సవతి కూతురు Step Daughter | Telugu kathalu | Telugu Stories |Bedtime Dreams Telugu | Kattapa kathalu

సోమరులుపురమని ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లక్ష్మి శంకర్ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకి బేబీ అని ఒక పాప ఉండేది. వాళ్ల కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. అలా రోజులు గడిచాయి. లక్ష్మీ చెల్లెలు అయిన వనజ ఇంటికి వస్తుంది . వనజా చదువుకోవడం కోసం అక్కడే ఉండి చదువుకుంటూ తన చదువులు పూర్తి చేసుకుంటుంది. అలా ఉండగా తెలియని జబ్బు చేస్తే లక్ష్మి చనిపోతుంది . దేవి చాలా బాధ పడుతూ ఉంటుంది . అప్పుడు వనజా
తల్లి లాగా బేబీ నీ చూసుకుంటూ ఉంటుంది.
దాన్ని చూసి తండ్రి చాలా సంతోషపడ్డాడు.
ఒకరోజు వనజ. శంకర్ తో…… బావ ఇంకా నేను వెళ్లి వస్తాను . పాప ని జాగ్రత్తగా చూసుకో. అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సాయంత్రం బేబీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తోంది.
ఇంట్లో వనజ లేకపోవడంతో ఆమె తండ్రితో…..నాన్న అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ కనపడటం లేదు. అందుకు అతను…. వనజ ఇంటికి వెళ్లిందమ్మ. ఇంకా రాదు అనీ చెప్తాడు ఆ మాట వినగానే బేబీ చాలా బాధ పడుతూ….. నాన్న నాకు వనజ అమ్మ కావాలి. అంటూ మారం చేస్తుంది.
అతను ఏదో ఒక సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఆమె అసలు వినదు.
ఆమె వనజ మీద దిగులుతో సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. ఎప్పుడు అమ్మ కావాలి అమ్మ కావాలి అని అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది.దాన్ని చూసిన తండ్రి ఏం చేయాలో అర్థం కాక వనజ ఇంటికి వెళ్తాడు.
అక్కడ వాళ్ళ అత్త ఉంటుంది అతను ఆమెను చూసి….. అత్త బాగున్నావా. వనజ ఎక్కడుంది. ఆమె….మేము బాగున్నాం బాబు నువ్వు ఎలా ఉన్నావు బేబీ ఎలా ఉంది బేబీనీ కూడా తీసుకు రావాల్సింది. అతను….. నేను బాగానే ఉన్నాను అత్త. బేబీ నే సరిగా లేదు ఎప్పుడు వనజ అమ్మ కావాలి వనజన్మమ్మా కావాలి అంటూ ఏడుస్తుంది. స్కూల్ కి వెళ్ళటం లేదు సరిగ్గా తిండి కూడా తినడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను ఆ విషయం చెబుదామని. వ న జానీ కొన్ని రోజులు ఇంటికి పంపించండి.
ఆమె సందేహిస్తూ ఉంటుంది దాన్ని చూసి అతను…. ఏం జరిగింది అత్త అలా ఆలోచిస్తున్నారు.
ఆమె…. బాబు వనజ పెళ్లి కావాల్సిన పిల్ల.అక్కడ ఉండటం మంచిది కాదు అని చెప్పి ఇక్కడికి తీసుకు వచ్చాను. అక్కడే ఉంటే నలుగురు నానారకాలుగా అనుకుంటారు.
అందుకు అతను… సరే అత్తయ్య నేను వెళ్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే మనకి వస్తుంది అతను వెళ్ళడం చూసిన ఆమె…. అమ్మ బావ వచ్చి వెళ్తున్నాడు ఏం జరిగింది అమ్మ.
ఆమె….. లేదు బేబీ నువ్వు కావాలని ఏడుస్తుంది అంట. అసలు బడికి వెళ్లడం లేదు తిండి కూడా సరిగా తినడం లేదంట నేను తీసుకు వెళతాను అన్నాడు కానీ . పెళ్లి కావాల్సిన పిల్లవి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు . అందుకే వద్దు అని చెప్పాను.
ఆమె….. అమ్మ నీకు కొంచెమైనా బుద్ధుందా ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి. మన పిల్లల్ని మనం చప్పుకుంటాం మా. బేబీ అన్నం తినడం లేదు స్కూల్ కి వెళ్లడం లేదు అని నువ్వే చెప్తున్నావు ఇలాగే సాగితే మా అమ్మాయి మనకు దక్కుతుందా.
తల్లి… సరే అయితే ఒక పని చెయ్ నువ్వు మీ బావని అక్కడే ఉండు ఎంచక్కా బేబీకి కూడా తల్లి ఉన్నట్టు ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ నీ పెళ్లి ముఖ్యం నీకు ఇష్టమైతే బావ కి ఇచ్చి పెళ్లి జరిపి ఇస్తాను అప్పుడు ఏ గొడవా ఉండదు నలుగురు ఏమనుకుంటారో అని బాధ కూడా ఉండదు. ఏదో ఒకటి చెప్పు అని అడుగుతుంది అందుకు వనజ….నేను బావనీ పెళ్లి చేసుకుంటాను బావతో మాట్లాడు .నాకు నా కుటుంబం కంటే ఎవరు ఎక్కువ కాదు అని అంటుంది అందుకు ఆమె అంటుంది ఆ విషయాన్ని అతనితో మాట్లాడడానికి వెళుతుంది . ఆమె జరిగిన విషయమంతా శంకర్ తో చెప్తుంది. శంకర్ కూడా పెళ్లికి ఒప్పుకుంటాడు కొన్ని ఈరోజులకు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది బేబీ వాళ్ళ అమ్మ వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళు సంతోషంగా మన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా బేబీ ని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు ఆమె గర్భవతి అని తెలుస్తుంది. దానికి ఆ కుటుంబం అంతా చాలా సంతోష పడుతూ ఉంటుంది. అలా కొన్ని నెలలు గడిచాయి ఆమె ఒక మగ బిడ్డకి జన్మనిస్తుంది. ఆ తర్వాత వాళ్లు బేబీ నీ సరిగా చూసుకునే వాళ్ళు కాదు ఒకసారి బేబీ…. అమ్మ నాకు ఆకలిగా ఉంది అమ్మ నాకు అన్నం పెట్టావా.
ఆమె…. బేబీ చాలా పని ఉంది తమ్ముడు తో నాకు సరిపోతుంది కదా నువ్వే కొంచెం ఆ పని చూసుకో.
బేబీ చిన్నపిల్ల కావడంతో ఆమెకు అది చాలా కష్టంగా ఉండేది. ఆమె ఎలాగోలా భోజనం పెట్టుకొని తింటూ ఉంటుంది.
ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఆ పుట్టిన బాబుతో చాలా సంతోషం గా ఆడుకుంటారు దాన్ని చూసిన బేబీ మనసులో….. అమ్మానాన్న తమ్ముడు పుట్టిన తర్వాత మీరు పూర్తిగా నన్ను మర్చిపోయారు. నాకు చాలా బాధగా ఉంది. అని ఏడుస్తూ ఉంటుంది.
తండ్రి దాన్ని గమనించి బేబీతో….. బేబీ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావ్. అని అడుగుతాడు అందుకామె ఏం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
దానికి తండ్రి భార్యతో….. నువ్వు బేబీనీ ఏమన్నా అన్నావా. అని అడుగుతాడు అందుకు ఆమె….. లేదండి నేను బేబీ ఏమీ అనలేదు. అని అంటుంది అందుకు అతను కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా రోజులు గడిచాయి వాళ్ళు చిన్న పిల్ల వాడితోనే కాలం గడుపుతూ ఉంటారు . బేబీ నీ పట్టించుకోరు బేబీ ఒక రోజు చాలా బాధపడుతూ . ఒక పుస్తకంలో తన బాధను ఈ విధంగా రాసుకుంటుంది.
అమ్మ నాన్న అంటే నాకు చాలా ఇష్టం . మా అమ్మ చనిపోయిన తర్వాత . వనజ అమ్మ నన్ను బాగా చూసుకుంటుంది . కానీ బాబు పుట్టిన తర్వాత అమ్మా నాన్న ఇద్దరూ కూడా నన్ను సరిగా చూసుకోవడం లేదు నాకు చాలా బాధగా ఉంది . నాకు అమ్మ నాన్న ప్రేమ మళ్ళీ కావాలి. అంటూ ఏడుస్తూ ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. అలాగే ఆమె తనకు వచ్చినట్టు గా వాళ్ళ అమ్మానాన్న పుట్టిన బాబు ముగ్గులు నీ పక్క పక్కన బొమ్మలు గీసి. ఆమె మాత్రం దూరంగా ఒక చోట నిలబడి చూస్తున్నట్టుగా గీసుకుంటుంది. ఆ తర్వాత ఆమె అక్కడే నిద్రపోతుంది. రాత్రి సమయం కావడంతో తండ్రి ఆమె గదిలోకి వెళ్తాడు. అక్కడ ఉన్న ఉత్తరం చూసి…. అయ్యో నా కూతురు మా ప్రేమకు చాలా దూరంగా ఉంది. నిజంగానే
ఆమెను మేము సరిగా చూసుకోవడం లేదు చాలా బాధపడుతుంది. అని అనుకుంటాడు ఆ రోజు గడిచి పోతుంది ఉదయాన్నే బేబీ బడికి వెళ్లి పోతుంది.
అప్పుడే ఇల్లు శుభ్రం చేస్తున్న వనజకు బేబీ గీసిన బొమ్మ కనపడుతుంది. దాన్ని చూసి నా మనసు చాలా చలించిపోతుంది. ఆ బొమ్మను తన భర్త దగ్గరకు తీసుకు వెళ్లి…. ఏవండీ ఈ బొమ్మను చూశారా బేబీ చాలా బాధపడుతుంది ఈ బొమ్మలో మీకు అర్థం తెలిసిందా .నువ్వు నేను బాబు మనం ముగ్గురం ఒక చోట నిలబడితే . దూరంగా బేబీ నిలబడిన చూస్తుంది అంటే . ఆమెను మనం ప్రేమగా చూసుకోవడం లేదని తన బాధని ఇలాగా బొమ్మల రూపంలో తెలియజేస్తుంది.
దాన్ని విన్న అతను చాలా బాధపడుతూ…. ఇదిగో ఈ ఉత్తరం చూడు బేబీ రాసుకుంది . అంటూ ఉత్తరాన్ని ఇస్తాడు. ఉత్తరాన్ని చదివిన ఆమె ఏడుస్తూ….. అయ్యో నిజమేనండీ మనం పాప పుట్టిన సంతోషంలో బేబీ ని సరిగ్గా చూసుకోవడమే మానేసాను. ఆ చిన్న మనసు ఎంత గాయమయ్యే ఇలాగా తన బాధను ఎవరికీ చెప్పుకోలేక. ఏం చేయలేక ఈ రూపంలో తెలియజేస్తుంది నిజంగా మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాము. బేబీ ని ఎప్పటిలాగే మనం ప్రేమతో చూసుకోవాలి. ఆమెతో సమయాన్ని గడపాలి ఆమెతో ఆడుకోవాలి. అంటూ చాలా ఏడుస్తూ చెబుతుంది అందుకు అతను కూడా చాలా బాధ పడుతూ….. అవును మనము ఇక నుంచి అలాగే చేయాలి . మనమంతా ఒక కుటుంబం మనలో ఎవరికీ ఏ బాధ వచ్చినా మనలో మనం మాత్రమే తీర్చుకోవాలి కానీ బయట వాళ్ళు ఎవరూ వచ్చి తీర్చలేరు.
అని అంటుంది అందుకామె నిజమే అని తలపుతుంది.
ఆ రోజు సాయంత్రం బేబీ ఇంటికి వస్తుంది.
బేబీ చూడంగానే తల్లి ఆమెనీ దగ్గరకు తీసుకొని…. బేబీ మేము నిన్ను చాలా బాధ పెట్టాము కదా . ఇంకెప్పుడూ అలాగ జరగదు.
నేను నీతో అలాగే బాబుతో ఇద్దరి తో ఆడుకుంటాను . అలాగే నాన్ను కూడా నీతో
బాబుతో ఇద్దరితో ఆడుకుంటాడు. నేను నీకు ప్రతిరోజు భోజనం తినిపిస్తాను. నిన్ను రెడీ చేసి స్కూల్ కి నేనే పంపిస్తాను సరేనా
అని అంటుంది ఆ మాటలు విన్న బేబీ చాలా సంతోషపడుతూ…. అమ్మ ఇన్ని రోజుల నుంచి నేను మీ ప్రేమకు ఎంత దూరంగా ఉన్నాను తెలుసా. నా స్నేహితులు అందరూ వాళ్ళ అమ్మా నాన్న తో ఆడుకుంటూ ఉంటే నాకు చాలా బాధగా ఉండేది. నేను మీకు చాలా దూరం అయిపోతున్న అని భయం వేసేది . అంటూ ఏడుస్తుంది.
తల్లి …. బేబీ ఏడవకమ్మ అలా ఎప్పటికీ జరగదు మీ ఇద్దరూ మాకు రెండు కళ్లు లాంటివాళ్ళు . ఒక కన్ను పోతే అవిటితనం ఎలా వస్తుందో. మీ ఇద్దరిలో ఎవరు మాకు దూరమైన అలాగే ఉంటుంది. ఇంకెప్పుడూ మేము అలా చేయను సరేనా బాధపడకు. అంటూ ధైర్యం చెబుతుంది ఇంతలో తండ్రి కూడా అక్కడికి వస్తాడు. తండ్రి ఆమెతో…. బేబీ నీకోసం నేను బొమ్మలు తీసుకు వచ్చాను. మనిద్దరము ఈ బొమ్మలతో ఆడుకుందాం. అందుకు బేబీ చాలా సంతోష పడుతూ తండ్రి తో ఆడుకోవడం మొదలు పెడుతుంది. తల్లి దాన్ని చూసి చాలా సంతోషపడుతుంది. చాలా సమయం అవుతుంది తల్లి భోజనం తీసుకువచ్చి బేబీకి తినిపిస్తూ…. తృప్తిగా తిని బేబీ. ఇలాగే నీకు గోరుముద్దలు పెట్టి ఎన్ని రోజులు అవుతుందో కదా. బేబీ ఏడుస్తూ….అవునమ్మా మీ చేతితో గోరుముద్దలు తిని చాలా రోజులవుతుంది . నాన్న తో ఇలా ఆడుకొని కూడా ఎన్నో రోజులు అవుతుంది. మళ్లీ నాకు మీ ప్రేమ లభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది .
మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వండి అని అంటుంది. అందుకు వాళ్ళు ఆశ్చర్యంగా….ఏమిటో చెప్పమ్మా తప్పకుండా నీ కోసం ఏదైనా చేస్తాము. అని అంటారు అందుకు బేబీ…. మీరిద్దరూ నాకు ఒక మాట ఇవ్వండి. ఇంకెప్పుడు నన్ను దూరంగా ఉంచాను అని. మా ఇద్దరినీ ఒకే లాగా చూసుకుంటాను అని. అందుకు వాళ్లు చాలా బాధపడుతూ….. బేబీ ఇంకెప్పుడు అలా మాట్లాడను అమ్మ మేము ఇంకెప్పుడు అలా చెయ్యము. మాట ఇస్తున్నాను కదా అని అంటారు అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది . అలా రోజులు గడిచాయి వాళ్లంతా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుపుతూ. ఎంతో ఆనందంగా ఉంటారు . బేబీ తన మనసులో…. భగవంతుడా నా తల్లిదండ్రి ప్రేమనీ నాకు తిరిగి ఇచ్చినందుకు చాలా సంతోషం .
మా కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండిపోవాలని దీవించు . మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకో స్వామి అంటూ భగవంతున్ని ప్రార్థిస్తుంది. ఆ విధంగా బేబీ తల్లిదండ్రుల ప్రేమను మళ్లీ తిరిగి పొంది సంతోషం వాళ్లతో జీవితాన్ని గడుపుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *