సవతి తల్లి మరణం Mother’s Death Animal stories | Telugu Kathalu | Telugu Stories |Best animal stories

ఒక అడవిలో ఒక బంగారు ఆడ ఏనుగు పిల్ల, తన సవతి తల్లి నల్ల ఏనుగు, తో జీవిస్తుండేది. నల్ల ఏనుగు కి ఒక కొడుకు కూడా ఉంటారు, నల్ల ఏనుగు సవతి కూతురైన బంగారు ఏనుగు ని అస్సలు ప్రేమగా చూసుకునేది కాదు, బంగారు ఏనుగు తో ఎప్పుడు ఎదో ఒక పని చేయిస్తూనే ఉండేది,

ఒకరోజు బంగారు ఏనుగు పని చేసి చేసి అలసిపోయి చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది.

ఇంతలో అక్కడికి బంగారు ఏనుగు తమ్ముడు వస్తాడు,

నల్ల ఏనుగు : అక్క అమ్మ నిన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటుంది కదా, నేను ఎన్నోసార్లు అమ్మకి చెప్పను కూడా కానీ అమ్మ నన్ను కూడా తిడుతుండేది, నిన్ను తిట్టకుండా ఆపడానికి ప్రయత్నించినా ప్రతి సారి అమ్మ చేతిలో నేను కూడా తిట్లు తింటూనే ఉన్నాను నాకు నువ్వంటే చాలా ఇష్ష్టం అక్క అమ్మ అంటే కూడా అంతే ఇష్టం, అమ్మ నిన్ను అలా తిడుతుంటే, నువ్వేమో పగలనకా రాత్రనకా తేడా లేకుండా పని చేస్తూ అలసిపోతుంటే నేను చూడలేకపోతున్నాను, నిన్ను ఎలాగైనా ఈ చెరసాల నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నాను.

బంగారు ఏనుగు : నువ్వేం దిగులు పడకు తమ్ముడు అమ్మ మీద నాకు నమ్మకం ఉంది ఈరోజు కాకుంటే రేపు, రేపు కాకుంటే తఃరువాత రోజు ఎదో ఒకరోజు అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుందో నన్ను అలాగే చూసుకుంటుందన్న నమ్మకం నాకు ఉంది, ఆరోజు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి, అప్పటి వరకు ఈ పనులు తిట్లు తప్పవు అని అంటుంది.

ఇంతలో తల్లి అక్కడికి వస్తుంది.

తల్లి : ఏంటే అక్క తమ్ముడు తెగ ముచ్చట్లు పెడుతున్నారు, నువ్వు దర్జాగా దొరసాని లాగా కూర్చుని ముచ్చట పెడుతున్నావా? అక్కడ పన్నులన్నీ ఎవ్వరు చెయ్యాలి? అని అంటుంది కోపంగా

బంగారు ఏనుగు  :అన్ని పనులు చేసి వచ్చే కొంత సేపు విశ్రాంతత కోసం ఇక్కడ కూర్చున్నాను పిన్ని, అని అంటుంది.

తల్లి : ఏంటి అన్ని పనులు అయిపోయాయా అంటే ఈరోజు మమ్మల్ని పస్తులు ఉంచుదాం అని అనుకుంటున్నావా? అన్ని ఆపనులు అయిపోయాయి అంటున్నావు నువ్వు ఇక్కడ విశ్రతి తీసుకుంటూ ఉంటె వంట ఎవరు చేస్తారు, అని అంటుంది.

బ్యాన్గరు ఏనుగు : సరే పిన్ని ఇప్పుడే వెళ్లి చేసేస్తాను అని వెళ్ళిపోతుంది.

అలా రోజులు గడిచ్చిపోతుంటాయి. ఓక్ రోజు సవతి తల్లి బంగారు ఏనుగు దగ్గరికి వచ్చి

తల్లి : చూడమ్మ నీకు ఒక మంచి సంబంధం వచ్చింది, నిన్ను పెళ్లి చేసుకున్నందుకు వాల్లే నీకు ఎదురు కట్నం ఇహ్హ్య్ చేసుకుంటాం అంటున్నారు, ఒక వారం రోజుల్లో నీకు పెళ్లి నేను ఎప్పుడో వాళ్లతో మాట్లాడేసాను నీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అని అంటుంది.

బంగారు ఏనుగు : నా పెళ్లి గురించి నాకు చెప్పకుండా మీరు మీరు మాట్లాడుకోవద్దం ఏంటి పిన్ని, అయినా నాకు ఇప్పుడే పెళ్లి ఏంటి నాకు ఇప్పుడు పేళ్ళి గిల్లి ఏమి వద్దు అని అంటుంది.

తల్లి : పెళ్లి వద్దు అంటే ఇంకా ఎన్ని నాళ్ళు మా మీద పది తింటావు, ఇన్నాళ్లు నిన్ను భరించింది మాకు సరిపోదా? అయినా వాళ్ళు ఎదురు డబ్బులు ఇస్తాము అని చెప్పారు అవి నా కొడుకు చదువుకు పనికి వస్తాయి నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాల్సిందే అని గట్టిగా అంటుంది.

బంగారు ఏనుగు : ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఏ మాత్రం ఇష్టం లేక పోయినప్పటికీ తమ్ముడు చదువుకోసం డబ్బులు పనికొస్తాయి అంటున్నావు కాబట్టి చేసుకుంటాను, నా ఇష్టాన్ని చంపుకొని బ్రతికేస్తాను, అని అంటుంది.

కొద్దీ రోజుల్లోనే బంగారు ఏనుగుని ఒక ముసలి ఏనుగుకి ఇచ్చి పెళ్ళి చేస్తుంది సవతి తల్లి.

బంగారు ఏనుగు తన జెఈవితాన్ని తలుచుకుంటూ రోజు కుమిలి పోతుంటుంది.

బంగారు ఏనుగు : అయ్యో ఏంటి నాకు ఈ ఖర్మ, సవతి తల్లితో రోజు పోరు తో విసిగిపోయి ఉన్నాను తాను ఏ రోజు కూడా కూతురిలా చూడలేదు నేను ఆవిడకు ఓక్ పని మనిషిని మాత్రమే, నన్ను నన్నుగా ప్రేమించే తమ్మూకిని కూడా నా దగ్గరికి రానిచ్చేది కాదు, ఇప్పుడేమో  డబ్బుల కోసం ఈ ముసలాడి ఇచ్చి కట్టబెట్టింది, ఇతను నాకు పేరుకు భర్త కానీ నా తండ్రి వయస్సు వాడు, ఇతనికి నేను ఒక దాసిని మాత్రమే నా జీవితం లో ఏ రోజు చూసుకున్నా దరిద్రమే తప్ప ఇంకేమి లేదు, ఇంత దరిద్రంగా జీవితం ఎవ్వరికి రాకూడదు అని ఏడుస్తూ ఉంటుంది బంగారు ఏనుగు, ఇంతలో తనకి తన త్తండి దగ్గర నుంచి పిలుపు వస్తుంది.

వెంటనే ఇంటికి వెళ్తుంది.

అక్కడికి వెళ్లి చూడగానే తన సవతి తల్లి చనిపోయి కనిపిస్తుంది.

నల్ల ఏనుగు : అక్క నాకంటూ ఉన్న అమ్మ చెనిపోయింది ఇక నుంచి అమ్మవైనా అక్కవైనా నాకు నువ్వే అక్క నాకు నువ్వ్వు తప్ప ఇంకా ఎవరు లేరు అక్క, నన్ను వదిలి ఎక్కడికి వేళ్ళకు అక్క నాకు చాలా భయంగా ఉంది అక్క అని ఏడుస్తూ ఉంటుంది.

ఇంతలో భర్త బంగారు ఏనుగు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు.

భర్త : నువ్వు తొందరగా నీ తమ్మడికి సర్ది చెప్పి వస్తే మనం వెళ్ళిపోదాం అవతల నాకు చాలా పనులు ఉన్నాయి అని అంటాడు.

బంగారు ఏనుగు : నీకు అవసరాలు ఉంటె నువ్వు వేళ్ళు, తల్లి చనిపోయిన బాధలో నా తమ్ముడు ఉంటె వాడిని ఒంటరిగా వదిలేసి నేను నీతో రావాలా నీకు సేవలు చేయడానికి నేను ఎక్కడికి రాను నా తమ్ముడితో పాటు ఇక్కడే ఉంటాను, ఇక న్నుహి నేను నా తమ్ముడు మాత్రమే మా మధ్యలో ఇంకా ఎవరు లేరు, అని చెప్తుంది కోపంగా

భర్త : ఏమి మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు నా భార్యవి నువ్వు రాకపోతే నేను ఏదైనా చేయగలను

బంగారు ఏనుగు : ఎలాగయ్యా నేను నీకు భార్యని, నా తండ్రి వైయస్ లో ఉంటావు నువ్వు నేను నీకు భార్య నా, ఇన్ని రోజులు నా తల్లి బాధపడుతుందో లేక నా మీద కోపం నా తమ్ముడి మీద ఎక్కడ ఆచూపిస్తుందో అని ఊరుకున్నాను, ఇప్పుడు థానే లేదు నీకు దిక్కున్న చోట్ల చెప్పుకోపో నేను నీ భార్యని అని ఎవడు అంటాడా నేను చూస్తాను ఇక నువ్వు బయలుదేరు ఇక్కడనుంచి అని అంటుంది.

బంగారు ఏనుగు తరువాతి కార్యక్రమాలు చూసుకొని ఇక అప్పటి నుచ్న్హి తన తమ్ముడిని చూసుకుంటూ తమ్ముడి దగ్గరే ఉండిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *