నాగిని కాపాడగలదా 3_ Telugu Stories- Stories in Telugu – Panchatantra Kathalu

రెండో భాగంలో నాగిని శ్రీ కన్య ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి. వాళ్లకి జరగబోయే ప్రమాదం గురించి కూడా చెప్పి జలం ఇచ్చి అక్కడి నుంచి మాయమైపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి శ్రీ కన్య కొంచెం పెద్దది అయ్యింది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమె తన కుక్కకి భోజనం పెట్టడానికి భోజనం తీసుకొని వెళుతుంది.

అప్పుడు ఆ కుక్క ఆమెను చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఆమెను కరవడానికి వెంట పడుతుంది. దానిని చూసిన శ్రీ కన్య చాలా భయం తో ….. కాపాడండి కాపాడండి అంటూ కేకలు వేస్తోంది.
ఆమె అలా పరిగెత్తి ఒకచోట కింద పడుతుంది ఆ కుక్క ఆమె మీద దూక పోతుండగా శ్రీ కన్య తన చెయ్యి అడ్డు పడుతుంది.
అడ్డు పెట్టిన వెంటనే ఒక శక్తి ఆ కుక్క మీద పడి ఆ కుక్క శరీరంలో ఉన్న దెయ్యం బయటికి వెళ్లిపోతుంది.
ఆ దెయ్యం వెళ్తూవెళ్తూ…. శ్రీ కన్య తప్పించుకున్న వే . నిన్ను వదిలిపెట్టను రప్పిస్తా ను నిన్ను నా దగ్గరకు రప్పి ఇస్తాను.
అంటూ వెళ్తుంది చాలా భయపడుతూ….. అమ్మ నాగిని ఎక్కడున్నావు. అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది అప్పుడు నాగిని ప్రత్యక్షమై…. శ్రీ కన్య భయపడకు ఇదంతా నేను సృష్టించిన చిన్న నాటకం.ఎందుకంటే ప్రమాదం ఎటువైపు నుంచి వచ్చినా నీకు ఒక గొప్ప శక్తులు ఉన్నాయని తెలియడం కోసమే ఇదంతా చేశాను. భయపడకు ఇప్పుడు ధైర్యంగా నువ్వు ఒంటరిగా దేనినైనా పోరాడవచ్చు. అని అంటుంది అందుకు శ్రీ కన్య…. చాలా కృతజ్ఞతలు తల్లి.
అని అంటుంది ఆ తర్వాత నాగిని అక్కడ్నుంచి మాయమైపోతుంది అప్పుడు కుక్క…. మిత్రమా నువ్వు చాల భయపడి పోయావు కదా.
శ్రీ కన్య…. అవును నేను చాలా భయపడి పోయాను. అని మాట్లాడుకుంటూ ఉండగా. ఇంతలో తన తల్లి వస్తుంది.
ఆమె…. శ్రీ కన్య మనం బయటికి వెళ్దామా మీ నాన్నగారు నీకోసం కొత్తబట్టలు తీసుకుంటానని చెప్పారు.
శ్రీ కన్య…. కానీ అమ్మ నాన్న నిన్ననే కదా కొత్త బట్టలు తీసుకొని వచ్చాడు. మళ్లీ ఈ రోజు బట్టలు ఏంటి.
ఆమె…. ఏమో నాకు తెలియదు అమ్మ మీ నాన్న నిన్ను తీసుకుని రమ్మన్నాడు మనం వెళ్దాం పద.
అందుకో శ్రీ కన్య ఆలోచిస్తూ ఉంటుంది.
అక్కడున్న కుక్క ఆమె తల్లి వైపు చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది.
శ్రీ కన్యక అనుమానం రావడంతో తన చేతిని ఆమె వైపు చూపిస్తుంది అప్పుడు ఆమె ఒక పెద్ద దుష్ట పాము గా మారుతుంది.
దానిని చూసిన శ్రీ కన్యా ఏ మాత్రం భయపడకుండా అక్కడే ఉన్న కుక్కను తన మాయాశక్తి తో పెద్ద దానిలా చేస్తుంది.
ఆ కుక్క మరియు దుష్ట పాము రెండు ఒక దానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి శ్రీ కన్య కు భయం కలిగి…. అమ్మ నాగిని నువ్వు ఇప్పుడు ఒకసారి నువ్వు నా దగ్గరికి రా తల్లి నేను చాలా ప్రమాదం లో ఉన్నాను అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తోంది అప్పుడు నాగిని అక్కడ ప్రత్యక్షమై తన శక్తితో ఆ దుష్ట నాగు పాము ని అంతం చేస్తుంది.
ఆ తర్వాత ఆ కుక్క సామాన్యమైన కుక్క గా మారిపోతుంది.
శ్రీ కన్య ఏడుస్తూ….. అమ్మ ఎందుకు నాకు అన్నీ ఎలా జరుగుతున్నాయి. నాకు చాలా భయంగా ఉంది అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు.ఎందుకు చేస్తున్నారు వాళ్ళు నా నుంచి ఏమి ఆశిస్తున్నారు.
నాగిని…. చూడమ్మా నువ్వు ఒక అద్భుతమైన నక్షత్రంలో జన్మించావ్వ. అందుకే నీకు ఎన్ని కష్టాలు కానీ నీకు ఎన్నో మాయ శక్తులున్నాయి. వాటితో నీకు వచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు. ఏ మాత్రం భయపడకు నీకు ఇందాక చెప్పాను. ఎటు వైపు నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చు అని జాగ్రత్తగా ఉండు. అని మళ్లీ హెచ్చరించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కుక్క మరియు శ్రీ కన్య ఇద్దరూ తన తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎంతసేపటికీ వాళ్లు తిరిగి రాకపోవడంతో ఆ కుక్క మరియు శ్రీ కన్య ఇద్దరూ తన తల్లిదండ్రులు వెతుక్కుంటూ వెళ్తారు.
మార్గమధ్యలో వాళ్ళిద్దరికీ ఆ తల్లిదండ్రులిద్దరూ మరణించి కనబడతారు.
దానిని చూసిన శ్రీ కన్య… అమ్మ నాన్న ఏమైంది మీకు ఒకసారి లేవండి. దయచేసి లేవండి అమ్మ. అంటూ భోరున ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఆమెకు ఒక స్వరం వినపడుతుంది.
……హా…హా హా శ్రీ కన్య మీ అమ్మానాన్నలు చనిపోలేదు. వాళ్ళ శరీరంలో వాళ్ళ ఆత్మ లు లేవు వాళ్ళ ఆత్మలు నా దగ్గర ఉన్నాయి.
శ్రీ కన్య…. ఎవరు నువ్వు నీకేం కావాలి.
అందుకు స్వరం….. నాకు నీ ప్రాణాలు కావాలి నీ తల కావాలి హా..హా హా ఇస్తావా.
కచ్చితంగా ఇస్తావు మీ తల్లిదండ్రుల ఆత్మలు నీకు కావాలి అంటే నువ్వు నా దగ్గరికి రావాలి.
శ్రీ కన్య… వస్తాను నా తల్లిదండ్రుల కంటే నాకు ఏది ఎక్కువ కాదు. వస్తాను అంటూ ఏడుస్తుంది అప్పుడే తన తల్లిదండ్రులు దూరం నుంచి …..అమ్మ శ్రీ కన్య ఎక్కడికి వెళ్తున్నావ్ అని పిలుస్తారు.
శ్రీ కన్య చాలా ఆశ్చర్యంగా వాళ్ళ వైపు చూస్తుంది. నేల మీద ఉన్న ఆ రెండు శవాలు మాయమైపోతాయి.
శ్రీ కన్య కు అంతా అయోమయంగా ఉంటుంది
అప్పుడు ఆమె తన తల్లిదండ్రులకు జరిగిన విషయం అంతా చెబుతోంది.
దాన్ని విన్న వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ ….. అమ్మ శ్రీ కన్య మనం ఇంటికి వెళ్దాం పద అంటూ అమ్మని తీసుకుని వెళ్తారు.
అప్పుడు తల్లి….చూడమ్మా శ్రీ కన్య నీకు 18 సంవత్సరాల వారికి దినదిన గండం అని స్వామీజీ నాగ కన్య ఇద్దరు చెప్పారు. అప్పటివరకు నువ్వు ఎవరి మాటలు నమ్మొద్దు. మాకు ఏం జరిగినా పర్వాలేదు నువ్వు మాత్రం సుఖంగా ఉండడమే నాకు కావాలి.
తండ్రి… కానీ ఇదంతా చేస్తుంది ఎవరు అనేది మాత్రం అర్థం కావటం లేదు.
అప్పుడే స్వామీజీ అక్కడకు వస్తాడు.
స్వామీజీనీ చూసినవాళ్లంతా నమస్కారం చేస్తారు.
అప్పుడు ఆ తల్లిదండ్రులు స్వామీజీకి జరిగిన విషయం అంతా చెప్తారు.
స్వామీజీ….ఇలాంటివి కొన్ని సంవత్సరాల వరకు తప్పదు కదా కానీ ఇవి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండడానికి మనం ఒక ప్రయత్నం చేద్దాం ఆ పరమేశ్వరునికి యాగం చేద్దాం.
అప్పుడు ఈ గండాలు ఈమెకు సంభవించకుండా ఆ భగవంతుడు కాపాడతాడు.
అందుకు ఆ తల్లిదండ్రులు…సరే స్వామి అలాగే చేయండి ఎప్పుడు పూజలు మొదలుపెడతారు చెప్తే మేము అన్నీ సిద్ధం చేసుకుంటాం.
అప్పుడు స్వామీజీ…..ఎప్పుడో కాదు ఇప్పుడే మొదలు పెడతాను శ్రీ కన్య నాతో పాటు వస్తే సరిపోతుంది మరి ఎవరు అవసరం లేదు.
అందుకు వాళ్ళిద్దరూ కొంచెం సందేహిస్తున్నారు అప్పుడే కుక్క ఇంట్లో కి వెళ్లి నాగిని ఇచ్చిన జలాన్ని బయటకు తెస్తుంది .
వెంటనే శ్రీ కన్య తల్లి దానిని తీసుకుని ఆ జనాన్ని స్వామీజీ పై చల్లుతుంది.
అప్పుడు అతని శరీరమంతా మంటలు మండి…. పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడినుంచి మాయమై పోతాడు.
అప్పుడు ఆ తల్లిదండ్రులు ఇద్దరూ…. చూశావుగా ఇది నిజమైన స్వామీజీ కాదు.నువ్వు ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టొద్దు. అని అంటుంది అందుకు ఆమె నుంచి ఆ కుటుంబం ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆ ఇంట్లోనే ఉంటారు.
అలా రోజులు గడిచాయి వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో . ఆమె ఎలా అయినా బలి చేసుకోవాలి అని ఆలోచిస్తున్న మంత్రగత్తె…. కాళికామాత ఆ శ్రీ కన్య నువ్వు ఎలాగ పని చేయాలో నాకు అర్థం కావడం లేదు. అన్నిటికీ ఆ స్వామీజీ ,నాగిని ముఖ్యంగా కుక్క అందరూ ఆ శ్రీ కన్య కి కాపలాగా ఉంటున్నారు నేను ఏం చేసినా అది విఫలం అవుతుంది. నేను ముందుగా స్వామీజీని బంద్ ఇస్తాను ఆ తర్వాత నాగిని ఆ తరువాత కుక్కని . అని పెద్దదవుతుంది.
అప్పుడు ఆమె కి ఒక స్వరం వినపడుతుంది…. నువ్వు ఆ పని చేయలేవు నాగినేని పంపించాలంటే అమావాస్య రావాలి.
స్వామీజీని బంధించాలి అంటే ఆయన గాఢనిద్రలో ఉండాలి. ఇక తెలివైన ఆ కుక్క దానిని బంధించడం చాలా కష్టం.
నా మాట విని నీ ప్రయత్నాన్ని విరమించుకుని ప్రాణాలతో ఉంటావు. లేదా నీ ప్రాణాలు బలి తీసుకోవాల్సిందే.
అందుకు ఆమె కోపంగా…. హమ్ ఆపు కపాల నువ్వు నాకు సాయం చెయ్యవు కానీ బాయ పెట్టడానికి మాత్రం ముందుంటావ్వ. ఇప్పుడు నీ ఉచిత సలహాలు నాకు అవసరం లేదు.
అందుకు ఆ స్వరం…హా హా పోయి పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు నాకెందుకు నేను వెళతాను అంటూ స్వరం మాయమైపోతుంది.
ఆ తర్వాత ఆ మంత్రగత్తె నాగిని గా మారి రాత్రి సమయం నిద్రిస్తున్న స్వామీజీ దగ్గరికి వెళుతుంది.
ఆమె స్వామీజీని చూసి…. స్వామీజీ గాఢ నిద్ర లో ఉన్నాడు. ఇప్పుడు అతని బంద్ ఇస్తాను అంటూ ఒక మంత్రాన్ని ప్రయోగిస్తుంది.
కానీ ఆ మంత్రం తిరిగి ఆమె మీదే కి వచ్చి ఆమె బందీగా మారిపోతుంది అప్పుడు ఆమె తన రూపంలోకి మారిపోతుంది.
ఆ తరువాత స్వామీజీ నిద్ర నుంచి లేచి నాగిని గా మారి…..హా..హా హా పిశాచి నీకే అన్ని తెలివితేటలు ఉంటే మాకు ఎన్ని ఉండాలి స్వామీజీ తీర్థయాత్రలకు వెళ్ల డు.
నేను ఇక్కడే ఉన్నాను నీ కుట్రలన్నీ తెలుసుకొని ఇదంతా చేశాను.
అందుకు ఆమె కోపంగా… నాగిని వదిలిపెట్టను ఆ శ్రీ కన్య నీ చంపకుండా వదిలిపెట్టను.
నాగిని….అయ్యో పిశాచి నువ్వు పొరపాటు పడుతున్నారు నేను నాగినేని కాదు నేను కుక్కని అంటూ కుక్క రూపంలోకి మారుతుంది.
దాన్ని చూసిన ఆమె మరింత ఆశ్చర్యపోతుంది.
ఆ కుక్క….అయ్యో పిశాచి ఎవరు నిన్ను కట్టేశారు స్వామీజీని పిలుద్దామా. ఆయన నిన్ను కాపాడుతాడు. అంటూ కుక్క మళ్ళీ స్వామీజీ రూపంలోకి మారుతుంది.
దాన్నంతా చూస్తున్నా ఆ మంత్రగత్తె కు ఏమీ అర్థం కాక…. అసలు ఎక్కడ ఉంది ఎవరు నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ కింద పడిపోతుంది.
అప్పుడు భూమి రెండు భాగాలుగా చీలి ఆమె ఆ భూమి లోకి వెళ్లి పోతుంది ఆ తర్వాత మళ్ళీ భూమి మూసుకుపోతుంది.
అప్పుడు అక్కడ నాగిని స్వామిజి కుక్క ముగ్గురు వచ్చి…. మేము ఉన్నంతవరకూ శ్రీ కన్య ఎవరు ఏమి చేయలేరు. అంటూ అక్కడి నుంచి ముగ్గురు మాయమైపోతారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *