సవతి తండ్రి హింస Step Father Violence |Telugu Kathalu | Telugu Stories | Telugu Moral Stories

లక్ష్యం పురం గ్రామంలో కృష్ణ పద్మ దంపతులు ఉండేవాళ్ళు. వాళ్లకు ఒక బిడ్డ ఉంది ఆమె పేరు శోభ.
వాళ్ల జీవితం చాలా చక్కగా సాగిపోతుంది.
sobha చక్కగా చదువుకుంటూ ఉంటుంది. రోజులు గడిచాయి సాఫీగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలో పిడుగులాంటి వార్త వచ్చి పడింది. ఆ వార్తతో వాళ్ళ జీవితం చిన్నాభిన్నం అయిపోయింది. కృష్ణ చనిపోయాడు అని. కనీసం ఆమె చివరి చూపు చూడడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుంది రైలు కింద పడి తను నుజ్జు నుజ్జు అయిపోయాడు. తర్వాత కార్యక్రమం జరిగింది. రోజులు గడుస్తున్న వి పద్మ అని అందరూ కూడా ఓదారుస్తూ ఉన్నారు. కూతురు శోభా కి తండ్రి చనిపోయిన విషయం తెలీదు . వాళ్ళ ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో…… అక్క ఎప్పుడు వస్తాడో ఎక్కడికి వెళ్ళాడు అమ్మ చెప్పడం లేదు. నువ్వు అయినా నాకు చెప్పు. పిన్ని నువ్వే నా నాన్న ఎక్కడున్నాడో చెప్పు. అంటూ వచ్చి పోయే వాళ్లందర్నీ అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఏడుస్తూ…… నాన్న కచ్చితంగా వస్తా అమ్మ అంటూ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు రోజులు గడుస్తున్నాయి. అమెరికా నుంచి
కృష్ణ చెల్లెలు శాంతి వస్తుంది ఆమె సరాసరి పద్మ దగ్గరకు వెళ్లి ఆమెను పట్టుకుని ఏడుస్తూ….. వదినా నేను కనీసం అన్నయ్యను చివరి చూపు కూడా చూసుకోలేక పోయాను. ఇంతటి దౌర్భాగ్యము ఏ చెల్లికి రాకూడదు .
అంటూ ఏడుస్తుంది పద్మ….. నువ్వే కాదు నేను కూడా అదే మొఖం చూసుకో లేకపోయాను అమ్మ . అంటూ చాలా ఏడుస్తూ బాధపడుతుంది.
శాంతి….. అసలు ఏం జరిగింది వదిన.
పద్మ….. ఏముంది శాంతి పొరుగూరు వెళ్లాలని చెప్పాడు. ఏదో పొలం బేరం లోకి వచ్చింది దాన్ని మనం కొనుక్కున్నాదాము.
మన జీవితం పూర్తిగా మారిపోతుంది.
అని ఎన్నో మాటలు చెప్పాడు.
నేను చాలా సంతోషపడ్డాను. జాగ్రత్తలు చెప్పి పంపించాను. ఆయన వెళ్లేసరికి రైలు ఫ్లాట్ఫామ్ మీద ఆగి ఉందట. టికెట్ తీసుకునే లోపే రైలుబండి కదలడంతో పరుగులు తీసి
ఎక్కడానికి ప్రయత్నించాడు. ఇంట్లోనే ప్రమాదం జరిగి పోయింది కాలుజారి పట్టాల కింద పడిపోయాడట. అంతే జరగాల్సిందంతా జరిగిపోయింది అమ్మ అంటూ బోరున ఏడవడం మొదలు పెడుతుంది.
శాంతి కూడా ఏడుస్తుంది రోజులు గడిచాయి.
ప్రతిరోజు శోభ వాళ్ళ అత్త శాంతితో…… అత్త నువ్వు చెప్పు నాన్న ఎక్కడికి వెళ్ళాడు. అమ్మ నాన్న గురించి చెప్పట్లేదు . నువ్వు చెప్పు నాన్న ఎప్పుడొస్తాడు.
అందుకు శాంతి బాగా ఆలోచించి…… నాన్న దేవుడి దగ్గరికి వెళ్లడు. అక్కడికి వెళ్ళి నీ కోసం కొత్త నాన్నని పంపిస్తాడట. నువ్వు ఎంచక్కా కొత్త నాన్నతో సంతోషంగా ఉండొచ్చు. కొత్త నేను నీకు కొత్త కొత్త బట్టలు.
చాక్లెట్లు, బొమ్మలు అన్ని తీసుకొస్తాడు.
అని చెబుతుంది ఆ మాట వినగానే పాపా సంతోషపడుతూ…… బలే బలే కొత్త నాన్న కావాలి కొత్త నాన్న అంటూ చప్పట్లు కొడుతుంది. శాంతి…. పాప తప్పకుండా వస్తాడు నువ్వు వెళ్లి ఆడుకో అని సమాధానం చెబుతుంది. పాపా సరే అని చెప్పి కేరింతలు కొడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలన్నీ విన్న పద్మ…… ఏంటి శాంతి నువ్వు చెప్తుంది . చిన్న పిల్లలకు అలా చెప్తారు. వాళ్ళ మనసులో అలాగే ఉండిపోతయి ఆ మాటలు అన్ని. ఆ మాటలు విన్న శాంతి….. వదిన నేను ఇప్పుడు చెప్పింది అబద్ధం కాదు నిజమే నీకు మంచి సంబంధం చూశాను. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి సంతోషంగా ఉండాలి ఇలా ఎంతకాలం ఒంటరి గా ఉంటావు వాయిసు అయిపోలేదు కదా నీకు .
అందుకు ఆమె….. ఏం మాట్లాడుతున్నావ్ . ముందే పెళ్లయి పిల్లలు ఉన్న నాకు . మళ్లీ పెళ్లి అంటే సమాజం నవ్వుతుంది. నేను తలదించుకోవాల్సిన పని వస్తుంది నాకు వద్దు నేను చేసుకోను.
శాంతి ఆ మాటలకు ఏ మాత్రం ఒప్పుకోదు.
ఆమె….. చూడు వదిన సమాజం కోసం నువ్వు బ్రతకడం లేదు నీ కోసం నీ బిడ్డ కోసం
బ్రతుకుతున్నావూ ఎవరో ఏదో అన్నారని మనం ఆగిపో కూడదు నా మాట విను నీ జీవితం మారి పోతుంది అని అంటుంది ఒప్పుకోదు . రోజులు గడుస్తున్నాయి పాప నాన్న కావాలని ఏడవడం. శాంతి పదేపదే పెళ్లి చేసుకోమని పద్మను కోరడంతో ఇక ఆమె పెళ్ళికి ఒప్పుకోవాల్సి వస్తుంది.
కొన్ని రోజులకి అనిల్ అనే వ్యక్తి తో పద్మ కి పెళ్లి జరుగుతుంది.
కొత్త జీవితం కొత్త సంవత్సరం చాలా చక్కగా సాగిపోతుంది. శాంతి తన ఉద్యోగాన్ని హైదరాబాద్లోకి మార్పించు కొని అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
అప్పుడప్పుడు వాళ్ళ వదిన దగ్గరకు వచ్చి పోతూ ఉంటుంది.
కచ్చితంగా ఈ నెల రోజుల తర్వాత.
శాంతి పద్మ వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడ ఎవరు ఉండరు . పాపా ఒక్కటే ఒంటరిగా కూర్చుని ఉంటుంది.
పాప శాంతి ని చూసి. ….. అత్త అని చెప్పి పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది.
ఆమె….. ఏమైంది శోభా ఎందుకు ఏడుస్తున్నావ్.
పాప…. అత్త నాకు ఈ కొత్త నాన్న వద్దు.
పాత నాన్న కావాలి. పాత నన్ను ప్రేమగా చూసుకునేవాడు. ఈ నాన్న నన్ను ఎప్పుడూ కొడుతున్నాడు. ఇదిగో చూడు వాతాలు
అంటూ ఏడుస్తూ చేతిపై వాతలు చూపిస్తుంది.
అందుకు శాంతి చాలా కంగారు పడుతూ….. ఏమైందమ్మా ఏం జరిగిందో చెప్పు.
పాప ఏడుస్తూ…… మొన్న నేను నాన్న దగ్గరికి వెళ్లి. నాన్నతో…… నాన్న నాన్న మనం ఏనుగు ఆట ఆటాడుకుందాం రా నాన్న.
సవతి తండ్రి….. హే ఊరికే నాన్న నాన్న ఆనీ నస పెడుతూ ఉంటావు.
నాకు వేరే పనులు లేవ నీతో ఆడుకోవడానికి.పో అంటూ
కొట్టాడు .
నేను ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళాను.
అమ్మ నాన్న నీ ఏమీ అనలేదు తెలుసా.
ఇంక నాతో నాన్నగారికి వద్దకు వెళ్లి విసిగించ కూడదు అని చెప్పింది.
నేను నాన్న దగ్గరికి వెళ్ళాలని ఆడుకోవాలని ఉన్నాకూడ దగ్గరికి వెళ్లడం మానేసాను.
కానీ ఉండబట్టలేక వెళ్తున్న ప్రతి సారి కొడుతున్నాడు తిడుతున్నాడు.
మొన్నటికి మొన్న . ఆయన దగ్గరికి వెళ్లి….. నాన్న కొనుక్కుంటాను రెండు రూపాయలు ఇవ్వరా.
సవతి తండ్రి…… డబ్బులు అంటే నీకు చెట్లకు కాస్తున్నయ. అసలు నాన్న అని నిన్ను పిలువనా అని ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఇలా కాదు. అంటూ నా కాళ్లు చేతులు కట్టి వేసి మంట దగ్గరకు తీసుకు వెళ్ళాడు …… ఈరోజు నుంచి నాన్న అని పిలవాలి అని చెప్పు లేదంటే నిన్ను మంటల్లో వేస్తాను.
నేను ఏడుస్తూ ….. నేను నాన్న అని పిలవను నాకు భయమేస్తుంది వద్దు నన్ను చంపొద్దు . అంటూ కేకలు వేశాడు.
ఇంతలో అమ్మ వచ్చి….. ఏం చేస్తున్నారు మీరు. చిన్న పిల్లలతో ఎలా ప్రవర్తిస్తార.
అంటూ సర్ది చెప్పి. నన్ను నన్ను అక్కడినుంచి కాపాడింది. ఆ రోజు నుంచి ప్రతి రోజు అమ్మ నాన్న కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి .
నాతో ఎవరూ మాట్లాడటం లేదు .
అని ఏడుస్తూ చెబుతుంది ఆ మాటలు విన్న ఆమె చాలా బాధ పడదు…. నువ్వేం బాధపడకు అమ్మ . మనం ఇంక ఇక్కడ ఉండదు. నీకోసం ఆ ఉద్యోగాన్ని ఇక్కడికి మార్చుకున్నాను మళ్లీ మన అమెరికా వెళ్ళిపోదాం అక్క నీకు ఎలాంటి బాధ ఉండదు. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్లారు .
పాప పొలం వెళ్లారు అని సమాధానం చెబుతుంది. వెంటనే శాంతి ఒక ఉత్తరం రాసి ఆ తలుపు పెట్టి పాపను తీసుకుని వెళ్లి పోతుంది. సాయంత్రం తల్లిదండ్రులు ఇద్దరూ ఇంటికి వస్తారు . అక్కడ ఉన్న మొత్తం చదువుతి…. పాప వల్ల మీకు గొడవలు అవ్వడం . నాకు ఇష్టం లేదు అని నేను సంతోషంగా చూడాలని అనుకుంటున్నాను.
అందుకే నాతో పాటు అమెరికా తీసుకు వెళ్తున్నాను. ఇకనుంచి మీకు పాపం లేదు . శోభ ఈరోజు నుంచి నా కన్న కూతురు నేను అలాగే చూసుకుంటాను. ఈరోజు తో ఈ బంధం తెగిపోయింది అనుకోండి.
అని ఉంటుంది దాన్ని చదివి….. అయ్యో భగవంతుడా అంటూ తల్లి ఏడుస్తుంది. సవతి తండ్రి…. దరిద్రం వదిలి పోయింది అని అంటాడు. ఇక రోజులు గడిచాయి అక్కడ భార్య భర్తల సంతోషగా ఉంటారు. శాంతి పాప ఇద్దరూ అమెరికా వెళ్లి అక్కడ సంతోషగా ఉంటారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *