1990 vs 2020 Then vs Now | Telugu Stories | Telugu Kathalu | Bedtime Stories | Panchatantra kathalu

కాలానికి తగ్గట్టుగా మనుషులు మారతారు. వాళ్ల అభిరుచులు వాళ్ళ ఆలోచనా విధానాలు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు మనం 1990 లో ఉన్న ఒక గ్రామం. 2020 లో ఉన్న అదే గ్రామంలో వచ్చిన మార్పులు అక్కడ మనుషుల్లో వచ్చిన మార్పులు తెలుసుకుందాం. అది మచిలీపట్నం 1990లో అక్కడి ప్రజలు ఒకరితో ఒకరు ఎంతో చక్కగా మాట్లాడుకుంటూ. అలాగే చాలా సంతోషంగా వాళ్ళ జీవితాలు గడుపుతూ ఉండేవాళ్ళు.


అదే గ్రామంలో ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో భర్త రామయ్య భార్య శకుంతల. వాళ్ళ కొడుకు రమేష్ ఉండేవాళ్ళు. రమేష్ ప్రతి రోజు బడికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి . ప్రశాంతంగా వాళ్ల స్నేహితుల తో ఆడుకుంటూ ఉండే వాడు. అతను అలా అనుకున్న సమయంలో బట్టలకు మట్టి అంట్టి నా పట్టించుకోకుండా ఆడుకుంటూ ఉండేవాడు తల్లి దాని గురించి ఎప్పుడూ తిడుతూ ఉండేది. దాన్ని అతను పట్టించుకోకుండా అలా చేస్తూ ఉండేవాడు ఒక రోజు ఆదివారం . రాజేషు వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటూ ఉంటాడో . వాళ్లు కొంతమంది టైర్లతో ఆడుకుంటూ. మరికొంత మంది బాలులతో ఆడుకుంటూ ఉంటారు.
అప్పుడే రాజేష్ తల్లి అక్కడికి వచ్చి…. రాజేష్ పొద్దుననగా ఇక్కడికి వచ్చావ్ రా . అన్నం కూడా తినలేదు ఎప్పుడు ఆట ఆట.
బట్టల చూడు ఎలా మురికి చేసుకున్నావో. వాటిని శుభ్రం చేయలేక నా ప్రాణాలు పోతున్నాయి. ముందు నువ్వు ఇంట్లోకి నడువు అంటూ అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది.
అతను రాను అంటూ ఏడుస్తూ ఉంటాడు ఆమె బలవంతంగా లోపలికి తీసుకు వెళ్తుంది.
తండ్రి…. ఎందుకు వాడికి అంత ఇబ్బంది పెట్టి లోపలికి తీసుకు వస్తున్నావు ఆడుకో నివ్వు .
తల్లి…. ఎప్పుడూ ఆటలే నా కాసేపు కూడా ఇంటిపట్టునే ఉండడు . ఎప్పుడూ ఆటలు ఆడుతూనే ఉంటాడు.
తండ్రి…. ఆటలు ఆడడం లో తప్పేముంది మంచిదే కదా. నువ్వు తిని ఆడుకో రా అని అంటాడు. అందుకు తను సరే అంటాడు తల్లి అతనికి అన్నం తినిపిస్తూ ఉంటుంది.
ఆ తర్వాత అతనితో చాలా కబుర్లు చెబుతోంది. అలా వాళ్ల జీవితాలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రతిరోజు ఆటలు ఆటలు తర్వాత తల్లితో తండ్రి తో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అందరూ కలిసి భోజనం చేయడం. ఆ చేస్తూ ఉంటారు సంవత్సరాలు గడిచాయి. రాజేష్ పెద్ద వాడు అవుతాడు అతనికి పెళ్లి జరుగుతుంది . వాళ్ల అబ్బాయి పేరు కిరణ్. కిరణ్ అచ్చం తండ్రి పోలికే తండ్రి చిన్నప్పుడు ఎలా అయితే ఉన్నాడో అతను కూడా అచ్చం అలాగే ఉంటాడు.
అతను బడి నుంచి రాగానే తల్లితో… అమ్మ ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు.
తల్లి…. ఒరేయ్ ఎప్పుడు ఆ వీడియో గేమ్స్ ఏంట్రా కాసేపు బయటికి వెళ్లి ఆడుకో. ఆట ఆడుకోవడం వల్ల నువ్వు చాలా చురుగ్గా ఉంటావు . హెల్త్ కు చాలా మంచిది నా మాట విను ఆడుకో పో.
అతను ఆమె మాటలు పట్టించుకోకుండా ఫోన్ లో ఆటలు ఆడుకుంటూ ఉంటాడు.
ఇంతలో వాళ్ళ నాయనమ్మ అక్కడికి వచ్చి…. వినయ్ ఏం చేస్తున్నావ్ ఫోన్ లో గేమ్ ఆడుకుంటున్నావా. కాసేపు ఫోన్ పక్కన పెట్టి నాతో మాట్లాడు.
అతను… నాయనమ్మ నన్ను అర్పించుకు నేను ఆట ఆడుకుంటున్నాను. అని సమాధానం చెప్తాడు.
ఇక అతనికి ఆ ఫోనే ప్రపంచం ఎవరితో ఏమి మాట్లాడవు. తల్లి ఎంత అరిచినా అంతే ఎవరు ఏం చెప్పినా అంతే అతను మాత్రం వీడియో గేమ్ ఆడుకుంటూనే ఉంటాడు .
అలా ఉండగా తండ్రి అప్పుడు అక్కడికి వస్తాడు. అతను పిల్ల వాడిని చూసి…. ఏరా ఎప్పుడు ఆ ఫోన్ పట్టుకుని ఆడుకుంటూనే ఉంటావు బయటికి వెళ్లి కలిసే ఆడుకోరా.
అతను…. డాడీ మమ్మీ ఎప్పుడు నన్ను బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు అంటారు ఎందుకు నేను ఇక్కడ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా. అని ఎదురు సమాధానం చెప్పి మాట్లాడతాడు .
అప్పుడు తల్లి…. బాగా ఎదురు సమాధానం నేర్చుకున్నావ్వుం. చంప మీద కొడిత ఇంకొకసారి మాట్లాడావంటే . అని తిడుతుంది అతను ఏం పట్టించుకోకుండా ఆడుకుంటూనే ఉంటాడు నాయనమ్మ దాన్ని చూసి…. ఒరేయ్ రాజేషు నీకు గుర్తుందా అంటా చిన్నప్పుడు. నువ్వు నీ స్నేహితులు అందరితో బయటికి వెళ్లి ఆడుకొని బట్టలు నిండా మురికి చేసుకునే వాడివి. మరి ఇప్పుడు నీ కొడుకు ఇంట్లో నుంచి బయటికి అసలు వెళ్లడం లేదు
అతను…. నిజమే అమ్మ అప్పటి రోజులే వేరు. అందరం ఒకచోట కూర్చుని సరదాగా గడిపే వాళ్ళం కానీ ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నారు కలవడానికి సమయం ఉండడం లేదు మాట్లాడుకోవడానికి సమయం ఉండటం లేదు . ఏంటో టెక్నాలజీ పెరిగింది అంటే ఏమో అనుకున్నాను కానీ . మనిషికి మనిషికి మధ్య ఎంతో దూరాన్ని పెంచుతుంది నా కొడుకు నాతో ఇంతవరకు ప్రేమగా మాట్లాడింది లేదమ్మా. కానీ నా చిన్నప్పుడు మీతో నాన్నతో చాలా విషయాలు పంచుకుంటూ ఉండేవాడిని .
ఇది కంప్యూటర్ కాలం అని అంటాడు.
ఆ మాటలు విన్న తల్లి…. ఏమో కానీ ముందు వాడిని కాసేపు బయటికి పంపించి స్నేహితులతో ఆడుకోమని చెప్పు లేదంటే ఎప్పుడు ఈ వీడియో గేమ్స్ తో మీ అందర్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడే అతని భార్య…. ఒరేయ్ కిరణ్ గా నువ్వు బయటికి నడువు రా అంటూ అతని చేయి పట్టుకొని బయటకు నెట్టేస్తుంది . అతను మాత్రం ఫోను ఏ మాత్రం వదలకుండా అలా చూస్తూనే ఉంటాడు. ఆమె మాత్రం … ఒరేయ్ ఫోన్ లేపు బయటికి వెళ్ళి మీ స్నేహితులతో ఆడుకునే రా పో. అని చెప్పి ఫోన్ తీసుకుని లోపలకు వెళ్లి పోతుంది. అతను చాలా సమయం వరకు అక్కడే ఉంటారు అతనికి స్నేహితులు చాలా మంది ఉన్న. వాళ్లంతా ఎప్పుడు బయటికి రారు. వాళ్లు కూడా వీడియో గేమ్స్ ఆడుకుంటూనే ఇంట్లో ఉంటారు.
కిరణ్ కి చాలా కోపం వచ్చి ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ తల్లితో…. అమ్మ బయట ఆడుకోడానికి నన్ను పంపించావు అక్కడ ఎవరూ లేరు. అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు. మీరు మాత్రం నన్ను బయటకి వెళ్లి ఆడుకో అని చెప్తరు. ఆడుకోవడానికి ఎవరూ రావడం లేదు అలాంటప్పుడు నేను మాత్రం ఎందుకు బయటికి వెళ్ళాలి ఎవరితో ఆడుకోవాలి. అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. తల్లి ఏం చేయలేక వదిలేస్తుంది.
నాయనమ్మ…. ఏంటో ఈ కాలం పిల్లలకి ఏం చెప్పినా ఏం అర్థం కాదు. వాళ్లు మన మాటలు అస్సలు పట్టించుకోరు వెనకటి ఈ రోజుల్లో మీ ఆయన ఎప్పుడూ కూడా వేధించే లేదు చాలా సంతోషంగా మా కుటుంబాలు గడిచిపోయాయి. ఏంటో ఈ ఘోరాలు అని చెప్పి లోపలికి వెళ్తుంది.
ఆ పిల్లవాడు మాత్రం ఎవరు ఏం చెప్పినా ఏమి వినకుండా ఫోన్ లో గేమ్ ఆడుకుంటడు.
అలా రోజులు గడిచాయి . తల్లి తండ్రి నాయనమ్మ తాత అందరూ అతనికి సర్ది చెప్పినా కూడా అతను అస్సలు పట్టించుకోడు. అతను ఎవరు ఏం చెప్పినా అసలు వినకుండా ఆ ఫోన్ లోనే మునిగిపోతాడు. తండ్రి చాలా బాధ పడుతూ ఇలా అయితే. వాడికి జ్ఞానం ఎలా వస్తుందో. ఏమో నాకు అర్థం కావడం లేదు . ఏంటో వీడు అసలు ఏమీ అర్థం కావడం లేదు . ఆ రోజుల్లో తల్లిదండ్రులకు మేము చాలా గౌరవిస్తూ మాట్లాడే వాళ్ళం కానీ ఈ రోజుల్లో. తల్లిదండ్రులకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు పిల్లలు. అని అంటూ చాలా బాధపడతాడు. తల్లి అతనితో….. చూడు రాజేష్ కాలంతో పాటు ఎన్నో మార్పులు చూశాను. కొత్త కొత్త టెక్నాలజీలను చూశాను. ఇవన్నీ తయారుచేయడానికి మనిషికి కావాల్సింది ఒక బ్రెయిన్ . దానిని ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నారు. అది ఒక్కటి ఉంటే చాలు సంతోషంగా ఉండొచ్చు అంటుంది.
అతను…. నిజమే అమ్మ ఈ రోజుల్లో పిల్లలకి ఆటలు అంటే ఏంటో తెలియడం లేదు . ఎప్పుడు వీడియో గేమ్స్ అని ఆడుకుంటూనే ఉన్నారు . ఏంటో లే అని అనుకుంటాడు.
అలా రోజులు గడిచాయి అతను ఎప్పుడు ఆ ఫోన్ ని చూస్తూ ఆడుకోవడం వల్ల అతని కంటికి చూపు మందగిస్తుంది.
దాన్ని తెలుసుకున్న తండ్రి అతనికి ఒక కళ్ళజోడు తీసుకొస్తాడు సైడ్ కి.
దానిని తీసుకొని ఆ పిల్లవాడు చాలా సంతోషపడుతూ. …. నాన్న ఇది చాలా అద్భుతంగా ఉంది. నాకు ఇప్పుడు అంతా సరిగ్గా కనబడుతుంది అంటాడు అతను…. సరే చాలా మంచిది అసలు ఇంత చిన్న వయసులో సైడు రావడం ఏంటి. ఇదంతా నువ్వు చేసుకున్న పని . ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండ. ఎప్పుడూ ఆ ఫోన్లో చూసుకుంటూ ఉంటావు అందుకే ఇప్పుడు నీకు ఎలా అయింది. ఇంత వయస్సు వచ్చినా మీ నాయనమ్మ తాతయ్య గారికి కళ్ళజోడు అంటూ తెలియదు.
ఇక నుంచి నువ్వు ఫోన్ పట్టుకో నీ పని చెప్తాను అని బెదిరిస్తాడు.
అతను ఫోను ఇచ్చేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. కొన్ని రోజులు అతను ఫోన్ పట్టుకోడు. కొడుకు మారిపోయాడు అని అనుకుంటారు. కానీ అతను ఒక రోజు… నాన్న నాకు సపరేట్ గా ఒక ఫోన్ కావాలి నువ్వు కొని పెడతావా లేదా అని అంటాడు.
అందుకు అతను…. ఎందుకు రా నీకు ఫోను ఈ వయసులో.
అతను ఏడుస్తూ మారం చేస్తాడు.
ఇక తప్పనిసరి పరిస్థితిలో కొడుకుకి ఫోన్ కొని పెడతాడు. ఇంకా అతను ఆ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. తల్లి గురించి గానీ తండ్రి గురించి గానీ అస్సలు పట్టించుకోడు.
ఆ తల్లిదండ్రులు కూడా ఏమీ చేయలేక వురక ఉండిపోతారు. అప్పుడు వాళ్ల తాతయ్య…. ఈరోజుల్లో ఎవరు కూడా మాట అస్సలు వినటం లేదు. ఎక్కడ చూసినా ఫోను ఫోను ఫోను . తీరిగ్గా తల్లిదండ్రులతో మాట్లాడే వాళ్లే లేరు. మనవడు తో ఆడుకునే అదృష్టం మాకు కూడా లేదు. అందరూ అలాగే ఉన్నారు . తరాలు మారే కొద్దీ మనుషుల్లో మార్పులు చాలా వచ్చాయి. కంప్యూటర్ పిల్లలు వీళ్ళంతా. ఏం చేస్తాము తప్పదు. అని చాలా బాధపడతాడు. ఎలా అయినా పిల్లవాణ్ణి మార్చాలని అనుకుంటారు తల్లిదండ్రులు అందుకే అతనితో మాట్లాడటం మానేస్తారు.
ఏ పనైనా అతని చేసుకోవాల్సి వస్తుంది . అతని ఏడుస్తూ…. ఎవరు నాతో మాట్లాడడం లేదు ఎందుకు. నాకు చాలా బాధగా ఉంది.
తల్లి…. మరి ఇన్ని రోజులు కూడా అలాంటి బాధను మేము అనుభవిస్తాము . నువ్వు మాతో మాట్లాడకుండా ఫోన్ లో గేమ్లు ఆడుకున్టావు . మమ్మల్ని అస్సలు పట్టించుకోరు అలాంటప్పుడు మేం కూడా నిన్ను పట్టించుకోము. ఎక్కడైనా నాయనమ్మ తాత తో ఆడుకుంటూ కబుర్లు చెప్తూ ఉంటే వాళ్లకి మాకు ఎంత బాగుంటుంది . నీ పాటకి నువ్వు ఉంటే వాళ్లు ప్రేమ అంతా ఎవరి మీద చూపించాలి. నువ్వు వాళ్ళ ప్రేమకు దూరం అవుతావో వాళ్ళు నీ చెల్లి కి దూరం అవుతారు. రోజు ఇదే జరుగుతుంది అని అంటుంది ఆ మాటలకు అతని ఏడుస్తూ…. అమ్మ తప్పయిపోయింది అంటాడు ఇక అప్పటి నుంచి అతను మొబైల్ ని పక్కన పెట్టేసి తల్లిదండ్రులతో నాయనమ్మ తాత తో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉంటాడు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *