వెదురు బొంగుల ఇల్లు | Telugu Kathalu | Telugu Story | Bedtime Stories | Panchatantra kathalu

అది కృష్ణాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో శారద కీర్తి అనే సవతితల్లి కూతురు ఉండేవాళ్ళు. శారద కీర్తి ని సరిగా చూసుకునేది కాదు ఆమెను కావాలనే తిడుతూ కొడుతూ ఉండేది. శారద భర్త వినోద్ ఉన్నప్పుడు మాత్రం ఆమె ఎంతో ప్రేమతో చూసుకున్నట్టు నటిస్తూ ఉండేది. కానీ కీర్తి తండ్రి ఒక మాట కూడా చెప్పేది కాదు. అలా ఆమె ఎన్నో బాధలు పడుతూనే అక్కడ ఉంటుంది కొన్ని నెలలు గడిచాయి శారద గర్భవతి. ఆ విషయం భర్తకి ఎంతో సంతోషంగా చెబుతుంది అతను చాలా సంతోష పడతాడు శారదా తన మనసులో….. ఇంకా ఇదే మంచి అవకాశం దీన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించవచ్చు. అని అనుకొని ఆ మరుసటి రోజు ఉదయం….. ఏమండీ కాపాడండి ఏమండీ కాపాడండి అంటూ కేకలు వేస్తూ అతను దగ్గరకు పరుగులు తీస్తుంది అతను చాలా కంగారుగా….. ఏమైందిరా ఏమైంది అని అంటాడు ఆమె…. ఒకసారి చూడండి కీర్తి చేతిలో కత్తి అది నన్ను చంపడానికి వస్తుంది.
కీర్తి చేతిలో కత్తిని చూసిన తండ్రి కోపంగా…. ఏంటే తల్లిలాగా నిన్ను చూసుకున్న తల్లిని చంపాలనుకుంటున్నావా . ఏమైంది నీకు.
కీర్తి ఏడుస్తూ …. నాన్న నేను ఎందుకు అలా చేస్తాను. నువ్వు తప్పుగా ఉద్దేశిస్తూ ఉన్నావు.
నాన్న నేను అలా ఎందుకు చేస్తాను. అంటూ ఏడుస్తూ చెబుతుంది.
అందుకు అతను ఏ మాత్రం నమ్మడు ఆమెను బయటకు పంపించే చేస్తాడు.
పాపం కీర్తి ఏడుస్తూ అడవి బాట పడుతుంది. ఆమె ఒంటరిగా కూర్చొని…. నిజానికి నేను ఏ తప్పు చేయలేదు కానీ ఎందుకు నన్ను ఇలా గా నా సవతి తల్లి వేధించుకు తింటుంది . అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆమె ఒక పెద్ద పులి గాండ్రింపు శబ్ధం వినపడుతుంది దానిని ఆమె చాలా బాధపడుతుంది.
కీర్తి తన మనసులో….. అమ్మో అడవిలో జంతువులు ప్రమాదం ఉంటుంది. నేను ఎక్కడ ఉండాలి అంటే ఏదైనా చెట్లమీద ఇంటి నిర్మించుకొని ఉండాలి. లేదంటే కూర జంతువు చేతిలో నేను చచ్చి పోతాను మా నాన్నకు నిజం తెలియాలి ఇన్ని రోజులు నేను ఆమె గురించి ఏది చెప్పలేదు . అని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయం పాప వెదురు బొంగులతో ఎంతో కష్టపడి ఒక ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది ఆమె ఇంటి ఏర్పాటు చేసుకోవడానికి మూడురోజుల సమయం పడుతుంది ఆమె ఎంతో కష్టపడి ఒక మంచి ఇంటికి ఏర్పరచుకొని….. ఇక ఈ అడవిలో నేను ప్రశాంతంగా ఉండొచ్చు.
ఎలాంటి బాధ ఉండదు. అని అక్కడే ఉంటుంది ఇక ఆమె స్నానం చేయడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది.
అందుకే ఆమె ఇంటి కిందనే ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది.
అక్కడే పాపా సంతోషంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న పండ్లు దుంపలు తిని సంతోషంగా ఉంటుంది.
కానీ ఒకరోజు రాత్రి మాత్రం పాప చాలా ఏడుస్తూ…. అమ్మ చూసావా అమ్మ కనీసం నాన్న నా మాట కూడా వినకుండా. నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నా అని కూడా ఆలోచించకుండా పిన్ని మాటలు విని. నన్ను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించాడు ఇది ఎంతవరకు న్యాయం.
నువ్వు ఉన్నట్లయితే నాకు ఎంతో బాగుండేది అమ్మ నీ కష్టం నాకు వచ్చేది కాదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. కానీ పాపకు తన తండ్రిని చూడాలని ఎంతో ఆశతో గా ఉంటుంది.
కానీ అక్కడికి వెళ్ళడానికి ఆమెకు భయం వేస్తుంది. ఒకరోజు పాప అక్కడ ఉన్న పండ్లు ఏరుకుంటూ ఉండగా ఒక ముసలావిడ అక్కడికి వస్తుంది. ఆమె పెద్ద పెద్దగా ఏడుస్తూ…. ఎందుకు నన్ను ఇంకా బ్రతికించావ్వు ఏదన్నా జంతు వచ్చినవి పీకు తింటే బాగుండు.
అంటూ పెద్ద పెద్ద గడుస్తుంది ఆ మాటలన్నీ కీర్తి వింటుంది ఆమె దగ్గరికి వెళ్లి…. అమ్మ ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ఇలా బాధ పడుతున్నావు.
అందుకు ఆమె ఏడుస్తూ…. నా కొడుకుకి పెళ్లి చేశాను అమ్మ నా కోడలు మంచిది కాదు నన్ను ఎప్పుడు రాచిరంపాన పెడుతుంది. నా వల్ల వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి గొడవలు పడుతూనే ఉన్నారు. అందుకే వాళ్ళిద్దరు నా వల్ల గొడవలు అవుతున్నాయి అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించారు . ఎటు వెళ్ళని పరిస్థితి నాది. అంటూ బాధపడుతూ జరిగిన విషయం చెప్పి…. ఇక్కడైతే ఏదో ఒక మృగం చేతిలో చచ్చి దానికి ఆహారం అన్న అయితే . దాని ఆకలి తీర్చిన దాన్ని అవుతానని ఇక్కడికి వచ్చాను.
ఆ మాటలు విన్న కీర్తి చాలా బాధపడుతూ…. అయ్యో అలా మాట్లాడ కమ్మ. భగవంతుడు చావు నిర్ణయించిన అంతవరకూ మనం బ్రతుకుని యిడవాల్సిందే .
అంటూ ఆమెను తన ఇంటికి తీసుకు వెళుతుంది . ఆ ఇంటిని చూసి ఆమె చాలా ఆశ్చర్య పోతూ….. పాపా నువ్వు అక్కడే ఉంటావా నీకు అమ్మ నాన్న ఎవరూ లేరా.
కీర్తి బాధపడుతూ…. నా తల్లి చనిపోయింది మన నన్నగారు మరో పెళ్లి చేసుకున్నారు
ఆమెను నన్ను సరిగా చూసుకునేది కాదు.
ఒకరోజు కూరగాయలు కత్తిరించి అమ్మ అని చెప్పి నా చేతిలో కత్తిని పెట్టింది.
కూరగాయలు ఏమీ ఇవ్వలేదు నేను దాన్ని పట్టుకొని ఆమె కూరగాయలు తెలుస్తుందేమో అని అలా చూస్తూ ఉన్నాను. ఇంతలో నా తండ్రి దగ్గరికి వెళ్లి నేను ఆమెను పొడుస్తున్న అని చెప్పి అబద్ధం చెప్పింది .
మా నాన్న చాలా కోపంగా నన్ను తిట్టి బయటకు పంపించేశాడు. నిజానికి నా తప్పు ఏమీ లేదు అంటూ బాధపడుతూ చెబుతుంది.
ఆమె పాపను ఓదారుస్తూ…. బతుకమ్మ ఏనాడు ఏ బంధమో మనది ఇప్పుడు ఇలా కలిసాము . అంటూ వాళ్ళిద్దరు అక్కడే ఉంటారు. అలా కొన్ని నెలలు గడిచాయి వాళ్లు అక్కడ ఉన్న పండ్లు గ్రామం లో అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో సంతోషంగా ఉండేవాళ్ళు.
వాళ్ళ పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండగా
సవతి తల్లి అక్కడికి వస్తుంది ఆమె కీర్తి ని చూసి…. అమ్మ కీర్తి నన్ను క్షమించండి . నేను బయటకు పంపించేందుకు. భగవంతుడు నాకు తగిన శిక్ష విధించాడు.
అందుకు కీర్తి ఏడుస్తూ ….. ఏం జరిగింది పిన్ని.
ఆమె… నేను జారిపడి గర్భస్రావం జరిగిన నా గర్భం పోయింది.
మీ నాన్నగారు చాలా బాధపడ్డా నువ్వు జరిగిన విషయం చెప్పాను. అయినా చాలా బాధపడుతూ….. ఎంత పనిచేశావే నీ నుంచి నా బంగారు తల్లి నీ. హనుమానీ చి . ఇంటి నుంచి బయట పంపించాను నా బంగారు తల్లి ఎక్కడ ఉంటుందో ఏం చేస్తుందో కూడా పట్టించుకోలేదు చి చి.
అంటూ నా మీద అరుస్తూ గుండె నొప్పితో
కింద పడిపోయారు.
నేను హాస్పిటల్ కి తీసుకెళ్ళాను ఆపరేషన్ కి చాలా డబ్బు ఖర్చు అయ్యిందమ్మా. అని ఏడుస్తుంది పాప కీర్తి….. ఒకసారి నేను నాన్న ని చూస్తాను పిన్ని.
ఆమె…. జరిగింది మర్చిపో కీర్తి నువ్వు ఇంటికి రా. అంటూ ఆమెని ఇంటికి తీసుకు వెళుతుంది ఆ ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తారు. తండ్రికి కీర్తి ని చూసి బాధపడుతూ….. అమ్మ కీర్తి నన్ను క్షమించు.
నేను చాలా పెద్ద పొరపాటు చేశాను.
అంటూ బాధపడతాడు అందుకు ఆమె కూడా చాలా బాధపడుతున్నావా ఏం పర్వాలేదు నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి. అనీ ధైర్యం చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఆ ముసలాయన ని తీసుకొని వెళ్ళి పోతుంది .
మన పిన్ని ఆగమని చెప్పినా అసలు ఆగదు.
సరాసరి తన ఇంటికి చేరుకుంది అక్కడ ముసలావిడ…. పాప ఎందుకు మళ్లీ ఎక్కడికి వచ్చావు. మీ వాళ్ళు మనసు మార్చుకున్నారు కదా.
కీర్తి…. వాళ్లు మనసు మార్చుకున్నారు బాగానే ఉంది. నేను అక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఒకవేళ మిమ్మల్ని కూడా అక్కడ ఉండామని చెప్పిన. మొదట్లో బాగానే ఉంటారు తర్వాత ఏదో ఒక గొడవలు అవుతూనే ఉంటాయి అందుకే.
మనం ఇక్కడే ప్రశాంతంగా ఉందా అంటుంది ఆ మాటలు విన్నా ఆమె చాలా ఏడుస్తు…. చాలా చాలా కృతజ్ఞతలు అమ్మ ఏ బంధంము నేను నా గురించి ఆలోచించావు తల్లి అని హత్తుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడే ఆ బొంగుల ఇంట్లోనే ఉంటూ. వాళ్ల వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *