సైకిల్ చక్రంలో బొంగుల చికెన్ 2 | Telugu Kathalu | Telugu Stories| Stories in Telugu | Moral Stories

వీరభద్రాపురం లో రమణ అనే వ్యక్తి ఉండేవాడు అతనికి ఏదైనా చేసి చాలా డబ్బులు సంపాదించి భార్య రాజమ్మని కూతురు మమతా ని గొప్పగా చూసుకోవాలన్న కోరిక చాలా బలంగా ఉండేది. కానీ వాళ్ళు కటిక పేదవాళ్ళు అవ్వడం వల్ల ఏ వ్యాపారం చేయాలన్న కూడా సరైన డబ్బులు లేక వ్యాపారాలు దివాళా తీసేవి. ఒకరోజు ఇంట్లో తినడానికి నిత్యావసరాలైన వస్తువులు కూడా లేని సమయంలో రాజమ్మ రమణ దగ్గరికి వచ్చి

రాజమ్మ :- ఏమండి మన ఇంట్లో సరుకులు అన్ని అయిపోయాయి అండి, ఇప్పుడు తినడానికి కూడా ఏమి లేవు మనకి ఈ వ్యాపారాలు అన్ని మన లాంటి పెద్దవాళ్ళకి పనికిరావండి, అవన్నీ డబ్బున్న వాళ్ళు చేసే పనులు, మనలాంటి పేదవాళ్ళు ఏ పూటకి ఆ పూట తినడానికి ఏదైనా దొరికితే చాలు అని చూసుకోవాలి తప్ప ఒకేసారి డబ్బులు రావాలంటే కుదరదండి. అని అంటుంది

రమణ :- అలా వ్యాపారాలు డబ్బున్న వాళ్ళు చేయాలి పేదవాళ్ళు ఎప్పుడు వాళ్ళ కాళ్ళ కింద బ్రతకాలి అనుకోబట్టే పేదవాడు ఎప్పుడు పేదవాడి లాగే ఉంటున్నాడు,  ధనవంతుల దగ్గర ఊడిగం చేస్తూ బ్రతుకుతున్నాడు, నీకు తెలియదు రాజమ్మ వాళ్ళు మనల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారో, అవకాశం దొరికినప్పుడల్లా మనల్ని అవమానించడానికే చూస్తున్నారు. అందుకే వాళ్లకి మనమేం తక్కువకాదు అని చూపించాలనే నా ప్రయత్నం అంతా, కానీ నేను చేసే ప్రతి పనిలో ఓడిపోతూనే ఉన్నాను. సరే ఇప్పుడైతే ఎదో ఒకటి చేసి తినడానికి ఏవైనా దొరుకుతాయేమో తీసుకువస్తాను అని చెబుతాడు.

ఇంట్లో తినడానికి ఏమైనా తీసుకు వస్తాయని చెప్పి వెళ్లిన రాజయ్య ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు, అంతో మదిని ఎన్నో రకాలుగా అడిగి చూస్తాడు. కానీ అతనికి ఎక్కడా ఏమి దొరకవు దాంతో  దిగులుగా తిరిగి ఇంటికి వస్తాడు

రాజమ్మ :- ఏంటండీ ఏమి దొరకలేదా? ఈ పూట కూడా మనం పస్తులు ఉండవలసిందేనా? సరే మనకంటే తప్పదు కానీ మన కడుపున పుట్టినందుకు మన కూతురు మమత కూడా మనతో పాటు ఈ కటిక పేద జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అని అంటుంది రాజమ్మ

ఇంతలో మమతా బయట నుండి నాన్న అమ్మ అని అరుస్తూ వస్తుంది, మమత చేతిలో ఉన్న కోడిని చూసిన రాజమ్మ

రాజమ్మ :- ఏంటమ్మా అంతలా అరుస్తున్నావు ? ఈ కోడి ఎక్కడిది నీకు?

మమత :- అమ్మ నేను ఇందాక బయట ఆడుకుంటూ ఉంటె నాకు ఈ కోడి కాలికి గాయంతో కనిపించింది అమ్మ పాపం అనిపించి తీసుకు వచ్చాను, దీన్ని మనం పెంచుకుందాం అమ్మ అని అంటుంది

రాజమ్మ :- మనకే తినడానికి ఏమి లేని ఈ పరిస్థితుల్లో ఇది మనకెందుకమ్మా?

రామణ :- పోనీ రాజమ్మ చిన్న పిల్ల ఎదో ముచ్చటపడి తీసుకొచ్చింది, మమతకు మనం సారైనా తిండి పెట్టలేక పోతున్నాము, ఇప్పుడు ఆ కోడిని వదిలేయమని చెబితే దాని ఆనందాన్ని కూడా దూరం చేసిన వాళ్ళము అవుతాము అని అంటాడు

రమణ మాటలకు మమత ఎంతగానో సంతోషిస్తుంది

అప్పటినుండి మమతా ఆ కోడిని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, కొద్దీ రోజుల్లోనే ఆ కోడి చాలా పిల్లలను పెడుతుంది, ఆ పిల్లలు మల్లి పిల్లలు చేయడంతో మజమ్మ వాళ్ళ ఇంట్లో చాలా కోళ్లు తయారవుతాయి

అన్ని కూలీలను చూసిన రమణకి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే రాజమ్మ నాదగ్గరికి వెళ్లి

రమణ :- చూడు రాజమ్మ నాకుఒక ఆలోచన వచ్చింది, బయట చికెన్ ఫ్రైకి చాలా మంచి డిమాండ్ ఉంది మన దగ్గర ఇన్ని కోళ్లు ఉన్నాయి కదా, రోజు కొన్ని కోళ్ళని తీసుకొని వెళ్లి చికెన్ ప్య్ర వ్యాపారం చేద్దాం ఇదైతే ఎక్కువ పెట్టుబడి లేని వ్యాపారం నువ్వు ఏమంటావు

రాజమ్మ :- ఆలోచన బాగానే ఉండండి కానీ కోళ్ళని చంపడం అంటే మమత ఒప్పుకుంటుందా అని నేను ఆలోచిస్తున్నాను

రామణ  :- కచ్చితంగా ఒప్పుకోదు, అందుకే మనం మమతకు చెప్పకుండా కొన్ని కోళ్ళని తీసుకుందాం వాటిల్లో లాభం వచ్చిన తరువాత బయట నుండి కోళ్ళని తెచ్చి ఈ వ్యాపారాన్ని కొనసాగిద్దాం అని చెప్పి కొన్ని కోళ్ళని తీసుకెళ్లి తన దగ్గర ఉన్న సైకిల్ చక్రంపై కుచ్చి కింద మంట పెట్టి కాల్చడం మొదలు పెడతాడు.

 రమణ:- రండి బాబు రండి, మీరు ఎప్పుడు తినని వేరే ఎక్కడా దొరకని చికెన్ బాబు, సైకిల్ చక్రం పై కాల్చిన చికెన్ ఫ్రై ఇలాంటి చికెన్ ముందెప్పుడూ మీరు తిని ఉండరు, అని అరుస్తూ అమ్ముతూ ఉంటాడు

చికెన్ ఫ్రై చాలా రుచిగా ఉండడం తో అందరూ ఎగబడి కొనుక్కుంటూ ఉంటారు, అలా వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది.

అప్పుడే కోపంతో అక్కడికి వచ్చిన మమత

మమత :- నాన్న నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు, నేను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కోళ్ళని నీకు చంపాలని ఎలా అనిపించింది నాన్న, మీ ముఖం చూడాలన్న నాకు అసహ్యంగా ఉంది, అని కోపంతో వెళ్ళిపోతుంది

రాజమ్మ :- అది చిన్నపిల్ల అండి, దాని మాటలు మీరేం పట్టించుకోకండి, ఇప్పుడు ఎలాగూ మనకు డబ్బులు వచ్చాయి కదా, బయటనుండి కోళ్ళని తెచ్చుకుందాం మమత కోపం తగ్గిపోతుంది లెండి అని భర్తకు దైర్యం చెబుతుంది

కొన్ని రోజుల్లోనే వాళ్ళ చికెన్ ఫ్రై వ్యాపారం చాలా అభివృద్ధి చెండుతుంది, తమకి చాలా డబ్బులు రావడం తో రమణ మమతకి ఎన్నో రకాల బహుమతులు తెచ్చిస్తూ ఉంటాడు

మమతా :- నాన్ మీరు ఎన్ని రకాలుగా నాకు దగ్గరవ్వాలని చూసినా కూడా నాకు చనిపోయిన కోళ్లే గుర్తుకొస్తున్నాయి, వాటిని నేను అంత ప్రేమగా చూసుకుంటుంటే మీకు చంపాలనుఈ ఎలా అనిపించింది నాన్న అని ఏడుస్తుంది

రమణ రాజమ్మ దగ్గరికి వెళ్లి

రమణ :- రాజమ్మ మమతకి నాపై ఉన్నకోపం ఇంకా తగ్గలేదు, నేను దాని కోపం తగ్గుతుందేమో అని ఆశించడం తప్పా ఇంకేం చేయలేను సరే చూద్దాం ఇంకా ఎన్ని రోజులు కోపంగా ఉంటుందో, సరేలే కానీ ఈరోజు చికెన్ ఫ్రై చేయడానికి కోళ్లు వచ్చాయి, పదా మన పని మొదలుపెడదాం అని చెప్పి భార్యని తీసుకొని వెళ్లి మల్లి చికెన్ ఫ్రై చేయడం ప్రారంభిస్తాడు రమణ

Add a Comment

Your email address will not be published. Required fields are marked *