వరదల్లో చేపలు Fish in floods | Telugu Kathalu |Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

మా ఊరు మొత్తం వరద నీటితో నిండిపోయింది. బేబీ తన తల్లి వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద చెక్క మంచం పైన కూర్చుని నీటిలో తేలుతూ ఉంటారు. వాళ్లకు బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు ఎందుకంటే చిన్న చిన్న తుప్పర్లు పడుతూనే ఉంటాయి. ఇంతలో బేబీ …. అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది .
శాంతి….. ఏం చేయాలి అమ్మ అంతా నీట మునిగి పోయింది నాకు ఏమీ అర్థం కావట్లేదు చాలా బాధగా చెబుతుంది ఇంతలో ఆ నీటిలో ఏదో కదలికలు మొదలవుతాయి. ఆ ఇద్దరూ చాలా భయపడతారు తీరా చూస్తే అవి చేపలు. ఆ చేపలు చేసే శబ్దాలకు తల్లి కూతురు ఇద్దరూ చాలా భయపడిపోతారు.
అప్పుడే తల్లికి ఒక ఆలోచన వస్తుంది వాళ్లు కూర్చున్న మంచం మీద నుంచి నీటిలోనే మంచం నీ పడవల జరుపుకుంటూ వంటగదిలోకి వెళ్తారు. వంటగదిలో ఉన్న పొయ్యిని అక్కడ తేలుతున్న కొన్ని వస్తువుల్ని తీసుకొని మంచంపై పెడతారు.
తల్లి… బేబీ మనం చేపలు పడదాం . ఎటూ కదలకుండా చేపలు జాగ్రత్తగా పట్టు. అని అంటుంది ఎందుకు బేబీ సరే అంటుంది వాళ్ళిద్దరూ కలిసి చీర సహాయంతో చేపలుపడతారు. ఆ తర్వాత తల్లి వాటిని శుభ్రం చేసి వాటిని కాలుస్తుంది.
దాన్ని చూసి బేబీ …. అబ్బా నాకు చూస్తుంటే నోరూరిపోతుంది అమ్మ త్వరగా పెట్టు . అని అంటుంది ఇక ఇద్దరూ కలిసి ఆ చేపలు తింటే ఉంటారు కదా మూడు రోజులు వాళ్ళు కేవలం చేప మాంసం తినే వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు బేబీ…. అమ్మ చేపలు కూడా లేకపోతే మనం ఆకలితో అల్లాడి పోయేవాళ్ళం కదమ్మా ఈ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయో కానీ మన ఇద్దరి ఆకలి తీర్చి మనం బతికే లాగా చేస్తున్నాయి .
తల్లి ….అవునమ్మా నాకు తెలిసి మన చెరువులోని చేపలు వరద నీటికి కొట్టుకు వచ్చిన ఏమో అని అంటుంది . రెండు రోజుల తర్వాత వర్షం పూర్తిగా తగ్గిపోతుంది నీరు ఎక్కడి ఎక్కడివి కాలవలోకి చేరుకుంటాయి వీలైతే చేరుకున్నాయి కానీ వాళ్ళ ఇంట్లో చేపలు మాత్రం అలాగే తిరుగుతూ ఉంటాయి.
బేబీ మరియు ఆమె తల్లి ఇద్దరు కలిసి చేపలన్నీ ఒక పెద్ద బకెట్లో పట్టి ఉంచు తారు బేబీ…. ఎందుకమ్మ చేపలన్ని పట్టి ఇక్కడ ఉంటున్నావు .
ఆమె…. మన ఊర్లో ఉన్న చెరువు పాటకు వచ్చింది కదా అమ్మ మన ఊరు జమిందార్ కృష్ణయ్య ఈ పాట పాడుతున్నారు. చేపలన్ని ఇప్పటికే చాలా వెళ్ళిపోయాయి . ఇక అందులో నాకు తెలిసి ఇక మిగిలి ఏమీ ఉండవు. మన ఇంట్లోనే చాలా చేపలు ఉన్నాయి కాబట్టి ఎంతో కొంత డబ్బు కలిసివస్తుంది ఆయన నష్టపోకుండా ఉంటాడు. మనల్ని ఇన్ని రోజులు చేపలు కాపాడాయి కాబట్టి. ఆయన ఋణాన్ని ఇలా తీర్చుకుందాం .
అని అంటుంది అంటుంది ఆ చేపలను చాలా కష్టం మీద వాళ్లు చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ చెరువులో వాటిని వేస్తారు. అక్కడే ఉన్న జమిందార్ కృష్ణయ్య….. శాంతి ఏంటమ్మా ఇదంతా అని అడుగుతాడు శాంతి జరిగిన విషయమంతా చెబుతుంది.
కృష్ణయ్య …..హా హా అందరిలో ఇళ్లలోకి చేపలు వెళ్ళాయి. అందరూ చేపలు మాంసం తినే ఎన్ని రోజులు ఆకలి తీర్చుకున్నారు. నీళ్లు మొత్తం ఇంటికి పోయిన తర్వాత చేపల పట్టుకొని అందరు పట్టణాములో అమ్మడానికి వెళ్లారు. మీరు మాత్రం ఇలా చేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
బేబీ…. కృష్ణయ తాత మేము కూడా బతికి ఉన్నానంటే కేవలం మీ చెరువు చేపల ద్వారానే అందుకు కృతజ్ఞతగా మేము ఇలా చేసాము . అందరు గురించి మాకు అనవసరం కదా.
కృష్ణయ్య….. ఇప్పుడు ఉన్న పరిస్థితికి అందరికీ డబ్బులు కావాలి ఈ చేపలు అమ్ముకుంటే ఎంతో కొంత డబ్బు వస్తుంది వాళ్ళ ఇల్లు చక్క పెట్టుకుంటారు. అలాగే మీరు కూడా ఈ చేపల అమ్ముకొని డబ్బులు తెచ్చుకోండి నాకు పెద్దగా నష్టం ఏమీ ఉండదు ఎందుకంటే కోట్ల ఆస్తి నాకు ఉంది మి మంచితనానికి నేను ఇచ్చే బహుమతి ఇదే .
ఏదేమైనా మీలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ సహాయం చేస్తూ ఉంటాడు. అలాగే ఈ చెరువులో కూడా చాలా చేపలు ఉన్నాయి వాటిని కూడా మీరే అమ్ముకోండి నేను వచ్చే ఏడు పంట వేసుకుంటాను. అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఆ మాటలు విన్న తల్లి కూతురు ఇద్దరు ఎంతో సంతోష పడతారు….. నిజంగా భగవంతుడు ఇలా మనుషులు రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తూ ఉంటాడు అనుకుంటా. చాలా సంతోషంగా ఉంది. అని అనుకొని ఆ చేపలు పట్టుకుని గంప నెత్తిన పెట్టుకొని పట్టణానికి బయలుదేరారు అక్కడ చేపలు అమ్ముకొని.
డబ్బు సంపాదిస్తారు . అలా ప్రతి రోజూ చేపలు తీసుకు వెళ్లడం . పట్టణంలో మీ డబ్బు సంపాదించు కోవడం చేస్తారు ఆ తర్వాత కొన్ని రోజులకి చేపలు అయిపోతాయి . ఇక వాళ్ళు వచ్చిన డబ్బుతో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుంటారు.
ఆ వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. ఇక దానితో వాళ్ళు ఒక మంచి ఇల్లు ని ఏర్పాటు చేసుకుంటారు.
అలా వాళ్ళు సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత కృష్ణయ్య వాళ్ళ ఇంటికి వస్తాడు. కృష్ణయ్య వాళ్లతో….. అమ్మ శాంతి మీరు డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది అయితే నేను నీకు ఒక బాధ్యత అప్పు చెప్పాలని అనుకుంటున్నాను.
శాంతి…. ఏంటి బాబాయ్ అది.
అతను…. ఏముందమ్మా నాకు వయసు అయిపోతుంది ఇంక నేను ఏ పని చేయలేను .
ఉన్న ఆస్తులన్నీ కొడుకులు సమానంగా ఇచ్చేసాను. వాళ్లు విదేశాలకు వెళ్లిపోయారు. ఏదో కొంత డబ్బు ఉంచుకున్న నేను మీ పిన్ని బతకాలి కదా. వాటితోనే చేపల పంట చేయాలనుకుంటున్నాను.
పెట్టుబడి నేను పెడతాను వాటికి కావాల్సిన మందులు. నువ్వు వాటిని జాగ్రత్తగా చూసుకో రా అంటే నీకు సగం వంతు వాటా ఇస్తాను నాకు నమ్మకం గా ఎవరు ఎక్కడ ఉండరు నువ్వు నమ్మకస్తరలివి అని ఇక్కడికి వచ్చాను .
అంటూ చెబుతాడు ఆమె సారే ఉంటుంది ఇక చేపల మంట వేస్తారు ఆమె రేయింబవళ్ళు చెరువుకు కాపలాగా ఉంటూ. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది కొద్దిరోజులకి మంచి రాబడి వస్తుంది . వాళ్లు ఆ చేపల్ని పట్టణానికి అమ్మేస్తారు మంచి లాభం వస్తుంది.
అలా లాబాన్ని కృష్ణయ్య సగం సగం గా పంచుతాడు. అది చూసి ఆమె కూడా చాలా సంతోషపడుతుంది అలా ఏదో ఒక రూపంలో ఆమెకు డబ్బు వస్తూనే ఉంటుంది. వాళ్ల కష్టాలన్నీ తీరిపోయి పాప బాగా చదువుకుంటూ ఉంటుంది. అందుకే మంచితనం ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో మనం ఉన్నత స్థాయిలో ఉంటాము.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *