్పుడు తన స్నేహితురాలైన వీణ తనతో ఇలా అంటుంది.

వీణ : సుగుణ నువ్వు ఎంతో కష్టపడి రోజు కొంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, వాటిని దాచి పెట్టుకోక పిల్లలు ఏది అడిగితే అది కొన్నివ్వడమేనా? వాళ్ళు చిన్నపిల్లలు వాళ్లకి ఏమి తెలుసు నీ పరిస్థితి నువ్వు ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయని, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు పులిసిపోయేలా పని చేస్తే వస్తున్నాయి ఆ డబ్బులు అలా అంత కష్టపడినా డబ్బులని నువ్వు వృధాగా ఖర్చుచేస్తున్నావెందుకు అయినా పిల్లు ఏదైనా అనవసరమైనది అడిగితే నువ్వు చెప్పాల్సింది పోయి వాళ్ళు అడగడమే ఆలస్యం వెంటానే కొనివ్వడమేనా అని అంటుంది

సుగుణ : అలా మాట్లాడతావేంటి వీణ, వాళ్లకి నేను తప్ప ఎవరున్నారు చెప్పు వాళ్ళు చిన్నపిల్లలు, ఇప్ప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వాళ్ళు జీవితాన్ని అనుభవించేది, మన లాంటి పేదవాళ్ల కడుపున పుట్టడమేనా వాళ్ళు చేసిన తప్పు మన పేదరికాన్ని వాళ్ళ మీద రుద్దితే ఎలా? చూద్దాం ఆడుకున్నన్ని రోజులు ఆడుకొని తరువాత కొంత పెద్దయ్యాక వాళ్ళే బాధ్యతలు నేర్చుకుంటారు లే, బాలు గాడికి నేను చేసే వాడా పాప్ అంటే చాలా ఇష్టం ఈరోజు అవ్వి చేయమని అడిగాడు, సాయంత్రం ఇంటి నుంచి వెల్లగాఎం అవ్వి చేసి పెట్టాలి వాడికి  అని అంటుంది.

వీణ : ఆ ఆ చేసిపెట్టు చేసిపెట్టు ఇలా ఏడాదిగితే అది చేసి పెట్టి, కొనిచ్చి వాళ్ళని దేనికి పనికి రాణి వాళ్ళని చేస్తావా ఏంటి?

సుగుణ : అలా ఏమి అవ్వడులే కొన్ని రోజులు పోతే వాళ్ళకే అర్ధం అవుతుంది అని అంటుంది.

అలా కొని రోజులు గడిచిపోతాయి ఒక రోజు సుగుణ కి అనుకోకుండా జబ్బు చేస్తుంది, మంచం నుంచి లేవలేక పోతుంది,  ఇంతలో అక్కడికి వీణ వస్తూఉంది.

వీణని చూసిన బాలు వీణ దగ్గరికి పరిగెత్తి ఇలా అంటాడు.

బాలు : ఆంటీ మా అమ్మ మాకన్నా ఎక్కువ సమయం మీతోనే ఉండేది కద్దా ఎక్కడికి వెళ్లినా మీతోనే వచ్చేది, మా అమ్మకి ఇంత పెద్ద జబ్బున పడీతే మీరు కూడా చెప్పకపోవడం ఏంటి ఆంటీ మీరైనా చెప్పాల్సింది కదా అని అంటుంది.

వీణ : సరే కానీ డాక్టర్ వచ్చాడా వచ్చి ఏమన్నాడు, ఏవైనా మందులు రాసిచ్చాడా అని అంటుంది.

కీర్తి : ఏంటి మీరు మా తమ్ముడు అమ్మ గురించి అడిగితే మీరేమో డాక్టర్, మందులు అంటారు, మా అమ్మకి ఇంత పెద్ద జబ్బు ఉందని మాకు చెప్పాలి కదా అని గట్టిగా అరుస్తుంది కీర్తి.

కీర్తి మాటలకు కొమ్మా వచ్చిన వీణ గట్టిగా అరుస్తూ ఇలా అంటుంది.

వీణ : నన్ను చెప్పలేదు చెప్పలేదు అంటున్నారు, ఇంట్లో ఉంది మీరేం చేస్తున్నారు మీ అమ్మని పట్టించుకోవద్దం కూడా తెలియదా మీకు, ఎంత సేపు అమ్మని తినడానికి ఏమి తెమ్మనాలి, ఆదుకోవడానికి ఏమి తెమ్మనలి అని ఆలోచించడమే తప్ప అమ్మకి అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీ అమ్మ ఎప్పుడు మీ గురించే ఆలోచించాలి కానీ మీకు మీ అమ్మ గురించి అవసరం లేదు, తాను పొద్దంతా బాండ చాకిరి చేసి వచ్చి మల్లి మీకు సేవలు చెయ్యాలి, తాను అంత కష్టపడుతున్నా మీకు జాలి లేకుండా అది కావలి ఇది కావాలి కొండమీత కోతి కావాలి అని తనని వేపుకుతింటున్నారు, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అడిగినవన్నీ కొనివ్వాలని తాను కష్టపడి కష్టపడి ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంది అని అంటుంది.

బాలు : అవునా మా అమ్మకి ఈ పరిస్థితి రావడానికి మేమె కారణం, ఇన్ని రోజులు మా అమ్మ మాకోసం కష్టపడింది చాలు, ఇక నుంచి అమ్మకోసం మేము కష్టపడతాము అని అంటాడు.

కీర్తి : నాకొక ఐడియా వచ్చింది తమ్ముడు అమ్మ ని ఇంతటి తీయసుకెళ్లే వరకు మనం ఇక్కడే ఉంది అమ్మని ఇంటికి తీసుకొచ్చిన తరువాత తన దగ్గర వాడాపావ్ చేయడం నేర్చుకొని మనం వాటిని తీసుకెళ్లి ఊరి మధ్యలో కూర్చుని అమ్ముతుంటారు. ఊరి జనాలందరికి వాడాపాప్ కొత్తగా అనిపించడం తో అందరు అక్కడ వాడాపావ్ కొనడానికి ఎగబడుతూ ఉంటారు, కొన్ని రోజుల్లోనే బాలు కీత్ర్త్య్ ల వాడాపావ్ వ్యాపారం చాలా గొప్పగా సాగిపోతూ ఉంటుంది.

ఇంతలో ఒకరోజు అక్కడికి వీణ వస్తుంది.

బాలు కీర్తి వాడాపావ్ అమ్మడం చూసి ఇలా అంటుంది.

వీణ : చూడండి పిల్లలు మీ చేస్తున్న పని చాలా గొప్పది, ఎవరి దగ్గర పని చేయకుండా మీ అంతటా మీరే ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టారు దీంట్లో మంచిగా డబ్బులు సంపాదించి మీ అమ్మ వైద్య అవసరాలకు కొన్ని దాచిపెట్టండి, ఇక నుంచి అయినా ఏది కనిపిస్తే అది కొనడం ఆపేసి జాగ్రత్తగా ఉండడి, మీరు చేసే పనిలో ఉండవలసినది నాణ్యతలో నిజాయితీ , ప్రజలమీద  నమ్మకం ఈ రెండు విషయాలు సరిగ్గా పాటించి మీ వ్యాపారాన్ని అభివుద్ది పరచాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది.

అలా కొద్దీ రోజుల్లోనే ఊరి వాళ్ళందరి నమ్మకాన్ని సంపాదించి వ్యాపారాన్ని చాలా బాగా నడుపుకుంటూ వాళ్ళ అమ్మకి వైద్య అవసరాలకు డబ్బు అందిస్తూ ఉంటారు, కొన్ని రోజుల్లోనే బాలు కీర్తి వాళ్ళ అమ్మ ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది.

షార్ట్ స్టోరీ

బాలు కీర్తి తమ అమ్మ దగ్గర ఉండేవారు, తల్లి సంపాదించిన డబ్బులని ఆట వస్తువులని, తిండి కి అని చాలా డబ్బులు వృధా చేస్తుండేవారు, వాళ్ళ అమ్మ కూడా ఎంత కష్టమైనా పని అయినా చేస్తూ ఉండేది వాళ్ళ పిల్లల కోసం. అలా ఉండగా బాలు కీర్తి వాళ్ళ అమ్మ ఒకేరోజు జబ్బున పడుతుంది, ఆరోజు నుంచి బాలు కీర్తి వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా  వాడాపావ్ చేసి ఊరి మధ్యలో పెట్టుకొని అమ్ముతుంటారు, అలా డబ్బులు సంపాదించి వాళ్ళ అమ్మ ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చుపెడుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *