వెదురు బొంగుల కారు Bamboo Car | Telugu Stories | Telugu Kathalu | Panchatantra Kathalu | Fairy Tales

విలాస్పూర్ అనే గ్రామంలో మహేష్ అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి ఒక కొడుకు ఉంటాడు అతని పేరు విమల్,మహేష్ కి ఎంత డబ్బు ఉన్నప్పటికీ చాలా పిసినారి వాడు, మహేష్ తన ఊరిలో ఒక స్విమ్మింగ్ పూల్ కడతాడు, అప్పుడు విమల మహేష్ తో ఇలా అంటాడు

విమల్ : నాన్న మనం ఉన్నది ఇద్దరం మన కోసం ఇంట్లో స్వమ్మింగ్ పూల్ కడితే సరిపోయేది కదా ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టడం అవసరమా అని అంటాడు

మహేష్ : ఒరేయ్ పిచ్చోడా ఇది కట్టింది మన కోసం అనుకుంటున్నావా, ఈ స్విమ్మింగ్ పూల్ ఊరందరి కోసం అని అంటాడు

మహేష్ని  పిసినారిగానే చూసినా విమల్ కి ఈ మాటలు విని ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తుంది, వెంటనే తండ్రితో ఇలా అంటాడు

విమల్ : నాన్న నువ్వు పిసినారి వాడివి అని ఊరిలో అందరు అంటుంటారు కానీ నువ్వు వాళ్ళ మాటలు పట్టించ్చుకోకుండా ఊరి ప్రజల ఆనందం కోసం ఏకంగా ఒక స్విమ్మింగ్ పూలే కట్టవు నువ్వు చాలా గ్రేట్ నాన్న అని అంటాడు, విమల్ మాటలు విన్న మహేష్ గట్టిగా నవ్వుతూ ఇలా అంటాడు

మహేష్ ; ఒరేయ్ పిచ్చివాడా నేను స్విమ్మింగ్ పూల్ కట్టిచ్చింది ఉచితగా జనాల్ని ఇందులో ఆనందపరచడానికి అనుకున్నావా, స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే ఒక్కొక్కరి కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది, బయట టికెట్ కొనుక్కొని ఇందులోకి రావాలి, నువ్వు ఊరిలో జులాయిగా తిరుగుతూ డబ్బు మీ స్నేహితులకి ఖర్చు పెట్టడం నాకు నచ్చడం లేదు, ఇక నుంచి స్వమ్మింగ్ పూల్ బాధ్యత నీదే నువ్వే దీనికి యజమానివి అని అంటాడు

తండ్రి మాటలు విన్న విమల్ తండ్రి వ్యాపార దృష్టిని చూసి ఆశ్చర్యపోతాడు, తనలో తాను ఇలా అనుకుంటాడు

విమల్ : వామ్మో మా నాన పిసినారి బుడ్డి వదిలేసాడు అనుకున్నాను కానీ ఇదంతా నా మెడకు పెడతాడు అనుకోలేదు ఇప్పుడు నా స్నేహితులని నా సంతోషాన్ని వదిలేసి ఇంకా స్విమ్మింగ్ పూల్ కె నా జీవితాన్ని అర్పించాలేమో, ఇక ఏమైనా అంటే స్విమ్మింగ్ పూల్ నే పెళ్లి చేసుకో మనీలా ఉన్నాడు అని అనుకుంటాడు

మహేష్ : ఏంట్రా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీకు ఇంకా ఏమైనా మార్పులు కావలి అనుకుంటే చేసుకో కానీ ఇక్కడికి వచ్చేవాళ్ల దగ్గర ఎంత డబ్బు వసూలు చేస్తావు అనేది నీ ఇష్టం కానీ నాకు నెలకి కొంత డబ్బు చెల్లించాలి అని చెప్పి వెళ్ళిపోతాడు మహేష్

మహేష్ పిసినారి తనాన్ని చూసిన విమల్ కి ఏమి మాట్లాడాలో కూడా అర్ధం కాదు,

ఇంతలో ఊరిలో ఉన్న యువకులు కొందరికి ఊరిలో స్విమ్మింగ్ పూల్ కడుతున్నారని తెలిసి అక్కడికి వస్తారు, అక్కడికి వచ్చిన వాళ్ళ లో రాజు అనే వ్యక్తి విమ్మల్ ని చూసి ఇలా మాట్లాడతాడు

రాజు : అరేయ్ విమల్ ఈ స్విమ్మింగ్ పూల్ నీదా, వావ్ ఎంత పెద్దగా ఉందొ, ఇక నుంచి మనం చేసుకునే పార్టీలు అన్ని ఇక్కడే చేసుకోవచ్చు రా అని అంటాడు

ఆ మాటలకి బదులుగా విమల్ రాజుతో ఇలా అంటాడు

విమల్ : అరేయ్ ఇది నాది కాదు రా మా నాన్నది నాకే హేతుల్లో ఏమి లేదు మొత్తం మా నాన్నే చూసుకుంటాడు అని చెబుతాడు

రాజు : మీ నాన్నది నీది అని ఏంటి రా మీ నాన్నది అయితే నీది కాదా అని అంటాడు

రాజు కి మహేష్ పిసినారి తనం గురించి చెప్పలేక విమల్ మౌనం పాటిస్తాడు

ఊరి జనం కొందరు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టడానికి వస్తూ ఉంటాయారు విమల్ గేట్ దగ్గర నిలబడి ఇలా అంటాడు

విమల్ : చూడండి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టి మీరు ఆనందం పొందాలంటే కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది ఆ డబ్బు ఎంత అంటే గంటకి 50 రూపాయలు అని అంటాడు

జనాలలో ఒక వ్యక్తి మాట్లాడుతూ

వ్యక్తి : ఏంటి ఈ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే 50 రూపాయలు కట్టాలా, 50 రూపాయలు కట్టడానికి ఇందులో అంతగా ఏముందని దీనికంటే మన ఊరి చెరువు నయం అని వచ్చిన జనాలని కూడా తీసుకెళ్లి పోతాడు

అలా వచ్చిన జనాలు తేఇరిగి వెళ్లడం విమల్ కి ఎంతో నిరాశగా అనిపిస్తుంది,

విమల్ : జనాలు నా స్విమ్మింగ్ పూల్ కి టికెట్ కొనుక్కొని రావడానికి నేను వాళ్లకి ఎదో ఒకటీ చేయాలి వాళ్లకి నా స్విమ్మింగ్ పూల్ లో ఎదో ఒక విషయం ప్రత్యేకంగా ఆకర్షించాలి అంటే ఎదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు

అలా విమల్ రోజు మొత్తం ఆలోచిస్తూ ఉంటాడు అనుకోకుండా అక్కడ నుండి ఒక వ్యక్తి వెదురుబొంగులు తీసుకు వెల్తూ కనిపిస్తాడు విమల్ కి వాటిని చూసిన తరువాత విమల్ కి ఒక ఆలోచన వస్తుంది

విమల్ : నాకు ఒక ఆలోచన వచ్చింది, వెదురు బొంగులతో ఒక కార్ తాయారు చేసి ఇక్కడా పెడర్థాను పక్కనే ఒక చిన్న ఇళ్ల తయారు చేస్తాను అప్పుడు జనాలు పిక్నిక్ కి వచ్చినట్టు ఇక్కడకు రావచ్చు అని అనుకుంటాడు

వెంటనే అడవికి వెళ్ళి కొన్ని వెదురుబొంగులు తీసుకు వచ్చి కొన్ని రోజులు కష్టపడి ఒక వెదురుబొంన్గులా కార్ మరియు ఇల్లు తాయారు చేస్తాడు, స్విమ్మింగ్ పూల్ కి పైన ఒక పక్కన కార్ ని మరొక పక్క ఇల్లుని నిర్మిస్తాడు, ఆ రెండింటిని కలుపుతూ ఒక వంతేన్బ కడతాడు. ఆ నిర్మాణాన్ని చూసిన జనాలు స్విమ్మింగ్ పూల్ కి రావడానికి ఉత్సహం చూపిస్తూ ఉంటారు, టికెట్ కొనుక్కొని లోపలి వచ్చిన కొందరు యువకులు వెదురుబొంగుల కారులోకి ఎక్కి అక్కడనుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకుతూ ఎంతో ఆనందిస్తూ ఉంటారు అలా విమల్ చేసిన ఒక చిన్న ఆలోచనతో స్విమ్మింగ్ పూల్ ఎంతో గొప్పగా నడుస్తూ ఉంటుంది, విమల్ తెలివికి మహేష్ కూడా ఎంతో మెచ్చుకుంటాడు, అప్పటి నుండి విమల్ తన వృధా ఖర్చులు అన్ని వదిలేసీ స్విమ్మింగ్ పూల్ నే జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు కొద్దీ రోజుల్లోనే విమల్ స్విమ్మింగ్ పూల్ మీద వచ్చిన టికెట్స్ తో బాగా డబ్బులు సంపాదిస్తాడు, ఊరి ప్రజలకి రోజు స్విమ్మింన్గ్ పూల్ కి రావడం వెదురుబొంగుల కార్ ని చూడడం అక్కడనుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దునికి ఆనందం పొందడం ఒక అలవాటుగా మారిపోతుంది.

1 minute story

ఊరిలో జులాయిగా తిరుగుతున్న విమల్ కి తన తండ్రి మహేష్ ఒక స్విమ్మింగ్ పూల్ కట్టించి వ్యాపారం చేసుకోమని చెబుతాడు, కానీ అది చాలా సాధారణంగా ఉండడం తో ఊరి ప్రజలు ఎవరూ కూడా అక్కడికి రావడానికి నిరాకరిస్తారు, అది గమనించిన విమల్ తన తెలివితి స్విమ్మింగ్ పూల్ మీద ఒక వెదురుబొంగుల కార్ మరియు ఇల్లు నిర్మిస్తాడు, ఆ నిర్మాణం ఊరి ప్రజలకి నచ్చడం తో రోజు అక్కడికి వస్తూ ఉంటారు, వచ్చిన వాళ దగ్గర టికెట్ డబ్బులు వసూలు చేస్తూ విమల్ కొద్దీ రోజుల్లోనే చాలా డబ్బులు సంపాదిస్తాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *