కాపాడుతున్న నాగిని_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కృష్ణాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో గోవింద్ , లక్ష్మీ అనే తండ్రి కూతురు ఉండేవాళ్ళు. ఆ కుటుంబం ఎప్పుడు నాగదేవత నీ ప్రార్థిస్తూఉంటారు ఒక రోజు లక్ష్మీ గోవింద్ ఇద్దరూ
రాత్రి సమయం పక్క ఊరు నుంచి వస్తూ ఉండగా. మార్గ మధ్యలో ఒక నిప్పుల మధ్య ఒక పాము చిక్కుకొని ఉంటుంది దాన్ని చూసిన గోవింద్…. అమ్మ నాగదేవత నేను నిన్ను కాపాడుతాను అమ్మ అంటూ ఆ మంటల్లోకి దూకి ఆ పాముని బయటకి విసిరేసాడు. ఆ మంటలు అతనికి అంటుకొని అక్కడికక్కడే మరణిస్తాడు.
దాని అంతా చూస్తున్న లక్ష్మి…. నాన్న నాన్న అంటూ కేకలు సృహా తప్పి కింద పడిపోతుంది. అక్కడ ఉన్న పాము …. అయ్యో నా కోసం తన ప్రాణాలను అర్పించాడు. ఈరోజు అమావాస్య కారణంగా నా శక్తులన్నీ క్షీణించాయి ఆ మాంత్రికుడు నన్ను చంపాలని నన్ను బంధించాడు అంటూ బాధపడుతుంది. ఇంతలో తెల్లవారిపోతుంది
ఆ పాము సామాన్య స్త్రీగా మారి అక్కడున్న లక్ష్మి ని తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.
లక్ష్మీ ఏడుస్తూ…. మా నాన్న నాగదేవతను కాపాడడానికి మంటల్లో పడి చనిపోయాడు. ఇప్పుడు నేను ఒంటరి దాన్ని అయిపోయాను.
అని ఏడుస్తుంది అందుకు ఆమె…. బాధపడకు దైవ నీకు కచ్చితంగా మేలు చేస్తోంది.
లక్ష్మి….. అది సరే కానీ ఇంతకీ మీరెవరు.
ఆమె… నువ్వు అక్కడ పడిపోవడం చూసి నీకు సహాయం చేయడానికి వచ్చాను.
నాకూడా ఎవరూ లేరు నీకు నేను తోడుగా ఉంటాను. అని అంటుంది అందుకు ఆమె సరే అంటుంది అలా రోజులు గడిచాయి .
ఆ ఇంటికి లక్ష్మీ మేనత్త వస్తుంది.
ఆమె … అయ్యో భగవంతుడా ఎంతపని జరిగిపోయింది ఒసేయ్ లక్ష్మి మీ నాన్న మమ్మల్ని వెళ్ళిపోయాడు తెలిసి. గుండెలు బాదుకుంటూ ఇక్కడికి వచ్చాను.
అయ్యో అన్నయ్య అప్పుడే మీకు నిండు నూరేళ్ళు నిండిపోయాయ అంటూ ఏడుస్తుంది లక్ష్మి ఆమెను ఓదారుస్తూ ఉంటుంది.
మనిషి రూపంలో ఉన్న నాగిని ఆమెను చూసి…. కొంతమంది దృష్టిల కళ్ళు పడ్డాయి కాబట్టే ఇలా జరిగింది. అని అంటుంది అందుకో అత్త ఆమె వైపు చూసి……. ఎవరు ఈ అమ్మాయి.
లక్ష్మి…. నా స్నేహితురాలు ఆమెకు ఎవరూ లేరు. అందుకే ఇక్కడే ఉంటుంది నాకు తోడుగా.
అప్పుడామె…ఎవర్ని పడితే వాళ్ళు ఇంట్లోకి రానివ్వకూడదమ్మా రోజులు అస్సలు బాలేదు. అయినా ఇప్పుడు నేను వచ్చాను కదా. ఆ అమ్మాయి ని బయటికి పంపించు అని అంటుంది ఎందుకు లక్ష్మి….. అయ్యో అత్తయ్య ఉన్నట్టుండి వెళ్ళిపో అంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లి పోతుంది .
మనిషి రూపంలో ఉన్న నాగిని…. మరేం పర్వాలేదు నేను వెళ్ళొస్తాను లక్ష్మి . జాగ్రత్తగా ఉండు నువ్వు నమ్మిన నాగమ్మ చాలా శక్తి గలది. ఏ కష్టం వచ్చినా ఆమె నీ మాత్రం విడిచి పెట్టకు అది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
చాలా రోజులు గడిచాయి. అత్త లక్ష్మీ చేత పనులన్నీ చూపిస్తూ ఆమె కూర్చుని ఉంటుంది. ఒకరోజు అత్తయ్య లక్ష్మితో…. అమ్మ లక్ష్మి ఇంకా ఎంత కాలం ఇలా ఒంటరిగా ఉంటావు. మీ బావ నీ పెళ్లి చేసుకోవచ్చు కదా.
లక్ష్మి…. లేదు అత్తయ్య నేను పెళ్లి చేసుకోను.
నేను మధు అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను.
ఆ మాటలు విన్న ఆమె చాలా కోపంగా…ఏమీ నా కొడుకుని పెళ్లి చేసుకోకుండా మరొక డి నీ ఎలా పెళ్లి చేసుకుంటావు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట చెప్పావే అంటూ ఆమెను కొడుతుంది.
లక్ష్మి…. అత్తయ్య ఎందుకు నామీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇది అస్సలు బాలేదు.
అత్త…. నాకు ఎదురు సమాధానం చెప్తావా. నువ్వు చచ్చినట్టు బావని పెళ్లి చేసుకోవాల్సిందే. ఈ ఆస్తి మొత్తం మా సొంతం కావాల్సిందే అంటూ ఆమెను లోపలికి తీసుకెళ్లి ఒక గదిలో బంధిస్తుంది.
అలా రోజులు గడిచాయి ఆమె కుమారుడు అక్కడికి వస్తాడు. అత్తయ్య ఆమెకు బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తోంది కానీ అది జరగదు.
అందుకోసం లక్ష్మికి తిండి తిప్పలు కూడా లేకుండా చేస్తుంది.
లక్ష్మీ ఒంటరిగా గదిలో కూర్చుని…. అమ్మా నాగమ్మ ఎక్కడున్నావ్ మా అత్తయ్య నన్ను ఎంతో ఏం చేస్తుంది బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. మూడు రోజుల నుంచి నాకు కడుపు మా డుస్తున్నారు .
నన్ను రక్షించు తల్లి అంటూ నాగ్గమను వేడుకుంటుంది అప్పుడు ఆ గదిలో నాగిని ప్రత్యక్షమవుతుంది.
నాకు ఎన్ని చూసిన లక్ష్మీ చాలా సంతోషపడుతుంది ఇప్పుడు నాగిని…. బాధపడకు లక్ష్మి నేనున్నా కదా నీకు ఏమీ కాదు ఈ భోజనం తీసుకో అంటూ భోజనం ప్రత్యక్షం చేసి ఆమెకు అందిస్తుంది.
ఆమె దాన్ని తిని అక్కడ ప్రశాంతంగా నిద్ర పోతుంది. అప్పుడు నాగిని లోపలికి వెళ్లి
నిద్రపోతున్నా అత్తయ్య మరియు ఆ వ్యక్తి పక్కలో పెద్ద పాముని ఉంచుతుంది.
దాన్ని చూసి వాళ్ళు చాలా భయపడుతూ…. అమ్మో పాము పాము అంటూ కేకలు వేస్తారు.
అలా వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టిన తర్వాత ఆ పాము అక్కడినుంచి మాయమైపోతుంది.
వాళ్ళు ఆ రోజు రాత్రి మొత్తం బిక్కుబిక్కుమంటూ అక్కడే ఉండి పోతారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం అత్త లేచి లక్ష్మీ దగ్గరకు వచ్చి…. ఇప్పటికైనా మీ బావతో కాళీ కట్టించుకో . లేదంటే ఈ కొరడాతో నీకు వాతలు తప్పవు.
అని అంటుంది లక్ష్మి ఏ మాత్రం భయపడకుండా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు అత్త ఆమెను కొట్టడం మొదలు పెడుతుంది. వెంటనే అక్కడకు నాగిని వాళ్లకి కనపడకుండా అక్కడ ప్రత్యక్షమవుతుంది.
ఆమె చేతిలో ఉన్న కొరడా గాల్లోకి లేచి ఆమెని ఆమె కొడుకుని కొడుతూ ఉంటుంది.
వాళ్ళిద్దరూ పెద్దపెద్దగా కేకలు వేస్తూ ఉంటారు.
అలా వాళ్ళిద్దరినీ కొట్టిన తర్వాత . కొరడా, మరియు నాగిని ఇద్దరు అక్కడినుంచి మాయమైపోతారు.
అప్పుడు అత్త…. ఇంట్లో ఏదో దెయ్యం ఉంది .
దాని పని తేలుస్తాను అంటూ ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్తుంది ఆ మాంత్రికుడు…. సరే పద వస్తున్నాను అంటూ ఆమెతో కలిసి ఆ ఇంటికి వస్తాడు.
ఆ ఇల్లు మొత్తాన్ని గమనించి అతను
తన మనసులో…. నాగిని ఎక్కడ ఉన్నావ్ అన్న మాట ఇక నా నుంచి తప్పించుకోలేవు.
అంటూ ఇంటి చుట్టూ మంత్రించిన విభూతి చల్లుతాడు. దానిని ఎంత దూరం నుంచి చూస్తున్న నాగిని ….. అయ్యో ఈశ్వర ఈ మాంత్రికుడు మళ్లీ ఇక్కడికి తిరిగి వచ్చాడు. వీడి వల్ల ఆ కుటుంబం నష్టపోయింది నేను వీడి వల్ల చాలా ఇబ్బంది పాలు అయ్యాను.
ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్లకుండా చేశాడు.
అంటూ ఈశ్వరుని ప్రార్థిస్తుంది.
లోపల ఉన్న వాళ్ళు లక్ష్మికి బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తుంటారు అప్పుడు నాగిని అక్కడినుంచి మాయమైపోయి . మనిషి లాగ మారి మధుకి అక్కడ పెళ్లి జరుగుతున్న సంగతి చెప్తుంది.
వెంటనే మధు అక్కడికి చేరుకొని ….. లక్ష్మీ మెడలో తాళి కట్టాడో వాడి తల గుమ్మానికి వేలాడుతుంది.
అని వాళ్లతో చెప్తాడు . ఆ మాటలకి వాళ్లు భయపడుతూ ఉంటారు. ఇంతలో మాంత్రికుడు అతన్ని బంధించి చేస్తాడు.
లక్ష్మీ బావతో…. నువ్వు తాళికట్టు ఇంక నిన్ను ఎవరు ఆపలేరు. అని అంటాడు లక్ష్మి అక్కడి నుంచి పరుగులు తీస్తూ గుమ్మం దాటడానికి ప్రయత్నిస్తుంది.
ఆ మాంత్రికుడు ఆమెను గుమ్మం దాటకుండా మంత్రం వేస్తాడు.
లక్ష్మీ ఏడుస్తూ… అమ్మా నాగమ్మ ఎక్కడున్నావు ఇక్కడ ఇంత ఘోరం జరిగి పోతుంది . దయచేసి నన్ను కాపాడు అంటూ ప్రాధేయ పడుతుంది దానిని ఎంత దూరం నుంచి చూస్తున్న నాగిని …. ఈశ్వర నా భక్తురాలు ప్రమాదంలో ఉంది దయచేసి నన్ను ఇంట్లోకి వెళ్లాక చెయ్యి. ఆ దృష్ట మాంత్రికుడి అంత చేస్తాను. అంటూ ఈశ్వరుని ప్రార్ధిస్తుంది అప్పుడు ఒక్కసారిగా అక్కడ జోరున వర్షం మొదలవుతుంది అంతా చీకటిగా మారిపోతుంది. ఆ వర్షం నీటికీ అక్కడ వేసిన విభూతి అంతా చిరిగిపోతుంది.
నాగిని దానిని గమనించి పెద్ద ఆకారంలో మరి అక్కడ ఉన్న ఆ మాంత్రికుడి అమాంతం మింగేస్తుంది.
దాన్ని చూసిన ఆత్త …. పరిగెత్తు రా పాము పరిగెత్త పరిగెత్తు ఇక్కడే ఉంటే మనల్ని చంపేస్తోంది అంటూ ఆ అమ్మ కొడుకులిద్దరూ పరుగులు తీస్తారు. అప్పుడు నాగిని వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి… ఇన్ని రోజులు లక్ష్మిని చాలా హింసించారు. ఇకనుంచి మీరు మీ ఊరికి కాని ఆ ఇంటి వైపు కన్నెత్తి చూశారు మీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త అని అంటుంది అందుకు వాళ్లు చేతులెత్తి నమస్కరించిన… ఇంకెప్పుడూ మేము ఇటువైపుగా రాము మమ్మల్ని వదిలేయ్ అంటూ అక్కడి నుంచి పరుగులు తీస్తారు.
ఆ తర్వాత నాగిని మామూలుగా మారి అక్కడికి వచ్చి మధు లక్ష్మీ ఇద్దరికీ పెళ్లి చేస్తుంది.
వాళ్ళిద్దరూ ఆ నాగిని కి నమస్కరిస్తూ…. నాగిని ఎన్ని రోజులు నా వెంటే ఉంటూ నన్ను కాపాడుతూ నాకు ధైర్యాన్ని కలిగించినందుకు నీకు చాలా వందనాలు. అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటారు నాగిని….. నేను మీకు అండగా ఉన్నంతకాలం ఎవరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇక మీరు సంతోషంగా ఇక్కడ జీవించండి అని వాళ్లను దీవించి అక్కడినుంచి మాయమైపోతుంది వాళ్ళిద్దరూ అక్కడే సంతోషంగా జీవిస్తూ ఉంటారు.
అలా కొన్ని రోజులు గడిచాయి లక్ష్మీ గర్భం దాల్చింది. లక్ష్మి గర్భం దాల్చిన ఆమె గర్భం దాల్చిన తర్వాత నాగిని దగ్గరకు వెళ్లి ….. అమ్మ నాకు తల్లి తండ్రి ఎవరు లేరు. తల్లి అయిన తండ్రి అయినా నువ్వే నేను పురుడు పోసుకుని ఎంతవరకు నీ దగ్గరే ఉంటాను కాదనకు.
అందుకు నాగిని..,… తప్పకుండా నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని అంటుంది.ఆ రోజు నుంచి నాగిని లక్ష్మీ నీ కన్న బిడ్డ లాగ చూసుకుంటూ ఉంటుంది రోజులు గడిచాయి.
లక్ష్మి కి ఎలాంటి బాధ లేకుండా నాగదేవి వరంతో ఒక బిడ్డ కలుగుతుంది.
లక్ష్మీ చాలా సంతోష పడుతూ…..అమ్మ నీ వరంతో కలిగింది కాబట్టి నా బెడ్ నువ్వే పేరు పెట్టు. అని అడుగుతుంది.
నాగిని…. దేవత కరుణ తో కలిగినది కాబట్టి దేవి అని పేరు పెడుతున్నా. బిడ్డ ని జాగ్రత్తగా చూసుకో అని దీవించి అక్కడ్నుంచి మారిపోతుంది బిడ్డను తీసుకుని
లక్ష్మీ తన ఇంటికి తిరిగి వస్తుంది.
బిడ్డలు చూసినా మధు చాలా సంతోషపడ్డాడు నాగిని మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక వాళ్ళు ఆ బిడ్డతో చాలా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాళ్ళ కుటుంబానికి రక్షణగా నాగిని ఒక కంట వాళ్ళని కనీపెడుతూ ఉంటుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *