వినాయకుడు గర్భవతి ఏనుగు_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో రూపేష్ అన్న వ్యక్తి ఉండేవాడు అతని దగ్గర ఒక గర్భవతి ఏనుగు ఉండేది. ఆ ఏనుగుని అతను చాలా బాగా చూసుకుంటాడు. అలా రోజులు గడిచాయి. వినాయక చవితి వచ్చింది. ఆరోజు రూపేష్ గర్భవతి ఏనుగుతో…. సీతమ్మా ఈరోజు వినాయక చవితి. మన ఇల్లు మొత్తం శుభ్రం చేసి వినాయకుని స్థాపించాలి. నేను ఇల్లు మొత్తం శుభ్రం చేస్తాను నువ్వు చెరువు దగ్గరకు వెళ్లి ఒక బిందె నీళ్లు తీసుకొని రా.

అందుకు ఏనుగు… సరే అన్నట్టుగా తల ఊపి బింద తీసుకొని. అక్కడి నుంచి వెళ్తుంది అది దారిలో వెళ్తూ ఉండగా . ఒక పెద్ద చెట్టు దగ్గర చెత్తకుండీ కనబడుతుంది. ఆ చెత్త కుండి పక్కనే ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. అప్పుడు ఆ గర్భవతి ఏనుగు తన మనసులో….. అయ్యో ఎవరో గణపయ్య ఇక్కడ పెట్టేసి వెళ్లిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న బిందె ను పక్కన పెట్టి ఆ గణపతిని తీసుకొని ఒక చెట్టు దగ్గర పెడుతుంది. ఆ తరువాత వెనక్కి తిరిగి వచ్చి ఆ బిందె తీసుకుని పక్కనే ఉన్న చెరువు లోకి వెళ్లి నీళ్లు తీసుకొని వచ్చి ఆ వినాయకుడినీ నీటితో శుభ్రం చేస్తూ ఉంటుంది అప్పుడు పైన ఆకాశంలో వినాయకుడు నెమలి వాహనంపై తిరుగుతూ ఉంటాడు అప్పుడు అతని పైన నీళ్ల వర్షంలో కురవడంతో గణపయ్యా… ఎవరు ఇది నాకు నీళ్లతో అభిషేకం చేస్తుంది. అంటూ కిందకి తొంగి చూస్తాడు. కింద ఏనుగు అభిషేకం చేయడం చూసి….. ఓహో నువ్వేనా ఇదిగో ఇప్పుడే నీ దగ్గరికి వస్తున్నా. అంటూ నెమలి వాహనంపై కిందికి దిగుతాడు. అప్పుడు ఆ ఏనుగు వినాయకుని చూసి చాలా సంతోషం తో…. స్వామి మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా కోసమే వచ్చారా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను స్వామి . నాకంతా అయోమయంగా ఉంది నేను చూస్తుంది అంతా నిజమేనా.
అందుకు వినాయకుడు…. అవును మిత్రమా నేను నీ కోసమే వచ్చాను. నీకు నీ పుట్టబోయే బిడ్డకు మంచి జరుగుతుంది. అని దీవిస్తాడు అప్పుడు ఏనుగు…. స్వామి ధన్యురాలినీ స్వామి. అది సరే గానీ స్వామి మీరు మూషిక వాహనుడు కదా మరి నెమలి మీద వచ్చారు ఏంటి. వినాయకుడు…. ఈరోజు చవితి కదా అందుకే నా మిత్రులు ఉండ్రాళ్లు తినడం కోసం నాకంటే ముందు వెళ్ళాడు. అందుకే నా సోదరుడైన మణికంఠ దగ్గర తన వాహనాన్ని తీసుకున్నాను. ఏనుగు…. ఓహో అయితే ఆ ఎలుక ఈరోజు చాలా రకరకాల ఆహారాన్ని భుజిస్తూ ఉందన్నమాట. వినాయకుడు….. అవును నా కంటే ముందుగా. రుచికరమైన వాటిని తినేస్తుంది. సరే మిత్రమా ఇక నేను బయలుదేరుతాను. అని స్వామి అక్కడ్నుంచి వెళ్లబోతుండగా ఆ ఏనుగు…. స్వామి స్వామి రాకరాక భూలోకం వచ్చారు కదా. అప్పుడే వెళ్ళిపోతాను అంటారేంటి స్వామి మరికొద్దిసేపు ఉండొచ్చు కదా.
కానీ ఇక్కడే ఉంటే నా భక్తులు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా.
అయితే మీరు ఇక్కడే ఉండి భక్తులు చేసే పనులు కూడా చూడొచ్చుఅయితే మీరు ఇక్కడే ఉండి భక్తులు చేసే పనులు కూడా చూడొచ్చు కదా స్వామి.
అందుకు సరే అన్నట్టుగా తలని చూపుతాడు.
అందుకు నేను చాలా సంతోష పడుతూ…. అయితే పదండి స్వామి ముందు మా ఇంటికి వెళ్దాం మా యజమాని
చాలా మంచివాడు ఈ రోజు మిమ్మల్ని స్థాపించపోతున్నాడు . అందుకు వినాయకుడు….హా…హా నాకు సర్వము తెలుసు. అయినా నీ కోరిక ఎందుకు కాదనాలి. భూలోకంలో నా పుట్టిన రోజుని ఎంత బాగా జరుపుతారో ఎక్కడో ఉండి కాదు ఇక్కడే ఉండి చూస్తాను. అని అంటాడు అందుకు ఆ ఏనుగు చాల సంతోషపడుతూ స్వామి అయితే మీరు నా మీద ఎక్కి కూర్చొ డి స్వామి .నేనే స్వయంగా మిమ్మల్ని మోస్తూ ఇంటికి తీసుకెళ్తాను అందుకు వినాయకుడు… వద్దు వద్దు నువ్వే గర్భవతివి నేను అలా చేయను.మరి ఏం పర్వాలేదు మనిద్దరం ఇలాగే నడుచుకుంటూ వెళ్దాం పద.
ఏనుగు…. లేదు స్వామీ మీ పాదంతో నన్ను ధన్యురాలిని చెయ్యండి. అని ప్రాధేయ పడుతోంది సర్వం తెలిసిన నాయకుడు. సరే అని ఆ ఏనుగు పై ఎక్కి కూర్చుంటాడు. వినాయకుడు కూర్చోగానే ఆ ఏనుగు అమాంతం గాల్లోకి లేస్తుంది. దాన్ని చూసిన ఏనుగు చాలా ఆశ్చర్యం తో….. ఏంటి స్వామి ఇది. నేను ఎలా గాల్లో కి ఎగర గలుగుతున్నాను.
వినాయకుడు…హా..హా.. అని నవ్వుతాడు.
అప్పుడు ఆ ఏనుగుకి అంతా అర్థమవుతుంది…. స్వామి మీరు నిజంగా చాలా గొప్ప వాళ్ళు నా కోరిక తీర్చారు. అలాగే నా మంచి గురించి ఆలోచించారు. అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ గాల్లో వెళుతూ సరాసరి రూపేష్ ఇంటిముందు ప్రత్యక్షమౌతారు. గణపయ్యను చూసినా రూపేష్ చాలా ఆశ్చర్యంతో సంతోషపడుతూ… స్వామి స్వామి నేను దీనిని నమ్మలేకపోతున్నాను కలా నిజమా. అని అంటూ ఉంటాడు.
అప్పుడు ఏనుగు…. నేను కూడా నీలాగే ఆశ్చర్యపోయాను అని తన మనసులో అనుకుంది. స్వామి…. ఇదంతా నిజంగా నిజమే రూపేష్. ఇదంతా నీ ఏనుగు పుణ్యమే. అని అంటాడు అందుకు రూపేష్ చాలా సంతోషం స్వామి రండి స్వామి రండి మేము విగ్రహాన్ని తీసుకొద్దాం అనుకుంటే స్వయంగా మీరే వచ్చారు. మీ రాకతో ఈ ఇల్లంతా పవనo అయిపోయింది. అంటూ సంతోష్ పడతాడు.రూపేష్ స్వామి కోసం అప్పటికి అప్పుడు చకచక స్వామి కి కావలసిన రుచికరమైన ఉండ్రాళ్ళు కుడుములు ఇంకా రకరకాల ఆహార పదార్థాలన్నిటినీ తయారుచేసి స్వామి ముందు ఉంచుతాడు. వాటన్నిటినీ చూసిన గణపయ్య…. నాకు ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు. అంటూ చాలా ప్రియంగా వాటిని తింటాడు. వాటన్నిటినీ తిన్న తర్వాత మరికొన్ని మిగులుతాయి. అందుకు రూపేష్…. స్వామి వీటిని ఎందుకు వదిలేశారు వీటిని కూడా భుజించండి.
అందుకు గణపయ్య…. అమ్మో వీటన్నిటినీ తినేస్తే ఎలా మరి నా భక్తులు చాలా మంది నా కోసం తయారు చేసిన వాటిని కూడా తినాలి కదా. అందుకు అతను నవ్వుతూ….. నిజమే స్వామి అని అంటాడు అప్పుడు గణేశుడు….
రూపేష్ ఒకసారి మీ ఊర్లో జరుగుతున్నా నవరాత్రుల నీ చూడాలని ఉంది ఒకసారి అలా వెళ్లి వద్దామా.
రూపేష్…. కానీ స్వామి మీరు అందరికీ కనిపిస్తారు కదా. అప్పుడు వాళ్ళందరూ మీ చుట్టూ గుమిగూడి మిమ్మల్ని ఇంకా మీ లోకానికి పంపించారు. అందుకు గణేషుడు నవ్వుతూ …. మరేం పర్వాలేదు మన ముగ్గురు ఎవరికీ కనిపించకుండా నేను చేస్తాను కదా అని చెప్పి తన మాయని ప్రదర్శిస్తాడు. అలా వాళ్ళు ముగ్గురు ఎవ్వరికీ కనిపించకుండా ఊర్లో వెళ్తుండగా ఒక పందిరి కనిపిస్తుంది. అందులో ఘనంగా పూజలు జరుగుతాయి. ప్రసాదాలు కూడా పంచిపెడతారు అప్పుడే గణపయ్య స్వామి పాటలు ఘనంగా మోగిస్తూ ఉంటారు.సాంగ్ (జయ జయ జయ జయ వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి జయ జయ శుభకర వినాయక )దాన్ని చూసి న ఏనుగు…. చూశారా స్వామి మీరు అంటే ఎంత భక్తి నో. అంటూ ఉండగా స్వామి చిన్నగా నవ్వుతు…. జరగబోయేది చూడండి ఇప్పుడే ఏం జరిగి పోలేదు అంటూ ఉండగా.
ఒక వ్యక్తి వచ్చి…. ఇప్పుడు దాకా వినాయకుడు పాటలు మోగించారు గా. వినాయకు డి కి పెట్టిన పాట లు పెడుతూ ఉంటే విసుగెత్తి పోతాడు. ఆయన కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వండి అంటూ సినిమా పాటలు పెడతాడు.సాంగ్ (రాములో రాముల నాగం చేసినవే. రఘు లో రాముల నా ప్రాణం తీసిన వే )అలా సినిమా పాటలు పెట్టిన గానే అతనితోపాటు మరొకరు కలిసి ఎగురుతూ ఉంటారు దాన్ని చూసిన రూపేష్…. అయ్యబాబోయ్ స్వామి అంటూ ముక్కున వేలేసుకుంటాడు. గణేశుడు చిన్నగా నవ్వుకుంటూ ముగ్గురు కలిసి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తారు అక్కడ మరో పందిరి ఉంటుంది. అక్కడ ఒక ఆమె ప్రసాదాలు పెడుతూ ఉంటుంది. అప్పుడు రూపేష్… స్వామి అక్కడ ఏదో అలా అయిపోయింది ఇక్కడ ఈమెను చూశారా. ఎంత భక్తిశ్రద్ధలతో మీ ప్రసాదాన్ని అందరికీ పంచి తుందో. అందుకు వినాయకుడు మళ్లీ చిన్నగా నవ్వుతాడు. అప్పుడు ఏనుగు…. స్వామి మీరు నవ్వారు అంటే మళ్ళీ ఇక్కడ ఏదో వింత జరగబోతుంది. అనిఅంటుంది ఏనుగు అన్నట్టుగానే అక్కడ వింతే జరుగుతుంది అది ఏంటంటే. ఆమె భక్తులతో…. అయ్యో స్వామి వారి ప్రసాదం అయిపోయింది. ఏమనుకోకండి మళ్ళీ సాయంత్రం రండి సాయంత్రం కూడా స్వామివారి ప్రసాదం అందరికీ అందిస్తాం కొంచెం త్వరగా రండి అని చెప్తుంది వచ్చినవాళ్లు సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన వెంటనే ఆమె ఒక చిన్న పాత్రలో స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని… ఆవురావురుమంటూ తింటూ తనలో…… అందరికీ పంచితే అయిపోతుంది నాకు ముందే తెలుసు అందుకే నేను కొంచెం ప్రసాదాన్ని పక్కన పెట్టుకున్నాను. పుణ్యమంతా వీళ్ళ తీసుకెళ్లి పోతే నాకే మిగులుతుంది. అందుకే ఇలా చేశాను నన్ను క్షమించు స్వామి. అని అనుకుంటూ మరికొంత ప్రసాదాన్ని ఒక పాత్రలో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. దాన్ని చూసిన ఆ ఏనుగు రూపేష్ చాలా ఆశ్చర్యపోతారు. వాళ్లకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు.
సరే అని చెప్పి ముగ్గురు కలిసి మరో వినాయకుడు పందిరి ఉన్న చోటికి వెళ్తారు అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజ జరుగుతూ ఉంటుంది. దాన్ని చూసిన ఏనుగు మరియు రూపేష్ లు స్వామితో…. స్వామి ఇక్కడ ఏం జరుగుతుందో అని మాకు చాలా ఆందోళనగా ఉంది. అప్పుడు గణేశుడు….. కంగారు పడాల్సిందేమీ లేదు వీలు నిజంగానే నన్ను భక్తిశ్రద్ధలతో. నన్ను పూజిస్తున్నారు. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడినుంచి మాయమయి ఆ పందిరిలో ఉన్న వాళ్లందర్నీ దీవిస్తాడు. ఆ ఏనుగు మరియు రూపేష్ స్వామి వైపు అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆ గణపయ్య ఆ పందిరి లో నుంచి మాయమై తిరిగి మళ్ళి వీళ్ల దగ్గర ప్రత్యక్షమవుతాడు. అప్పుడు రూపేష్ స్వామితో…. స్వామి ఇలాంటివన్నీ మీరు చూస్తూనే ఉంటారు. భక్తి శ్రద్ధలతో కాకుండా నామమాత్రంగా పూజించే వాళ్ళని చూస్తే మీకు మీకు కోపం కలగదా స్వామి….. చూడు రూపేష్ నీ చేతికి ఉన్న ఐదు వేళ్ళు ఒకేలా ఉన్నాయా.
రూపేష్…. లేవు స్వామి
గణేశుడు….. మరి నీ చేతికున్న వెళ్లే అన్ని సమానంగా లేనప్పుడు మనుషులందరూ ఒకేలా ఎందుకుంటారు. ఎవరి వాళ్ల స్వభావాన్ని బట్టి వాళ్ళు ఉంటారు. ఇక్కడ భక్తి చేసిన వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్లు ఉన్నారు. కానీ అందరూ నాకు పిల్లలు అలాంటి వాళ్లే. పిల్లలు తప్పు చేస్తే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడో చెప్పు.
రూపేష్…. మందలిస్తాడు. స్వామి.
గణేశుడు…. అంతేగాని తప్పు చేశావని చనిపోయాడు కదా. అలాగే నేను కూడా నా బిడ్డలు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి అవకాశం ఇస్తాను. ఆ అవకాశంతో వాళ్లు కచ్చితంగా మారతారు.మార్పు చెందడానికి కొంచెం సమయం పట్టొచ్చు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మంచి వ్యక్తులు గా మారతారు. అదే ఈ సృష్టి లో ఉన్న రహస్యం.
రూపేష్…. ఆహా స్వామి ఎంత గొప్పగా చెప్పారు. అని చేతులెత్తి నమస్కరిస్తడు.
గణేష్ లో…. సరే మిత్రులారా ఇంక నేను వెళ్ళే సమయం అయింది. చివరిగా మీ అందరికీ చెప్పేది ఒకటే. నన్ను స్థాపించాలని ఉన్నవాళ్ళు. మట్టితో చేసిన నా విగ్రహాన్ని స్థాపించండి. దానివల్ల పర్యావరణం పాడు కాకుండా ఉంటుంది. దాని వల్ల మీకు మేలు అలా చేయడం వల్ల నేను కూడా చాలా సంతోషిస్తాను. పిల్లలు నా నిమజ్జనం రోజు కాలువలకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటే మిమ్మల్ని చూసి నేను అక్కడ సంతోషిస్తాను. అని చెప్తాడు అందుకు రూపేష్ ఏనుగు సరే స్వామి అని అంటాడు వెంటనే అక్కడికి నెమలి వాహనం వస్తుంది ఆ నెమలి పై స్వామి కూర్చొని ఆకాశంలోకి ఎగిరి వెళ్తాడు. రూపేష్ మరియు ఏనుగు స్వామి వారికి వీడ్కోలు చెప్తారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి తమ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మన గణపయ్య చెప్పింది మీ అందరికీ గుర్తుంది కదా. మట్టితో చేసిన విగ్రహాన్నే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *