హింసించే సవతి తల్లి_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

అనురాధ(6) ఒంటరిగా కూర్చొని ఎంతో బాధపడుతూ ఆ భగవంతుని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటుంది… స్వామి అందరూ పిల్లలు తమ తల్లి చేతి గోరు ముద్దలు తింటూ. తల్లి తో కబుర్లు చెప్పుకుంటూ తల్లి ఒడిలో హాయిగా నిద్రిస్తున్నారు. మరి మా అమ్మనీ నువ్వు దూరం చేశావు. నాక్కూడా మా అమ్మ తో ఆడుకోవాలని ఆమె చేతి గోరుముద్దలు తినాలని ఉంది కానీ నాకు ఆ అదృష్టం లేదు. దయచేసి మా అమ్మనీ నాకు తిరిగి ఇవ్వవా .
అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడే అటుగా శారద అనే ఒక ఆమె వెళ్తూ ఉంటుంది. ఆమె అనురాధ ని చూసి…. పాప ఎవరు నువ్వు ఇక్కడ కూర్చొని ఎందుకు
ఏడుస్తున్నావ్. అనురాధ….. నా పేరు అనురాధ మా అమ్మ పేరు లక్ష్మి . మా నాన్న పేరు వరుణ్ . నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. నా తోటి వాళ్ళు అందరూ
వాళ్ల వాళ్ల అమ్మానాన్నలతో సంతోషంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది.
అని ఏడుస్తూ ఉంటుంది.
శారద ఆమెను పట్టుకొని…. అయ్యో ఏడవకు అమ్మ ఇటు అంటూ ఆమె దగ్గర తీసుకుంటుంది. కొంత సమయం తర్వాత శారదా…. సరే పదా నేను మీ ఇంటి దగ్గర విడిచి పెడతాను. అందుకు ఆమె సరే అంటుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటిదగ్గర శారదా ని చూసిన
వరుణ్…. శారద ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరైనా చూస్తే బాగోదు వెళ్ళిపో.
శారద…. నిజానికి నువ్వని తెలిసి ఇక్కడికి వచ్చాను.పాప బాధని అర్థం చేసుకున్నావా తల్లి లేదని ఎంతగానో బాధ పడుతుంది.
ఇద్దరం ప్రేమించుకుంన్నము పెద్దలు ఒప్పుకోలేదు. విడిపోయాము నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు నేను ఒంటరిగా మిగిలిపోయాను.ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను.
నా కోసం కాకపోయినా పాప కోసం అయినా ఆలోచించు. అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వరుణ్ ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు అప్పుడు అనురాధ… నాన్న ఆ అమ్మ నీకు ముందే తెలుసా. వరుణ్…. తెలుసమ్మా తెలుసు.
అంటూ బాధ గా చెప్తాడు అనురాధ…. అయితే నాన్న అమ్మని పెళ్లి చేసుకో నాకు కూడా అమ్మ వస్తుంది. అని ఏడుస్తుంది.
అతను ఏం చెప్పకుండా అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కొన్ని రోజులు గడిచాయి పాప పదే పదే అమ్మని కావడంతో.ఇక తప్పనిసరి అతను శారద దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి. ఆమెను పెళ్లి చేసుకుంటాడు.
ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకువస్తాడు.
వాళ్ళిద్దర్నీ చూసిన అనురాధ ఎంతో సంతోషంగా అమ్మ అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంది. అప్పట్నుంచి అనురాధ కు తల్లి లేద నీ బాధ తీరిపోతుంది. రోజులు గడిచాయి
ఆమె అనురాధ ని చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే శారదా స్నేహితురాలైన
విమల ఇంటికి వస్తుంది. విమల ఒక డాక్టర్.
శారదా విమల ని చూసి చాలా సంతోష పడుతూ ఉంటుంది.
విమల….. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా.
శారద… సంతోషంగా ఉంది ఇదంతా నీ వల్లే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాను.
నీకు చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి విమల.
విమల…. నాదేముంది నువ్వు చెప్పినట్టే పురుడు పోసే టప్పుడు లక్ష్మి ని చంపేశాను.
నేను అప్పుడు చంపిన వరుణ్ ని కలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు
పట్టింది.
శారద…. నిజమే లక్ష్మీ అడ్డు తొలగించకున్న తర్వాత వరుణ్ తో మాట్లాడటానికి ఎంతగానో ప్రయత్నించాను కానీ అది వాళ్ళ కాలేదు అనుకోకుండా ఆ పిల్ల రాక్షసి ఉంది కదా దానివల్ల మళ్లీ ఒకటి అయ్యాము.
అంటూ సంతోషపడుతూ చెబుతోంది.
దాన్నంతా చాటుగా అనురాధ వింటుంది.
అనురాధ ఏడుస్తూ అక్కడికి వచ్చి .,…. అమ్మ మా అమ్మ ని మీరే చంపేశారా.
అంటూ ఏడుస్తుంది.
అందుకు వాళ్లు ఏం చెప్పాలో అర్థంకాక చాలా భయపడుతూ ఉంటారు
శారద…. అలా అని నీకు ఎవరు చెప్పారు అమ్మ.
అనురాధ…. నేను మీ ఇద్దరు మాట్లాడుకోవడం విన్నాను. నేను ఇప్పుడే నాన్నతో చెప్తాను అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.
విమల…. త్వరగా దానిని ఆపవే లేదంటే నా ఉద్యోగం పోతుంది. మీ ఆయన నిన్ను ఉరేసి చంపుతాడు. అని అంటుంది
అందుకు ఆమె భయపడుతూ ఆమె వెంట పరిగెడుతూ… అమ్మ అనురాధ ఆగు ఒక్క నిమిషం ఆగు అంటూ కేకలు వేస్తోంది.
ఆమె అస్సలు పట్టించుకోకుండా తండ్రి దగ్గరికి వెళ్దామని పరుగులు తీస్తూ ఉంటుంది ఆమె వెనక విమల కూడా పరిగెడుతుంది.
శారద కి ఏం చేయాలో అర్థం కాక ఒక చోట నిలబడి అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న రాయితో ఆ మీద విసిరి కొడుతుంది.
రాయి గట్టిగా తగిలి …… అమ్మ అమ్మ అంటూ పెద్దగా కేకలు వేస్తూ అనురాధా కుప్పకూలిపోతుంది. జర్నీ చూసినవి విమల చాలా కంగారుపడుతూ ఆమె దగ్గరికి వస్తుంది శారద… అయ్యో ఏం చేయాలో అర్థం కాక ఇలా చేశాను. దీనికి ఏమన్నా అయితే నా ప్రాణం తీస్తాడు.
శారదా…. మరి ఏం పర్వాలేదు ప్రాణాలు ఉన్నాయి తలకు తీవ్ర గాయమైంది అంటూ ఆమెను తన హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. అక్కడ ఆమెకు తలకి కట్టు కడుతుంది.
శారద…. విమల తనకి ఏం కాలేదు కదా.
విమల…లేదు కొంచెం సేపు ఉంటే సృహ లోకి వస్తుంది. వెళ్లి చూడొచ్చు .
అని అంటుంది కొంత సమయం అవుతుంది లోపల్నుంచి అనురాధ …. ఎవరు మీరు నేను ఇక్కడ ఎందుకు నన్ను పంపించండి మా అమ్మ నా కోసం ఎదురుచూస్తుంది. అంటూ పిచ్చి పిచ్చిగా కేకలు వేస్తూ ఉంటుంది.
ఆ కేకలు విన్న శారద , విమల ఇద్దరు ఆమె దగ్గరికి వెళ్తారు. శారద….. అనురాధ ఏమైందమ్మా ఎందుకు అలా అరుస్తున్నావ్. మీ అమ్మని వచ్చాను.
అనురాధ… మా అమ్మ నువ్వు కాదు . మా అమ్మ నాకు కావాలి అంటూ ఏడుస్తుంది.
విమల… శారద అనురాధ తలకు గాయం కావడం వల్ల గతం మర్చిపోయింది.
అని చెబుతోంది దాన్ని విని ఆమె…. అయ్యో మరి ఇప్పుడు ఎలాగా.
విమల…. మంచిదే కదా . మన గురించి ఎవరికీ చెప్పదు. ఇంకా ఏ బాధా లేకుండా హాయిగా ఉండొచ్చు.
అందుకు ఆమె…. అంతే అంటావా మరి నా భర్తకు ఏం చెప్పాలి.
విమల…. ఆడుకుంటూ పొరపాటున బండ మీద పడింది అని చెప్పు. తలకి బలమైన గాయం అయ్యి గతం మర్చిపోయింది అని కూడా చెప్పు. ఇక ఏ బాధ ఉండదు అని అంటుంది ఆ తర్వాత ఆమె సరే అని చెప్పి పాపను బలవంతంగా ఇంటికి తీసుకు వెళ్తుంది.
ఇంటిదగ్గర అనురాధా పిచ్చి పిచ్చిగా అరుస్తూ
ఉంటుంది. ఆమె అరుపులు వినలేక ఆమెను పట్టుకోలేక ఆమెను ఒక కుర్చీలో కట్టి వేస్తుంది.
కొంత సమయం తరువాత ఆమె భర్త వరుణ్ ఇంటికి వచ్చాడు .
అనురాధ ని కట్టివేయడం చూసి ….. ఏమైంది నా బంగారు తల్లి నీ కట్టి వేశావు.
అప్పుడు ఆమె విమల చెప్పినట్టుగా చెబుతుంది అందుకు అతను ఆమెను చూసి చాలా బాధ పడుతూ…. అయ్యో అంటూ ఏడుస్తూ ఉంటాడు. అతని భార్య అతన్ని ఓదారుస్తుంది. రోజులు గడిచాయి
అనురాధ తో శారదా విసుగెత్తి పోతుంది.
ఆమెకు అసలు ఏం చేయాలో అర్థం కాదు.
అప్పుడే విమల అక్కడికి వస్తుంది.
శారద తన బాధ మొత్తాన్ని ఆమెకు చెప్పుకుంటుంది.
దాన్ని విన్న ఆమె….సరే అయితే దాన్ని అడ్డుకూడా తొలగించుకుంటే ఒక పని అయిపోతుంది. అందుకు ఆమె చాలా భయపడుతూ ఉంటుంది.
విమల….ఎందుకు అంతగా భయపడుతున్నావు పిచ్చిదే కదా. దగ్గర్లో ఉన్న టపాసులు గూడెం లోకి తీసుకెళ్ళి వదిలేద్దాం
దాని చేతికి ఒక అగ్గి పెట్టి ఇస్తే సరిపోతుంది .
ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం అయింది కదా.
శారద…. కానీ వద్దు నాకు చాలా భయంగా ఉంది. అందుకు ఆమె…. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఈ పిచ్చి దాంతో జీవిత కాలం అంతా బాధపడుతూనే ఉండాలి అది నీకు ఇష్టమేనా.
ఆమె…. నువ్వు ఒక డాక్టర్ వి కదా ఆమెకు గతం గుర్తు వచ్చే మార్గమే లేదంటావా.
విమల…. అలాంటిది ఏమన్నా ఉండుంటే నేను కచ్చితంగా చెప్పే దానివి కదా ఇంతకన్నా గొప్ప అవకాశం దొరకదు మీ ఆయన కూడా ఊర్లో లేడు కదా . మిగతా కథ అంతా నేను నడిపిస్తాను.
అందుకు ఆమె సరే అంటుంది. ఆ తర్వాత విమల ఆ పాపను తీసుకుని ఊరి చివర ఉన్న
టపాసుల గూడెం లోకి వెళుతుంది .
చుట్టుపక్కల ఎవరూ ఉండరు ఆమె అటూ ఇటూ చూసి ఒక చిచ్చుబుడ్డి తీసుకొని బయటకు తెచ్చి దాన్ని వెలిగిస్తుంది.
దాన్ని చూసిన ఆ పాప కేరింతలు కొడుతూ.
భలే భలే భలే బాగుంది. అంటూ కేకలు వేస్తోంది.
విమల…. బాగుంది కదా అవిగో అలాంటివి అన్నీ లోపల ఉన్నాయి అవన్నీ నీ కోసమే ఇదిగో అగ్గి పెట్టి నీకు నచ్చినట్టుగా వాటితో ఆడుకో. అని తన చేతిలో ఉన్న అగ్గిపెట్టి ని ఇస్తుంది.
ఆ పాప అగ్గి పెట్టి తీసుకుని లోపలికి వెళ్తుంది.
అలా ఆమె లోపలికి వెళ్లిన వెంటనే విమల తలుపులు గడియ వేసి అక్కడ నుంచి వెళ్లి పోతుంది. లోపల ఉన్న ఆ పాప అగ్గి పెట్టి తో
చిచ్చుబుడ్డి నీ వెలిగిస్తుంది. అక్కడున్న అన్ని టపాసులు కావడంతో ఆ నిప్పులు అన్ని ఒకదానికొకటి అంటుకొని టపాసులు అన్ని పెద్దపెద్ద శబ్దాలతో పేలడం మొదలు పెడతాయి. పాప చాలా బాధపడుతూ పెద్ద పెద్దగా…. అమ్మ అమ్మ అంటూ అరుస్తూ
ఏడుస్తూ ఉంటుంది కొంత సమయానికి ఆ తాకిడికి ఆమె చనిపోతుంది.
విమల శారదా కి జరిగిన విషయం చెప్తోంది.
అప్పుడే ఆమె భర్త అక్కడికి వస్తాడు వాళ్ళ మాటలు అన్నీ వింటాడు.
అతను చాలా కోపంగా…. నేను వస్తానని ఊహించలేదు కదూ. నీవు నా భార్య బిడ్డ ని చంపిన హంతకులు. ఒక డాక్టర్ పదవిలో ఉండి. ప్రాణాలు పోయాల్సిన ది పోయి
ప్రాణాలు తీస్తావా. నా బంగారు తల్లి ఏం పాపం చేసిందని. అలా కఠినంగా ప్రవర్తించి నా బిడ్డని పొట్టన పెట్టుకున్నారు . భగవంతుడా అంటూ ఏడుస్తూ…. ఇద్దరిని చంపేస్తాను
వీరు బ్రతకడానికి వీల్లేదు మిమ్మల్ని చంపిన భార్య బిడ్డలు ఆత్మ కు శాంతి కలిగిస్తాను.
అంటూ వాళ్ళ గొంతు పట్టుకుంటాడు.
వాళ్ళిద్దరూ కూడా…. వద్దు దయచేసి మిమ్మల్ని చేయొద్దు. మమ్మల్ని ఏం చేయొద్దు అంటే పెద్ద పెద్దగా కేకలు వేస్తారు.
అతను …. ఛీ మి లాంటి పాపులని చంపి
నేను ఆ పాపాన్ని మూట కట్టుకొని నేను.
శారదా ఎవరి కోసం అయితే నువ్వు నా భార్య పిల్లల ప్రాణం తీశావు నేను నీకు దక్కను దూరంగా వెళ్ళిపోతాను. నీ చావు నువ్వు చావు ఒంటరి జీవితాన్ని అనుభవించు.
అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉంటాడు ఆమె….. ఏమండీ వద్దండి నన్ను విడిచిపెట్టి వెళ్ళకండి అంటూ ఏడుస్తూ అతని వెంట పడుతుంది అతను ఆమెను చీదరించుకుని వెళ్ళిపోతాడు .
విమల…. మరి ఏం పర్వాలేదు . వదిలేయ్.
శారద… ఛీ ఇదంతా నీ వల్లే జరిగింది.లక్ష్మి ని చంపడానికి కారణం నువ్వే ఈ బిడ్డ ని చంపడానికి కారణం నువ్వే . ఇదంతా నీ వల్లే జరిగింది . నీవల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నువ్వు నాకు కనపడవు.
వెళ్ళిపో అని అంటుంది అందుకు ఆమె ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
శారదా కూడా అక్కడ ఏడుస్తూ ఉండిపోతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *