వరదల్లో పేద కుటుంబం Floods Telugu Story – Telugu Kathalu – Telugu Fairytales – Kattappa Kathalu

అది ఒక లోతట్టు ప్రాంతం. ఉన్న వాళ్ళు చాలా చాలా ధనవంతులు. ఒక్క రెండు కుటుంబాలు తప్ప. ఆ కుటుంబాల వాళ్ళ రామయ్య శంకర్ అనే అన్నాతమ్ముళ్ళు. రామయ్య భార్య సుందరి. కూతురు శోభ. శంకర్ భార్య విమల. రామయ్య శంకర్ తల్లి శాంతమ్మ. నివసిస్తూ ఉండేవాళ్ళు వాళ్లకి చిన్న కుటుంబం. పైగా చిన్న ఇల్లు అంతమంది అక్కడ ఉండటం చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ వాళ్లు సర్దుకొని అక్కడ నివసిస్తూ ఉండేవాళ్ళు.
వాళ్ళందరూ కాయకష్టం చేసుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళు. పాప శోభ మాత్రం బడికి వెళ్లి చదువుకుంటుంది.
వాళ్లంతా మంచి ఇంటికి ఏర్పాటు చేసుకోవడం కోసం వాళ్లు తీసుకు వచ్చిన డబ్బులు ఒక డబ్బాలో దాచి పెడుతూ ఉంటారు. ఎలా అయినా మంచి ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం వాళ్లది రోజులు గడుస్తున్నాయి ఒకరోజు రాత్రి సమయం అందరు నిద్రిస్తుండగా ఒక దొంగ వాళ్ళ ఇంటిలోకి ప్రవేశిస్తాడు . అతను చుట్టుపక్కల మొత్తం అంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతలో అతనికి వాళ్ళు డబ్బులు దాచిపెట్టిన డబ్బా కనబడుతుంది.
వెంటనే దాన్ని తీసుకుంటాడో. ఇంతలో ఏదో పరిశుద్ధ శబ్దం రావడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా నిద్రలేస్తారు. అందరూ వారిని చూసి దొంగ….. పట్టుకోండి దొంగ దొంగ అంటూ అరుస్తూ ఉంటారు. వాళ్ల వెంట అందరూ పడుతూంటారు దూరంగా నిలబడి ఒక పెద్ద కర్ర తీసుకొని గురిచూసి అతని కాళ్ళ మీద పడేలా కొడుతుంది . వెంటనే అతని కాళ్ళు కి కర్ర తగిలి చేతిలో ఉన్న డబ్బా కింద పడేసి ముందుకు పడతాడు.
అతను కింద పడతాడు వెనకాల అతని తరుముతూ ఉండటంతో అతను భయంతో అక్కడినుంచి ఊరుకుతు డబ్బు డబ్బాని వదిలేసి పరుగులు తీస్తాడు.
వాళ్ళు ఆ డబ్బా ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వస్తారు. వాళ్ళ అమ్మ…. ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాడిని పట్టుకోవడం మీ వల్ల కాలేదు పాప తెలివిగా ఆలోచించినది కాబట్టి డబ్బులు అన్న దొరికాయి. లేదంటే ఇన్ని రోజుల కష్టమంతా వృథా అయిపోయేది.
అని తిడుతూ ఉంటుంది. రామయ్య శంకర్ అలా చూస్తూ ఉంటారు.
తల్లి శాంతమ్మ….. ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడిపోయారు. మీకు కొంచమైనా అర్థం అవుతుందా .
అని చెబుతూ ఉండగా రామయ్య…. అమ్మ ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. రేపే ఇంటి పనులు మొదలు పెడదాం.
శంకర్…. ఇల్లు కట్టడానికి అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నయ్య .
రామయ్య… ఎక్కడో ఒక చోట నువ్వు నేను అప్పు చేద్దాం రా ఏం చేద్దాం చెప్పు . ఈరోజు ఒక దొంగ వచ్చాడు రేపటి రోజున ఎంతమంది వస్తారో తెలియదు నన్ను చంపేయి డబ్బు తీసుకెళ్లి కూడా ఈ రోజుల్లో ఆశ్చర్యం లేదు. మన కష్టం వృథా కాకుండా ఉండాలి అంటే ఇది తప్ప మరో మార్గం లేదు.
అని అంటాడు వాళ్ల భార్యలు….. మీరైతే ముందు ఇల్లు మొదలు పెట్టండి మేము కూడా ఏదో ఒక పని చేసి డబ్బులు తీసుకు వస్తాము. అని అంటారు ఈ కారోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం ఆ చిన్న గుడిసెలు తొలగించి. అక్కడ మట్టి ని తొలగించుకుంటూ ఇంటి నిర్మాణాన్ని మొదలు పెడతారు.
ఐదుగురు కూడా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు పాప బడికి వెళ్ళింది.
అలా వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యారు అప్పుడు అనుకోకుండా జోరున వర్షం మొదలైంది . వాళ్లంతా….. ఇప్పుడు వర్షం పడటం చాలా మంచిది మనం తోలిన మట్టి మొత్తం చదునుగా అవుతుంది . అని అనుకుంటారు. కానీ వాళ్లు ఉండడం కోసం పక్కన పరదా పట్ల తో ఒక ఇంటిని నిర్మించుకుంటారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు.
వర్షం నీరు ఎక్కువ అవుతుంది.
వాళ్లంతా… అయ్యబాబోయ్ వర్షం వరద గా మారి లాగా ఉంది. ఓరి భగవంతుడా అంటూ భయపడుతూ ఉంటారు వాళ్ళు ఊహించినట్టుగానే అక్కడ వరదలాగ ఏర్పడుతుంది పైగా అది లోతట్టు ప్రాంతం . వాళ్లంతా సామాలు మునిగిపోకుండా వాళ్లకి అవసరమైన సామానుని నెత్తిన పెట్టుకొని.
ఆ నీటిలో నిలబడి పోతారు. శోభ మాత్రం ఆ నీటిలో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తుంది వాళ్లు పిలుస్తున్న పట్టించుకోదు .
ఆమె ఒక ఎత్తుగా ఉన్న ప్రాంతాన్ని చూస్తుంది అక్కడ తనతోపాటు తీసుకువెళ్లినా పరదా పట్టుతో ఒక డేరా ఏర్పాటు చేస్తోంది.
వాళ్లంతా పాప ఎక్కడికి వెళ్లిందో కంగారు పడుతూ ఉంటారు కొంత సమయానికి పాప అక్కడికి వచ్చి… నాన్న బాబాయ్ నేను మన కోసం ఒక డేరా ను ఏర్పాటు చేశాను. మనం సామాను తీసుకుని ఎక్కడికి వెళ్దాం పదండి . ఇంకా వరద నీరు ఎక్కువైనా అక్కడికి నీరు వచ్చేలాగా లేవు బాగా ఎత్తుగా ఉంది ఆ ప్రాంతం. అని అంటుంది ఎందుకు వాళ్లు సరే అని చెప్పి వాళ్ల సామాను తీసుకుని ఆ డేరా దగ్గరకు చేరుకుంటారు.
పాప చేసిన తెలివైన పనికి వాళ్ళందరూ మెచ్చుకుంటారు. వాళ్ళ నాయనమ్మ అయితే మరి మరి…. నా బంగారు తల్లి కి ఎన్ని తెలివితేటలు ఉన్నాయి బాగా చదివి మంచి ఉద్యోగం చేసి బతికించఅమ్మ . ఈ పేదరికం నుంచి మమ్మల్ని బయటపడే యి అమ్మ.
అని అంటూ ఏడుస్తూ బాధపడుతుంది. వాళ్లంతా….. తొందర పడ్డామా మనం. ఇప్పుడు కనీసం వుండడానికి కూడా లేకుండా పోయింది. ఏంటో మనకు ఎన్ని కష్టాలు ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా సరిగ్గా డబ్బుని కూడా పెట్టుకో లేక పోతున్నాము.
కష్టాలన్నీ మనకే వచ్చింది అనుకుంటా.ఒక్కో ఒకసారి ఇలాంటి బతుకు ఎందుకు అనిపిస్తుంది. అని వాళ్లలో వాళ్లు బాధపడుతూ చెప్పుకుంటారు శాంతమ్మ…… ఒరేయ్ ఎంత చిన్న చిన్న వాటికి మీరు ఎంత బాధ పడుతున్నారో మీ ఇద్దరిని పెంచడానికి ఎంత కష్టపడి ఉంటాను ఆలోచించారా. మీ నాన్న లేకపోయినా మిమ్మల్ని ఎంత ఇవ్వాలనే చేశాను ఆ ఈ రోజు నేను కూడా ఈ కష్టాలన్నీ ఎందుకు అని చెప్పి మిమ్మల్ని బావిలో పడేసి నేను కూడా దానిలో దూకి చచ్చిపోతే. పరిస్థితి
ఏంటి. అని బుద్ధి వచ్చేలా గా మాట్లాడుతుంది అందుకు వాళ్లు …. అవునమ్మా నీ కష్టం తో పోల్చుకుంటే ఇది కష్టాలే కాదు. ఏదేమైనా మనం డబ్బు సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి. ఈ కష్టాలకు భయపడ్డారు అంటే బతుకు నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అని వాళ్ళ వాళ్ళ ధైర్యం చెప్పుకుంటారు. నీళ్లన్నీ పోవడంతో వాళ్ళు వాళ్ళ ఇంటి పని సాధించుకుంటారు. అందరూ ఏదో ఒక కష్టం చేసి డబ్బులు సంపాదించి. ఇలాంటి ఆప్పులు చేయకుండా పెద్ద ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు.
ఇక అందరూ దాన్ని చూసి ఎంతో సంతోష పడిపోతారు కష్టం ఏ మాత్రం ఆపకుండా. వాళ్ళు అలా కష్టపడి బాగా డబ్బు సంపాదించి ఒక బట్టల వ్యాపారం మొదలు పెడతారు. వ్యాపారం చాలా చక్కగా సాగిపోతూ ఉంటుంది ఇక వాళ్ళు ఆ వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తూ సంతోషంగా జీవిస్తారు ఎవరైతే. వాళ్ళ లాగా కష్టపడుతున్నారో అలాంటి పేద వాళ్ళకి వాళ్ళ వంతు సహాయం చేస్తూ. వాళ్లకి మనోధైర్యాన్ని ఇస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళ కుటుంబం అంతా కష్టాలు పడుతూ. ఇప్పుడు మంచిగా సుఖ పడుతున్నారు. అందుకే జీవితంలో మనం సుఖ పడాలి అంటే మంచి రోజులు మనకు రావాలి అంటే కష్టపడాల్సి ఉంటుంది అందుకే కష్టేఫలి అన్నారు పెద్దలు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *