వరదల్లో పాప Episode 2 | Telugu kathalu | Telugu Stories | Telugu Moral Stories | Kattapa kathalu

అది అరుణాచలం అనే గ్రామం నీటితో పూర్తిగా నిండిపోయి ఉన్నది . చుట్టూ ఎవరూ లేరు. ఒక ఇంటి మీద మాత్రం ఒక పాప కూర్చొని ఆకలితో అల్లాడి పోతుంది…. అమ్మ ఆకలి గా ఉంది.అమ్మ ఆకలిగా ఉంది. అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. ఆమె అలాగే అరుస్తూ అక్కడే కుప్ప కూలిపోయింది. చాలా సమయం తర్వాత ఆ వరద నీటిలో ఈదుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు.
అతను ఆ పాప దగ్గరకు చేరుకొని పడిపోయిన పాప ని చూసి….. అమ్మ కీర్తి అమ్మ లేమ్మా. అమ్మ కీర్తి లేమ్మా అంటూ పిలుస్తూ ఉంటాడు.
పాప పైకి లెగ్వ్వక పోవడంతో. అతనికి భయం వేస్తుంది. వెంటనే అతను ఆమె భుజం మీద ఎక్కించుకొని ఈదుకుంటూ పక్క గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక హాస్పిటల్ లోకి ఆమెను తీసుకు వెళ్తాడు.
అక్కడ డాక్టర్ ఆమెను లోపలికి తీసుకెళ్లి సెలైన్ బాటిల్ అందిస్తుంది.
కొంత సమయం తర్వాత డాక్టర్మ్మ బయటకు వచ్చి…. ఆ పాప చాలా నీరసంగా ఉంది ఇంతకీ మీకు ఏమవుతుంది అసలు ఏం జరిగింది.
అతను పెద్దగా ఏడుస్తూ…. అమ్మ ఆ పాప నా కూతురు నా బిడ్డ. నా తల్లికి ఏం కాకుండా చూసుకోండి. తల్లి లేని పిల్ల. అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాను అమ్మ అంటూ ఏడుస్తాడు.
డాక్టర్…. అయ్యో అలా బాధ పడకండి మీ అమ్మాయికి ఏమీ కాదు అసలు ఏం జరిగింది చెప్పండి. అంటూ అడుగుతుంది అందుకు అతను…. అమ్మ నాది పక్కనే ఉన్న అరుణాచలం అనే గ్రామం. నేను నా కూతురు ఇద్దరం ప్రశాంతంగా అక్కడే నివసిస్తున్నాము . నా భార్య నా కూతురు పుట్టినప్పుడే చనిపోయింది అప్పటినుంచి నేను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
నా కూతురు తో నేను ఎప్పుడు ఆనందంగా ఉండే వాడిని. ఆమె ఇంటి పని వంట పని చేసేది. తన చిన్ని చిన్ని చేతులతో అలా పని చేస్తూ ఉంటే ఎంతో ముచ్చటగా చూడ బుద్ధి అవుతుంది నా బంగారు తల్లినీ. అలాంటి నా బంగారు తల్లి ఉలుకూ పలుకూ లేకుండా ఆలా పడి ఉంటే నాకు చాలా బాధగా ఉంది.
అంటూ ఏడుస్తా….. అమ్మ ఎప్పటిలాగే నేను
ఉదయాన్నే పొలం వెళ్లా ను జోరుగా వర్షం మొదలైంది….. అయ్యో ఏంటి ఇప్పుడు ఈ వర్షం మొదలైంది. ఉన్నట్టుండి ఇలా జరగడం ఏంటి. అని అనుకొని చాలా కంగారు పడ్డాను.
కొంచెం తెరిపి ఇవ్వడంతో . చాలా హడావిడిగా ఇల్లు చేరుకున్నాను నా కూతురు….. నాన్న వేడి వేడిగా అన్నం వడ్డిస్తాను తినండి నాన్న.
తండ్రి….. నువ్వు తిన్నావా తల్లి
కూతురు….. లేదు నాన్న నువ్వు తిన్నావ్ అంటే తర్వాత నేను తింటాను.
తండ్రి….. ఇది నువ్వు అన్నం వడ్డించు నేను నీకు తినిపిస్తాను. అని అన్నాను నా బిడ్డ నాకు అన్నం తీసుకు వచ్చింది ఇక నేను అన్నం ముద్దను కలిపి పెడుతున్నాను . ఇంతలో జోరున వర్షం మళ్ళీ మొదలైంది.
ఉరుములు పెద్ద పెద్ద శబ్దాలు నా కూతురు … నాన్న నాకు చాలా భయంగా ఉంది.
తండ్రి…. అమ్మ భయపడకు అర్జున పాల్గొన అని అనుకో అమ్మ. నా కూతురు అలాగే పలుకుతుంది ఇంకా విపరీతమైన వర్షం .
ఆ రోజు అంతా వర్షం కురుస్తూనే ఉంది ఆ మరుసటి రోజు కూడా అలాగే వర్షం కురుస్తుంది . మూడో రోజు నాటికి మొత్తం నీళ్లు చేరుకున్నాయి. ఇల్లంతా నీళ్లు నేను నా బిడ్డ ని భుజాలమీద ఎత్తుకుని ఉన్నాను అప్పటికే నా సగం వరకు నీళ్ళు నిండిపోయాయి ఊరంతా కొట్టుకుపోతున్న సంగతి నాకు అర్ధం అయింది .
ఏం చేయాలో అర్థం కాలేదు మా ఇంటి పైన చిన్న ఇంటి ఆకారం ఉంటుంది అది మేము అందం కోసం పట్టించుకున్నది. అప్పుడు నాకు అనిపించింది….. ఇప్పుడు ఆ ఇంటి పైనున్న ఆ ఇచ్చిన ఇల్లే నా కూతుర్ని కాపాడుతుంది అని నేను వెంటనే నా కూతుర్ని అక్కడికి పంపించి అందులో కూర్చోమని చెప్పాను.
నా కూతురు బిక్కుబిక్కుమంటూ అక్కడే కూర్చుంది.
ఇంతలో నాకు కాలు జారి నీటిలో పడి పోయాను. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నా ఈత సరిపోలేదు అలా కొట్టుకుపోయారు నా కూతురు నన్ను చూసి…. నాన్న నాన్న అంటూ పెద్ద పెద్ద కేకలు వేసింది ఆ క్షణం నాకు ….. భగవంతుడా నా కూతురు కూతురు అనాధ కాకూడదు. నా కూతురికి నాకు ఏం కాకుండా చూడు స్వామి అంటూ భగవంతుని ప్రార్ధించాను. భగవంతుడు నా ప్రార్థన విన్నాడు అందుకే. మా ఊరికి నాలుగు ఊర్లు అవతల వరకు వెళ్లినా నాకేమీ కాలేదు. వర్షం తగ్గిపోయింది మీరు మాత్రం అలాగే ఉంది నేను నా బిడ్డ కోసం నీటిలో ఈదుకుంటూ వచ్చే సమయానికి వారం రోజుల సమయం పట్టింది ఆ వారంరోజులు నా బిడ్డ నీళ్లు అన్నం లేక అలాగే ఉంది. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయమంతా చెప్పాడు.
డాక్టర్ అది విని ఆమె కన్నీళ్లు పెట్టుకొని…. మరి ఏం పర్వాలేదు నీ కూతురికి ఏమీ కాదు ధైర్యంగా ఉండండి అని ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కొంత సమయానికి పాప శ్రుహ నుంచి మేలుకుంటుంది దాన్ని చూసి అతను చాలా సంతోషపడ్డాడు. పాపా నాన్న అని హత్తుకుంటుంది. కొంత సమయం తర్వాత అతను డాక్టర్ కి కృతజ్ఞతలు చెప్పుకొని పాప ని తీసుకొని మరో గ్రామానికి వెళ్లిపోయి తిరిగి తన కూతురితో సంతోషంగా జీవిస్తాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *