సిగ్గులేని అత్త కోడళ్ల తిండిపోరు Village Comedy | Emotional Stories |Telugu kathalu |Telugu Stories

అది ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఇద్దరు అత్తా కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఒక్కొక్క పిచ్చి . కోడలికి నగల పిచ్చి అత్తకి షాపింగ్ పిచ్చి. అంతేనా కోడలికి నగల పిచ్చి తో పాటు తిండి పిచ్చి కూడా. ఒకరోజు అత్త…. ఒసేయ్ ఝాన్సీ. నా కోడలా ఎక్కడున్నావే. అత్తయ్య వంట గదిలో ఉన్నాను.
అత్త…. ఏంటి నువ్వు వంట గది లో ఉన్నావా పొద్దున్నే లేచి పని చేస్తున్నావా ఇది కలా నిజమా. అంటూ వంట గదిలోకి వెళ్తుంది.
అక్కడ కోడలు నగలన్నీ పెట్టుకొని చద్దన్నం తింటూ ఉంటుంది.
దాన్ని చూసిన అత్త…. ఒసేయ్ నేను ఇంకా పని చేస్తున్నావ్ ఏమో అనుకున్నాను. పొద్దున్నే లేచి చద్ది అన్నం తింటున్నావ్వు ఏంటే పైగా ఏడువారాల నగలు అన్నీ దిగేసకున్నావు.
కోడలు…. అయ్యో అత్తయ్య మర్చిపోయారా నిన్న మీరు ఏమన్నారు. రేపు బట్టల షాప్ కి వెళ్దాం రెడీ అవ్వ మన్నారా అందుకే పొద్దున లేచి రెడీ అయ్యాను . ఆకలేస్తుంది అని రాత్రి మిగిలిన అన్నం తిన్నాను.
అత్త… అబ్బా మా తల్లి. నువ్వు ఎంత మంచి దానివో. నేను కూడా ఏదో ఒకటి తిని బయలుదేరుతాను. దోసెల పిండి ఉండాలిగా.
కొంచెం దోశలు వేసి పెట్టు. నేను స్నానం చేసి వస్తాను.
కోడలు… దోసెల పిండి ఎక్కడ ఉంది అత్తయ్య నేను ఇప్పుడే దాంతో దోసెలు వేసుకుని తిన్నాను.
అత్త…. మరి చద్దన్నం తింటున్న అన్నావు కదా . మరి దోశాలు ఎందుకు తిన్నావు.
కోడలు…. ముందు దోసెలు వేసుకుని తిన్నాను అత్తయ్య అది సరిపోలేదని సద్ది అన్నం తింటున్నాను.
అత్త…. అది కడుపా లేక హుస్సేన్ సాగర.
అడ్డమైన చెత్త అంతా కడుపులో వేసుకుంటున్నావ్వు.
సర్లే పండ్లు ఉన్నాయిగా అవి తింటాలే .
అని స్నానానికి వెళ్తుంది.
ఆమె అలా స్నానానికి వెళ్లి తిరిగి వస్తుంది.
ఆమె పండ్లు కోసం వెతుకుతూ ఉంటుంది.
కోడలు…. ఏంటి అత్తయ్య దేనికోసం వెతుకుతున్నారు.
అత్త…. ఇక్కడ పండ్లు ఉండాలి కదా ఏమైపోయాయి.
కోడలు…. నాలుగు యాపిల్ పళ్ళు ఉంటే అది తినేసను అత్తయ్య .
అత్త…. నాకు తినడానికి అవి కూడా లేకుండా చేశావా. నిన్ను ఏమనాలి.
కోడలు…. అయ్యో అత్తయ్య నాకసలు పండ్లు ఉన్నాయన్న సంగతి చెప్పిందే మీరు అసలు నేను వాటి సంగతి మర్చిపోయాను. అవి ఉన్నాయ్ అని చెప్పి పెద్ద తప్పు చేశారు .
వాటిని తినకపోతే నా నాలుక పికుతూ ఉంటుంది అందుకే తినేసాను.
అత్త…. పెద్ద ఘనకార్యం చేసావు లే కానీ. వెళ్దాం పద. అని ఇద్దరూ కలిసి బట్టల షాప్ కి వెళ్తారు. అక్కడ ఉన్న అతను ….. మేడం ఏం తీసుకుంటాడు కూల్ డ్రింక్, కాఫీ , కాఫీ.
ఆ మాట వినగానే వెనక్కి తిరిగి వెళుతూ ఉంటారు. ఆ వ్యాపారి….. మేడం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళిద్దరూ….. మేము బట్టల షాపు అని వచ్చాము. హోటల్ అనుకోలేదు.
అతను…. మేడం మీరు పొరపాటు పడుతున్నారు ఇది బట్టల షాప్పే.
అత్త…. మరి టీ టిఫిన్ కూల్డ్రింక్ అంటే మేము అదే అనుకొని వెళ్ళిపోతున్నాము.
కోడలు… మీరు అందుకోసం బయటికి వెళ్తున్నారా. నేనింకా చేతులు కడుక్కోవడానికి తీసుకెళ్తున్నార ఏమో అనుకున్నా.
అత్త…. అదేం లాజిక్కే నాకస్సలు అర్థం కాలేదు.
కోడలు… అంటే టీ కూల్ డ్రింక్ అన్నారు కదా సమోసా దోశ కూడా ఉంటుందేమో చేతులు కడుక్కొని తినచ్చు అనుకున్నాను .
అత్త కోపంగా చూస్తూ….. నీ తిండి పిచ్చి ఆపు.
వ్యాపారి…. మేడం మా షాప్ కి వచ్చిన కస్టమర్లకు మేము గౌరవ్ ఆర్థకంగా అడుగుతూ ఉంటాము.
కోడలు…. చాలా మంచి దేశం ఒక ప్లేట్ సమోసా. ఒక ప్లేట్ రవ్వ దోశ ప్లేట్ ఉప్మా , నాలుగు ఇడ్లీలు , రెండు బోండా. తీసుకురండి.
వ్యాపారి…. ఎందుకు మేడం ఇన్ని ఆర్డర్ చేస్తున్నారు కొట్టూ ఏమన్నా పెడుతున్నారా.
కోడలు…. అబ్బే అదేం కాదు. ఇవన్నీ నాకు అనుకుంటున్నారా కాదు మా అత్తయ్య కి.
ఆమె ఇవన్నీ ఒక్కటే కూర్చొని తినేస్తుంది .
అత్తా…. ఒసేయ్ నేను ఎప్పుడు చెప్పాను నీకు ఇవన్నీ నేను తింటాను అని నువ్వు తినడం కోసం నా మీదకు తోస్తున్నావా.
అంటూ ఆ వ్యక్తితో… అవన్నీ ఏమీ అవసరం లేదు కానీ కొత్త చీరలు ఏమన్నా వచ్చి ఉంటే వాటిని చూపించండి.
వ్యాపారి… చూడరమ్మ ఇవి వంద రూపాయల చీరలు, ఇవి 150 రూపాయల చీరలు ఇవి 200.
కోడలు…. అంటే నీ కంటికి మేము ఎలా కనబడుతున్నాము. వంద రూపాయలు నూట యాభై రూపాయలు చీరలు కొనే వాళ్ళ లాగా . కాబడుతున్నమ కొంచెం మంచివి ఏమైనా ఉంటే చూపించండి .
వ్యాపారి…. క్షమించమ్మా ఇవి కూడా చూడండి ఇది 1000, ఇది 1500 ఇది 2000 .
కోడలు…. అత్తయ్య ఈ చీర బాగుంది కదా .
అత్త….. చీర బావుంది కానీ దీని అంచు అసలు బాగాలేదు.
కోడలు…. అత్తయ్య ఇది చూడండి ఈ అంచ్చు బాగుంది కదా .
అత్త…. బాగుంది కానీ కలరు అస్సలు బాలేదు .
కోడలు…. ఇది చూడండి అత్తయ్య కలరు అంచు రెండు బాగుంది.
అత్త…. కానీ దీని డిజైను ఓల్డ్ డిజైన్.
అలా చాలాసేపు అత్తా కోడలు అతన్ని అవి తీసుకురావాలి తీసుకురా అని అంటూ చెబుతూ ఉంటారు ఒక గంట సమయం తర్వాత. బాగా విసుగెత్తిపోయిన అతను చాలా కోపంగా…. అమ్మ ఇంక నావల్ల కాదు . డిజైన్ బాగుంటే కలర్ బాగోలేదు అంటున్నారు కలర్ బాగుంటే ఓల్డ్ డిజైన్ అంటున్నారు. అసలు మీరు కొనడానికి వచ్చిన వాళ్లేనా .
అత్తయ్య…. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు అసలు నీకు వ్యాపార లక్షణాలు ఏమీ లేవు కస్టమర్ తో మాట్లాడే పద్ధతి ఇదేనా.
కోడలు…. అత్తయ్య మీరూ ఆగండి నేను అర్థం ఎలా చెప్తాను. బాబు చూడు నీకు మా అత్త తో ఎందుకు గొడవ.
కానీ వేసవి కాలం వస్తుంది కదా మంచి కాటన్ చీరలు చూపించండి.
అతను…. ఇదిగోండి అమ్మ ఒక్కొక్కటి 2000 .
అత్త వాటిని చూసి…. ఏమయ్యా 200 రూపాయల చీరనీ 2000 అని చెప్తున్నావు మా చెవుల్లో మీకు క్యాలీఫ్లవర్ను కనబడుతున్నాయ. ఇవన్నీ నేను కట్టిపడేసిన చీరలు మరో మాట ఏమైనా ఉంటే చెప్పు.
అతను… 2000 కు ఒక్క రూపాయి కూడా తగ్గించేది లేదు. ఇంకో ఆఫర్లు discount to ఉంది అనుకుంటే 200 తగ్గించి ఇవ్వండి.
అత్త…. చివరగా 250. ఈస్తాము ఇచ్చేయ్.
వ్యాపారి…. రాదమ్మ.
కోడలు…. బాబు ఇంకో పది రూపాయలు కట్టుకోండి .
అతను…. రాధమ్మ ఇంక నన్ను ఇబ్బంది పెట్టకండి. వదిలేయండి.
కోడలు…. అసలు మీ షాప్ లో మంచి చీరలు దొరకలేదు. మాకు కావాల్సింది అసలే దొరకలేదు.
అంత రేటు చెప్తున్నారు తక్కువ లేవా .
ఇంకా ఎక్కడైనా మంచి షాపు ఉంటే చెప్పండి తక్కువలో.
వ్యాపారి…. మీకు తక్కువ రేటు కావాలంటే సరాసరి ముందుకెళ్లండి. అక్కడ ఒక పెద్ద
గుడి ఉంటుంది.
అత్తయ్య… గుడి పక్కన షాపు ఉందా నేను
ఎప్పుడూ చూడలేదే.
వ్యాపారి…. గుడి పక్కన కాదమ్మా గుడి ముందు. పెట్టి అమ్ముతూ ఉంటారు సెకండ్హ్యాండ్ చీరలు పాత చీరలు .
ఆ మాట విని ఆ అత్తా కోడళ్ళు ఇద్దరు కోపంగా అతని వైపు చూస్తూ…. ఏరా మీ కంటికి నేను ఎలా కనబడుతున్నాము. సెకండ్ హ్యాండ్ చీరలు పాత చీరలు కొనుక్కునే వాళ్ళ లాగా. అంటూ చితకబాదారు.
అతను అమ్మ అయ్యా అంటూ అరుస్తున్నాడు.
వాళ్ళిద్దరు…. ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇచ్చావ్ అంటే నీ పని గోవిందే.
అంటూ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
వాళ్ళిద్దరూ సరాసరి ఇంటికి వెళ్లి కూర్చుంటారు.
అత్త….. ఈరోజు పొద్దున్నే ఎవరి ముఖం చూశానో కానీ . వాడితో గొడవపడి తలకొట్టేసినట్టు అయ్యింది.
కోడలు…. అవును అత్తయ్య పొద్దున్నే నేను నీ మొఖం చూశాను కాబట్టి. వాడితో పోట్లాడ వలసి వచ్చింది.
అత్త…. అంటే నా మొఖం అంత దరిద్రంగా ఉంది అంటే నీ ఉద్దేశం.
కోడలు…. దాని అర్థం అదే కదా అత్తయ్య.మారి.
అత్త…. అసలు షాప్ లోకి వెళ్లి వాడిని ఇడ్లీ దోస తీసుకురా అని ఇంత లిస్ట్ చెప్పినప్పుడే
వాడికి పూర్తిగా అర్థం అయి ఉంటది.
ఇది తిండిబోతు గాని కొనే లక్షణాలు ఏమీ లేవు అని.
కోడలు…. నేను కూడా అదే చెబుతున్నాను. మీరు కొనే వాళ్ళు కాదు ఊరికే 40 షాపులు తిరిగి కొన్నట్టు గా బిల్డప్ ఇస్తారు.
అని అంటుంది అలా ఇద్దరూ ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు.అత్త ఎక్కువగా ఇంకా తిట్టడంతో ఆమె పెద్దగా ఏడుస్తూ…. అత్తయ్య అనవసరంగా నన్ను ఎన్ని మాటలు అన్నారు. నాకు చాలా కోపంగా ఉంది అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది.
అత్త మనసులో…. అయ్యో నా కోడలు అనవసరంగా తిట్టానా ఇప్పుడు ఇది ఏ అఘాయిత్యం చేసుకుంటుందో ఏమో . ఒసేయ్ కోడలా అంటూ తలుపు కొడుతూ ఉంటుంది.
ఆమె గట్టిగా తలుపు కొట్టి లోపలికి వెళ్తుంది లోపల కోడలు మామిడి పండులో తింటూ ఉంటుంది. దాన్ని చూసిన అత్త…. ఒసేయ్ తింటున్నావా ఇంక నువ్వు ఏం అఘాయిత్యం చేసుకుంటున్నావో అని భయపడి చచ్చాను.
కోడలు…. అయ్యో ఇంత చిన్న దానికి అలా అయితే చేసుకో అన్నా అంత తెలివితక్కువ దాని కాదు అత్తయ్య అయిన నేను లేకపోతే ఇక్కడ తిండి అంతా ఎవరు తింటారు మీ ఒక్కరి వల్ల కాదు కదా.
అత్త…. నువ్వేనమ్మ అది సరే కానీ ఈ బుట్ట మామిడి పళ్ళు మీకు ఎక్కడినుంచి వచ్చాయి.
కోడలు…. మీ అబ్బాయి ని అడిగి అడిగి నా నోరు నొప్పి పుట్టడమే కానీ ఒక్క పని కూడా చెయ్యయి. అందుకే వడ్డానం తాకట్టు పెట్టి మామిడి పళ్ళు తీసుకొచ్చాను.
అత్త…. ఏంటి మీ అమ్మ గారు ఇచ్చిన వడ్డానం తాకట్టు పెట్టావా. ఒసేయ్ వాడెవడో తెలివైన వాడు దాన్ని తీసుకుని ఎప్పుడో ఉడాయించి ఉంటాడు. ఎంత పనిచేశావే మీ అమ్మ వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలి నేను.
కోడలు…. మా అమ్మకు సమాధానం ఎందుకు చెప్పాలి అత్తయ్య . మీ అమ్మ బతికి ఉంటే మాకు చెప్పాల్సి వచ్చేది ఏమో .
అత్త…. అంటే నీ ఉద్దేశం ఏంటి.
కోడలు…. అయ్యో అత్తయ్య ఇంకా అర్థం కాలేదా నేను తాకట్టు పెట్టింది నా వడ్డానం కాదు మీ అమ్మగారు ఇచ్చిన మీ వడ్డానం.
ఆ మాటలు విన్న అత్త శృహా తప్పి కింద పడిపోతుంది. దాన్ని చూసిన కోడలు కంగారుగా… అత్తయ్య ఉన్నారా పోయారా.
అత్త… ఇంకా బతికే ఉందను. ఇంక నువ్వు చేసే పనులు ఎన్ని ఉంటాయో ఏమో.
కోడలు…హా హా హా భలే కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అంటూ పెద్దగా నవ్వింది. అత్త ఆమెను చూసి నవ్వాలో ఏడవాలో అర్థంకాక అలా చూస్తూ ఉండి పోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *