స్మశానం లో దెయ్యం_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu


సింగంపల్లి అనే గ్రామంలో ఊరి చివర ఒక పెద్ద స్మశానం ఉండేది. ఆ స్మశానం దగ్గర్లోనే పాపయ్య ,పోలయ్య అనే ఇద్దరు దొంగలు నివసిస్తూ ఉండేవాళ్ళు . వాళ్లు ఇళ్లల్లోనూ లేక దుకాణాల్లోనూ దొంగతనం చేసే వాళ్ళు కాదు. కానీ వాళ్లు ధనవంతులైన వారి సమాధులను తవ్వి దానిలో ఉండే బంగారం లేక డబ్బులు దొంగిలించే వాళ్ళు.
ఒకరోజు పోలయ్య ఊరిలో వెళుతుండగా అక్కడ ఒక ఆమె ఇతరులతో.
ఆమె— చూశారంటే అక్క ఈ విచిత్రం ఆ పీనాసి సాంబయ్య చచ్చిపోతే కొడుకులు ఛీ!ఛీ !నువ్వు బతికి ఉన్నప్పుడు. నీ పీనాసి తనంతో మా అందర్నీ బాధ పెట్టావు. ఇప్పుడు చచ్చాక నీ డబ్బు మొత్తం నువ్వే తీసుకో పో అని మొత్తం డబ్బు, బంగారం , సమాధిలో పెట్టి పూడ్చి వేశారంట.
అని చెప్పుకుంటున్న వారి మాటలు విన్న పోలయ్య పరుగుపరుగున పాపయ్య వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పాడు.
పాపయ్య– ఆహా ఎన్నటికి మన పంటపండింది మిత్రమా ఇంకా ఆలస్యం.
చేయకుండా ఈ రాత్రి ఒక పట్టుపడతాం అని అనుకొని ఇద్దరూ రాత్రివేళ స్మశానంలో కి బయలుదేరారు మార్గమధ్యలో పోలయ్య.

పోలయ్య– ఒరేయ్ పాపయ్య ఈ రోజుతో మనం ధనవంతులవబోతున్నాం ఆ సమాధిలో ఎంత ఉన్నా అది సమానంగా పంచుకుందాం.
అని మాట్లాడుకుంటూ స్మశానం వద్దకు చేరుకున్నారు అక్కడ శవం తో పాటు పూడ్చిన బంగారం డబ్బు కోసం తవ్వడం ప్రారంభించారు.
ఇంతలో దూరం నుంచి భయంకరమైన వింత వింత శబ్దాలు రావడం మొదలయ్యాయి వాటిని విన్న పోలయ్య
పోలయ్య (భయంతో వణుకుతూ) అరే పాపయ్య ఉన్నట్టుండి ఈ భయంకరమైన శబ్దాలు ఏంట్రా నాకు చాలా భయంగా ఉంది రా! రా !వెళ్ళిపోదాం.
అందుకు పాపయ్యా– అరే ఇది మనకి కొత్త కాదు! కదరా! ఏం కాదు భయపడకు నేను ఉన్నాగా అని ధైర్యం చెప్పాడు.
వాళ్లు గుంటను తవ్వుతుండగా ఎవరో పాపయ్య పోలయ్య రండి రండి అని పిలవసాగారు .
అందుకు వాళ్ళు ఎవరో పిలుస్తున్నారు అని భయంతో వెనక్కి తిరిగారు కానీ అక్కడ ఎవరూ లేరు వెంటనే అక్కడ పెద్దపెద్ద శబ్దాలతో ఒక్క సుడిగాలి వాళ్ళని చుట్టుముట్టింది వాళ్ళు భయంతో కేకలు వేశారు కొంత సమయానికి అంతా కుదుటపడింది అప్పుడు మళ్ళీ
పోలయ్య భయంతో వణుకుతూ — అరే నేను చెప్పా గా ఇక్కడ ఏదో వింత జరుగుతుంది అని పదరా వెళ్ళిపోదాం .
అందుకు పాపయ్య— అరేయ్ చిన్న చిన్న వాటికి భయపడకు ఇంత దూరం వచ్చి ధనలక్ష్మిని తీసుకొని వెళ్లకపోతే ఆమె చాలా బాధపడుతుంది. రా::రా !!భయపడకుండా వచ్చి తవ్వు అని మళ్ళీ తవ్వడం ప్రారంభించారు .

ఇంతలో వాళ్ళకి ఒక పెద్ద పెట్టి బయటకు వచ్చింది దాన్ని చూసి ఆనందంతో… డబ్బు డబ్బు అంటూ చాలా ఉత్సాహంతో దాన్ని తెరిచారు దాని నుంచి ఒక్కసారిగా పెద్ద దయ్యం బయటకు వచ్చింది
దయ్యం —-హ హ హ (అని పెద్దగా భయంకరంగా నవ్వుతుంది )దాన్ని చూసి వాళ్ళు భయంతో పరిగెడుతూ ఉండగా
పోలయ్య ముందుకి ఆ దెయ్యం ఒక్కసారిగా వచ్చి
దెయ్యం— హ హ హ హ హ నేను ఎంత పీనాసి వాడి నో తెలుసు కదా అలాంటి నా దగ్గర డబ్బు దొంగిలించడానికి వచ్చారా హ..హ..హ.. (పెద్దగా నవ్వుతూ) నిన్ను ఏమి చేస్తానో చూడు అంటూ వాడిని గట్టిగా పట్టుకుంది..
పోలయ్య —నన్నేం చెయ్యొద్దు నన్ను వదిలేయ్ అంటుండగా.. ఆ దెయ్యం వాడిని మట్టి లాగా మార్చేసింది . పాపం పాపయ్య భయంతో పరుగులు తీస్తున్నాడు ఒక్కసారిగా దెయ్యం చేయి ముందు నుంచి బయటకు వచ్చి కాళ్ళు పట్టుకొని ఆ సమాధి లోపలికి తీసుకు పోతుండగా
పాపయ్య— భయంతో అయ్యో అయ్యో నన్ను వదిలేయ్ నాకు నీ డబ్బు వద్దు ఏమి వద్దు. దయచేసి నన్ను చంపకు నాకు డబ్బు వద్దు ఏమి వద్దు అని బ్రతిమాలుకుండగా.
దెయ్యం–
హ… హ …హ …ఏంట్రా వణుకు పుడుతుందా చావంటే అంత భయపడే వాడివి ఎందుకు వాడివి వెతుక్కుంటూ చావు దగ్గరకి వచ్చావు ఎక్కడ వరకు వచ్చావు గా రా రా ఇంకాఇక్కడ నుంచి మనం కలిసి ఉందాం కలిసి జీవిద్దాం హ…హ..హ..
అంటూ వాడిని సమాధిలోకి లాక్కొని పోయింది అప్పుడు ఆ దయ్యం సమాధిలో నుంచి పెద్దగా గంభీరంగా హ హ హ నాకు చాలా సంతోషంగా ఉంది నా సొమ్ము నా దగ్గరే ఉంది ఎవరు నా సొమ్ము దొంగిలించ లేరు హ.హ..హ.. ఎవ్వరూ కూడా నా దగ్గర నుంచి దేనిని తీసుకు వెళ్ళలేరు ఒకవేళ తీసుకొని వెళ్ళాలి అని ప్రయత్నించారు వాళ్ళకి కూడా ఇదే గతి పడుతుంది.. హా…హా (పెద్దగా నవ్వుతూ) ఈ సమాధికి నేను కాపలగా ఉంటానుఅన్న విషయం తెలియక వచ్చారో చచ్చిపోతారు హ …హ ….అని (పెద్దగా నవ్వుతూ )ఒక్కసారిగా నిశ్శబ్దం అయినదీ.
నీతి– అందుకే పరుల సొమ్ము కోసం ఆశపడద్దు ఆశపడి ప్రమాదాలను కొని తెచ్చుకోకూడదు అని ఈ కథ ద్వారా తెలుసుకుందాం

Add a Comment

Your email address will not be published. Required fields are marked *