కాపాడుతున్న నాగిని 2_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

కాపాడుతున్న నాగిని మొదటి భాగంలో . లక్ష్మి నాగిని దగ్గర్నుంచితన బిడ్డని తన భర్త దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు . నాగిని వాళ్ళకి కాపలాగా ఉంటుంది.
ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం .కొన్ని సంవత్సరాలు గడిచాయి దేవి కొంచెం పెద్దది అవుతుంది. ఆమె ఒక రోజు తన ఇంటి ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఆమె ఇంటి ముందు బొంగ తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆమె కాలికి ఏదో తగిలింది ఒక్కసారిగా కిందపడిపోయి ఆమె చేతికి గాయం అయ్యి రక్తం కారుతూ బాధపడుతూ ఉంటుంది దాన్ని చూసిన దేవి ఆమె దగ్గరకు వెళ్లి…. అయ్యో బాధగా ఉంది అమ్మ తగ్గిపోతుందిలే అని ఆ గాయం పైచేయి వేస్తుంది వెంటనే ఆ గాయం మాయమైపోతుంది. దాన్ని చూసిన ఆమె చాలా ఆశ్చర్య పోతూ ఆమెకు నమస్కరిస్తోంది. అప్పుడే ఇంట్లోనుంచి లక్ష్మీ బయటకు వచ్చి ….. దేవి పదమ్మ లోపలికి వెళ్దాం అంటూ పిలుస్తుంది అక్కడున్న ఆమె ఎందుకు నమస్కరిస్తుంది ఆమెకు అర్థం కాక
అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఆమె…. అమ్మ నీ కూతురు చాలా మహిమ గల ది. మనిషి కాదు దేవత అని అంటుంది.
లక్ష్మి ఆమె వైపు అదోలా చూస్తూ పాప ని తీసుకుని లోపలికి వెళ్ళి పోతుంది.
అలా ఆ రోజు గడిచి పోతుంది ఆ మరుసటి రోజు ఉదయాన్నే దేవి నిద్ర లేచి నాగిని దగ్గరికి వెళ్లి ఆమెకు పూజ చేసి దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర కూర్చుంటుంది.
ఇంటి దగ్గర లక్ష్మి కంగారు పడుతూ ఆమె కోసం వెతుకుతూ ఆ చెట్టు దగ్గరికి వస్తుంది ఆ చెట్టు దగ్గర అందరూ వరుసలో నిలబడి ఉంటారు. లక్ష్మీ చాలా కంగారుగా అక్కడికి వెళుతుంది. అప్పుడు దేవి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటుంది.
అప్పుడు లక్ష్మి…. దేవి ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావ్ రా ఇంటికి వెళ్దాం.
దేవి….. కొంచెం సేపు ఆగమ్మా వీళ్ళ సమస్యలకు పరిష్కారం చెప్పి వస్తాను.
లక్ష్మి కోపం గా…. చిన్నపిల్లవి చిన్నపిల్లల గా ఉండు అంటూ ఆమెను బలవంతంగా తీసుకొని ఇంటికి వెళ్తుంది.
చెబుతుంది అప్పుడే నాగిని అక్కడ ప్రత్యక్షమవుతుంది.
లక్ష్మీ నాగిని తో….అమ్మ ఏంటిది నాకు అస్సలు అర్థం కావడం లేదు దేవి ఒక దేవతగా అందరి సమస్యలు తీరుస్తుంది. నాకు చాలా భయంగా ఉంది.
నాగిని…. ఇందులో భయపడడానికి ఏమీ లేదు. నా వరాల జన్మించింది కాబట్టి ఆమెకు శక్తులు వచ్చాయి అంతే. ఆమె నువ్వు అన్నట్టుగానే దేవతలతో సమానం.
ఆమె ఇరవై ఒక్క సంవత్సరం వరకు మానవునిగా గా జీవించి 22 వ సంవత్సరంలో నాగిని గా మారిపోతుంది.
ఆ మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ…. అమ్మ నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా బిడ్డని మా నుంచి దూరం చేయాలనుకోవడం అస్సలు మంచిది కాదు.
నాగిని…. లక్ష్మి దైవ నిర్ణయాన్ని కాదని ఎవరూ ఏమీ చేయలేరు. అంటూ అక్కడి నుంచి నాగిని మాయమైపోతుంది.
అందుకు వాళ్లు ఇద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు రోజులు గడిచాయి. దేవిని ఇంటిలో నుంచి బయటికి పోయి ఇవ్వటం లేదు.
అప్పుడే నాగిని అక్కడికి వస్తుంది నాగిని చూసిన లక్ష్మి చాలా కోపంగా…. అమ్మ అని నోరార పిలిచాను కానీ నువ్వు నాకు ఇలా చేస్తావని అనుకోలేదు. దయచేసి మా ఇంటికి రావద్దు.
నాగిని…. లక్ష్మి ఎందుకలా మాట్లాడుతున్నావు.
లక్ష్మి….. అమ్మ నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను దయచేసి మమ్మల్ని విడిచి పెట్టు. కనీసం నా కూతుర్ని 21 సంవత్సరం వరకు పెంచుకొనిఇవ్వు .
మాకు ఎలాంటి కష్టం వచ్చినా నిన్ను మాత్రం పిలువము. మాకు ఇంతటి శ్లోకాన్ని తీసుకొస్త వని మేము అస్సలు ఊహించలేదు .
అంటూ ఏడుస్తూ ప్రాధేయ పడుతోంది అప్పుడు నాగిని …హా.హా అని నవ్వుకుంటూ అక్కడ్నుంచి మాయమైపోతుంది.
ఇక నాగిని వెళ్లిపోవడంతో ఆ ఇంటికి ఉన్న రక్షణ కవచం కూడా మాయమైపోతుంది.
ఆ రోజు రాత్రి సమయం అందరూ నిద్రిస్తూ ఉండగా. ఆ ఇంటి తలుపు ఎవరో కొడుతున్నారు….. కాపాడండి కాపాడండి ఎవరు నన్ను కాపాడండి. అంటూ కేకలు వేస్తారు. వెంటనే ఇంట్లో వాళ్ళు బయటికి వచ్చి తలుపు తెరిచి చూసాడు ఎదురుగా ఒక ఆమె…. కాపాడండి నన్ను కాపాడండి నా వెంట ఎవరో వస్తున్నారు.అని అంటుంది అందుకు లక్ష్మీ ఆమె ముందు లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆమె లోపలికి వచ్చి పెద్దగా నవ్వుతూ ….హా..హా అంటూ ఒక మంత్రగత్తె గా మారుతుంది. దానిని చూసి మధు లక్ష్మి ఇద్దరు కంగారు పడిపోతారు అప్పుడే దేవి అక్కడకు వచ్చి….. ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు.
అప్పుడా మంత్రగత్తె… ఓహో నువ్వేనా పిల్ల నాగిని. మీకోసమే వచ్చాను . అంటూ తన మాయతో ఆమెను ఒక సీసాలో బంధించి అక్కడ్నుంచి మాయమైపోతుంది.
అప్పుడు లక్ష్మి పెద్ద పెద్దగా ఏడుస్తూ…. అమ్మా నాగమ్మ నా బిడ్డని ఎవరో తీసుకు వెళ్లి పోయారు. కాపాడమ్మా అంటూ అరుస్తుంది.
ఆమె ఎంత పిలిచినా నాగిని అక్కడికి రాదు లక్ష్మి మధు తో….. ఏవండీ పొద్దున నాగిని తో చాలా తప్పుగా మాట్లాడాను . అందుకే ఆమె రావడం లేదు. ఆమె రాకపోతే ఏమి మనమే వెళ్దాం పదండి ఆమెని వేడుకుందాం
అంటూ ఇద్దరూ నాగిని దగ్గరికి వెళ్తారు అక్కడ నాగిని పాము రూపంలో వారి ఒక ముంగిస తో పోరాడుతూ ఉంటుంది.
వాళ్లు దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుండగా వాళ్ళ చుట్టూ మంటలు వస్తాయి.
అప్పుడు గాలిలో ఆ మంత్రగత్తె ఎగురుతూ…హా..హా అంత సులువుగా నాగిని తప్పించుకోలేదు. ఎందుకంటే ఆ ముంగిసను నేనే పంపించాను కాబట్టి. హా..హా హా
అని పెద్దగా నవ్వుతుంది లక్ష్మి…. అసలు నువ్వు ఎవరు నా బిడ్డని ఎందుకు తీసుకెళ్లావ్వ.
మంత్రగత్తె…. నీ బిడ్డ మహా థ్జాతకురాలు .
ఆమెని ఎలాగా వదిలేస్తాను ఆమెను బలిస్తే నాగ జాతి మొత్తాన్ని నా వశం చేసుకోవచ్చు.
ఆ నాగమండల శక్తితో ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకుంటాను. హా..హా హా అంటూ నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది.
లక్ష్మీ మధు ఇద్దరు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటారు.
అప్పుడు మధు…. లక్ష్మి మరేం పర్వాలేదు నేను బలైపోయిన నాగిని నీ ఆ ముగిసి నుంచి కాపాడుతాను. అంటూ ఆ మంటల్లో దూకి నాగిని నీ . ఆ ముంగిస నుంచి కాపాడుతాడు. వెంటనే ఆ ముంగిస చాలా పెద్ద ఆకారంలో కి మారుతుంది నాగిని కూడా చాలా పెద్ద కారంలోకి మారుతుంది.
వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి అక్కడే ఉన్న త్రిశూలాన్ని తీసుకువచ్చి ముంగిస ని పొడుస్తుంది. ఆ పవిత్రమైన త్రిశూళం తగ్గిన వెంటనే ఆ ముంగిస పెద్ద పెద్దగా అరుస్తూ మంటలు మండి చనిపోతుంది.
ఆ తర్వాత నాగిని మామూలు స్థితికి వస్తుంది.
అప్పుడు లక్ష్మి …. అమ్మ నిన్ను తప్పుగా మాట్లాడినందుకు నన్ను క్షమించు నా బిడ్డ నీ నువ్వే కాపాడు . అని ప్రాధేయ పడుతోంది.
వెంటనే నాగిని ఆ మంత్రగత్తె గృహ లోకి వెళ్తుంది.
అక్కడ నాగిని…. నీకు పాపంపండింది అందుకే నీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావ్వ. మర్యాదగా దేవిని విడిచిపెట్టు. లేదంటే నా అగ్నికి నువ్వు ఆహుతై పోవాల్సిందే.
మంత్రగత్తె….హా..హా నాగిని నువ్వు ఉన్నది నా స్థావరంలో అన్న సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇక్కడ నీ శక్తి లు పనిచేయవు.
అప్పుడు నాగిని….హా..హా..హా నా శక్తులు పనిచేయకపోవచ్చు కానీ కాళికామాత త్రిశూలం శక్తి బాగా పనిచేస్తుంది అంటూ త్రిశూలాన్ని ప్రత్యక్షం చేసి ఆమె పైకి విసురుతుంది. ఆ త్రిశూలం గాలిలో వెళ్తూ ఉండగా దాన్ని చూసిన ఆమె భయపడుతూ పరుగెడుతూ ఉంటుంది.
ఆ త్రిశూలం ఒక్కసారిగా ఆమెకు పొడుచుకుని ఆమె కూడా మంటలు మండి చనిపోతుంది.
వెంటనే నాగిని దేవిని విడిపించి అక్కడినుంచి మాయమై తన ఇంటి దగ్గర ప్రత్యక్షమవుతుంది అక్కడ లక్ష్మి ఆమెను చూసి హత్తుకొని…. అమ్మ దేవి వచ్చేసావా తల్లి. అంటూ ఏడుస్తుంది నాగిని…. ఇలాగే ఎన్నో దినదినగండంగా ఉంటాయి జాగ్రత్త.
లక్ష్మి ఏడుస్తూ….. అమ్మ దేవి ఎక్కడ ఉండడం అంత మంచిది కాదు నీతో పాటు తీసుకు వెళ్ళి పో. అని అంటుంది అందుకు నాగిని…. లక్ష్మి నువ్వు ఇంతగా బాధపడుతున్నావు కదా. నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఈమె 21వ సంవత్సరం తర్వాత కూడా మనిషిలాగే జీవించాలని. భగవంతుని కృప ఉంటే అలాగే జరుగుతుంది. నిజంగానే ఈమె నాగిని గా మారడం ఈశ్వర కటాక్షం అయితే అది అలాగే జరుగుతుంది. అని చెప్పి ఆ బిడ్డను తీసుకుని అక్కడి నుంచి మాయమైపోతుంది.
అలా రోజులు గడిచాయి నాగిని దగ్గరే దేవి పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజులకి లక్ష్మీ మళ్లీ గర్భం దాలుస్తుంది.
లక్ష్మీ మధు తో…. ఏమండీ నాకు ఈ బిడ్డ వద్దు నేను పిల్లలు లేకుండా గొడ్రాలు గా అయినా ఉంటాను కానీ. నా పిల్లలు దూరంగా ఉండి దైవానికి అంకితమై పోతే నేను తట్టుకోలేను.
మధు…. నువ్వు ఎందుకు అలాగ బాధపడుతున్నావు దైవానికి మించిన గొప్ప శక్తి ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది మన బిడ్డలు దైవంతో సమానం అంటే మనకు చాలా సంతోషం. అయినా భగవంతుడికి న్యాయం ఉంటుంది. పుట్టబోయే బిడ్డ మన సొంత కావాలా లేదా ఆయన సొంతం కావాలా అనేది పై వాడి నిర్ణయం.
ఇంతలో నాగిని ప్రత్యక్షమై…. అవును సరిగ్గా చెప్పారు. ఈశ్వరుడు అన్నీ చూస్తున్నాడు.
నాకు తెలిసి మీ ప్రార్ధన వింటాడు దేవి కూడా మీ దగ్గరికి వస్తుందని నేను ఆశిస్తున్నాను.
అంత వరకు ఓపికతో వేచి చూడండి.
అందుకు లక్ష్మి…. అదే ఆశతో జీవిస్తున్నాం తల్లి కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా.
లక్ష్మి…. అందుకే అంతా పైవాడి నిర్ణయం మీద వదిలేయండి. మీకు అంతా శుభం కలుగుతుంది. అని చెప్పి అక్కడ్నుంచీ మాయమైపోతుంది.
అలా కొన్ని రోజులు గడిచాయి లక్ష్మి, మధు ఆ నాగిని సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉంటారు.
అక్కడ నాగిని ఈశ్వరుడికి దేవి గురించి మరి పెడుతూ ఉంటుంది అప్పుడే నాకు నీకు ఒక స్వరం వినపడుతుంది…. నాగిని నీ ప్రార్థన ఆ లక్ష్మి మాతృప్రేమను చూశాను. కాబట్టి దేవి మానవ రూపంలోనే ఉంటుంది కానీ ఆమెకు శక్తులు మాత్రం ఉంటాయి. వాటితో ఆమె ఎంతో మందికి సహాయం చేస్తుంది. ఎన్నో మంచి పనులు చేస్తుంది.
ఆ మాటలు విన్న నాగిని చాలా సంతోషపడుతూ… చాలు పరమేశ్వర మీరు చెప్పిన ఈ మాట తో నేను మరియు ఆ లక్ష్మి ఇద్దరు చాలా సంతోషం గా ఉంటావు నేను ఇప్పుడే దేవి ని తీసుకెళ్లి వాళ్ళకి అప్పు చెబుతాను అని అంటుంది.
అప్పుడు ఆ స్వరం …. మంచిది ఇక నేను సెలవు తీసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతుంది ఆ తర్వాత నాగిని దేవి ని తీసుకొని. ఆ ఇంటికి వెళ్లి అక్కడ జరిగిన విషయం అంతా చెబుతుంది.
ఆ మాటలు విని మధు , లక్ష్మీ ఇద్దరు చాల సంతోషపడుతూ ఈశ్వరుడికి అలాగే నాగిని కి కృతజ్ఞతలు చెప్పుకుంటారు.
ఇక వాళ్లు ఎప్పటిలాగే సంతోషంగా మన జీవితాన్ని కొనసాగిస్తారు. రోజులు గడిచాయి లక్ష్మీ ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది.
ఇక మళ్ళీ వాళ్ళ కుటుంబంలో సందడి చేయడానికి మగబిడ్డ వచ్చినందుకు వాళ్లు చాలా సంతోషంగా భావిస్తారు. దేవి తన తమ్ముడి చూసుకుని చాలా సంతోషపడుతుంది.వాళ్ల సంతోషాన్ని చూసిన నాగిని మరింత సంతోషపడుతుంది ఇక ఆ విధంగా వాళ్ల కథ సుఖాంతమవుతుంది.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *