వెదురు బొంగుల బోరింగ్ పంప్ Episode 80 | Telugu Stories | Telugu Fairy Tales | Story World Telugu

రుద్రాపురం అనే గ్రామంలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మ సీత తో కలిసి ఉండేవారు, ఆ ఊరిలో తాగడానికి కూడా నీళ్లు సరిగా దొరికేవి కావు కొన్ని సంవత్సరాలుగా ఊరు కరువుతో అల్లాడిపోతోంది, అలా ఉండగా ఒకరోజు ఊరిపెద్ద జగన్  ఊరిలో కొంతమంది ప్రజలతో ఊరి మధ్యలో ఉంది ఇలా అంటాడు

జగన్ : చూడండి ప్రజలారా మన ఊరు ఒకప్పుడు నీటితో పచ్చని పొలాలతో కల కళ్లాడుతూ ఉండేది, గత కొన్ని సంవత్సరాలుగా మనం అంతా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నాము మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనమే కారణం అని ఎంత మందికి తెలుసు అని అంటాడు

ఇంతలో జనాల మధ్య నుంచి రంగయ్య ఇలా అంటాడు

రంగయ్య : ఏంటి మన ఊరిలో కరువు రావడానికి మనం కారణం ఎలా అవుతాము మీరు చెప్పడం బానే ఉంది, కరువు రావాలని ఎవరైనా కోరుకుంటారు అని అంటాడు

జగన్ : అవును కరువులు కష్టాలు రావాలని ఎవరు కోరుకోరు కానీ ఇదంతా మనం చేసుకున్నదే అని ఇప్పటికి అంటాను నేను, ఎందుకంటే మన ప్రతి అవసారిణికి అడవులకు వెళ్లి చెట్లు నరకడం తో పాటు ఇళ్లలో ఉన్న చెట్లు కూడా మనకి అడ్డం అవుతున్నాయని వాటిని నరికేస్తున్నాము, చెరువుల వెంబటి పొలాలు పెంచుకుంటూ పోతున్నాము ఇలా చేయడం వాళ్ళ చెరువుల విస్తీర్ణం తగ్గిపోతుంది, చెట్లు నరకడం వాళ్ళ వర్షాలు పడవు అప్పుడో ఇప్పుడో పడిన వర్షాల వల్ల వచ్చిన నీరు నిలువ ఉండడానికి స్థలం లేదు ఇప్పుడు చెప్పండి దీనికి కారణం మనం కాదంటారా? అని అంటాడు

ఇదంతా అక్కడే ఉండి జగన్ చెప్పిన మాటలు అన్ని విన్న సీత ఇంటికి వచ్చి బాలు కీర్తి తో చెబుతుంది అంతలో బాలు వాళ్ల అమ్మతో ఇలా అంటాడు

బాలు : అమ్మ అదే విషయం నేను ఏఒప్పటినుంచో చెబుతూనే ఉన్నాను, మా టీచర్ చెప్పిందమ్మా చెట్ల వల్లనే వరాశాలు పడతాయని అది నేను కూడా చెప్ప్పినా కనీసం మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా వినలేదు అదే మాట జగన్ చెప్పే వరకు అందరు వింటున్నారు అని అంటాడు

కీర్తి : అమ్మ ఇన్ని రోజులు చెల్ట్లు చేమలు మరికేసి ఇప్పుడు కరువులు వచ్చాయని ఇప్పుడు బాధపడితే లాభం ఏంటి? అందరు ఇప్పుడు మన ఊరి పెద్ద జగన్ చెప్పాడని ఇళ్లకు వెళ్లి మొక్కలు నాటుతారు , ఈ పిచ్చి జనాలకి అర్ధం కానీ విషయం ఏంటంటే ఆ మొక్కలు పెరగాలన్న కూడా నీళ్లు కావలి, అయినా ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను నరికి ఇప్పుడు మొక్కలు పెడితే అవ్వి ఎప్పుడు పెరగాలమ్మ అని అంటుంది.

సీత : ఇప్పుడు ఇవ్వన్నీ అనుకోని ఏమి లాభం అమ్మ ఇప్పుడు మనం గట్టెక్కే ఆలోచన ఏదైనా ఉంటె చెప్పండి, జనాలు నీళ్లు లేక చచ్చిపోయేలా ఉన్నారు, అక్కడో ఇక్కడో ఎదో బావులలో ఉన్న అడుగు బొడుగు నీళ్లు కూడా అయిపోతున్నాయి, మంచి నీళ్ల కోసం రెండు ముడ్డి మైళ్ళు వెళ్లి తేవలసి వస్తుంది అని అంటుంది సీత

బాలు : అమ్మ మా టీచర్ ఒక మాట చెప్పిందమ్మా, నీళ్లు భూమిలో ఉన్న చోట భూమి అంతటా వచ్చే లాంటి చప్ప్పుడు కాకుండా కొంచం వేరే లాంటి శబధం వస్తుందని మన ఊరిలో అలాంటి శబ్దం ఎక్కడైనా వస్తుందేమో చూస్తాము అక్క నేను వెళ్లి, ఎక్కడైనా దొరికిందా  మనతో పాటు మన ఊరందరి అదృష్టం లేదంటే ఇక మనకి ఎప్పటి కష్టాలే, అని అంటాడు

కీర్తి : అవునమ్మా మా టీచర్ నిజంగానే చెప్పింది, మేము వెళ్లి చూసి వస్తామమ్మ అని అంటుంది.

అలా చెప్పి బాలు కీర్తి వాళ్ళు శబ్దం వినిపించడానికి వెదురుబొంగుతో చేసిన ఒక రకమైన పరికరాన్ని తయారు చేస్తారు, అలా తాయారు చేసిన వెదురుబొంగు పరికరాన్ని పట్టుకొని నీటి శబ్దం వచ్చే స్థలం కోసం ఊరంతా వెతుకుతుంటారు

ఊరంతా తిరిగినా కూడా వారికి అలాంటి శబ్దం ఎక్కడా వినిపించదు, అలా నిరాశతో బాలు కీర్తి ఇద్దరు ఇంటికి వస్తారు

ఇంటికి వచ్చిన బాలు సీతతో ఇలా అంటుంది

కీర్తి : అమ్మ ఊరంతా ఎంత వెతికినా కూడా ఎక్కడా నీరు ఉన్నట్టు చప్పుడే రాలేదమ్మా అని అంటుంది,

సీత : పోనీలేందమ్మ మన ఊరికి ఇక నీరు వచ్చే అవకాశం లేనట్టుఉంది, మనం అందరి లాగే ఇలా కష్టాలు పడుతూనే ఉందాము అని అంటుంది.

ఇంతలో ఇంటి ముందు ఉన్న బాలు అరుస్తూ ఉంటాడు

బాలు : అమ్మ అమ్మ అక్క అక్క తొందరగా ఇక్కడకు రండి రండి అని అరుస్తూ ఉంటాడు

బాలు దగ్గరికి వెళ్లిన కీర్తి సీత బాలు తో

సీత : ఏంట్రా బాలు ఏమయ్యింది అలా అరుస్తున్నావు అని అంటాడు

బాలు  ; అమ్మ విన్నారా? మేము ఏదైతే అనుకున్నామో అలాంటి శబ్దం ఇక్కడ వినిపిస్తుంది కావాలంటే మీరు కూడా వినండి అని వెదురుబొంగు పరికరాన్ని ఒక చోట పెట్టి కీర్తి సీత ఒకరొకరుగా చెవి పెట్టి శబ్దాన్ని వింటారు

కీర్త : అవునమ్మా నిజంగానే శబ్దం వస్తుంది అని అంటుంది

బాలు : అమ్మ ఒక జేసీబీ ని తెప్పిచ్చి ఇక్కడ తవ్విస్తే కచ్చితంగా నీళ్ల్లు వచ్చే అవకాశం ఉండమ్మ అని అంటాడు

వీళ్ళ హడావిడి చూసిన జగన్ అక్కడికి వస్తాడు

జగన్ : ఏంటమ్మా ఇక్కడేదో హడావిడిగా ఉంది? అని అంటాడు

బాలు : అంకుల్ ఇక్కడ కొంత లోతు తవ్వితే ఇక్కడ నీరు పడే అవకాశం ఉంది అని అంటాడు

జగన్ : మీ లాంటి తెలివైన పిల్లలు ఉంటె చాలా గొప్ప విషయం, ఇక్కడ నీరు పడతాయో లేదో అని నాకైతే నమ్మకం లేదు కానీ మీరు అంటున్నారు కాబట్టి ఒక సారి తవ్వి చూద్దాం నీరు పడిందంటే మంచిది లేదంటే ఎప్పటి ఆటే ప్రయత్నం రాయితీ చేసి చూద్దామ్ అని జేసీబీ తెప్పిచ్చి బాలు చెప్పిన చోట తవ్విస్తాడు చాలా లోతు తవ్విన తరువాత అక్కడ నీటి ఆనవాళ్లు కనిపిస్తాయి.

జగన్ : అరేయ్ బాలు నీ తెలివ్వితో ఊరినే బ్రతికించారు, ఇక్కడ నిజంగానే నీరు ఉంది కానీ ఆ నీరు చాలా లోతుగా ఉంది, ఆ నీటిని పైకెలా తీసుకురావాలో అర్ధం కావడం లేదు అని అంటాడు

అప్పుడు కీర్తి ఇలా అంటుంది

కీర్తి : మన ఊరిలో చాలా చోట్ల వెదురుబొంగు చెట్లు ఉన్నాయి కదా వాటిని ఇందులో దింపి ఆ వెదురుబొంగుల నుండి నీటిని పైకి తీసుకురావొచ్చు అని అంటుంది.

జగన్ కొన్ని వెదురుబొంగులు తెప్పించి నీటికోసం తీసిన గుంటలోకి పంపిస్తాడు

చాలా వాటిని లోపలి పంపిన తరువాత నీరు బయటకు వస్తుంది, అది చూసిన ఊరి జనమంతా ఎంతో సంతూషపడతారు, బాలు కీర్తి ని చూసి ఎంతో మెచ్చుకుంటారు, అది చూసిన సీత కూడా ఎంతో సంతోష పడుతుంది.

1 మినిట్ స్టోరీ

రుద్రాపురం అనే గ్రామంలో ప్రజలందరూ కరువుతో బాధపడుతుంటారు, అదే ఊరిలో బాలు కీర్తి అనే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మతో కలిసి ఉంటారు. బాలు తాను తాయారు చేసిన ఓక్ రకమైన పరికరంతో ఊరంతా వెతుకుతుంటారు, అలా చూడగా చూడగా బాలు కీర్తిలకు ఒక చోట ఒక రకమైన శబ్దం వినిపిస్తుంది, ఊరి పెద్ద సహాయంతో ఆ చోట జేసీబీ తో తవ్విస్తారు, నిజంగానే అక్కడ నీరు వస్తాయి, దాంట్లో వెదురుబొంగులని అందులోకి పంపించి నీటిని బయటకు రప్పిస్తారు, అలా బాలు కీర్తి చేసిన పనికి ఊరంతా సంతోషంగా ఉంటారు, బాలు కీర్తిని కూడా మెచ్చుకుంటారు

Add a Comment

Your email address will not be published. Required fields are marked *