వాటర్ మిలన్ ఇల్లు Water Milan Illu |Telugu Kathalu|Telugu Stories |Telugu Moral stories| Fairy Tales

బేబీ రాత్రి సమయం పరుగులు తీస్తూ….. కాపాడండి ఎవరైనా కాపాడండి. ఎవరైనా కాపాడండి అంటూ పరుగులు తీస్తూ ఉంటుంది ఆమె వెంట ఒక పెద్ద  పుచ్చకాయ వెంట పడుతూ ఉంటుంది. బేబీ అలా పరుగులు తీస్తూ ఒక చోట దాక్కుంటుంది.

ఆ పుచ్చకాయ ఒక చెట్టుకు తగిలి అక్కడే నిలబడి పోతుంది అది ఒకసారి ఒక ఇల్లు లాగా మారిపోతుంది. తలుపులు తెరుచుకొని అందులోనుంచి ఒక వ్యక్తి బయటకు వస్తాడు.

అతనిని చూడటానికి చాలా వింతగా ఉంటాడు. బేబీ అతన్ని చూసి చాలా బాధపడుతూ తన మనసులో…… వామ్మో అతని ఏంటి అలా ఉన్నాడు. ఒక దెయ్యం లాగా. అమ్మో అంటూ భయ పడుతూ ఉంటుంది ఇంతలో అతను బయటకు వచ్చి…. పాప నువ్వు భయపడకు నేను నిన్ను ఏం చేయను . బయటికి రా అని బేబీ అని పిలుస్తాడు బేబీ భయపడుతూ అతని ముందుకు వస్తుంది. బేబీ….. ఎవరు మీరు ఎందుకు ఇలాంటి వింత ఇంట్లో నుంచి బయటకు వచ్చారు.

అప్పుడు ఆ వింత మనిషి….. మాది వేరే గ్రహం. నువ్వు అనుకున్నట్టు ఇది ఇల్లు కాదు మా వాహనం. దీంతో మేము ఎంత దూరమైనా ప్రయాణం చేయగలము. ఇది భూమి మీదకు రాగానే ఇల్లు లాగా మారిపోతుంది.

నేను ఈ గ్రహం లో ఉన్న మనుషుల్ని జంతువులు అన్నిటినీ చూడడానికి వచ్చాను.

బేబీ…. కానీ నువ్వు చూడటానికి చాలా వింతగా ఉన్నావు కదా ఇక్కడ వాళ్ళు అందరూ భయపడతారు లేదా కర్రలతో కొట్టి చంపేస్తారు.

అతను భయపడుతూ …. అమ్మో అవునా అయితే నేను వెళ్ళిపోతాను. కానీ నేను చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను. ఇక్కడ ఏమి చూడకుండానే వెళ్ళిపోతాను అని అస్సలు అనుకోలేదు. అంటూ చాలా బాధగా వెళిపోతూ ఉండగా బేబీ….. ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు.. నేను నీ కోసం ఏమైనా చేయగలను అని ఆలోచనలో పడుతుంది .

కొంత సమయం తర్వాత ఆ వ్యక్తితో…. సరే నువ్వు మీ ఇంటి వాహనాన్ని ఎక్కడ దాచి పెట్టు  నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను.

అప్పుడు అతను….. మీ ఇంటికి తీసుకెళ్టై మీ అమ్మానాన్న నిన్ను ఏమీ అనరా.

బేబీ…. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు నేను ఒంటరి దాన్ని. కానీ ఈ మధ్యనే చనిపోయారు . నేను ఆహారం కోసం బయటికి వచ్చాను కానీ బయటకు వస్తే అన్నీ మూసేసి ఉన్నాయి నేను సమయం చూసుకో లేదు అనుకుంటా. దగ్గరదగ్గరగా 11 12 అయినట్టుంది నాకు ఏమీ అర్థం కాలేదు.

అందుకు ఆ వ్యక్తి….. అయితే ప్రస్తుతానికి మనం వెళ్లాల్సింది నీ వెంటే కాదు మా ఇంటికి

ఎలా వెళ్దాం అంటూ అతను తన వాటర్ మిలన్ ఇంట్లోకి తీసుకువెళతాడు.

అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఇంట్లో అన్ని సామాన్లు రకరకాల వస్తువులు చాలా అందంగా ఉంటుంది.

అక్కడే వంటగది బాత్రూం అన్నీ ఉంటాయి.

అతను….. నువ్వు అలా కూర్చో నేను చిటికలో వంట సిద్ధం చేస్తాను.

అని అంటాడు అందుకని ఈసారి అది కూర్చుంటుంది అతను చిటికెలో ఏదో పదార్ధాలు వేసి మంచి వంటలు తయారు చేస్తాడు.

ఆ తర్వాత ఇద్దరు కూర్చొని తింటారు అలాంటి వంట పాప ఎప్పుడు తినలేదు చాలా అద్భుతంగా ఉంది అని అతన్ని నేర్చుకుంటుంది.

….. నువ్వు వంటికి ఏవేవో ఉపయోగించావు.

మేము వంట చేయడానికి కూరగాయలు ఉపయోగిస్తాము.

అని అంటుంది అందుకు అతను అవి ఎలా ఉంటాయి నాకు చూపించు.

బేబీ రేపు మొత్తం అన్ని తిప్పి చూపిస్తాను.

అందుకు తను సరే అంటాడు ఇక ఇద్దరు భోజనం చేసి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.

మరుసటి రోజు ఉదయాన్నే పాప అతన్ని ఊర్లో తిప్పుతూ ఉంటుంది అందరూ అతన్ని చూసి వింతగా  చూస్తూ ఉంటారు అప్పుడు పాప….. తను నా స్నేహితుడు మీరెవరు కంగారు పడకండి. తను వేరే గ్రహం నుంచి వచ్చాడు అని అందరికీ చెప్తూ ఉంటుంది అందరూ కూడా అతని చూడ్డానికి గుంపులు కడుతూ ఉంటారు.

అలా అందరికీ షేకండ్ ఇస్తూ అందరినీ పలకరిస్తూ ఉంటాడు.

ఆ తర్వాత అతన్ని పంటపొలాలకు తీసుకువెళ్లి….. ఇదిగో ఇవే కూరగాయలు టమోటా బెండకాయ వంకాయ ఇలా అన్ని రకాల కూరగాయలు పండిస్తారు. వీటితోనే మేము వంట సిద్ధం చేసుకుంటాము.

అతను….. చాలా అద్భుతంగా ఉంది నాకు వీటితో వంట ఎప్పుడు చేసి పెడతావు.

బేబీ… మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అదే పని చేద్దాం.

అందుకు తను సరే అంటాడు.

అలాగే మా ఊర్లో ఒక సముద్రం కూడా ఉంది మనం అక్కడికి కూడా వెళ్దాం పద.

ఇక ఇద్దరు కలిసి సముద్రం దగ్గరికి వెళ్తారు.

సముద్రంలో పడవ లో జాలర్లు చేపలు పడుతూ ఉంటారు

దాన్ని చూసిన ఆ వ్యక్తి…. చాలా బాగుంది మనం కూడా అలా వెళ్ళొచ్చా.

బేబీ…. వెళ్లొచ్చు కానీ ఇప్పుడు అందరూ చేపల వేటకు వెళ్లారు కదా. మళ్లీ వాళ్ళు బయటికి రావాలంటే సాయంత్రం లేదంటే రేపు అవుతుంది.

ఆ వ్యక్తి…. అప్పటిదాకా  ఆగడం ఎందుకు .

నా వాహనాన్ని  ఇక్కడికి తీసుకు వస్తాను అది ఎక్కడైనా  ఏ విధంగా అయినా మారగలదు.

బేబీ….. అవునా అని ఆశ్చర్యపోతుంది అతను అవును అని చెప్పి ఆ వాటర్ మిలన్

ఇంటి నీకు తీసుకొస్తాడు అది నీటిలో కూడా తేలుతూ ఉంటుంది . ఇద్దరూ దాన్లో కూర్చుంటారు. అలా ఆ ఇల్లు ఒక పడవ లాగా సముద్రంలో తిరుగుతూ ఉంటుంది.

బేబీ….. అన్నట్టు నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను

. అతను ఏంటది అని అంటాడు పాప….. నీ వాహన మా ఇల్లు ఏదో. ఇది చూడ్డానికి పుచ్చకాయ ఆకారంలో ఉంటుంది. మా ఊరిలో పుచ్చకాయలు తింటారు చాలా బావుంటుంది.

నేను వాటిని కూడా చూపిస్తాను. అని అంటుంది అతను సరే అంటాడు.

ఇంకా ఇద్దరూ చాలాసేపు అన్నిట్లో తిరిగిన తర్వాత మళ్లీ బయటకు వస్తారు.

పాప అతనికి పుచ్చకాయ ని చూపిస్తుంది.

దాన్ని చూసి అతను….. వావ్ నిజంగానే చాలా బాగుంది. అచ్చం మా వాహనం లాగే.

బేబీ అవును అని అంటుంది ఇక తర్వాత ఇద్దరూ కలిసి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకొని . వాటితో పాటు ఇంటికి వెళ్తారు. బేబీ అతనికి వాటితో వంట తయారు చేసి పెడుతుంది.

అతను దానిని తిని చాలా అద్భుతంగా ఉంది. నేను వీటిని కొన్నిటిని మా గృహానికి కూడా తీసుకువెళతాను.

అని అంటాడు అందుకు పాప సరే అంటుంది.

ఇక కొన్ని రోజుల తర్వాత అతను అక్కడి నుంచి ప్రయాణం అవుతూ ఉండగా….. చూడు బేబీ నువ్వు నాకు చాలా సహాయం చేశావు. ఈ ఊరు మొత్తం తిప్పి చూపించావు దానికి కృతజ్ఞతగా నీకేం కావాలో చెప్పు నేను కచ్చితంగా చేస్తాను.

బేబీ…. నేను ఉంటున్న ఇల్లు అద్దె ఇల్లు.

నాకంటూ ఒక ఇల్లు కావాలి అది కూడా ఈ పుచ్చకాయ  ఆకారంలో ఉన్న ఇల్లు కావాలి.

నాకు సొంతంగా ఒక స్థలం ఉంది ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని నా తల్లిదండ్రులు అనుకున్నారు కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.

అంటూ ఏడుస్తుంది అతను…. నువ్వు బాధపడకు ఆ స్థలం ఎక్కడుందో చూపించు

 అంటాడు ఆమె సరే అని చెప్పి అతన్ని ఆ స్థలం దగ్గరికి తీసుకు వెళుతుంది.

అతను తనకు ఉన్న కొన్ని చిన్నపాటి మ్యాజిక్ లతో. అక్కడ వాటర్ మిలన్ ఇంటిని ఏర్పాటు చేస్తాడు దాన్ని చూసి చాలా సంతోషపడుతుంది బేబీ. ఆనందభాష్పాలతో తన కొత్త స్నేహితునికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.

పాప ఏడుస్తూ …. ఇదంతా చూడటానికి మా అమ్మ నాన్న బ్రతికి ఉంటే బాగుండేది.

అని బాధపడుతుంది అతనిని ఓదార్చి…. సరే మిత్రమా ఈ సారి మళ్ళీ వచ్చి నిన్ను మా గ్రహానికి తీసుకు వెళతాను. బాయ్ అంటూ అక్కడ వాటర్ మెలన్ వాహనంలో అక్కడినుంచి గాల్లోకి వెళ్ళిపోతాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *