సర్కస్ చేసే ఏనుగు పిల్ల_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కోదండం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణయ్య అనే ఒక

ముసలి వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు . పని చేయడానికి అతని దగ్గర అంత ఓపిక కూడా లేదు. అతను ఏం చేయలేని పరిస్థితిలో తన ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ భగవంతుని ప్రార్ధిస్తూ ఉంటాడు. ఇంతలో ఒక చిన్న ఏనుగు పిల్ల దూరంలో ఆడుకుంటూ కనబడుతుంది.
దానిని చూసి న కృష్ణయ్య తన మనసులో… అరే ఈ ఏనుగు పిల్ల బలే గా ఆడుతుంది . దూరాన్నుంచి చూస్తుంటే సర్కస్ చేసినట్టుగా ఉంది. అని అనుకుంటూ ఉండగా అతని మనసులో…. అరే సర్కస్ అంటే భలే గుర్తుకు వచ్చింది. ఆ ఏనుగు పిల్ల ని మచ్చిక చేసుకొని దీని చేత సర్కస్ చేపిస్తే. ఎంతో కొంత డబ్బులు వస్తాయి. దీని బాగా మేపి కొంచెం పెద్దదాన్ని చేసిన తర్వాత దీని చేత సర్కస్ చేయిస్తే. దానివల్ల నాకు కూడా కొంత కష్టం తీరుతుంది. అని అనుకొని ఆ ఏనుగు పిల్ల దగ్గరకు వెళ్లి దానికి తినడానికి ఆహారం ఇస్తాడు. దాన్ని తిన్న ఏనుగు పిల్ల చాలా సంతోషం తో….. చాలా బాగుంది మీరు ఇచ్చిన ఆహారం. చాలా కృతజ్ఞతలు మీకు అని అంటుంది.
కృష్ణయ్య…. నువ్వు ఆడుకోవడం విధానం సర్కస్ చేసినట్టుగా ఉంది . నువ్వు గనక నాతో పాటే ఉంటే కొంచెం పెద్దయిన తర్వాత నీ చేత నేను సర్కస్ చేయిస్తాను ఏమంటావ్.
అందుకు ఆ ఏనుగు పిల్ల…..సరే నేను మీతో పాటే వస్తాను అని చెప్పి అతనితోపాటు వెళుతుంది అలా రోజులు గడిచాయి.
ఆ ఏనుగుకి బలమైన ఆహారం అందించడం కోసం కృష్ణయ్య అప్పు చేసి మరి దానికి పోషకమైన ఆహారం అందిస్తూ ఉంటాడో అలా రోజులు గడిచాయి అతని పరిస్థితి ఏమీ బాగోలేదు దిన దిన గండం లాగే ఉంటుంది.
అతను తన మనసులో…. ఏనుగు పిల్ల కొంచెం త్వరగా పెద్ద అయితే బాగుండు దీనికి సర్కస్ నేర్పించి . నాలుగు రూపాయల వెనకేసుకు వద్దాం అనుకుంటున్నా భగవంతుడా త్వరగా జరిగేలా చెయ్ అప్పులు బాధలు ఎక్కువైపోతున్నాయి. వాళ్లు మా ఇంటి మీదకు రాకముందే వాళ్ళ అప్పు తీర్చే లాగా చేయి అని అనుకొని బాధపడుతూ ఉంటాడు .ఏనుగు పిల్ల అతని దగ్గరకు వచ్చి…. ఎందుకు మీరు అలా బాధ పడుతున్నారు. నేను ఉన్నా కదా నేను మీకు సహాయం చేస్తాను. నాకు సర్కస్ చేయడం నేర్పించండి. ఆ మాటలకి అతను చాలా బాధ పడుతూ… నువ్వు అన్న మాటలు నాకు కొంత ఆనందంగా ఉన్నా. ఇంత చిన్న వయసులోనే చాలా సర్కాస్ చేయించడం మంచిది కాదు.
ఏనుగు పిల్ల….అలా అని ఎవరు చెప్పారు ఈ వయసు నుంచి నేర్చుకుంటే నేను పెద్దదాన్ని అయ్యేటప్పటికీ చాలా బాగా సర్కస్ చేయగలను. నా మాట విని నాకు సర్కస్ నేర్పించండి. అని అంటుంది. అందుకు అతను ఆ ఏనుగు పిల్ల మాటలు నచ్చి…నువ్వు చాలా తెలివిగల దానివి నీకు తప్పకుండా సక్సెస్ నేర్పిస్తాను. తన ఇంటి ముందే సర్కస్ చేయడం నేర్పిస్తూ ఉంటాడు. ఆ ఏనుగు మొదట్లో కొంచెం కష్టపడుతూ తనలో….. నాకు చాలా కష్టంగా ఉంది. కానీ నేను యజమానికోసం కష్టపడాలి. తప్పదు ఆయన ఇప్పటికే చాలా బాధపడుతున్నాడు. భగవంతుడా నేను త్వరగా మంచిగా సర్కస్ నేర్చుకునేలా నన్ను దీవించు. అని తన మనసులో అనుకుంటూ ఉంది అతను ఆ ఏనుగు బాధను అర్థం చేసుకొని….. నేను ముందే చెప్పాను ఇంత చిన్న వయసులో నీకు సర్కస్ ఇలాంటివి వద్దు కొంచెం పెద్దయిన తర్వాత నేర్పిస్తానని. నువ్వే నా మాట వినలేదు నీకు చాలా కష్టంగా ఉంది నాకు అర్థం అవుతోంది.
ఏనుగు పిల్ల…. అలా ఏం లేదు నేను మా అమ్మ లాగా మంచిగా సర్కస్ చేస్తాను.
అని అంటుంది అలా రోజులు గడిచాయి ఆ ఏనుగు చాలా పట్టుదలతో సర్కస్ నీ నేర్చుకుంటుంది. దాన్ని చూసిన అతను చాలా సంతోష పడుతూ ఉంటాడు. అలా రోజులు గడిచాయి అతను ఒక రోడ్డుపైన ఆ ఏనుగు చేత సర్కస్ చేయిస్తూ ఉంటాడు. అయినా నువ్వు చాలా చక్కగా సక్సెస్ చేస్తూ ఉంటుంది. అతను…. రావాలి బాబు రావాలి చూడాలి బాబు చూడాలి ఈ వింత చూడండి. చిన్న ఏనుగు అయినా బలమైన ఏనుగు. ఎంత బరువైన ఎత్తి పక్కన పడేస్తుంది.
బంతి పైన నిలబడి సర్కస్ చేస్తుంది.
అలా ఎన్నో వింతలు చేస్తుంది చూడాలి బాబు చూడాలి రావాలి బాబు రావాలి. అంటూ కేకలు వేస్తారు అక్కడికి చాలా మంది వచ్చి చప్పట్లు కొడుతూ ఆ ఏనుగు చేసే విన్యాసాలు చూస్తూ. అతనికి డబ్బులు వేసి వెళ్తారు. అలా కొంత సమయం తర్వాత. అతను…. ఈ రోజుకి ఆట ముగిసింది మీరు వెళ్ళచ్చు. మళ్లీ రేపు ఇదే సమయానికి అక్కడికి వస్తాను మీ అందరికీ చాలా ధన్యవాదాలు అని చెప్తాడు.
అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత అతను కింద పడిన డబ్బులు మొత్తం పోగు చేసుకొని తన సంచిలో పెట్టుకుంటాడు.
ఆ ఏనుగుతో…. నువ్వు చాలా చక్కగా చేస్తున్నావు నీకు బలమైన ఆహారం నేను అందిస్తాను. అని అంటాడు ఆ ఏనుగు కూడా చాల సంతోషపడుతూ… నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండటం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు బాధపడకు నేను నీతోనే ఉంటాను కదా. అని అంటుంది ఇంతలో ఒక వ్యక్తి అక్కడకు వచ్చి… బాబు రేపు నువ్వు ఆ ఏనుగు ని తీసుకొని మా ఇంటికి వచ్చావా అంటే నీకు కోరిన డబ్బు ఇస్తాను.
అందుకు అతను…. కానీ బాబు గారు ఎందుకు అలాగా.
అతను…. రేపు వస్తే నీకే అర్థమవుతుంది. నా పేరు మహేష్ ఈ వీధి చివర పెద్ద బంగ్లా అది మాదే. రేపు ఉదయం త్వరగా వచ్చేయ్.
అందుకు కృష్ణయ్య…సరే బాబు గారు వస్తాను అని చెప్పి ఆ ఏనుగును తీసుకొని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.మహేష్ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మరుసటి రోజు ఉదయం కృష్ణయ్య ఆ ఏనుగు పిల్ల ని తీసుకుని తన ఇంటి ముందు కి వెళ్తాడు అక్కడ….. మహేష్ బాబు గారు నేను వచ్చాను ఒకసారి బయటికి వస్తారా.
అని పెద్ద పెద్దగా కేకలు వేస్తాడు ఇంతలో మహేష్ ఇంటి నుంచి బయటకు వచ్చి… చాలా కృతజ్ఞతలు అండి మంచి పని చేశారు ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్తాడు.
కృష్ణయ్య…. ఈ బాబు గారు మనల్ని ఎందుకు రమ్మన్నారు. అంటూ ఉండగా మహేష్ లోపలికి వెళ్లి తన తల్లిని బయటకు తీసుకొని వస్తాడు. ఆమె వయసు పెద్దదే కాని. ఆమె చిన్న పిల్లలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది.
దాన్ని చూసిన అతను ఆశ్చర్యపోతాడు మహేష్…..బాబు నువ్వు ఏనుగు చేత సర్కస్ చేయించు మా అమ్మ చూస్తుంది.
అని అంటాడు అందుకు కృష్ణయ్య సరే అని చెప్పి ఆ ఏనుగు చేత సర్కస్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూస్తున్న ఆమె చప్పట్లు కొడుతూ….. బలే బలే బలే బలే బలే భలే బాగుంది ఈ ఏనుగు బలే సర్కస్ చేస్తుంది. అని అంటుంది.
అలా చాలా సమయం వరకూ ఆ ఏనుగు తో సర్కస్ చేయిస్తాడు. కొంత సమయం తర్వాత కృష్ణయ్య…. బాబు గారు ఇంకా చాలా అండి ఏనుగు ఆలిసి పోతుంది అని అంటాడు.
అందుకు అతను…. సరే ఇంక చాలు ఆపండి.అని చెప్పి తన తల్లిని ఇంటి లోపలికి తీసుకు వెళ్తాడు. ఆమెను మంచం పై ఉంచి ..అమ్మ నేను ఇప్పుడే వస్తాను నువ్వు అక్కడే ఉండు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి
అతను బయటికి వస్తాడు.
మహేష్… బాబు చాలా బాగా ఆడించారు ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి ఇది సరిపోకపోతే ఇంకా ఇస్తాను. రేపు కూడా ఇదే సమయానికి ఇక్కడికి రండి. అని అంటాడు
కృష్ణయ్య…. బాబు గారు మీరు ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చారు నాకు ఇది చాలు.
మీరు ఏమి అనుకోకపోతే ఒక మాట అడగొచ్చా.
మహేష్…. అడగండి.
కృష్ణయ్య…. ఆమె ఎవరు ఆమెకు ఏం జరిగింది.
ముందుకు మహేష్ ఏడుస్తూ …. ఆమె మా అమ్మ ఆమెకు నేనంటే చాలా ఇష్టం నేను కూడా మా అమ్మని చాలా ఇష్టపడతాను. చిన్నప్పుడే మా నాన్న లేకపోవడంతో నన్ను అల్లారు ముద్దుగా పెంచింది నేను ఒక మంచి స్థాయిలో కి వచ్చాను మా అమ్మని బాగా చూసుకుందాం అనుకున్నాను.
ఇంతలో విధి వక్రించింది.
ఆరోజు నేను ఆఫీస్ కని వెళ్తున్నాడు ఇంతలో వర్షం పడేలాగా ఎలా ఉంది అని మా అమ్మ….
మహేష్ వర్షం పడేలా ఉంది బాబు కొడుకు తీసుకెళ్ళు ఆగు నువ్వు టిఫిన్ కూడా సరిగ్గా చేయలేదు బాక్స్ పెడతాను తీసుకెళ్ళు అంటూ నన్ను పిలిచింది.
నేను దూరంగా ఉండి…. అమ్మ నేను వెళుతుంది కారు లో గొడుగు అవసరం లేదు. నేను ఏదో ఒక హోటల్లో తింటాను.
అమ్మ…. హోటల్లో ఎందుకురా హోటల్ భోజనం తినొద్దు నాన్న నేను ఇంట్లో మంచి భోజనం చేశాను నీ కోసం తీసుకెళ్ళు ఆగు.అని హడావిడిగా లోపలికి వెళ్లి బాక్స్ తీసుకుని వస్తుండగా కాలు జారి కింద పడి తలకి బలమైన గాయం అయింది.
అప్పటి నుంచి మా అమ్మ కి మతి స్తిమితం లేదు. మా అమ్మ పిచ్చి అయిపోయింది. అప్పటినుంచి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను. మా అమ్మ ఒక రోజు… నాకు ఏనుగు కావాలి. నాకు ఏనుగు కావాలి. నాకు ఏనుగు కావాలి అంటూ మారాం చేస్తుంది.
నేను…. అమ్మ నేను ఏం కూడా తీసుకొస్తాను అమ్మ అన్నం తిన్నామా.
ఆమె…. నాకు ఏనుగు కావాలి . ఏనుగు లేకపోతే నేను అన్నం తినను. అని మారం చేస్తుంది. రెండు రోజుల నుంచి అన్నం తినలేదు. నేను ఏనుగు కోసం తిరగని ఊరు లేదు అనుకోకుండా మీరు సర్కస్ చేపిస్తూ కనిపించారు మీరు నా పాలిట దేవుడు.
మా అమ్మ ఏ పరిస్థితిలో ఉన్న నాతోనే ఉందని నేను సంతోష్ పడుతున్నాను ఆమె నాతోనే ఉండాలి. అందుకోసమే ఇదంతా అని ఏడుస్తాడు.
కృష్ణయ్య… బాధపడకు బాబు నేను ప్రతి రోజు ఇక్కడికి వస్తాను. అని చెప్పి అక్కడ నుంచి నువ్వు తీసుకొని వెళుతుండగా.
ఇంతలో ఆమె బయటకు వచ్చి …. ఏనుగు ఏనుగు ఎక్కడికి వెళ్తుంది. ఏనుగు వెళ్లి పోతే నేను అన్నం తినను. అని అంటుంది.
అందుకు మహేష్….. అమ్మ నువ్వు అన్నం తిను ఈ ఏనుగు ఎక్కడికి వెళ్ళద్దు అని ఆమెకు అన్నం తినిపిస్తాడు.ఆ ఏనుగు నీ కృష్ణయ్య అక్కడే ఉంచుతాడు. ఆమె భోజనం తింటుంది. కానీ ఆ ఏనుగుని మాత్రం ఎటు కథ నివ్వదు.
అప్పుడు మహేష్….. అయ్యా మీరు ఏమీ అనుకోకుండా మా ఇంట్లోనే ఉండండి అప్పుడు మా అమ్మ ప్రశాంతంగా అన్నం తింటుంది. కాదనకండి
అందుకు కృష్ణయ్య…. నీకు ఆ తల్లి మీద ఉన్న ప్రేమను చూసి నేను కాదనలేక పోతున్నాను తప్పకుండా ఇక్కడే ఉంటాను.
అని అతనికి ఆ ఈరోజు నుంచి ఆ ఏనుగు ని అక్కడే ఉంచి దాని చేత సర్కస్ చేయించి ఆమెని ఆనందపరుస్తూ ఉంచుతాడు దాన్ని చూసిన మహేష్ కూడా చాలా సంతోష పడతాడు. ఆ విధంగా ఒక కొడుకు తన తల్లి కోసం అలాగే పొట్టకూటికోసం దేవుని ప్రార్థిస్తున్నా కృష్ణయ్య ను ఆ భగవంతుడు ఒకటి చేసి ఒకరి ఆనందాలు ఒకరితో తీర్చే ఎలా చేస్తున్నాడు. ఆ ఏనుగు వాళ్ళ ఆనందాన్ని చూసి తనలో….. నాకు వీళ్ళ ఆనందాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. నా వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు.
కృష్ణయ్య బాధ తీరింది. అలాగే మహేష్ తన తండ్రి సంతోషాన్ని చూసి ఎంతో ఆనంద పడుతున్నాడు. అని ఆ ఏనుగు పిల్ల చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత కృష్ణయ్య కూడా తను చేసిన అప్పులన్నీ తీర్చుకొని అప్పుడు బాధ లేకపోవడంతో. అతను కూడా ఎంతో సంతోష పడుతూ ఉంటాడు.
అలా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడుపుతూ ఉంటారు. భగవంతుడి దయవల్ల ఆమె ఒక్క ఆరోగ్యం కుదిరి పడాలని మనం కూడా కోరుకుందాం
ఈ కథ గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *