వెదురు బొంగుల వంతెన | Telugu Kathalu | Telugu Moral Stories | Bedtime Stories | Panchatantra kathalu

అది శ్రావణ పురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో బేబీ అనే ఒక పాప ఉండేది. ఆమె ఊరిలో సమస్యలన్నిటినీ తీరుస్తుంది చాలా తెలివైన అమ్మాయి. తల్లిదండ్రులు ఎవరూ లేకపోవడంతో ఆ పాపని రోజుకు ఒక కుటుంబం దగ్గర ఉంచుకునే వాళ్ళు . ఆ గ్రామ సభ్యులే ఆ పాపని చదివిస్తూ ఉంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. అలా వుండగా ఒక రోజు పక్క గ్రామం నుంచి లింగయ్య అనే వ్యక్తి. శ్రావణి పురానికి వస్తాడు అతను సరాసరి ఆ ఊరి పెద్ద అయినా కృష్ణయను కలుస్తాడు.
అతను… కృష్ణయ్య నేను నీ దగ్గరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసం వచ్చాను. అందుకు అతను ఏంటో చెప్పమని అడుగుతాడు.
అప్పుడు అతను…… మా ఊరిలో ఒక పెద్ద సమస్య వచ్చింది. మా ఊరు నుంచి పక్క గ్రామానికి వెళ్లడానికి ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. నిజం చెప్పాలి అంటే కావాలని కూల్చి వేశాడు. అలా చేసింది ఎవరో కూడా నాకు బాగా తెలుసు కానీ డబ్బు పదవి ఉన్నకారణంగా మేం వాడిని ఏం చేయలేక పోతున్నాము. ఇప్పుడు బ్రిడ్జి కట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఒకవేళ మేము కట్టించిన కూడా ఇటుకలు కానీ పనికి కావలసిన సామాన్లు అన్నీ అతని దగ్గర మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఆ సామాన్లు అన్నీ అతని దగ్గర తీసుకోకపోతే అతను ఊరుకోడు. ఇసుక సిమెంటు ఇటుకలు . తాపీ పనిముట్లు అని అతని దగ్గర తీసుకోవాలి. లేదంటే చాలా ఇబ్బంది పెడతాడు.
దీనికి పరిష్కారం కోసం ఏదన్నా ఉపాయం చెబుతావని వచ్చాను. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు మాకు ఏదైనా ఒక సలహా ఇవ్వు.
అందుకు అతను…. సలహాలు ఇవ్వడానికి నేను అంత తెలివైన వాడిని కాదు. కానీ బేబీ అనే ఒక పాప ఉంది. వయసులో చిన్న పాప కావచ్చు కానీ. తెలివితేటల్లో కాదు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చెబుతుంది.
స్కూల్ నుంచి వచ్చే సమయం అయ్యింది. ఒక 10 నిమిషాలు ఎదురు చూద్దాం. అని అంటాడు అందుకు అతను సరే అంటాడు కొంత సమయం తర్వాత. బేబీ స్కూల్ నుంచి అక్కడికి వస్తుంది.
అప్పుడు వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నా అమ్మ అని అంటారు. ఏం జరిగిందో చెప్పండి అని బేబీ అంటుంది అప్పుడు అతను జరిగిన విషయం అంతా పూర్తిగా వివరిస్తాడు. పాప చాలా సేపు ఆలోచించి వాళ్లతో…… మనకు అక్కడ బ్రిడ్జి ఏర్పాటు కావాలి. అంతే కదా. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఎదురు బొంగులతో బలమైన బ్రిడ్జిని ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు అతని తో మనం మాట్లాడడానికి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇటుకలు కానీ ఇసుక కానీ వాడటం లేదు అలాంటప్పుడు అతనికి మనం భయపడాల్సిన అవసరం లేదు.
ఒకవేళ మనం ని అడిగితే మనం కూడా అదే సమాధానం చెప్తాం . అందుకు వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతూ చాలా తెలివిగా ఆలోచించి పాప శభాష్ అని ఆమెను మెచ్చుకుంటారు పాప కూడా ఆ ఊరికి వెళ్తుంది. అక్కడ ఎదురు బొంగులతో బ్రిడ్జి ని ఏర్పాటు చేస్తూ ఉంటారు.
అప్పుడు ఆ జమీందారు కృష్ణయ్య మరియు సింగయ్య దగ్గరకు వచ్చి…… ఏంటి మీరు చేస్తున్నది నన్ను కాదు అని చెప్పి బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నారా అందుకు వాళ్ళు……
అయ్యో మిమ్మల్ని ఎదిరించే ధైర్యం మాకు ఎక్కడ ఉందండి. అందుకే కదా మేము బొంగులతో బ్రిడ్జి ని ఏర్పాటు చేస్తున్నాము. మిమ్మల్ని కాదు అని ఇసుక కానీ ఇటుకలు కానీ సిమెంట్ కానీ మేము ఎక్కడ తీసుకు రాలేదు కదా . మీ మీద గౌరవం తోనే కదా అలా చేసింది అని అంటారు ఆ మాట కి అతను ఏం మాట్లాడకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
ఇక కొన్ని రోజుల తర్వాత బ్రిడ్జి పూర్తవుతుంది. ప్రజలందరూ ఆ బ్రిడ్జి మీద సంతోషంగా పక్క గ్రామానికి చేరుకుంటారు. కానీ అది ఏమాత్రం జమీందారుకి నచ్చదు ఆ బ్రిడ్జి ని కూడా కూల్చి వేస్తాడు.
కానీ అక్కడున్న ప్రజలు ఏమాత్రం బాధ పడకుండా మళ్లీ బిజీ ఏర్పాటు చేస్తారు కేవలం గంటలోపు మాత్రమే. చేసుకుంటారు దాని అంతా చూసిన జమీందారు చాలా కోపంగా ఉంటాడు మరుసటిరోజు కూడా ఆ బ్రిడ్జి ని కూల్చి వేస్తాడు అలా వారం రోజులపాటు చేస్తాడు ఆ వారం రోజులు కూడా ప్రజలందరూ. గంటల్లోనే బ్రిడ్జి ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు దాన్నంతా చూసి జమీందారు బాగా విసిగిపోయి. తనలో….. ఎదురు బొంగులతో కట్టిన బ్రిడ్జి కాబట్టి చాలా సులువుగా గంటలో నిర్మించుకుంటున్నారు. ఎప్పటిలాగే జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి నాకే చాలా చిరాగ్గా ఉంది. కలిసికట్టుగా అందరూ కలిసి పోయారు. ఇంకా ఏమి చేయలేను అని ఊరుకుంటే పోతాడు.
ఇక ప్రజలు ఎప్పటిలాగే బ్రిడ్జి పైన ప్రయాణం సంతోషంగా ఉంటారు. జమీందారు కూడా అభివృద్ధి జోలికి రాకపోవడంతో ఊరు వాళ్ళు అందరూ చాలా సంతోష పడతారు ఇక అందరూ కలిసి బేబీ దగ్గరికి వెళ్తారు. ఆమెను ఎంతగానో పొగడ్తలతో ముంచుతారు . పాపా చాల సంతోషపడుతూ…. మీ అందర్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ. నేను ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్పాను కానీ ఇది నా జీవితంలో ఒక ఊరి సమస్య తీర్చినందుకు సంతోషంగా ఉంది.
అంటూ వాళ్లతో చెబుతుంది వాళ్లు కూడా చాలా సంతోష పడతారు.
ఇక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు.
రోజులు గడిచాయి రోజు పక్క గ్రామం జమీందారు అక్కడికి చేరుకుంటాడు. అతను కృష్ణ యతో …. నాకు ఆ బ్రిడ్జి ని ఏర్పాటు చేసిన పాప తెలివితేటలు బాగా నచ్చాయి. నాకు పిల్లలు లేరు నేను ఆ పాపని దత్త తీసుకుంటాను. అని అంటాడు అందుకు కృష్ణయ్య సందేహిస్తూ ఎందుకంటే. జమిందార్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి. అతను సందేహించడం చూసిన జమీందారు
కన్నీళ్లు పెట్టుకొని….. ఇదివరకు నేను ఎన్నో తప్పుడు పనులు చేశాను కానీ నాకు
చాలా బుద్ధి వచ్చింది నాకు పిల్లలు లేకపోవడానికి కారణం నేను చేసిన చెడ్డ పనులు అని అందరు నా గురించి చెప్పుకోవడం నా భార్య నేను విన్నాము.
నా భార్య చాలా బాధపడి నన్ను అనరాని మాటలు అన్నది. ఆ మాటలను ఆమె బాధ కనబడింది నా కళ్ళు తెరుచుకున్నాయి. అని జరిగిన విషయం చెప్తాడు. అందుకు కృష్ణయ్య అంటాడు పాపతో మాట్లాడుతాడు.
పాపా…. నేను ఈ ఊరిని విడిచి ఎక్కడికి వెళ్ళను. నేను ఈ ఊరి ప్రజలతో ఎంతో అనుబంధం పెంచుకున్నాను. అని అంటుంది అప్పుడు కృష్ణయ్య….. చూడమ్మా ని భవిష్యత్తు బంగారుబాట వేయడానికి ఇదొక మంచి అవకాశం. అని మంచిమాటలు చెబుతాడు అందుకు ఆమె సరే అంటుంది. అతనితోపాటు వెళ్లడానికి సిద్ధపడుతుంది ఇక జమిందార్ కూడా సంతోష పడతాడు పాపను తీసుకుని తన ఇంటికి వెళతాడు.
పాప అక్కడే పెరుగుతూ ఉంటుంది ఆ ఊరి ప్రజలందరూ జమీందారు ని చూసి ఆశ్చర్యపోతారు ఆయన ప్రవర్తన రోజురోజుకీ చాలా మార్పు వస్తుంది అదంతా కేవలం బేబీ వల్ల మాత్రమే సాధ్యమౌతుంది ఎంతోమంది పేదవాళ్లకు సహాయం చేస్తూ
ఉంటాడు జమీందారు దాన్ని చూసి ఊరి ప్రజలందరూ అతని దేవుడు అని పొగుడుతూ ఉంటారు. అతను ఇటుకలతో కూడా ఒక మంచి బ్రిడ్జి ని ఏర్పాటు చేస్తాడు.
అతను సొంత డబ్బులతో ఊరి యొక్క రూపురేఖలను మార్చేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతని ఊరి పెద్దగా మారిపోతాడు.
అందరూ అతని గౌరవిస్తూ నమస్కారాలు చేస్తూ ఉంటారు దానికి కారణమైన బేబీకి అతను కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *