వరదల్లో పేదవారి కష్టాలు |Telugu Kathalu| Telugu Story |Bedtime Stories| Panchatantra kathalu

కృష్ణాపూర్ మన గ్రామానికి వారం రోజుల క్రితం పెద్ద వర్షం కారణంగా వరదలు సంభవించాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలా ఆస్తినష్టం జరిగింది. వరద నీరు మాత్రం ఇంకిపోకుండా ఆ గ్రామంలో అలాగే ఉంది అక్కడ ఉన్న వాళ్ళు కొందరు ఎటు వెళ్లలేని పరిస్థితి ఆ నీటిలోనే కాపురాలు చేస్తున్నారు రాత్రి సమయం పడుకోడానికి ఇంటి పైకప్పులు వ్యక్తికి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. అలాంటి కుటుంబంమే శంకర్ వనజల కుటుంబం . శంకర్ వానజల్లు అదే గ్రామంలో  ఇచ్చే వాళ్ళు శంకర్ ఆటో డ్రైవర్ . ఆమె ఇంట్లోనే ఉండి పని చేసుకుంటూ ఉండేది. వాళ్లకి బేబీ , బాబీ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

వాళ్ల కుటుంబం మంచిగా సాగిపోతున్న సమయంలో వరదలు వచ్చాయి వాళ్ళ కుటుంబం వరుసలోనే ఆంటీ పోయింది నీటిలోనే ఉండే అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికీ తీవ్రమైన ఆస్తినష్టం. బయటికి వెళ్లి వాళ్ళ నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది.

బేబీ బాబి ఇద్దరు ఆకలితో అల్లాడి పోవడంతో

తల్లి కి ఏం చేయాలో అర్థం కాదు.

ఆమె భర్తతో…… ఏవండీ ఏంటండి మనకి కర్మ ఎక్కడికి వెళ్లాలి అన్న గుంటలు ఎక్కడ  ఉన్నాయా అర్థం కాదు ఎక్కడ గుంటల్లో పడి చనిపోతారు అని భయం .

ఇక్కడే ఉంటే పిల్లలు మనం ఆకలితో చచ్చిపోవడమే. ఏం చేయాలండి.

శంకర్….. చేసేదేముంది . ఎవరైనా అధికారులు సహాయం చేస్తారేమో అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు . ఏం చేయమంటావు. అని అంటాడు బాబి….. అమ్మ ఆకలి అవుతుంది . మీరు మా గురించి అసలు పట్టించుకోవడం లేదు కదా.

బేబీ …… ఈ బాబి ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అమ్మ నాన్న మన కోసమే కదా కష్టపడుతుంది ఆకలి దప్పికలు వాళ్ళకి లేవా. వాళ్లకి అంత ఆకలి బాధ ఉన్నప్పటికీ మన ఆకలి గురించి ఆలోచిస్తున్నారు నీకు అర్థం అవుతుందా . నోరు మూసుకొని కూర్చో. భగవంతుని ఆశపడితే బతికి ఉంటాను లేదంటే అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం.

అని తమ్ముని తిడుతుంది తమ్ముడు ఏడుస్తూ …. నాకు నిజంగానే చాలా ఆకలిగా ఉంది అంటూ ఏడుస్తాడు.

తల్లి…. బాబు ఈ ఊరుకోమ్మ. అంటూ ఆమె సర్ది చెబుతూ ఉంటుంది.

దాన్ని చూసి తండ్రి బాధపడుతూ….. పిల్లలు ఆకలి తీర్చాలని నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను అంటూ ఏడుస్తూ ఉంటాడు.

ఇంతలో ఎదురింట్లో ఉన్న కృష్ణవేణి కొన్ని సరుకులు తీసుకుని నీటిలోనే తన నెత్తిపై పెట్టుకుని ఎదురింటి నుంచి వాళ్ళ ఇంటికి వచ్చి వాటిని ఇస్తుంది.

దానిని చూసిన శంకర్ దంపతులు చాలా ఆశ్చర్య పోతూ కృష్ణవేణి ఇవన్నీ నీకు ఎక్కడివి. కృష్ణవేణి….

ఎక్కడికి అంటారు ఏంటి వదినా . మాది కిరాణా షాప్ కదా కొన్ని సామాన్లన్నీ ముందుగానే అటకపైన పెట్టుకుంటాము .

అసలు నేను ప్రత్యేకంగా ఒక గది కట్టించి పెడదాం అనుకున్నాను కానీ మా ఆయన అదిగో ఇదిగో అనేవాడు అందుకే అన్ని వస్తువులు అటకమీద పెట్టాల్సి వచ్చేది . ఆ అటక మీద పెట్టడం వల్ల ఈ రోజు  వస్తువులు తడిసి పోకుండా ఉన్నాయి మేము ఆకలితో లేకుండా ఉన్నాము నలుగురు ఆకలి తీర్చడానికి సిద్ధ పడ్డాము అని సామాలు ఇస్తుంది.

శంకర్….. కానీ చెల్లెమ్మ నీకు డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. దయచేసి వాటిని తీసుకెళ్ళి పో.

ఉంటుంది అందుకు ఆమె…. అయ్యో ఎందుకని అలా మాట్లాడుతున్నారు నేను డబ్బులు కోసం ఇక్కడికి రాలేదు. కేవలం అందరికీ సహాయం చేయడం కోసమే వచ్చాను. నీకే కాదు చుట్టుపక్కల వాళ్ళకి కూడా మా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే ఇప్పుడే వచ్చాము మీరు తప్పుగా ఆలోచించకుండా తీసుకోండి అని చెప్పి వాళ్లకి సామాను ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది .

కానీ చూసి వాళ్లు ఆనందభాష్పాలతో నే ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకుంటారు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడే కనపడిన గోధుమపిండితో తల్లి చపాతీ చేసి పిల్లలిద్దరికీ పెడుతుంది వాళ్ళు తృప్తిగా తింటారు. ఆ తర్వాత ఆ భార్య భర్తలు కూడా తింటారు.

భార్య…. కృష్ణవేణి చేసిన సహాయం తో మనం కొన్ని రోజులు ఆకలి తీర్చుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మన పరిస్థితి మొదటికి వస్తుంది ఇక్కడ నుంచి వెళ్లి పోయే మార్గం ఆలోచించండి.

అందుకు అతను తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు . ఇక అప్పుడు అతడికి ఆలోచన వచ్చింది నీటిలో తేలియాడుతూన్న చెక్కలనీ

మరియు వాళ్ళ ఇంటికి గోడలిగా ఉన్న

చెక్కలు పికి ఒక పడవ ని తయారు చేయడం మొదలుపెడతాడు . ఆ భార్య పిల్లలకి అక్కడ ఏం చేస్తున్నాడు అది అర్థం కాదు రెండు రోజుల తర్వాత ఒక మంచి పని తయారుచేస్తాడు శంకర్ .

వాళ్ల తినడానికి కావలసిన సామాన్లు అందులో పెట్టుకొని వాళ్లని అందులో కూర్చోమని చెప్పాడు వాళ్లు అందులో కూర్చుంటారు ఇక కృష్ణవేణి ఆమె భర్త వినయ్ ని పిలుస్తారు …… కృష్ణవేణి వినయ్ మీరు కూడా ఇక్కడ కూర్చుంది. పడవలో ఎక్కువ మంది కూర్చోవడానికి అవకాశం అయితే లేదు మనం వెళ్ళిన ఈ పడావని ఎవరికన్నా  అందజేయాలి  . వాళ్లు కూడా సురక్షిత ప్రాంతానికి చేరుకుంటారు.

అని అంటాడు అందుకు కృష్ణవేణి సరే అంటుంది వాళ్లు తినడానికి కొని సామాన్లు మరియు పొయ్యిని తీసుకొని భార్యాభర్తలిద్దరూ ఆపదలో కూర్చుంటారు అలా అందరూ పడవలో ముందుకు వెళ్తున్నారు . చుట్టూ అంతా నీరు కావడంతో వాళ్ళకి ఎటు వెళ్తున్నారు కూడా అర్థం కాదు వాళ్ళు ఆ పడవలో  రెండు రోజులు ప్రయాణం అవుతూనే వాళ్ళకి కావాల్సినది ఆ పదవుల్లోని తయారు చేసుకొని తింటూ కాలం గడుపుతారు. తర్వాత వాళ్ళు ఒక ప్రాంతానికి చేరుకుంటారు . వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారు . అప్పుడే వాళ్లకి మరో పడవ కనబడుతుంది వినయ్ ఆ పడవనీ తీసుకొని….. మన ఊర్లో ఉన్న మిగిలిన వాళ్ళని కాపాడుదాం పదండి అని అంటాడు శంకర్ సరే అంటాడు ఇక ఇద్దరూ చెరొక తీసుకొని మళ్ళీ ఊరు ప్రయాణం అవుతారు అక్కడ వాళ్ళందర్నీ సురక్షితంగా పడవలో ఎక్కించుకొని నెల రోజులు కష్టపడి అందర్నీ సురక్షిత ప్రాంతానికి చేస్తారు వాళ్ళు చేసిన మెలు కి ప్రజలందరూ వాళ్లకి కన్నీటితో కృతజ్ఞతలు చెప్పుకుంటారు .

ప్రజలందరూ వాళ్ళ జీవితాన్ని కొత్తగా మొదలు పెడతారు ఎందుకంటే వాళ్ల చేతిలో చిల్లిగవ్వ లేదు. అందరూ పేదరికంలో ఉన్న వాళ్ళు అందరూ మొదటి పైనుంచి కష్టపడుతూ కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *